స్పేస్‌ రికార్డులకు కేరాఫ్‌ అడ్రస్‌ ఆమె..! రిటైర్మెంట్‌ తర్వాత సునీత.. | Sunita Williams Ends 27-Year NASA Career: A Look At Her Pension Benefits | Sakshi
Sakshi News home page

అసామాన్య ప్రతిభాశాలి స్పేస్‌ జర్నీ ముగిసింది..! రిటైర్మెంట్‌ తర్వాత సునీత..

Jan 22 2026 3:50 PM | Updated on Jan 22 2026 4:21 PM

Sunita Williams Ends 27-Year NASA Career: A Look At Her Pension Benefits

నాసాలోని అనుభవజ్ఞురాలైన వ్యోమగామి సునీతా విలియమ్స్ ఎన్నో రికార్డులు సృష్టించారు. ఆమె కెరీర్‌లో మూడు మిషన్‌ బహుళ అంతరికక్ష  ప్రయాణ రికార్డులు సునీతా పేరు మీదనే ఉన్నాయి. స్పేస్‌లో 608 రోజులు గడిపిన ఘనత కూడా ఆమెదే. మొత్తం తొమ్మిది స్పేస్‌ వాక్‌లు పూర్తి చేసి..రికార్డు నెలకొల్పారామె. అంతేగాదు తొమ్మిది  సార్లు 62 గంటల ఆరు నిమిషాల పాటు స్పేస్‌వాక్‌ చేసిన ఏకైక మహిళా వ్యోమగామి. అలా ఎన్నో ఘనతలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన సునీతా..నాసా ఎక్స్‌ వేదికగా రిటైర్మెంట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

అంతే ఒక్కసారిగా సునీతా కంగ్రాట్స్‌ ఇన్నాళ్లు మీరందించిన అంతరిక్ష సేవలకు ధన్యవాదాలు అంటూ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి కూడా. ఈ తరుణంలో మరికొందరు ‘ఇకపై సునీతను వ్యోమగామిగా చూడలేమా?’ అంటూ భావోద్వేగం వ్యక్తం చేస్తున్నారు. ఇంతలా అందర్నీ ప్రభావితం చేసిన ఈ సూపర్‌ విమెన్‌ పదవీవిరణమ తర్వాత ఆమె జీవితం ఎలా ఉంటుంది..? పెన్షన్‌ వస్తుందా తదితర ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా..!.

సునీతా విలియమ్స్‌ పదవీ విరమణ డిసెంబర్ 27, 2025 నుండి అమల్లోకి వస్తుంని యూఎస్‌ ఏజెన్సీ దృవకరించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె  పదవీ విరమణ తర్వాత నాసా నుంచి నేరుగా పెన్షన్‌ పొందరట. ఆమెకు ఫెడరల్ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ సిస్టమ్ (FERS) కింద పెన్షన్‌ తీసుకుంటారట. ఆమె 2ళ్ల సర్వీసు, అలాగే వరుసగా మూడేళ్లు అత్యధిక జీతం పొందిన సగట తదితరాల ఆధారంగా పెన్షన్‌ ఇవ్వడం జరుగుతుంది. 

అంతరంగిక వర్గాల సమాచారం ప్రకారం సుమారు రూ. 36 లక్షల వరకు పెన్షన​పొందే అవకాశం ఉందట. దీంతోపాటు ఆమెకు యూఎస్‌ సోషల్ సెక్యూరిటీ స్కీమ్ నుంచి ప్రయోజనాలను కూడా అందుకుంటారు. ఇవేగాక ఫెడరల్‌ ఆరోగ్య బీమా, జీవిత బీమా, థ్రిఫ్ట్ సేవింగ్స్ ప్లాన్ (TSP) తదితర బీమా ప్రయోజనాలు కూడా ఆమె పొందుతారు.

అక్కడకు వెళ్తే..సొంతింటికి వెళ్లిన  ఫీల్‌..
కాగా, సునీత అమెరికాలోనే స్థిరపడినా తన మాతృదేశాన్ని మర్చిపోలేదని చెబుతుంటుంది. ఆమె ఇటీవల తన మాతృభూమి భారత్‌ పర్యటకు వచ్చారు. ఈ మేరకు ఢిల్లీలోని అమెరికన్‌ సెంటర్‌లో ‘Eyes on the Stars, Feet on the Ground’ పేరుతో ఏర్పాటుచేసిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సెషన్‌కి ఆమె  బ్లూ కలర్‌ స్పేస్‌ సూట్‌ ధరించి హాజరవడం విశేషం. 

ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంటూ..భారత్‌లోకి అడుగుపెట్టగానే తన సొంతింటికి వచ్చిన భావన కలుగుతుందుని పేర్కొంది. ప్రతిసారి అంతరిక్షంలోకి వెళ్లగానే భూమిపై తన ఇల్లు ఎక్కడ ఉందా అని ఆతృతగా చూసేదాన్ని అంటూ చెప్పుకొచ్చంది. నాన్నది భారత్‌లోని గుజరాత్‌ కాగా అమ్మది స్లోవేకియా..అందువల్ల తన దృష్టిలో ఈ మూడు తన స్వస్థలాలుగానే భావిస్తా అంటూ పోస్ట్‌ ముగించింది.

(చదవండి: ఓన్లీ టైమ్‌స్పెండ్‌ చేసేందుకే..! ఆ ఒక్క మాటతో ఓవర్‌నైట్‌ స్టార్‌గా..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement