సాక్షి హైదరాబాద్: లిక్కర్ కేసులో క్లీన్ చీట్ ఇవ్వడంపై మాజీ ఎమ్మెల్సీ కవిత హర్షం వ్యక్తం చేశారు. చివరకు సత్యమే గెలిచిందన్నారు. రాజకీయ వేధింపుల్లో భాగంగానే లిక్కర్ కేసులో తనను ఇరికించారని అయినా కడిగిన ముత్యంలా బయిటకు వచ్చానన్నారు. లిక్కర్ కేసు రాజకీయ కుట్రని దానిని ఎవ్వరూ నమ్మలేదని తెలిపారు.ఈ తీర్పుతో న్యాయవ్యవస్థపై తనకున్న నమ్మకం నిలిచిందన్నారు.
తనను మూడేళ్ల పాటు నానా మాటలన్నారని ఐదేళ్లపాటు జైలులో పెట్టారని ఈ సందర్భంగా కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కష్టకాలంలో తనకు అండగా ఉన్న అభిమానులకు శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఢిల్లీ లిక్కర్ కేసులో ఎటువంటి కుట్ర రౌస్ రెవెన్యూ కోర్టు స్పష్టం చేసింది. ఈకోసులో ఉన్న నిందితులు తప్పు చేశారని సాక్షాదారాలు లేవని తెలిపింది.
ఏం జరిగింది?
ఢిల్లీ లిక్కర్ కేసులో అవినీతి జరిగిందంటూ ఆ సమయంలో ఎమ్మెల్సీగా ఉన్న కవితను మార్చి 2024న అధికారులు అరెస్టు చేశారు. అనంతరం ఆమెను తీహార్ జైలుకు తరలించారు. దీంతో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఆమెకు బెయిల్ మంజూరైంది. దీంతో ఐదు నెలల అనంతరం ఆమె జైలు నుంచి విడుదలైంది. కాగా తాజాగా ఈ కేసులో మాజీ ఎమ్మెల్సీ కవితతో పాటు మిగతా వారు ఎటువంటి నేరాలకు పాల్పడలేదని రౌస్ రెవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది.



