తొందరగా బరువు తగ్గాలంటే..! ఏం చేయాలి? ఏం చేయకూడదు? | Fitness Expert Who Lost 31 Kg In 8 Months Shares 3 Key Changes | Sakshi
Sakshi News home page

ఎనిమిది నెలల్లో 31 కిలోల బరువు..! ఆ సాకులకు స్వస్తి చెప్పాల్సిందే..!

Jan 20 2026 5:26 PM | Updated on Jan 20 2026 6:03 PM

Fitness Expert Who Lost 31 Kg In 8 Months Shares 3 Key Changes

బరువు తగ్గడానికి కొవ్వు కరిగించే మందులు, ఇంజెక్షన్‌లపై ఆధారపడుకుండా అత్యంత సహజసిద్ధంగా బరువు తగ్గాలంటే చాలా ఓపిక, స్ట్రాంగ్‌ మైండ్‌సైట్‌ చాలా ముఖ్యం. అలా నిలకడగా ప్రయత్నానికి బ్రేక్‌ ఇవ్వని వారే అద్భుతాలు సృష్టిస్తారు..మంచి ఫలితాలను అందుకుంటారు. అందుకు ఉదాహరణే ఈ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ టార్న్‌ కౌర్‌. ఆమె కేవలం ఎనిమిది నెలల్లోనే 31 కిలోలు తగ్గి శెభాష్‌ అనిపించుకుంది. అందుకు ఉపకరించిన మూడు వాస్తవిక త్యాగాల గురించి ఇస్టాగ్రామ్‌లో వివరిస్తూ..పోస్టు పెట్టారామె. మరి బరువు తగ్గేందుకు ఆమె వ్యక్తిగతంగా చేసిన ఆ మూడు మార్పులేంటి? అంతలా ఎలా బరువు తగ్గారామె అంటే..

ఆమె చేసుకున్న వ్యక్తిగత మార్పులు..

పక్కా ప్లానింగ్‌..
బరువు తగ్గేందుకు ప్రయత్నించిన ప్రతిసారి నూటికినూరు శాతం పర్‌ఫెక్షన్‌ ఉండాలనుకునేది. అలా అనుకున్న ప్రతిసారి తన డైట్‌ మళ్లీ మొదటకు రావడం..జరుగుతుండేది. ముఖ్యంగా నిద్ర తర్వాత ప్లానింగ్‌ స్కిప్‌ అవ్వతూ ఇబ్బంది పడేది. అందుకే పరిపూర్ణ కంటే..సవ్యంగా అనుకున్నది ప్రతి రోజు జరిగేలా ప్లాన్‌ ఉంటే సరి అని డిసైడ్‌ అయ్యింది.

నిర్విరామంగా, స్థిరంగా..
అస్తామాను బరవు తగ్గాలి అంటూ పరిష్కారాల ​కోసం ప్రయత్నించడం అనేవి వృధా ప్రయాసేనని అంటోందామె. దానికంటే..రోజువారి ఆరోగ్యకరమైన అలవాట్లు క్రమం తప్రకుండా చేసేలా చూసుకోవడం బెటర్‌. ముఖ్యంగా నిలకడ(స్థిరత్వానికి) ప్రాముఖ్యత ఇస్తేనే..మంచి ఫలితాలు సొంతం అవుతాయి.

సాకులు
సమయం లేదనే మాటకు ఆస్కారం ఇవ్వకూడదంటోంది. సెలవులు, వివాహాలు, సుదీర్ఘ ప్రయాణ రోజులు, తల్లిదండ్రుల బాధ్యతలు, పని ఒత్తిళ్లు, ఇలా ఎన్ని ఉన్నా..బరువు తగ్గాడానికి బ్రేక్‌ ఇవ్వకూడదని, సమయం లేదనే మాట ఉండకుండా ఉండేలా కేర్‌ తీసుకోవాలంటోంది. ఎందుకంటే ఇలా ఎన్నో బాధ్యతలు ఉన్న చాలామంది బరువు తగ్గుతున్నప్పుడూ మనమెందుకు తగ్గం అనేది విశ్లేషించుకుంటే..పరిష్కారం ఆటోమేటిగ్గా దొరుకుతుందంటోంది.

 

ఇక ఇక్కడ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ తన బరువ తగ్గే జర్నీలో డైట్‌లో మార్పులు చేసుకున్నా మొత్తం 20 ఆహారాల జాబితాను కూడా షేర్‌ చేశారు. అవేంటో చూద్దామా..!


