బిర్యానీలలో హైదరాబాద్‌ బిర్యానీ రుచే వేరు..! | Japanese Ambassador Enjoys Biryani In Delhi Says Goes Viral | Sakshi
Sakshi News home page

బిర్యానీలలో హైదరాబాద్‌ బిర్యానీ రుచే వేరు..! సాక్షాత్తు జపాన్‌ రాయబారి సైతం..

Jan 21 2026 10:46 AM | Updated on Jan 21 2026 11:04 AM

Japanese Ambassador Enjoys Biryani In Delhi Says Goes Viral

బిర్యానీలో ఎన్నో వెరైటీలు ఉన్నాయి..ఎన్ని ఉన్నా మన భాగ్యనగరంలోని హైదరాబాద్‌ బిర్యానీ టేస్ట్‌కి మరేది సరిపోదు అనేంతగా ఆహారప్రియుల మనసుని గెలుచుకుంది. గబాలనా..ఏం ఆర్డర్‌ చేద్దాం అనుకున్నా..ఠక్కున హైదరాబాద్‌ బిరానీనే మదిలోకి వస్తుంది. అలాంటి టేస్టీ బిర్యానీ రుచికి జపాన్‌ రాయబారి సైతం ఫిదా అవ్వడమే కాదండోయ్‌..దాని రుచిని ఎలా ఆస్వాదిస్తే బాగుంటుందో కూడా నెట్టింట షేర్‌ చేసుకున్నారు ఆయన.

జపాన్‌ రాయబారి ఒనో కెయిచి డిల్లీ బిర్యానీ తిన్న అనుభవాన్ని సోషల్‌ మీడియా ఎక్స్‌ పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు. న్యూఢిల్లీలోని ఆంధ్రభవన్‌లో బిర్యానీ ప్లేట్‌తో ఉన్న ఫోటోలను షేర్‌ చేస్తూ ఇలా పేర్కొన్నారు పోస్ట్‌లో. ఆ బిర్యానీని తమ సంప్రదాయ వంటకమైన సుషీతో పోల్చారు. అంతేకాదండోయ్‌..ఆ బిర్యానీని సాంప్రదాయ భారతీయ విధానంలో తింటేనే రుచి అట. అదేనండి చేతితో హాయిగా ఆస్వాదిస్తే మరింత టేస్టీగా ఉందని ఆయన సైతం అంగీకరించారు. 

ఇలా చేతులతో తింటుంటే తన భారత స్నేహితులకు మరింత చేరువైనట్లుగా ఉందని పేర్కొన్నారు కూడా. అంతేగాదు జపాన్‌ రాయబారి ఒనో అంతకుమునుపు తెలంగాణ పర్యటనలో కూడా రియల్‌ హైదరాబాద్‌ బిర్యానీని ఆస్వాదించిన ఫోటోలను కూడా షేర్‌ చేసుకున్నారు. ఆ పోస్ట్‌కి ఒనో దీని టేస్ట్‌కి ఎవ్వరైనా ఫిదా అవ్వడమే కాదు..ఒక్కసారి తింటే..అదే వారి ఫేవరట్‌ వంటకంగా స్థిరపడిపోతుందని క్యాప్షన్‌ జోడించి మరి పోస్ట్‌ చేశారు. 

కాగా, చేతులతో తినడం భారతీయ సంస్కృతిలో భాగం. ఇలా తినడం వల్ల రుచి పెరడగమే గాక ఆయుర్వేద పరంగా కూడా మంచిదనేది భారతీయుల నమ్మకం. ఇక బిర్యానీ స్విగ్గీలో అత్యధికంగా ఆర్డర్‌ చేయబడిన వంటకంగా అగ్రస్థానంలో నిలిచిన సంగతి విధితమే. పైగా దీన్ని కూరగాయలు, మాంసం, సీఫుడ్స్‌, సుగంధ ద్రవ్యాలు జోడించి టేస్టీగా తయారు చేస్తారు. అత్యంత ప్రజాదరణ పొందిన వంటకంగా కూడా పైచేయి దీనిదే. 

(చదవండి: ఎనిమిది నెలల్లో 31 కిలోల బరువు..! ఆ సాకులకు స్వస్తి చెప్పాల్సిందే..!)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement