10 రోజులకే అన్ని కోట్లా? కమల్‌కు కళ్లు చెదిరే పారితోషికం | Yugi Sethu Reveals Kamal Haasan Remuneration For Kalki 2898 AD Movie, Check Out Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Kamal Haasan: 'కల్కి' కోసం కమల్‌ రెమ్యునరేషన్‌ తెలిస్తే షాకవ్వాల్సిందే!

Mar 8 2026 3:31 PM | Updated on Mar 8 2026 5:11 PM

Yugi Sethu Reveals Kamal Haasan Remuneration for Kalki 2898 AD Movie

రెండేళ్ల క్రితం వచ్చిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్‌ వద్ద సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించిన ఈ కళాఖండంలో ప్రభాస్‌ హీరోగా అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొణె, కమల్‌ హాసన్‌ ప్రముఖ పాత్రలు పోషించారు. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రెట్టింపు స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1200 కోట్లు వసూలు చేసింది.

రెమ్యునరేషన్‌కే అంత బడ్జెట్‌
అయితే ఈ బడ్జెట్‌లో ఎక్కువ భాగం తారల రెమ్యునరేషన్‌కే సరిపోయిందని అప్పట్లో వార్తలు వినిపించాయి. ప్రభాస్‌ రూ.150 కోట్లు తీసుకోగా అమితాబ్‌, బిగ్‌బీ, దీపికా పదుకొణె చెరో రూ.20 కోట్లు తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. అంతలోనే సౌత్‌ ఇండియా స్టార్‌ కమల్‌ హాసన్‌ ఏకంగా రూ.100 కోట్ల మేర పుచ్చుకున్నట్లు సోషల్‌ మీడియాలో కథనాలు చక్కర్లు కొట్టాయి. అయితే ఇవేవీ కాదు, అంతకుమించి పారితోషికం తీసుకున్నాడని తమిళ నటుడు యుగి సేతు వెల్లడించాడు.

10 రోజులకే అన్ని కోట్లా?
తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కమల్‌ సర్‌ కల్కి సినిమాలో 20 రోజుల కాల్షీట్లకు గానూ రూ.150 కోట్లు తీసుకున్నాడు. ఆయన దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడు అని కమల్‌ బర్త్‌డేరోజే చెప్పాను. ఓసారి కల్కి నిర్మాత అశ్వినీదత్‌ను కలిశాను. నా స్నేహితుడిని అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకుంటున్న వ్యక్తిగా మార్చినందుకు థాంక్యూ సర్‌..

20 రోజులు ఎక్కడ?
20 రోజులకు రూ.150 కోట్లు ఇచ్చారంటే మామూలు విషయం కాదన్నాను. వెంటనే ఆయన కలగజేసుకుని నాకు 20 రోజులు ఎక్కడిచ్చారు, 10 రోజుల డేట్సే ఇచ్చారు అని చెప్పాడు. అప్పటిదాకా కమల్‌ రోజుకు సుమారు రూ.8 కోట్లు సంపాదించాడనుకున్నాను, కానీ రోజుకు రూ.15 కోట్లు ఇచ్చారని తర్వాతే తెలిసింది అని యుగి పేర్కొన్నాడు.

సినిమా
బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన కల్కి 2898 ఏడీకి ప్రస్తుతం సీక్వెల్‌ తెరకెక్కుతోంది. ఫస్ట్‌ పార్ట్‌లో ఉన్న స్టార్‌ నటీనటులందరూ సెకండ్‌ పార్ట్‌లోనూ కనిపించనున్నారు. దీపికా పదుకొణెను మాత్రం సీక్వెల్‌ నుంచి తప్పించారు. ఈ రెండో భాగంలో కమల్‌ హాసన్‌ పోషించిన సుప్రీం యాస్కిన్‌ క్యారెక్టర్‌కు ఎక్కువ నిడివి దక్కనుంది.

చదవండి: అదృష్టవంతురాలిని.. కన్నీళ్లు ఆగడం లేదు: తనూజ

Advertisement
 
Advertisement
Advertisement