‘ధురంధర్‌’తో ఆ విషయం అర్థమైయింది :అక్షయ్‌ కుమార్‌ | Akshay Kumar Interesting Comment On Dhurandhar | Sakshi
Sakshi News home page

‘ధురంధర్‌’తో ఆ విషయం అర్థమైయింది :అక్షయ్‌ కుమార్‌

Mar 15 2026 10:24 AM | Updated on Mar 15 2026 12:35 PM

Akshay Kumar Interesting Comment On Dhurandhar

ప్రేక్షకులు అభిరుచి ప్రతి రెండు,మూడేళ్లకు ఓసారి మారుతుందని, అందుకు ‘ధురంధర్‌’ మంచి ఉదాహరణ అని బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ అన్నాడు. తాజాగా అక్షయ్‌ కుమార్‌ ఇండియా టుడే కాంక్లేవ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్‌లో మారుతున్న ట్రెండ్‌ గురించి అక్షయ్‌ మాట్లాడుతూ.. ‘ధురంధర్‌’ సినిమాను తీసుకోండి. ఇది పూర్తి స్థాయి యాక్షన్‌ చిత్రం. సినిమా మొత్తంలో యాక్షన్‌ సన్నివేశాలే ఉంటాయి. ప్రేక్షకులు వాటిని ఎంజాయ్‌ చేస్తున్నారు. రణవీర్ సింగ్ చేసిన హై-ఎనర్జీ యాక్షన్ సన్నివేశాలకు చప్పట్లు కొడుకున్నారు. దీన్ని బట్టి ఇప్పుడు ఆడియన్స్‌ యాక్షన్‌ సినిమాలను ఇష్టపడుతున్నారనే విషయం అర్థమవుతుంది.

ఇలా రెండు, మూడేళ్లకు ఒకసారి ప్రేక్షకుల అభిరుచి మారుతూనే ఉంటుంది. ఐదారేళ్ల క్రితం పరిస్థితి వేరుగా ఉండేది.అప్పుడు సామాజిక సందేశాత్మక చిత్రాలను ఆదరించారు. నేను చేసిన ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’, ‘ప్యాడ్ మ్యాన్’ లాంటి సినిమాలు అప్పుడు సూపర్‌ హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు అలాంటి సినిమాలు తీస్తే.. ఆడుతాయో లేదో తెలియదు. ప్రేక్షకుల కోరికలు ట్రెండ్‌కు తగ్గట్లుగా మారుతుంటాయి. ప్రస్తుతం హారర్ కామెడీలకూ ఆదరణ లభిస్తోంది. తర్వాత ఆడియన్స్‌ దేనిని ఇష్టపడతారో మనం ఎప్పటికీ ఊహించలేం’ అని అన్నారు. 

ధురంధర్‌ విషయానికొస్తే..  రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా ఆదిత్య ధర్‌ తెరకెక్కించిన  యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇది. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ని షేక్‌ చేసింది. దాదాపు రూ. 1300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్‌గా ధురంధర్‌ 2 రాబోతుంది.  మార్చి 19న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement