బుల్లితెర నటి, బిగ్ బాస్ ఫేమ్ కీర్తి భట్ (Keerthi Bhat) షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తన రిలేషన్‌షిప్‌కు గుడ్ బై చెప్పేసింది. రెండేళ్ల క్రితం హీరో విజయ్ కార్తీక్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న కీర్తి భట్.. ప్రస్తుతం లివింగ్ రిలేషన్‌లో ఉన్నారు. తాజాగా కీర్తి తమ బంధానికి ఎండ్ కార్డ్ పడేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.
కాగా.. కీర్తి భట్ సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగు బిగ్‌బాస్ ఆరో సీజన్‌తో మరింత పాపులారిటీ సంపాదించుకుంది. తెలుగు బిగ్‌బాస్ ఆరో సీజన్ ఫైనలిస్టుగా నిలిచింది. ఈ షోలో తన లైఫ్ జర్నీ చెప్పి ప్రేక్షకులను ఏడిపించేసింది. యాక్సిడెంట్‌లో తల్లిదండ్రులను కోల్పోయింది. తీవ్రంగా గాయపడ్డ తనకు పిల్లలు పుట్టే అవకాశమే లేదని వైద్యులు చెప్పడంతో ఎంతో వేదన పడింది. ఎవరూ లేని తాను ఓ అనాథ పాపను కూడా దత్తత తీసుకుంది. కానీ బిగ్‌బాస్‌కు వెళ్లేముందే ఆ పాప చనిపోయింది. అంతేకాకుండా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఫేస్ చేసింది. వాటిన్నింటినీ దాటుకుని సీరియల్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.


