సల్మాన్‌ ఖాన్‌ దేశభక్తి సినిమా పేరు మారింది.. కారణం? | Salman khan Battle Of Galwan Title Changed | Sakshi
Sakshi News home page

సల్మాన్‌ ‘బ్యాటిల్‌ ఆఫ్‌ గల్వాన్‌’ టైటిల్‌ మారింది.. కొత్త టైటిల్‌ ఇదే!

Mar 16 2026 2:09 PM | Updated on Mar 16 2026 2:26 PM

Salman khan Battle Of Galwan Title Changed

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ హీరోగా నటిస్తున్న తాజా దేశభక్తి చిత్రం ‘బ్యాటిల్‌ ఆఫ్‌ గల్వాన్‌’పేరు మారింది. ఈ సినిమాకు‘మాతృభూమి’ అని టైటిల్‌ మార్చినట్లు సోషల్‌ మీడియా వేదికగా సల్మాన్‌  ప్రకటించారు. అయితే పేరు మార్పుకు గల కారణాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు.

2020లో గ‌ల్వాన్ లోయ‌లో భారత-చైనా సైనిక ఘర్షణ ఘటన నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో వీర‌మ‌ర‌ణం పొందిన తెలంగాణలోని సూర్యాపేట‌కు చెందిన కల్నల్ బిక్కుమళ్ళ సంతోష్ బాబు పాత్రలో సల్మాన్‌ కనిపించబోతున్నట్లు సమాచారం. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిత్రాంగద సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. సల్మాన్‌ పుట్టినరోజును పురస్కరించుకొని ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయగా.. ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది. 

అయితే చైనా మీడియా మాత్రం చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ ఆరోపించింది. సినిమా తీసినంతమాత్రన చరిత్ర మారిపోదంటూ చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ లో అక్కసు వెళ్లగక్కింది. ఈ పరిణామాల వేళ తాజాగా సినిమా పేరును మార్చడం గమనార్హం. ఆగస్ట్‌లో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement