మనుషుల మనో భావాలు రక రకాలుగా ఉంటాయి. ఇక సినీ తారల అభిప్రాయలు సందర్భానుసారంగా ఉంటాయని చెప్పవచ్చు. కొందరు తమపై వచ్చే విమర్శలను స్వాగతిస్తున్నామంటారు. మరి కొందరు వదంతులను ఎంజాయ్ చేస్తున్నామంటారు. ఇంకొందరు సీరియస్‌గా రియాక్ట్ అవుతుంటారు. ఇందుకు మన కథానాయకిలు అతీతంగా కాదు. అలా నటి రష్మిక మందన్నా(Rashmika Mandanna) కూడా వదంతులపై స్పందించారు. ఈ కన్నడ బ్యూటీ మాతృభాషలో నటించిన తొలి చిత్రం తరువాత నుంచే వివాదాల్లో చిక్కుకున్నారనే చెప్పాలి. ఆ తరువాత కూడా తన వివాదాస్పద వ్యాఖ్యలతో విమర్శలకు గురయ్యారు. ఆ తరువాత ప్రేమ వ్యవహారంలో వైరల్ అయ్యారు.
విషయం ఏమిటంటే ఇవేవీ ఈ భామ కెరీర్‌కు ఎఫెక్ట్ అవ్వలేదు. అదే సమయంలో అవన్నీ ఈమెకు ప్లస్ అయ్యాయనే చెప్పాలి. అందుకే శాండిల్ వుడ్ వైయా టాలీవుడ్, కోలీవుడ్‌లోనూ దాటి బాలీవుడ్‌లోనూ వరుస విజయాలను సాధిస్తూ నేషనల్ క్రష్‌గా వెలిగిపోతున్నారు. ప్రస్తుతం తెలుగులో రెండు చిత్రాలతో పాటూ హిందీలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో తన గురించి వైరల్ అవుతున్న రకరకాల ట్రోలింగ్స్‌పై స్పందించిన రష్మిక మందన్నా అసత్య ప్రచారాలపై ఎందుకు వివరణ ఇవ్వాలని ప్రశ్నించారు. అలాంటి విషయాలపై స్పందిస్తే వారిని ప్రోత్సహించినట్లే అవుతుందన్నారు. కొందరు డబ్బు కోసమే అలాంటి నిరాధారమైన వార్తలు రాస్తున్నారని అన్నారు. అలాంటి ముఖం తెలియని వారికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. తాను ఎప్పుడూ ఒకేలా ఉంటున్నానని నటి రషి్మక మందన్నా పేర్కొన్నారు.


