
అనుష్క శెట్టి లీడ్ రోల్‌లో నటిస్తోన్న తాజా చిత్రం ఘాటి. ఈ సినిమాలో విక్రమ్ ప్రభు మరో కీలక పాత్రలో నటించారు. జాగర్ల మూడి రాధాకృష్ణ (క్రిష్) దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని యూవీ క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.
తాజాగా విడుదలైన ఘాటి ట్రైలర్ చూస్తే గంజాయి మాఫియా నేపథ్యంలో ఈ కథను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 'ఘాట్లలో గాటీలు ఉంటారు సార్' అనే డైలాగ్లో ట్రైలర్ను ప్రారంభించారు. ట్రైలర్ చూస్తే అనుష్క మరోసారి అరుంధతి తరహాలో రౌద్రంగా కనిపించింది. ట్రైలర్ చివర్లో 'సీతమ్మోరు లంక దహనం చేస్తే ఎట్టుంటదో చూద్దురు గానీ' అనే డైలాగ్ ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది.
కాగా.. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 5న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రటించారు. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ సినిమా వచ్చేనెలలో థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీని తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకు నాగవెల్లి విద్యాసాగర్ సంగీతమందిస్తున్నారు.