క్యాస్టింగ్‌ కౌచ్‌పై మెగాస్టార్ కామెంట్స్.. అది సాధ్యమేనా? | Megastar Chiranjeevi comments about casting couch in cinema industry | Sakshi
Sakshi News home page

Casting Couch: క్యాస్టింగ్‌ కౌచ్‌పై మెగాస్టార్ కామెంట్స్.. ఇకనైనా ఆగుతుందా?

Jan 28 2026 9:45 PM | Updated on Jan 28 2026 9:58 PM

Megastar Chiranjeevi comments about casting couch in cinema industry

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు చూసినా అదే హాట్ టాపిక్‌. నటీమణుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొన్నామని అంటుంటారు. ఎక్కడా చూసినా అదంతా సాధారణమే అన్నంతగా సినీ ఇండస్ట్రీలో పాతుకుపోయింది. తాజాగా మరోసారి తెరపై తీసుకొచ్చింది. ఇంతకీ అదేంటి అనుకుంటన్నారా? అదేనండి క్యాస్టింగ్ కౌచ్. మన మెగాస్టార్ నోటా ఆ మాట వినిపించడం ఇప్పుడు మరింత చర్చకు దారితీసింది.

మెగాస్టార్ నోటా క్యాస్టింగ్ కౌచ్‌ అనే పదం రావడంతో టాలీవుడ్ మాత్రమే కాదు.. యావత్ సినీ ప్రపంచం ఇప్పుడు దీనివైపే చూస్తోంది. మనం కఠినంగా ఉంటే ఇలాంటి జరగడానికి ఆస్కారం ఉండదని చిరంజీవి అంటున్నారు. కానీ సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే కమిట్‌మెంట్‌ తప్పనిసరి చిన్మయి లాంటి వాదిస్తున్నారు. సినీరంగంలో క్యాస్టింగ్‌ కౌచ్ ఉందని బల్లగుద్ది చెబుతోంది సింగర్ చిన్మయి. తాను కూడా క్యాస్టింగ్ కౌచ్‌ బారిన పడ్డానని చాలాసార్లు తన ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా మెగాస్టార్ చేసిన కామెంట్స్‌పై సైతం చిన్మయి తనదైన శైలిలో స్పందించింది. మెగాస్టార్‌ను గౌరవిస్తూనే క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉందని.. కమిట్‌మెంట్‌ ఇస్తేనే అవకాశాలు వస్తాయని అంటోంది సింగర్.

మెగాస్టార్‌ కామెంట్స్‌ కరెక్టేనా?

మెగాస్టార్‌ చెప్పిన ప్రకారం మనం కరెక్ట్‌గా ఉంటే ఎవరూ అవకాశం తీసుకోరని అంటున్నారు. మన ప్రవర్తన ఎలా ఉంటే అలానే జరుగుతుందని చెబుతున్నారు. చిరంజీవి చెప్పిన విషయాన్ని కొంత వరకు అంగీకరించాల్సిందే. మన ప్రవర్తన ఎలా ఉంటే అలానే జరుగుతుంది అనేది వాస్తవమే. కానీ మెగాస్టార్‌ చెప్పిన మాటలు వంద శాతం నిజమని చెప్పలేం. ఎందుకంటే మనం కరెక్ట్‌గా ఉన్నా.. ‍అలాంటి బుద్ధి ఉన్నవారు ఏదో ఒక రూపంలో మనల్ని టార్గెట్ చేస్తారు. పని చేసే చోట ఇబ్బందులు కలిగిస్తారు. అలా మనం కరెక్ట్‌గా ఉన్నప్పటికీ.. అలాంటి పరిస్థితులను కూడా క్యాష్‌ చేసుకునే వారు కూడా ఉంటారు. ఒకవేళ మెగాస్టార్‌ చెప్పింది పాటిస్తే.. ఇండస్ట్రీలో అవకాశాలు టాలెంట్‌ను చూసి ఇచ్చేస్తారా? లేదా? అన్నదే ఇక్కడ ప్రశ్న. మనం ఎంత కరెక్ట్‌గా ఉన్నప్పటికీ.. ఛాన్స్ అనే పేరుతో ఛాన్స్ తీసుకోరని గ్యారెంటీ ఏంటని పలువురిలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది మారాలంటే సినీ ఇండస్ట్రీ నుంచే మార్పు వస్తే బాగుంటుందని అందరి అభిప్రాయం.

చిన్మయికే కామెంట్స్‌కే మద్దతు..

ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌పై పోరాటం చేసేవాళ్లలో చిన్మయిని మించిన వారు ఉండరు. కేవల సినీ ఇండస్ట్రీ మాత్రమే కాదు.. ప్రపంచంలో ఎక్కడా మహిళలకు అన్యాయం జరిగినా సరే తన గొంతు వినిపిస్తూనే ఉంటోంది. అందుకే మెగాస్టార్‌ కామెంట్స్‌పై కూడా సింగర్ స్పందించింది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌ ఉందని బల్లగుద్ది చెబుతోంది. ఎందుకంటే తాను కూడా బాధితురాలిననే ఇప్పటికే చాలాసార్లు చెప్పింది. ఎందుకంటే ఎవరికైనా తాము అనుభవిస్తేనే అందులోని బాధ వారికే ఎక్కువగా తెలుస్తుంది. మెగాస్టార్ వ్యాఖ్యలు కొంతవరకు నిజమే అయినా.. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌ను అరికట్టాలంటే ముందు అలాంటి వాళ్ల మైండ్‌ సెట్‌ మారాలి. అంతే తప్ప క్యాస్టింగ్‌ కౌచ్‌ లేదనడం కరెక్ట్ కాదనిపిస్తోంది.  

చిన్మయి రియాక్షన్..

చిరంజీవి కామెంట్స్‌పై చిన్మయి స్పందిస్తూ.. 'ఇండస్ట్రీలో కాస్టింగ్‌ కౌచ్‌ లేదు అనేది పూర్తిగా అబద్ధం. ఇంగ్లీష్‌లో ‘కమిట్‌మెంట్’ అంటే వృత్తి పట్ల నిబద్ధత అని అర్థం వస్తుంది.. కానీ, ఇండస్ట్రీలో ఆ పదానికి అర్థం పూర్తిగా వేరు ఉంటుంది. మహిళలు తమ శరీరాన్ని అప్పగించకపోతే  ఇండస్ట్రీలో ఛాన్సులు రావు. ఇక్కడ చాలామంది మగవారు మహిళల నుంచి లైంగిక ప్రయోజనాలను ఆశించడం సర్వసాధారణం. లెజెండరీ చిరంజీవి గారి తరం వేరు.. ఇప్పుడు జరుగుతున్నది వేరు. చిరంజీవి జనరేషన్‌లో మహిళా ఆర్టిస్టులను గౌరవించేవారు… ప్రస్తుతం పరిశ్రమలో అలాంటి వాతావరణం లేదు. చిరు తరంలో మహిళా  కళాకారులతో స్నేహితులుగా తమ కుటుంబ సభ్యులుగా ఉండేవారు. ఒకరినొకరు గౌరవించుకునేవారు. లెజెండ్‌లతో పనిచేసిన వారందరూ లెజెండ్‌లే. చిరు నాటి రోజులు ఇప్పుడు లేవు' అని మెగాస్టార్‌ వ్యాఖ్యలకు రియాక్ట్ అయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement