breaking news
Battle Of Galwan
-
సల్మాన్ ఖాన్ సినిమాపై చైనా అక్కసు.. కారణం ఇదేనా?
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కొత్త సినిమా 'బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్'పై చైనా తీవ్ర అభ్యంతరం తెలుపుతోంది. సినిమా తీసినంతమాత్రన చరిత్ర మారిపోదంటూ చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ లో అక్కసు వెళ్లగక్కింది. ఈ మేరకు తమ సంపాదకీయంలో బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ చిత్రంపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఇండియన్ సినిమాపై చైనాకు ఎందుకంత అక్కసు? బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ కథేంటి?తెలంగాణ వీర సైనికుడిగా సల్మాన్సల్మాన్ఖాన్(salman Khan) హీరోగా అపూర్వ లఖియా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’(Battle of Galwan Movie). సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా శనివారం ఈ చిత్ర టీజర్ విడుదలైంది. సల్మాన్ ఖాన్ ఇందులో ఇండియన్ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. 2020లో గల్వాన్ లోయలో భారత-చైనా సైనిక ఘర్షణ ఘటన నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో వీరమరణం పొందిన తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమళ్ళ సంతోష్ బాబు పాత్రలో సల్మాన్ కనిపించబోతున్నాడు.అయితే ఈ సినిమా కథపైనే ఇప్పుడు చైనా అభ్యంతరం చెబుతోంది. ఈ చిత్రం చరిత్రను వక్రీకరిస్తోందని చైనా మీడియా ఆరోపిస్తోంది. చైనా ప్రాదేశిక సమగ్రతను కాపాడటంలో తమ సైన్యం సంకల్పాన్ని ఇలాంటి సినిమాలు దెబ్బతీయబోదంటూ గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. గ్లోబల్ టైమ్స్ ప్రచురించిన కథనంలో చైనా సైనిక నిపుణులు మాట్లాడుతూ..భారత్-చైనా గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణకు సంబంధించిన నిజాలను సినిమాలో చూపించలేదని ఆరోపించారు. మూవీ కథాంశం భారత్ కి అనుకూలంగా ఉండే అవకాశం ఉందని, ఇది ప్రజలను రెచ్చగొట్టడానికి దోహదమవుతుందని చైనా మీడియా ప్రచారం చేస్తోంది.అదే చైనా భయమా?2020 జూన్ 15న గాల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగింది.భారత్ ఆధీనంలో ఉన్న ప్రాంతాలను ఆక్రమించేందుకు చైనా ఆర్మీ దుస్సాహసం చేయగా, 16వ బీహార్ బెటాలియన్‌కు చెందిన కమాండింగ్ అధికారి కల్నల్ సంతోష్ బాబు నేతృత్వంలోని భారత సైనికులు చైనా దళాలకు ధీటుగా జవాబిచ్చారు. ఈ ఘర్షణలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబుతో సహా 20 మంది జవాన్లు అమరులయనట్లు భారత ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. అయితే చైనా మాత్రం వారికి జరిగిన ప్రాణనష్టంపై ప్రకటన విడుదల చేసేందుకు నిరాకరించింది. ఈ ఘటనలో చైనాకు చెందిన 40 మందికిపైగా సైనికులు మరణించి ఉంటారని విదేశీ మీడియా కథనాలు వెలువరించినప్పటికీ, చైనా మాత్రం ఈ విషయంలో నోరు మెదపలేదు. ఇప్పుడు ఈ ఘటన నేపథ్యంలోనే 'బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్' సినిమా రాబోతుంది. ఈ సినిమా విడుదలైతే..అసలు నిజం చైనీయులకు కూడా తెలిసే అవకాశం ఉంది. భారత్ చేతిలో చైనా సైన్యం ఘోరంగా దెబ్బతిందనే విషయం కూడా ప్రపంచానికి తెలిసే అవకాశం ఉంది. అందుకే టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచే ఈ సినిమాపై చైనా దుష్ప్రచారం చేస్తోంది. ఈ సినిమా చైనా సర్కార్ పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని భారత విశ్లేషకులు చెబుతున్నారు. -
చరణ్‌కి ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడితో సల్మాన్ సినిమా.. టీజర్ రిలీజ్
గత కొన్నేళ్ల నుంచి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కి అస్సలు కలిసి రావట్లేదు. చేసిన సినిమా చేసినట్లే బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేస్తూ వచ్చాయి. ఈ క్రమంలోనే ట్రెండ్‌కి తగ్గట్లు దేశభక్తి బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన 'బ్యాటల్ ఆఫ్ గాల్వాన్' అనే మూవీలో నటిస్తున్నాడు. సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ఇప్పుడు చిత్ర టీజర్ రిలీజ్ చేయడంతో పాటు విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసిన 'బిగ్‌బాస్' ఇమ్మాన్యుయేల్)టీజర్లో గాల్వాన్ లోయని.. యుద్ధభూమిలో సల్మాన్‌ని మాత్రమే చూపించారు. ఈ సినిమాకు అపూర్వ లఖియా దర్శకుడు. ఇతడు గతంలో రామ్ చరణ్‌తో 'తుఫాన్' అనే మూవీ తీశాడు. ఇది ఎంత ఘోరంగా ఫ్లాప్ అయిందో తెలిసిందే. దీని తర్వాత హసీనా పార్కర్ అనే చిత్రం, క్రాక్ డౌన్, ముమ్ బాయ్ అనే వెబ్ సిరీస్‌లు చేశాడు. దాదాపు ఐదేళ్ల తర్వాత ఈ మూవీతో మళ్లీ దర్శకుడిగా అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. ఈ సినిమాకు సల్మాన్ ఖానే నిర్మాత కూడా. వచ్చే ఏడాది రంజాన్ సందర్భంగా ఏప్రిల్ 17న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.అయితే 'బ్యాటల్ ఆఫ్ గాల్వాన్' సినిమా.. కల్నల్ సంతోష్ బాబు బయోపిక్ అనే సందేహం కలుగుతోంది. ఎందుకంటే తెలంగాణ సూర్యాపేటకు చెందిన ఈయన.. పదిహేనేళ్లుగా సైన్యంలో పనిచేశారు. భారత్-చైనా సరిహద్దుల్లోని గాల్వాన్ లోయలో ఏడాదిన్నరగా విధులు నిర్వర్తించారు. భారత్-చైనా సైనిక బలగాల ఘర్షణ సందర్భంగా 2020లో అమరులయ్యారు. మూవీ రిలీజైతే ఈయన జీవితం ఆధారంగా సినిమా తీశారా లేదా అనేది క్లారిటీ వస్తుంది.(ఇదీ చదవండి: అతడికి 45.. ఆమెకు 20 ఏళ్లు.. సూర్య కొత్త సినిమా స్టోరీ ఇదే) -
ఎలా నటించాలని భయపడుతున్న సల్మాన్
-
భయంగా ఉంది... అయినా సిద్ధమే : సల్మాన్ ఖాన్
గాల్వాన్ లోయలో 2020లో భారత్–చైనా సైనికుల మధ్య జరిగిన యుద్ధం, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంతో రూపొందుతున్న చిత్రం ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman khan ) హీరోగా నటిస్తున్నారు. ఇందులో ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు సల్మాన్. అలాగే ఈ చిత్రంలోని మరో కీలక పాత్రలో నటి చిత్రాంగద సింగ్ కనిపిస్తారు. ఈ సినిమాకు సంబంధించి తన ప్రిపరేషన్ గురించి సల్మాన్ ఖాన్ తాజాగా మాట్లాడుతూ– ‘‘నా గత చిత్రం ‘సికందర్’ యాక్షన్ మూవీ. ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ డిఫరెంట్ మూవీ. ఇందులో చాలా యాక్షన్ అయితే ఉంది. కానీ గత చిత్రాలతో పోల్చినప్పుడు ఈ చిత్రం పూర్తిగా విభిన్నమైంది. ఈ సినిమా కోసం చాలా శ్రమిస్తున్నాను. ప్రతి రోజూ వర్కౌట్స్ చేస్తున్నాను. ఈ తరహా కష్టాన్ని ఈ సినిమా డిమాండ్ చేస్తుంది. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించనున్నాం. కష్టమైన లొకేషన్స్‌లో షూట్ చేయాల్సి ఉంది. లడక్‌లో దాదాపు ఇరవై రోజుల షూటింగ్ ప్లాన్ చేశాం. ఇందులో ఎనిమిది రోజులు గడ్డకట్టే చలిలో షూటింగ్ చేయాల్సి ఉంది. ఈ విషయం తలచుకుంటే నాకు భయంగా ఉంది. కానీ ఇందులో నేనే నటించడానికి సిద్ధంగా ఉన్నాను. ఫిజికల్ గా ఈ సినిమా కష్టమైనప్పటికీ ఈ జర్నీ నాకో మంచి మెమొరీ’’ అని పేర్కొన్నారు. ఇక అపూర్వ లిఖియా దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. అనుకున్న ప్రకారం ఈ సినిమా షూటింగ్ పూర్తయితే వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఒకవేళ కుదరకపోతే... సల్మాన్ ఖాన్ ఫేవరెట్ సీజన్ రంజాన్ సందర్భంగా ఈ సినిమా విడుదల కావొచ్చు.


