ప్రముఖ కమెడియన్ భారతి సింగ్, హర్ష్ లింబాచియా దంపతులు తమ కుమారుడి పేరును రివీల్ చేశారు. డిసెంబర్ 19న రెండో బిడ్డకు జన్మనిచ్చిన భారతి సింగ్ ఇవాళ తన కొడుకు నామకరణ వేడుకను నిర్వహించారు. తమ ముద్దుల కుమారుడికి యశ్‌వీర్ అనే పేరు పెట్టినట్లు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ నామకరణ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేక్ చేశారు. అవీ కాస్తా నెట్టింట వైరల్ కావడంతో పలువురు సినీ ప్రముఖులు నైస్ నేమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. వీరికి ఇప్పటికే లక్ష్ అనే కుమారుడు ఉన్నారు. ఈషా సింగ్, కరిష్మా తన్నా, అదా ఖాన్, కిష్వర్ మర్చంట్ వంటి ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
కాగా.. నటి, కమెడియన్ భారతి సింగ్ పలు సీరియల్స్‌తో పాటు రియాలిటీ షోస్‌లోనూ పాల్గొంది. ది కపిల్ శర్మ షో, ఇండియాస్ గాట్ టాలెంట్ లాంటి షోలలో మెరిసింది. ఇటీవల ప్రసవం తర్వాత వెంటనే లాఫ్టర్ చెఫ్స్ ఫన్ అన్‌లిమిటెడ్ సీజన్- 3 సెట్స్‌లో కనిపించింది. ఈ దంపతులకు ఇప్పటికే మూడేళ్ల కుమారుడు లక్ష్ సింగ్ లింబాచియా ఉన్నాడు. వీరికి 2022లో మొదట కుమారుడు జన్మించాడు. ఈ జంట కొన్ని సంవత్సరాలు డేటింగ్ చేసిన తర్వాత 2017లో వివాహం చేసుకున్నారు.


