తమిళనాడులో ఓవైపు ఎన్నికల హడావుడి ఉంది. మరోవైపు స్టార్ హీరో విజయ్ వైవాహిక బంధం గురించి పెద్ద చర్చే నడుస్తోంది. రీసెంట్‌గానే ఇతడి భార్య సంగీత, కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసింది. ఓ నటితో తన భర్తకు అక్రమ సంబంధం ఉందనే కారణాన్ని పిటిషన్‌లో పేర్కొంది. ఇదలా ఉండగానే త్రిషతో కలిసి విజయ్ ఏకంగా ఓ పెళ్లికి వెళ్లడం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయిపోయింది. వీళ్లిద్దరి మధ్య ఏముందనేది కాలమే నిర్ణయిస్తుంది. ఇంతలోనే తమిళ నటుడు, దర్శకుడు పార్తిబన్.. త్రిషపై దారుణమైన వ్యాఖ్యలు చేశాడు.
(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్)
తాజాగా ఓ మూవీ ఈవెంట్‌లో యాంకర్ మాట్లాడుతూ.. త్రిష గురించి అభిప్రాయం చెప్పాలని పార్తిబన్‌ని అడిగింది. 'పొన్నియిన్ సెల్వన్'లోని త్రిష చేసిన కుందవై పాత్రని ప్రస్తావిస్తూ.. 'ఈ కుందవై కొన్నాళ్ల పాటు ఇంట్లోనే ఉండాలి. బయటకు రావొద్దు. అలా చేస్తే ఇలాంటి సమస్యలు రావు' అని అన్నాడు. అయితే పార్తిబన్ చేసిన వ్యాఖ్యలు.. త్రిషని అవమానించేలా ఉన్నాయని పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు మాత్రం ఆయన సరదాగానే అన్నాడని, మిగతా వాళ్లు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అంటున్నారు.
ఏదేమైనా పార్తిబన్ లాంటి ఓ సీనియర్ నటుడు, దర్శకుడు.. త్రిష లాంటి హీరోయిన్ గురించి పబ్లిక్‌గా ఇలా మాట్లాడటం సరికాదనే అభిప్రాయం పలువురు నెటిజన్ల నుంచి వ్యక్తమవుతోంది. గతంలోనూ ఈ నటుడు హీరోయిన్ల గురించి నోరు జారిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం సినిమాలో కథ ఉందా? లేదా అనేది ప్రేక్షకులు చూడటం లేదు. హీరోయిన్ డ్యాన్స్ కోసమే సినిమాలు చూస్తున్నారు. తమన్నా ఉంటే చాలు.. కథ లేకపోయినా ఫర్వాలేదు.. సినిమా హిట్టవుతుంది అని అన్నారు. తర్వాత తన మాటలపై విమర్శలు రావడంతో క్షమాపణ చెప్పుకొచ్చాడు.
పార్తిబన్ విషయానికొస్తే.. యుగానికి ఒక్కడు, నేనూ రౌడీనే, పొన్నియన్ సెల్వన్, పొన్నియన్ సెల్వన్ 2 తదితర సినిమాల్లో నటించాడు. తెలుగులోనూ 'రచ్చ'లో చరణ్ తండ్రిగా చేశాడు. ఇతడు నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే తెలుగు మూవీ త్వరలోనే థియేటర్లలోకి రానుంది. నటి సీతని 1990లో పెళ్లి చేసుకున్న పార్తిబన్.. 2001లో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు.
(ఇదీ చదవండి: విడాకుల గురించి తొలిసారి స్పందించిన విజయ్)
Parthiban attacks Trisha😝
“Intha Kunthavai ah veetukullaye Kunthavaikirathu nalathu”😀
pic.twitter.com/X5St5Ycnvk— Christopher Kanagaraj (@Chrissuccess) March 8, 2026


