బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ గత కొన్నాళ్ల నుంచి సక్సెస్ రేసులో చాలా వెనకబడిపోయాడు. ప్రస్తుతం 'బ్యాటల్ ఆఫ్ గాల్వాన్' పేరుతో ఓ దేశభక్తి సినిమా చేస్తున్నాడు. తెలంగాణకు చెందిన వీరజవాన్ కల్నల్ సంతోష్ బాబు జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 17న ఇది థియేటర్లలోకి రానుంది. ఇప్పుడీ మూవీ నుంచి 'మాతృభూమి' అంటూ సాగే పాటని రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ హిట్ 'సర్వం మాయ'.. తెలుగులో స్ట్రీమింగ్)
ఇందులో సల్మాన్ సరసన చిత్రంగద సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. సల్మానే స్వయంగా నిర్మిస్తుండగా.. గతంలో రామ్ చరణ్‌తో 'జంజీర్(తుఫాన్)' లాంటి అట్టర్ ఫ్లాప్ మూవీ తీసిన అపూర్వ లఖియా.. ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో దేశభక్తి ట్రెండ్ నడుస్తోంది. మరి దాన్ని సల్మాన్ సినిమా అందుకుని హిట్ అవుతుందా లేదా అనేది చూడాలి?
(ఇదీ చదవండి: శోభిత 'చీకటిలో' సినిమా రివ్యూ)


