స్ట్రాంగ్‌ ఉమెన్ అవుతారా? | how to become a strong woman | Sakshi
Sakshi News home page

మానసికంగా దృఢంగా..

Mar 7 2026 7:48 PM | Updated on Mar 7 2026 8:21 PM

how to become a strong woman

ఉరుకుల పరుగుల జీవితంలో మహిళలు శారీరకంగా బలంగా ఉంటే సరిపోదు.. మానసికంగానూ బలంగా ఉండాలి. అపుడే అన్ని రంగాల్లోనూ రాణించగలుగుతారు. అందుకోసం కొన్ని అలవాట్లను మార్చుకోవాలి, అలవర్చుకోవాలి. ఒక చిన్న అలవాటు మీ వ్యక్తిత్వాన్ని అద్భుతంగా తీర్చిదిద్దగలదు, అదే సమయంలో పూర్తిగా దెబ్బతీయగలదు కూడా. మిమ్మల్ని మీరు ఒక స్ట్రాంగ్‌ ఉమెన్‌గా చూసుకోవాలనుకుంటే, మీరు అలవర్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన అలవాట్లు..

భావోద్వేగాలపై నియంత్రణ 
ఈ ఉరుకుల పరుగుల జీవితంలో శారీరక బలంతో పాటే మానసికంగా దృఢంగా ఉండటమూ చాలా ముఖ్యం. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌ సరిగ్గా ఉపయోగించడమే మానసిక దృఢత్వానికి మొదటి మెట్టు. ఎప్పుడు మౌనంగా ఉండాలో, ఎప్పుడు మాట్లాడాలో తెలిసుండాలి. కోపం, బాధ కలిగినపుడు కుంగిపోకుండా.. ఆ భావాలను అర్థం చేసుకుని మరింత మానసిక పరిపక్వతతో ముందుకు సాగుతుండాలి.

నో చెప్పడమే బెటర్‌
అందరినీ మెప్పించాలనేం లేదు. అలా ప్రయత్నిస్తే మానసిక అలసట తప్పదు. అందుకే ఎదుగుదలకు, మనశ్శాంతికి అడ్డుపడే విషయాలకు నిర్మొహమాటంగా నో అని చెప్పగలగాలి. ఇందులో ఎటువంటి గిల్టీ ఫీలింగ్‌ని కలిగి ఉండకూడదు. సమయానికి విలువ ఇవ్వడం, అనవసరమైన బాధ్యతలను తిరస్కరించడం అనేది స్వార్థం కాదు, మీ ఆత్మగౌరవానికి నిదర్శనం.‘కాదు’ అని చెప్పగలగడం విజయానికే కాదు, ప్రశాంతమైన జీవనానికి కూడా తోడ్పడుతుంది.

తప్పుల నుంచి పాఠాలు
ఓటమికి భయపడని వారే విజేతలుగా నిలుస్తారు. తమ తప్పులకు ఇతరులను నిందించకూడదు. బాధ్యత తీసుకోవాలి, లోపాలను విశ్లేషించుకోవాలి. ఆ తప్పులు మళ్లీ జరగకుండా చూసుకోవాలి. ఈ నేర్చుకునే తత్వం అన్ని పరిస్థితుల్లోనూ మిమ్మల్ని విజేతలుగా నిలబెడుతుంది.

నేర్చుకోవడానికి సిగ్గుపడకపోవడం 
తమకు అన్నీ తెలుసు అని ఎప్పుడూ అనుకోకూడదు. తమకున్న జ్ఞానంపై నమ్మకం ఉన్నప్పటికీ, ఇతరుల అనుభవాలకు విలువ ఇవ్వాలి. ఏదైనా కొత్త విషయం తెలిసినప్పుడు దానిని మనస్ఫూర్తిగాస్వీకరించాలి. ఇతరులలోని మంచిని, గొప్ప లక్షణాలను అడాప్ట్‌ చేసుకోవడానికి ఎప్పుడూ వెనుకాడకూడదు. ఈ లక్షణాలు అలవర్చుకుంటే ఏ మహిళ అయినా తన జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోగలదు.

అసూయ పడకపోవడం 
మానసిక బలానికి ప్రధాన వనరు అసూయ లేకపోవడం. ఇతరుల విజయాన్ని చూసి కుళ్లుకోవద్దు. బదులుగా వారి నుంచి స్ఫూర్తి పొందాలి. ప్రతి ఒక్కరి ప్రయాణం వేరని గుర్తించాలి. ఇతరులతో పోల్చుకోవడం మానేసి, నిన్నటి కంటే ఈరోజు తాము ఎంత మెరుగ్గా ఉన్నాము అనే దానిపైనే దృష్టి పెట్టాలి.

చ‌ద‌వండి: ట్రావెలింగ్ నుంచి హోస్టింగ్ వ‌ర‌కు

మార్పును స్వీకరించాలి
ప్రపంచంలో మార్పు అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. మార్పును చూసి భయపడకుండా దానిని ఒక అవకాశంగా మలచుకోవాలి. అది కెరీర్‌ అయినా.. వ్యక్తిగత జీవితం అయినా పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవాలి. గతాన్ని తలచుకుని బాధపడటం కంటే, భవిష్యత్తు కోసం ప్రస్తుతం ప్రణాళికలు రచించుకోవాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement