73 ఏ​ళ్ల తాత గారి సిక్స్‌ప్యాక్‌ బాడీ..! ఫిదా అవ్వాల్సిందే.. | Health Tips: 73 year old man with impressive 6-pack reveals how he maintains | Sakshi
Sakshi News home page

73 ఏళ్ల​ తాత గారి సిక్స్‌ప్యాక్‌ బాడీ..! ఫిదా అవ్వాల్సిందే..

Jan 20 2026 1:06 PM | Updated on Jan 20 2026 2:04 PM

Health Tips: 73 year old man with impressive 6-pack reveals how he maintains

జస్ట్‌ ఆరు పదుల వయసు దాటగానే ముఖంలో ముడతలు..చర్మం వదులుగా వచ్చేసి..ముసలి రూపు వచ్చేస్తుంటుంది. ఒకవేళ ఆరోగ్యకరమైన వృద్ధాప్యాన్ని ఆస్వాదించేవారు కూడా ఓ మోస్తారు వర్కౌట్లు, చిన్న పాటి వాకింగ్‌ వంటివి చేస్తూ ఆరోగ్యంగా ఉండటం చూశాం. కానీ ఇతడని చూస్తే..నోరెళ్లబెట్టేస్తాం. బాడీ ఏమో 25 ఏళ్ల యువకుడిలా చాకులా ఉంటుంది. వయసు చూస్తే వామ్మో అనేస్తాం. ఇది నిజమేనా అనే సందేహం కూడా వచ్చేస్తుంది ఆ తాతగారి ఫిజిక్‌ని చూస్తే. అంత అద్భుతమైన దేహ ధారుడ్యంతో..ముఖ్యంగా సిక్స్‌ ప్యాక్స్‌తో నవ మన్మధుడిలా ముగ్ధమనోహరంగా ఉంటాడు. మరి అతడి ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ ఏంటి?, ప్రోటీన్‌ సప్లిమెంట్స్‌ ఏమైనా తీసుకుంటాడా అంటే..?

సాధారణంగా డెభైల వయసులో కండరాలు దృఢంగా ఉండటం అంత సులభం కాదు. ముఖ్యంగా చర్మం ఎంత వదులుగా మారిపోతుందో తెలిసిందే. అలాంటిది ఆ తాతగారి ఉక్కులాంటి శరీరాన్ని చూసి షాకవ్వుతాడు. అంతలా ఉండటానికి ఎంతలా వర్కౌట్లు చేస్తాడో తలుచుకుంటూనే భయమేస్తుందంటూ..నేరుగా ఆయన్నే అడుగుతాడు ఫిట్‌నెస్‌ కోచ్‌ లాంగోవ్‌స్కీ. చక్కటి పోషకాహారం, స్మార్ట్‌ వ్యాయామాలు మయసుని దిక్కారిస్తాయని నిరూపించాడు ఈ 73 ఏళ్ల వ్యక్తి. 

అందుకు తనకు ఉపకరించిన హెల్త్‌ సీక్రెట్‌ గురించి కూడా ఫిట్‌నెస్‌ కోచ్‌ స్కీతో పంచుకుంటాడు కూడా. ఇంత స్ట్రాంగ్‌ బాడీ మెయింటైన్‌ చేసేందుకు జిమ్‌లో ఎంతలా కష్టపడుతుంటారని అడుగుతాడు. అందుకు ఆ తాతగారు గట్టిగా నవ్వేసి..తేలికపాటి వ్యాయామాలే చేస్తాను, కానీ కష్టపడకుండా తేలిగ్గా చేస్తానని సమాధానమిచ్చారు. మరి ఎలాంటి పుడ్‌ తీసుకుంటారు అని ఫిట్‌నెస్‌ కోచ్‌ స్కీ అడగగా..మంచి ప్రోటీన్‌, కొల్లాజెన్‌, క్రియేటిన్‌ మాత్రమే తీసుకుంటానని అన్నారు. 

ఉపవాసం ఉంటే తప్ప..ప్రతిరోజు వైన్‌ పడాల్సిందేనని అన్నారు. రోజుకి రెండు గ్లాస్‌ల వైన్‌ హాంఫట్‌ చేస్తారట ఈ తాతయ్య. ఆ తర్వాత కోచ్‌ ఎన్ని పుష​అప్‌లు చేయగలరు? అని కుతుహలంగా అడుగుతాడు..దానికి ఆయన దాదాపు 30 వరకు చేయగలనని నమ్మకంగా చెప్పారు. అంతేకాదండోయ్‌ ఆ ఫిట్‌నెస్‌ కోచ్‌ ముందే ఏకంగా 36 పుష్‌ అప్‌లు చేసి చూపించాడు కూడా. 

తన శరీర కొవ్వు శాతం కూడా  8.5% అని వెల్లడించాడు. పైగా క్రమశిక్షణతో కూడిన మంచి పోషకాహారం, కొంచెం వైన్‌ని సేవిస్తూ..డెభైలలో కూడా ఫిట్‌గా ఉండటం ఈజీనే అని నిరూపించాడమే కాదు వయసు అనేది జస్ట్‌ నెంబర్‌ మాత్రమే అని తన ఆహార్యంతో గొంతెత్తి చెప్పకనే చెప్పాడు ఈ తాతయ్య. 

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

 

(చదవండి:  థాంక్యూ అమెరికా..కానీ భారత్‌ అంటే ప్రేమ..! వైరల్‌గా భారత సంతతి వ్యక్తి పోస్ట్‌)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement