ఎర్రకోటలో నిఘా వైఫల్యం.. బంగ్లాదేశీయులు అరెస్ట్‌.. అధికారులు సస్పెండ్‌ | Bangladeshis Arrested For Forcibly Trying To Enter Red Fort, More Details Inside | Sakshi
Sakshi News home page

ఎర్రకోటలో నిఘా వైఫల్యం.. బంగ్లాదేశీయులు అరెస్ట్‌.. అధికారులు సస్పెండ్‌

Aug 5 2025 9:22 AM | Updated on Aug 5 2025 11:23 AM

Bangladeshis arrested for forcibly trying to enter Red Fort

ఢిల్లీ: భారత స్వాతంత్ర్య వేడుకలకు ఎర్రకోట సిద్ధమవుతున్న వేళ సంచలన ఘటన చోటుచేసుకుంది. ఎర్రకోటలో తీవ్ర భద్రతా వైఫల్యం బయటపడింది. డమ్మ బాంబును భద్రతా అధికారులు గుర్తించకపోవడం ఒక కారణం అయితే.. ఎర్రకోటలోకి ఐదుగురు బంగ్లా దేశీయులు అక్రమంగా చొరబడే ప్రయత్నం చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని అధికారులు తెలిపారు.

వివరాల ప్రకారం.. స్వాతంత్ర్య దినోత్సవ కార్యaక్రమం నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు.. ఎర్రకోటలో స్పెషల్‌ డ్రిల్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా  కొందరు భద్రతాధికారులు సాధారణ వ్యక్తుల్లా డమ్మీ బాంబుతో ఎర్రకోటలోకి ప్రవేశించారు. అయితే, అక్కడ విధుల్లో ఉన్న అధికారులు ఆ డమ్మీ బాంబును గుర్తించడంలో విఫలమయ్యారు. దీంతో వారిని సస్పెండ్‌ చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని తెలిపారు. మొత్తం ఏడుగురు సస్పెండ్‌ కాగా.. వారిలో హెడ్‌ కానిస్టేబుల్స్‌, కానిస్టేబుల్స్‌ ఉన్నారు. 

ఇదిలా ఉండగా.. తాజాగా బంగ్లాదేశ్‌కు చెందిన ఐదుగురు యువకులు.. ఎర్రకోటలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు. దీంతో, వారిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేసినట్ట తెలిపారు. 20-25 ఏళ్ల వయసున్న వీరంతా అక్రమ వలసదారులుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు వారిని విచారిస్తున్నామని వెల్లడించారు. వరుస ఘటనల నేపథ్యంలో ఎర్రకోట​ వద్ద భద్రతను కట్టుదిట్టం చేసినట్టు అధికారులు చెప్పుకొచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement