భయంగా ఉంది... అయినా సిద్ధమే : సల్మాన్‌ ఖాన్‌ | Salman khan Talk Candidly About Battle Of Galwan | Sakshi
Sakshi News home page

భయంగా ఉంది... అయినా సిద్ధమే : సల్మాన్‌ ఖాన్‌

Jul 18 2025 2:04 PM | Updated on Jul 18 2025 3:10 PM

Salman khan Talk Candidly About Battle Of Galwan

గాల్వాన్‌ లోయలో 2020లో భారత్‌–చైనా సైనికుల మధ్య జరిగిన యుద్ధం, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంతో రూపొందుతున్న చిత్రం ‘బ్యాటిల్‌ ఆఫ్‌ గాల్వాన్‌’. ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌(Salman khan ) హీరోగా నటిస్తున్నారు. ఇందులో ఆర్మీ ఆఫీసర్‌ పాత్రలో కనిపిస్తారు సల్మాన్‌. అలాగే ఈ చిత్రంలోని మరో కీలక పాత్రలో నటి చిత్రాంగద సింగ్‌ కనిపిస్తారు. 

ఈ సినిమాకు సంబంధించి తన ప్రిపరేషన్‌ గురించి సల్మాన్‌ ఖాన్‌ తాజాగా మాట్లాడుతూ– ‘‘నా గత చిత్రం ‘సికందర్‌’ యాక్షన్‌ మూవీ. ‘బ్యాటిల్‌ ఆఫ్‌ గాల్వాన్‌’ డిఫరెంట్‌ మూవీ. ఇందులో చాలా యాక్షన్‌ అయితే ఉంది. కానీ గత చిత్రాలతో పోల్చినప్పుడు ఈ చిత్రం పూర్తిగా విభిన్నమైంది. ఈ సినిమా కోసం చాలా శ్రమిస్తున్నాను. ప్రతి రోజూ వర్కౌట్స్‌ చేస్తున్నాను. ఈ తరహా కష్టాన్ని ఈ సినిమా డిమాండ్‌ చేస్తుంది. 

త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించనున్నాం. కష్టమైన లొకేషన్స్‌లో షూట్‌ చేయాల్సి ఉంది. లడక్‌లో దాదాపు ఇరవై రోజుల షూటింగ్‌ ప్లాన్‌ చేశాం. ఇందులో ఎనిమిది రోజులు గడ్డకట్టే చలిలో షూటింగ్‌ చేయాల్సి ఉంది. ఈ విషయం తలచుకుంటే నాకు భయంగా ఉంది. కానీ ఇందులో నేనే నటించడానికి సిద్ధంగా ఉన్నాను. ఫిజికల్‌ గా ఈ సినిమా కష్టమైనప్పటికీ ఈ జర్నీ నాకో మంచి మెమొరీ’’ అని పేర్కొన్నారు. 

ఇక అపూర్వ లిఖియా దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను సల్మాన్‌ ఖాన్‌ ఫిల్మ్స్‌ నిర్మిస్తోంది. అనుకున్న ప్రకారం ఈ సినిమా షూటింగ్‌ పూర్తయితే వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్‌. ఒకవేళ కుదరకపోతే... సల్మాన్‌ ఖాన్‌ ఫేవరెట్‌ సీజన్‌ రంజాన్‌ సందర్భంగా ఈ సినిమా విడుదల కావొచ్చు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement