చాలామంది సోషల్‌మీడియాలో స్టార్‌లుగా సంచలనం సృష్టించేందుకు..చాలా కష్టపడుతుంటారు. పోనీ అంతలా చేసినా..కొందరికీ లక్ కలిసిరాక, లేక కంటెంట్ బాగోకో..జనాలకు రీచ్ అవ్వడంలో విఫలమవుతుంటారు. కానీ సోషల్‌మీడియా గురించి ఏమి తెలియని ఈ 70 ఏళ్ల తాత నిజాయితీగా మాట్లాడిన తొలి వ్లాగ్ ప్రభంజనమే సృష్టించేలా వ్యూస్ వచ్చాయి. అలా అని అందులో ఏమి అంత గొప్పగా చెప్పిన విషయాలేం లేవు. కేవలం తన గురించి మాట్లాడిన కొద్ది మాటలే..ఎంతలా నెటిజన్లను ఆకర్షించాయో వింటో నోరెళ్లబెట్టేస్తారు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన 70 ఏళ్ల వృద్ధుడు వినోద్ కుమార్ శర్మకు అసలు వ్లాగింగ్ గురించి ఏమి తెలియదు. కానీ చాలా ఇన్నోసెంట్‌గా, నిజాయితీగా ఆ విషయాన్ని వివరించిన విధానం నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. వినద్ శర్మ పదవీ విరమణ అనంతరం తన విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా గడిపేందుకు ఈ వ్లాగ్‌ని ఒక మార్గంగా ఎంచుకున్నానట్లు తెలిపారు. ఆయన వీడియలో ఇలా అన్నారు. నా పేరు వినోద్ కుమార్ శర్మ.
"నేను ఉత్తర ప్రదేశ్‌కి చెందిన వాడిని. నాకు వ్లాగ్ చేయడం రాదు. జస్ట్ కాలక్షేమపం కోసం వ్లాగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నా. నా ఈ వ్లాగ్‌మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. ఎందుకుంటే మీ ప్రోత్సాహం ఉంటే కదా భవిష్యత్తులో దీన్ని కొనసాగించగలను అంటూ ముగించారు." అంతే ఆ వీడియోకి ఏకంగా రెండు మిలియన్లకుపైగా లైక్‌లు వ్యూస్ వచ్చాయి. ఆ వృద్ధుడు వినోద్ శర్మ అమయకత్వానికి మత్ర ముగ్ధలవ్వడంతో నెటిజన్ల నుంచి విశేష స్పందన వచ్చింది.
అతడిని చూడగానే మా తల్లిదండ్రలు, తాతయ్య అమ్మమలు గుర్తుకొచ్చారని, అంకుల్ మీకు మేము తోడుగా ఉంటాం అంటూ పోస్టులు వెల్లువెత్తాయి. అంతేగాదు అంకుల్ మీరు మా హృదయాలనకు కొల్లగొట్టారంటూ ప్రోత్సహించారు కూడా. మరికొందరు నేర్చుకోవడానికి వయసు అనేది అడ్డంకి కాదు అని నిరూపించారు శెభాష్ అంకుల్ అని ప్రశంసల వర్షం కురిపించారు కూడా.
(చదవండి: బిర్యానీలలో హైదరాబాద్ బిర్యానీ రుచే వేరు..! సాక్షాత్తు జపాన్ రాయబారి సైతం..)


