
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వేర్వేరుగా భేటీ అయ్యారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో ఇరువురు నేతలు గంటల వ్యవధిలోనే రాష్ట్రపతితో భేటీ అయ్యారు. అయితే భేటీకి కారణాలు, చర్చించిన అంశాల గురించి వివరాలు బయటికి తెలియలేదు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా.. రాష్ట్రపతిని ఆదివారం కలిశారని రాష్ట్రపతి భవన్ ఎక్స్ ఖాతాలో పేర్కొంది. పార్లమెంట్ సమావేశాలు, ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో జరిగిన ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.