పవర్‌ఫుల్‌  | Shruti Haasan Aakasamlo Oka Tara First Look out on her birthday | Sakshi
Sakshi News home page

పవర్‌ఫుల్‌ 

Jan 29 2026 5:33 AM | Updated on Jan 29 2026 5:33 AM

Shruti Haasan Aakasamlo Oka Tara First Look out on her birthday

‘ఆకాశంలో ఒక తార’ సినిమాలో భాగమయ్యారు హీరోయిన్‌ శ్రుతీహాసన్‌. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. ఈ చిత్రంలో సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా నటిస్తున్నారు. పవన్‌ సాధినేని దర్శకత్వంలో గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్పణలో సందీప్‌ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. కాగా, జనవరి 28న (బుధవారం) శ్రుతీహాసన్‌ బర్త్‌ డే. 

ఈ సందర్భంగా ‘ఆకాశంలో ఒక తార’ చిత్రంలో శ్రుతీహాసన్‌ నటిస్తున్న విషయాన్ని వెల్లడించి, ఈ సినిమా నుంచి ఆమె ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ‘‘ఈ సినిమా కథలో ఓ కీలక మలుపుకు కారణమైన పాత్రలో శ్రుతీహాసన్‌ నటిస్తున్నారు. ఆమె ప్రెజెన్స్‌ పవర్‌ఫుల్‌గా ఉంటుంది’’ అని యూనిట్‌ పేర్కొంది. తెలుగు, మలయాళ తమిళ, హిందీ భాషల్లో ఈ వేసవిలో విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్‌.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement