నిశ్చితార్థం చేసుకున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్ | Actor Bellamkonda Sreenivas Engagement With Longtime Love Kavya Reddy, Video Viral On Social Media | Sakshi
Sakshi News home page

Bellamkonda Sreenivas: ప్రియురాలితో ఎంగేజ్‌మెంట్.. వీడియో వైరల్

Mar 8 2026 3:09 PM | Updated on Mar 8 2026 5:05 PM

Actor Bellamkonda Sreenivas Engaged With Kavya Reddy

తెలుగు యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థం చేసుకున్నాడు. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న కావ్యరెడ్డితో కొత్త జీవితం ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో ఈ శుభకార్యం జరగ్గా.. టాలీవుడ్ హీరోయిన్ సంయుక్త, దర్శకుడు బోయపాటి శీను తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: ఓటీటీలో ఫంకీ సినిమా.. స్ట్రీమింగ్‌ తేదీ వచ్చేసింది)

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడు అయిన సాయి శ్రీనివాస్.. అల్లుడు శ్రీను సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తొలి చిత్రంలోనే సమంత లాంటి హీరోయిన్‌తో నటించాడు. సక్సెస్ కూడా అందుకున్నాడు. తర్వాత అడపాదడపా మూవీస్ చేశాడు గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. 'రాక్షసుడు' అనే రీమేక్ మూవీ హిట్ అయింది. రీసెంట్ టైంలో అయితే భైరవం, కిష్కింధపురి చిత్రాలతో పలకరించాడు. ఇవి బాక్సాఫీస్ దగ్గర ఆడలేదు.

హీరో బెల్లకొండ శ్రీనివాస్.. ప్రేమలో ఉన్నాడని, నిశ్చితార్థం చేసుకోబోతున్నాడనే విషయం రెండు మూడు రోజుల క్రితం బయటకు వచ్చింది. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ ఎంగేజ్‌మెంట్ జరిగింది. శ్రీనివాస్‌కి కాబోయే భార్య కావ్యకు ఇండస్ట్రీతో సంబంధం లేదు. ఈమె తాత జడ్జి కాగా తండ్రి లాయర్. వీళ్లది హైదరాబాదే. శ్రీనివాస్, కావ్య కుటుంబాలకు ముందు నుంచే పరిచయం ఉందని అంటున్నారు. మరి కావ్యతో పరిచయం, ప్రేమ ఎలా అనే విషయాల్ని శ్రీనివాసే బయటపెట్టాలి. వీళ్ల పెళ్లి బహుశా ఈ ఏడాదిలోనే ఉండొచ్చు.

(ఇదీ చదవండి: ప్రేమలో పడ్డ కోర్ట్‌ జంట? రోషన్‌, శ్రీదేవి రియాక్షన్‌ ఇదే!)

Advertisement
 
Advertisement
Advertisement