ఈ స్మార్ట్ టెక్నాలజీ కాలంలో స్కీన్ టైం ఎక్కువైపోతోంది. దేనికైనా..ఫోన్, ల్యాప్‌టాప్‌తోనే రోజంతా పని. అది లేకుండా ఒక్క పూట గడవడం కష్టం అన్నంతగా టెక్నాలజీపై ఆధారపడిపోయాం. దాంతో అందరి కళ్లు మసకబారిపోయి అందవిహీనంగా తయారవుతున్నాయి. అందానికి కేంద్రమైన నయనాలే డల్‌గా అలసిపోయినట్లు ఉంటే అందమైన ముఖానికి ఆస్కారం ఏముంది. అందుకే కంటి కాంతి కోసం ఈ కేర్ తప్పనిసరి. అది కూడా మన ఇంట్లో దొరికే వాటితోనే కంటి కింద నల్లటి వలయాలను పోగొట్టుకుందాం ఇలా..!.
కళ్లు త్వరగా అలసిపోవడం, కళ్ళ కింద నల్లని వలయాలు ఏర్పడటం వంటివి తరచూ జరుగుతుంటాయి. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యంతో పాటు కళ్లు ఆకర్షణీయంగా, అందంగా తయారవుతాయి.
బంగాళదుంపని మెత్తగా రుబ్బి రసం తీయాలి. అందులో దూదిని ముంచి కనురెప్పలపై పదిహేను, ఇరవై నిమిషాలపాటు ఉంచి కడిగేయాలి. బేబీ ఆయిల్‌ని కళ్లచుట్టూసున్నితంగా మసాజ్ చేస్తే ఒత్తిడి తగ్గి మంచి రిలీఫ్ వస్తుంది.
కనురెప్పలు దట్టంగా పెరగాలంటే క్రమం తప్పకుండా ప్రతీరోజూ రాత్రి పడుకునే ముందు రెప్పలకి ఆముదం రాయాలి. కొబ్బరి నూనె చుక్కల్ని కళ్ల చుట్టూ వలయాకారంలో నెమ్మదిగా మసాజ్ చేస్తే కళ్ల కింద నలుపు తగ్గుముఖం పడుతుంది.
కాచి వడబోసిన నీటిలో చిటికెడు ఉప్పు వేసి కళ్లని కడిగితే కాంతిమంతంగా కనిపిస్తాయి.
టొమాటో రసాన్ని, నిమ్మరసాన్ని సమపాళ్లలో కలిపి కళ్ల చుట్టూ అప్లై చేయాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే కళ్ల కింద నలుపు తగ్గడమే కాకుండా మంచి రిలీఫ్ వస్తుంది. ఈ మిశ్రమం రోజు విడిచి రోజు పెడితే మంచి ఫలితాన్నిస్తుంది.
కీరాని ముక్కలుగా కోసి రుబ్బి రసం తీసుకోవాలి. దాంట్లో రోజ్‌వాటర్‌ని కలిపి కళ్లచుట్టూ పట్టించి అరగంట తరువాత కడిగేసుకోవాలి.
(చదవండి: అసామాన్య ప్రతిభాశాలి స్పేస్ జర్నీ ముగిసింది..! రిటైర్మెంట్ తర్వాత సునీత..)


