సెట్స్ పైకి ప్రభాస్.. హీరోయిన్ పై సస్పెన్స్ | Prabhas Kalki-2 Actress Suspense Continues in Tollywood | Sakshi
Sakshi News home page

సెట్స్ పైకి ప్రభాస్.. హీరోయిన్ పై సస్పెన్స్

Jan 28 2026 11:58 PM | Updated on Jan 28 2026 11:58 PM

Prabhas Kalki-2 Actress Suspense Continues in Tollywood

ప్రభాస్ నటిస్తున్న కల్కి-2 సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. వచ్చే నెల నుంచి ప్రభాస్ సెట్స్ పైకి అడుగుపెట్టనున్నాడని, దాదాపు 10 రోజుల కాల్షీట్లు కేటాయించాడని సమాచారం. ఈ వార్తలు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్‌గా మారాయి. కల్కి ఫ్రాంచైజీ నుంచి దీపికా పదుకోన్ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆమె పోషించిన సుమతి పాత్ర కథలో చాలా కీలకమైనది. కల్కి పార్ట్-2 మొత్తం ఆ పాత్ర చుట్టూనే తిరుగుతుందని తెలుస్తోంది. కానీ అలాంటి ముఖ్యమైన పాత్ర నుంచి దీపిక తప్పుకోవడంతో కొత్త హీరోయిన్ ఎవరనే ప్రశ్న అభిమానులను ఉత్కంఠకు గురి చేస్తోంది.  

ప్రస్తుతం నెట్టింట సాయిపల్లవి పేరు బలంగా వినిపిస్తోంది. కల్కి చిత్ర యూనిట్ కూడా ఆమెను ఈ పాత్రకు అనుకూలంగా భావిస్తోందని టాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే నిజంగానే సాయిపల్లవినే ఫైనల్ చేశారా లేదా ఊహించని విధంగా మరో నటిని పరిచయం చేస్తారా అనేది ఇంకా సస్పెన్స్‌గానే మిగిలింది. దాంతో ఈ విషయంపై అధికారిక ప్రకటన కోసం ఎదురుచూడాల్సిందే. దీపికను పార్ట్-1లో చూసిన ప్రేక్షకులు, అదే పాత్రలో మరో హీరోయిన్‌తో కనెక్ట్ అవ్వగలరా అనేది పెద్ద ప్రశ్న. ఈ సవాల్‌ను దర్శకుడు నాగ్ అశ్విన్ ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement