బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ చిక్కుల్లో ఇరుక్కున్నారు. కాంతార చిత్రంలోని ఓ దైవ సన్నివేశాన్ని ఇమిటేట్ చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆయనపై కేసు నమోదైంది. దీంతో ఈ కేసుపై ఏప్రిల్ 8న విచారణ జరగనుంది.
అసలేం జరిగిందంటే
2025లో గోవాలో ఇంటర్నేషనల్ ఫిల్స్ ఫెస్టివల్ జరిగింది. కాంతార చిత్రంలో హిరో రిషబ్ పోషించిన పంజుర్లి, గులిగ అనే దైవంశకు చెందిన క్యారెక్టర్లను పోషించారు. అయితే ఈ కార్యక్రమంలో రణవీర్ సింగ్ ఆ క్యారెక్టర్లను కామెడీగా అనుకరించారు. దీంతో రణవీర్ సింగ్‌పై కన్నడీగులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే తన తప్పు తెలుసుకున్న రణవీర్ సింగ్ వారికి క్షమాపణ చెప్పారు. అనంతరం రిషబ్ షెట్టి చాలా బాగా ఆ పాత్రలను పోషించాడు అని చెప్పడం కోసమే అలా చేశానని వివరణ ఇచ్చారు.
అయితే దైవాంశకు చెందిన పాత్రలను రణవీర్ సింగ్ కామెడీగా ఇమిటేట్ చేశారని ఆరోపిస్తూ గత డిసెంబర్‌లో ప్రశాంత్ మితల్ అనే న్యాయవాది బెంగళూరులోని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆ దీనిపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 196,299,302 ల ప్రకారం కేసు ఫైలు చేశారు. దీనిపై ఏప్రిల్ 8న విచారణ జరగనుంది.
అయితే గతేడాది పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన కాంతారా చాప్టర్-1 మూవీ బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. రూ.800 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి రికార్డులు సృష్టించింది. 2022లో విడుదలైన కాంతారా చిత్రానికి ఇది ప్రీక్వెల్‌గా కాంతారా చాఫ్టర్-1 విడుదలైంది.


