
హైదరాబాద్‌లో సోమవారం.. 'కూలీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రుతిహాసన్, నాగార్జున, సత్యరాజ్, దర్శకుడు లోకేశ్ కనగరాజ్ పాల్గొన్నారు.

రజినీకాంత్ మాత్రం వీడియో బైట్ రూపంలో మాట్లాడారు.

రజనీకాంత్ తాజాగా నటించిన చిత్రం కూలీ. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్ ఖాన్, టాలీవుడ్ స్టార్ నాగార్జున, శాండిల్ వుడ్ సూపర్ స్టార్ ఉపేంద్రతో పాటు శృతిహాసన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

ఈ చిత్రానికి కథ, దర్శకత్వం బాధ్యతలను లోకేష్ కనకరాజ్ నిర్వహించారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందించారు.

కూలీ చిత్రం ఈ నెల 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది.












