కలుపు మొక్కలకు భయపడొద్దు | Varalakshmi Sarathkumar about lifestyle | Sakshi
Sakshi News home page

కలుపు మొక్కలకు భయపడొద్దు

Mar 8 2026 12:21 AM | Updated on Mar 8 2026 12:21 AM

Varalakshmi Sarathkumar about lifestyle

సమాజం మనల్ని ఇలానే ఉండాలని నిర్దేశిస్తుంది. కొన్ని కలుపు మొక్కలు మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తాయి. మన లక్ష్యాలను నెరవేర్చుకోనివ్వకుండా అడ్డంకులు సృష్టిస్తాయి.అయినా ఆగిపోకుండా మహిళలు ధైర్యంగా బతుకుతూ ముందుకు సాగిపోవాలి అంటున్నారు నటి, దర్శకురాలు వరలక్ష్మి.

నా స్కూల్‌ డేస్‌లో నేను ఈవ్‌ టీజింగ్‌కి గురైన సందర్భాలు చాలా ఎక్కువ. వాళ్లందరికీ నా స్టైల్‌లో నేను బుద్ధి చెప్పాను. కొందరికి మాటలతో చెబితే పనికి రాదు; అలాంటివాళ్లకు చెంప దెబ్బతో సమాధానం చెప్పడం చాలా అవసరం.

⇒  అమ్మాయిలను వేధించేవాళ్లు ఎక్కడున్నా వారికి బ్యాక్‌గ్రౌండ్‌తో సంబంధం లేదు. కొత్త అమ్మాయిలనూ వేధిస్తారు... బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న అమ్మాయిలనూ ఇబ్బందులపాలు చేస్తారు. వాళ్లకు ఎవరూ స్పెషల్‌ కాదు.  నేనైతే సినిమాలో యాక్షన్‌ రోల్స్‌ చేసినప్పుడు ఎలా కొడతానో అలాగే రియల్‌ లైఫ్‌లోనూ. అయితే ‘అలాంటివాళ్లను ఇలా చేయండి’ అని నేను ఎవరికీ సలహా ఇవ్వను. ఎందుకంటే ఒక్కొక్కరి తీరు ఒక్కోలా ఉంటుంది. కాని నేను చెప్పేదొక్కటే– పరిస్థితి ఏదైనా కావొచ్చు, ధైర్యంగా ఎదుర్కోండి.

⇒ నా కెరీర్‌ ఆరంభంలో నేను ‘ఇన్‌సెక్యూరిటీ’కి గురయ్యాను. దానికి కారణం సరైన అవకాశాలు రాకపోవడమే. అయితే ఆ అభద్రతాభావం నన్ను మానసికంగా కుంగదీయలేదు. శరత్‌కుమార్‌గారి కూతురిగా నాకు ఒక విజిటింగ్‌ కార్డ్‌ ఉంటుంది. కాని, నన్ను నేను నిరూపించుకోవాల్సిందే! ఆర్టిస్ట్‌గా నాకు దక్కే ప్రతి చాన్స్‌ ద్వారా నన్ను నేను నిరూపించుకుంటూ వస్తున్నాను.

⇒ అమ్మాయిలు వాళ్లకు నచ్చినట్లు వాళ్లు ఉండాలి. అమ్మాయిలు సున్నితంగానే ఉండాలి. అప్పుడే అందరికీ నచ్చుతారు. ఇగోయిస్ట్‌లను ఇష్టపడరని చాలామంది ఫిక్స్‌ అయిపోతారు. అసలు ఒకరికి నచ్చేట్లు ఉండాలని ఎందుకు అనుకోవాలి? మన వ్యక్తిత్వానికి తగ్గట్టు మనం నడుచుకోవాలి. వేరేవాళ్ల కోసం మన తీరు మార్చుకుంటే మనకంటూ ఒక ఉనికి ఉండదు. సమానత్వం అనేది మనకి ఇక్కడే ఉంది. ఇక మనం ఎందుకు తక్కువ అవుతాం.

⇒  మహిళలు ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో ‘బాడీ షేమింగ్‌’ ఒకటి. సన్నగా ఉంటే మరీ సన్నగానా? అంటారు. బొద్దుగా ఉన్నా విమర్శిస్తారు. ఇప్పుడు ఒక గదిలో పదిమంది ఉంటే ఐదుగురికి వెజ్‌ పలావ్‌ నచ్చుతుంది, మరో ఐదుగురికి నాన్‌వెజ్‌ బిర్యానీ నచ్చుతుంది. ఎవరి టేస్ట్‌ వారిది. అలాగే ఎవరి బాడీ వారిది, ఎవరి చాయిస్‌ వారిది. దాన్ని విమర్శించే హక్కు ఎవరికీ లేదు. మనం ఎలా ఉండాలనుకుంటున్నామో అలానే ఉండాలి. ఎవరేం అనుకుంటే మనకేంటి? మన వ్యక్తిత్వమే మనం.

⇒ కొన్ని విషయాల్లో అమ్మాయిలకు అమ్మాయిలే శత్రువులైపోతారు. చదువుకో! జాబ్‌ చెయ్‌! పెళ్లి చేసుకో!– ఇలా సలహాలు ఇస్తారు. ఒకవేళ పెళ్లి చేసుకోలేదనుకోండి, ‘ఇంకా పెళ్లి చేసుకోకపోవడం ఏంటి?’ అంటారు. ఆ అమ్మాయి వెనక కామెంట్‌ చేస్తారు. ఇలాంటి ఆడవాళ్ల తీరు మారాలి.

⇒  సినిమా ఇండస్ట్రీలో నేను ఎదుర్కొన్న కొన్ని చేదు అనుభవాలే ‘సేవ్‌ శక్తి’ పౌండేషన్‌ ఆరంభించేలా చేశాయి. నాకు ఎదురైన సమస్యలను ధైర్యంగా ఎదుర్కొన్నాను. నాలా ఎదుర్కోలేనివాళ్ల కోసమే ఈ ఫౌండేషన్‌ ఆరంభించాను. డిప్రెషన్‌కు గురైనవారిని అందులోంచి బయటకు తేవడానికి డాక్టర్స్‌ సహాయం తీసుకుంటాం. ఇప్పటివరకూ చాలామంది అమ్మాయిలకు హెల్ప్‌ చేశాం. ‘సేవ్‌ శక్తి’కి సంబంధించిన వ్యవహారాలను ఎక్కువగా మా అమ్మ ఛాయ చూసుకుంటారు.

⇒  స్టేజి మీద నేను సాధారణంగా ఎమోషనల్‌ అవ్వను. కాని, ఆ రోజు (‘సరస్వతి’ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌. ఈ సినిమా ద్వారా వరలక్ష్మి దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు) అలా ఎందుకు అయ్యానంటే నటిగా స్టార్ట్‌ అయి, డైరెక్టర్‌ స్థాయికి రావడం చిన్న విషయం కాదు. తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీ నాకెన్నో అవకాశాలు ఇచ్చింది. అలాంటి ఒక ఇండస్ట్రీ వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు కాస్త ఎమోషనల్‌గా అనిపించింది.     - డి.జి. భవాని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement