
విజయ్ దేవరకొండ హీరోగా వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలకు అంతా సిద్ధమైంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ రిలీజ్ తర్వాత కింగ్డమ్పై ఒక్కసారిగా బజ్ క్రియేట్ అయింది. సినిమా రిలీజ్కు ఒక్కరోజు మాత్రమే టైమ్ ఉండడంతో తాజాగా ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన విజయ్ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తానెప్పుడు ఎవరికోసమే మారనని.. ఎవరికీ భయపడనని అన్నారు.
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..'నేనేప్పుడు లోపల ఏది అనిపిస్తే అదే మాట్లాడతా.. కెరీర్ ప్రారంభంలో అగ్రెసివ్గా ఉన్నా. అప్పుడు నాలో డిఫెన్స్ మెకానిజంతో ఉండేవాన్ని. ఎవరూ నన్ను తక్కువ చేసి మాట్లాడకూడదు. నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి. నేను అనుకున్నది సాధించాలి. అందుకే కెరీర్ ప్రారంభంలో దూకుడుగా ఉన్నానేమో. మనం సినిమాల్లోనూ చూస్తుంటాం కదా.. హీరో ముందుగా పవర్‌ఫుల్‌గా ఉంటాడు. అమ్మ, అమ్మాయి ఎవరో ఒకరి వల్ల తర్వాత సాఫ్ట్ అయిపోతాడు.' అని అన్నారు.
ఆ తర్వాత మాట్లాడుతూ..'ఇప్పుడు నా అభిమానుల ప్రేమతో నేను కూడా సాఫ్ట్ అయిపోయా. ఇప్పుడైతే నాకేలాంటి ఫియర్ లేదు. మొదట్లో నాకు కొద్దిగా భయముండేది. ఇప్పుడైతే అలాంటిదేం లేదు. నా చుట్టూ ఉండే వాతావరణం వల్లే అలాంటి ఫీలింగ్ వచ్చి ఉండొచ్చు. ఇప్పుడైతే ఆడియన్స్ లవ్ వల్ల ఫియర్ పోయి ప్రశాంతంగా ఉన్నా' అని విజయ్ దేవరకొండ తెలిపారు.