ఊహించని దర్శకుడితో ప్రభాస్.. రొయ్యల బిర్యానీతో డిన్నర్ | Malayalam Director Dinjith Ayyathan With Prabhas | Sakshi
Sakshi News home page

Prabhas: ప్రభాస్‌తో మలయాళ డైరెక్టర్.. ఎందుకు కలిశారు?

Mar 10 2026 4:52 PM | Updated on Mar 10 2026 4:57 PM

Malayalam Director Dinjith Ayyathan With Prabhas

డార్లింగ్ ప్రభాస్ చేతిలో ఇప్పుడు స్పిరిట్, ఫౌజీ, కల్కి: పార్ట్ 2 సినిమాలు ఉన్నాయి. వీటన్నింటి షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. తర్వాత సలార్ 2 ఉంది. కానీ ఇదెప్పుడు ఉంటుందనేది ఇంతవరకు క్లారిటీ లేదు. ఇవి కాకుండా నెక్స్ట్ ఎవరితో చేస్తారా అనేది తెలియదు. ఇంతలోనే పలువురు దర్శకులు ప్రభాస్‌ని కలుస్తున్నారు. తాజాగా మలయాళ డైరెక్టర్ ఒకరు ప్రభాస్‪‌ని కలిశారు. ఓ సాయంత్రం అద్భుతంగా గడిపానని పోస్ట్ కూడా పెట్టారు.

(ఇదీ చదవండి: డైరెక్ట్ ఓటీటీలో రిలీజైన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా)

గతేడాది మలయాళంలో వచ్చిన హిట్ సినిమాల్లో 'ఎకో' ఒకటి. ఓటీటీ డబ్బింగ్ రూపంలో తెలుగు ఆడియెన్స్‌ని కూడా పలకరించింది. దీని కంటే ముందు 'కిష్కిందకాండం' అనే మరో మూవీ కూడా తీసిన దర్శకుడు దింజిత్ అయ్యతన్.. సోమవారం సాయంత్రం ప్రభాస్‌ని కలిశాడు. ఈ విషయాన్ని తన ఇన్ స్టాలో షేర్ చేశాడు. కలిసి ఎన్నో విషయాలు మాట్లాడుకున్నామని, మరీ ముఖ్యంగా డిన్నర్‍‌లో తిన్న రొయ్యల బిర్యానీ అదిరిపోయిందని చెప్పుకొచ్చాడు.

ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన హోంబలే నిర్మాణ సంస్థ అధినేత విజయ్ కిరగందూర్‌కి కూడా దింజిత్.. ధన్యవాదాలు చెప్పుకొచ్చాడు. అయితే దింజిత్, ప్రభాస్‌ని కొత్త ప్రాజెక్ట్ కోసమే కలిశాడా అనిపిస్తుంది. ఎందుకంటే హోంబలే సంస్థలో ప్రభాస్ మూడు మూవీస్ చేయాలి. చాన్నాళ్ల క్రితమే ఈ విషయాన్ని ప్రకటించారు. ఇందులో ఒకటి సలార్ సీక్వెల్ కాగా మిగతా రెండు ఏంటనేది క్లారిటీ రాలేదు. బహుశా దింజిత్-ప్రభాస్ కాంబోని ఏమైనా ఫిక్స్ చేశారా లేదా అనేది త్వరలో క్లారిటీ రావొచ్చు. ఒకవేళ కన్ఫర్మ్ అయితే మాత్రం ఊహించని కాంబో అవుతుంది. మరి దింజిత్.. తనకు సూటయ్యే థ్రిల్లర్ తీస్తాడా? లేదా ప్రభాస్‌కి తగ్గ స్టోరీని రెడీ చేస్తాడా చూడాలి.

(ఇదీ చదవండి: వడివేలుని తట్టుకోలేను.. అందుకే 16 సినిమాలు తిరస్కరించా)

Advertisement
 
Advertisement
Advertisement