1. మిల్కీ షుగర్ చాయ్ బదులు - బ్లాక్ కాఫీ

2. ప్యాక్ చేసిన జ్యూస్‌లు - ఎలక్ట్రోలైట్స్ కోసం దోస, కీర జ్యూస్‌లు లేదా కొబ్బరి నీళ్లు

3. రాత్రిపూట తెల్ల బియ్యం - క్వినోవా/కాలీఫ్లవర్ బియ్యం

4. మైక్రోవేవ్ పాప్‌కార్న్ - ఎయిర్-పాప్డ్ పాప్‌కార్న్

5. చీజ్ క్రాకర్స్ - కాల్చిన చిక్‌పీస్

6. క్రీమీ పాస్తా - హోల్‌వీట్ నూడుల్స్ + పాలకూర సాస్

7. షుగర్ తృణధాన్యాలు - దాల్చిన చెక్క, ఆపిల్ & తేనెతో రాత్రిపూట ఓట్స్

8. క్రిస్ప్స్ ప్యాకెట్లు - వెజ్జీ స్టిక్స్ + గ్రీక్ పెరుగు డిప్

9. మిల్క్ చాక్లెట్ - డార్క్ చాక్లెట్ స్క్వేర్

10. షుగర్ బిస్కెట్లు - బాదం పిండి కుకీలు

11. బిస్కెట్లు - వేరుశెనగ వెన్న మరియు తేనెతో రైస్ క్రాకర్స్

12. వేయించిన స్నాక్స్ - బేక్డ్ వెజ్జీ చిప్స్

13. ఐస్ క్రీం - గ్రీక్ పెరుగు + ఫ్రోజెన్ బెర్రీస్

14. షుగర్ సాస్‌లు - ఇంట్లో తయారుచేసిన టమోటా/పెస్టో సాస్

15. వైట్ బ్రెడ్ - హోల్‌గ్రెయిన్ లేదా సీడ్ బ్రెడ్

16. షుగర్ డ్రింక్స్ - మెరిసే నీరు + నిమ్మకాయ

17. సూపర్ మార్కెట్ మఫిన్లు - ఇంట్లో తయారుచేసిన ప్రోటీన్ అరటిపండు/ఓట్ మఫిన్లు

18. చాక్ బార్లు - నట్ + డార్క్ చాక్లెట్ బైట్స్

19. హెవీ సలాడ్ డ్రెస్సింగ్‌లు - ఆలివ్ ఆయిల్ + బాల్సమిక్ వెనిగర్

20. ఫాస్ట్ ఫుడ్ బర్గర్లు - ఇంట్లో తయారుచేసిన టర్కీ/వెజ్జీ బర్గర్లు


బరువు తగ్గడానికి 8 'విచిత్రమైన' అలవాట్లు

  • టెంప్ట్‌ చేసే ఆహారాలు కంట పడకుండా ఉండేలా చేసుకోవడం లేదా దూరంగా ఉండేలా నోటిని అదుపులో ఉంచుకోవడం. 

  • భోజనం తర్వాత ఏమైనా తినాలనిపిస్తే..పుదీనా లేదా ఆరోగ్యకరమైన హెల్దీ ఆకులను తినేలా మెదడుని పాజ్‌ చేయడం

  • ముందుగానే ఇంత తినాలనేలా ప్లాన్‌ చేసుకోవడం

  • ఆహారం సరిపోయిన సంతృప్తిని అందివ్వకపోతే..ఆ కోరికను స్కిప్‌ చేసి..ఏదైనా పనిలో లీనమవ్వడం

  • అలాగే కడుపు నిండింది అని బిగ్గరగా చెబుతూ మన మైండ్‌ని కంట్రోల్‌ చేయడం

  • రెస్టారెంట్‌లలో బ్రెడ్‌ వంటి వాటి జోలికి పోకుండా ఉండటం.

  • ఫిట్‌గా ఉండే మోడ్రన్‌ దుస్తులు ధరించాలనే విషయాన్ని గుర్తించుకుంటూ..తక్కువగా తినడం తనను ఏదో రకంగా తినాలనిపించేలా చేసే ఆకర్షణీయమైన వంటకాలన్నింటిని చెత్తబుట్టలో వేసేయడం తదితరాలతో ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ టార్న్‌ కౌర్‌ విజయవంతంగా బరువు తగ్గారామె. 

ఈమె వెయిట్‌లాస్‌ జర్నీ ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే..ఇక్కడ మనం బరువు తగ్గాలనే విషయంపై గట్టి ఫోకస్‌ తోపాటు ఆ దిశగా మనం తినే ఆహారం, వర్కౌట్లు ఉండేలా కేర్‌ తీసుకోవడమే గాక నిలకడతో చేయాలి. అప్పుడే సత్ఫలితాలు పొందగలం అని చెబుతున్నారు నిపుణులు

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

(చదవండి: 73 ఏళ్ల​ తాత గారి సిక్స్‌ప్యాక్‌ బాడీ..! ఫిదా అవ్వాల్సిందే..)

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement