
అధిక బరువును తగ్గించుకుని ఫిట్‌గా ఉండాలని అందరూ అనుకుంటారు. కొందరు అనుకోవడంతోనే సరిపెట్టుకుంటారు. మరికొందరు దాన్ని సాధించి తీరతారు. అదీ ఖరీదైన జిమ్‌లు, క్రాష్ డైట్‌లు ఇలాంటివేమీ లేకుండానే శరీరం మీద అవగాహన పెంచుకుని, అధిక బరువును తగ్గించుకుంది. 20 ఏళ్ల వయసులో చాలా పట్టుదలగా అదీ సింపుల్ చిట్కాలతో ఫిట్‌నెస్ సాధించింది. పదండి ఆమె పాటించిన టిప్స్ ఏంటో తెలుసుకుందాం.
ప్రముఖ కంటెంట్ సృష్టికర్త ఆర్య అరోరా జత డంబెల్స్ , కొంచెం స్వీయ-అవగాహన, చాట్‌జీపీటీ సాయంతో 18 కిలోల బరువు తగ్గింది. ఈ వెయిట్ లాస్‌జర్నీని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లు, వీడియోల ద్వారా అభిమానులను ఆకర్షిస్తోంది.తన విజయానికి కారణమైన చిట్కాల గురించి పంచుకుంటూ ఆర్య వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఏడంటే ఏడు టిప్స్
జిమ్ వర్కౌట్స్, ఫ్యాన్సీ డైట్ ఇవేమీ లేకుండా 18 కేజీల బరువు తగ్గింది. ఆర్య మొదట్లో అధిక బరువుతో బాధపడేది. కానీ , ఇపుడు స్లిమ్ అండ్ ట్రిమ్‌గా మారిపోయింది. ఇందుకు 7 చిట్కాలు ఫాలో అయినట్టు పేర్కొంది.
BMR : ముందు తన శరీరానికి అవసరమైన కేలరీల గురించి అర్థం చేసుకోవడం మొదలు పెట్టింది. ఇందుకు చాట్ జీపీటీ సాయాన్ని తీసుకుంది. ChatGPT ప్రాంప్ట్‌ని ఉపయోగించి తన బేసల్ మెటబాలిక్ రేట్ (BMR)ను అంచనావేసింది. రోజువారీ కేలరీల అవసరాలను నిర్ణయించడంలో సహాయపడే మెట్రిక్. బరువు తగ్గడానికి కేలరీ ఇంటేక్ ఎంత? అని చాట్ జీపీటీని కోరింది. తన శరీరాకృతిని బట్టి ఏఐ ఇచ్చిన డేటాతో సరైన కేలరీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.
ఇదీ చదవండి: చదివింది పదో తరగతే... కట్ చేస్తే కోట్లలో సంపాదన
పోర్షన్-బ్యాలెన్సింగ్: ఆర్య పోర్షణ్ బ్యాలెన్సింగ్ ప్రధానంగా పాటించింది. 40% ప్రోటీన్, 30% ఫైబర్, 20% కార్బోహైడ్రేట్లు, 10% ఆరోగ్యకరమైన కొవ్వులు.పరిమితంగా తినడం పరిష్కారం కాదని,అవగాహన , నియంత్రణ ముఖ్యమని స్పష్టం చేసింది. "కటింగ్ లేదు, బ్యాలెన్స్ మాత్రమే" అంటుంది.
బరువు తగ్గడమే కాదు ఎనర్జీ పెంచుకోవాలి : బరువు తగ్గడం, ఫ్యాట్‌ను కరిగించడంతోపాటు బాడీకి శక్తి కావాలి, దానికి తగ్గ వ్యాయామం కావాలి అంటుంది ఆర్య. ఈ విషయంలో తనకైతే డంబెల్స్‌చాలు అంటుంది.2.5 కిలోలతో ప్రారంచి, 5 కిలోల డంబెల్స్‌తో వర్కైట్స్ చేసింది. రోజూ నడక, రెండు రోజులు , 4 రోజులు స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌తో కండరాలు దృఢంగా మారడంతో పాటు వేగంగా శరీరంలోని కొవ్వు కరిగిపోతుందని ఆర్య తెలిపింది.
క్యాలరీల లెక్కలు: ఆర్య క్యాలరీల అవగాహన రావాలంటే వారం రోజులు చాలు అని, అలాగ ఒక వారంపాటు తన ఆహారాన్ని ట్రాక్ చేసుకుంటూ, ఆహార అలవాట్లను బాగా అర్థం చేసుసుకుని ఆచరించినట్టు తెలిపింది.
జంక్ ఫడ్ : జంక్ ఫుడ్ విషయంలో 80:20 నియమాన్ని పాటించిదట. తినే ఫుడ్ లో జంక్ ఫుడ్ శాతాన్ని 20 శాతానికి పరిమితం చేసింది. ప్రాసెస్ చేసిన ఫుడ్, చక్కెర, పిండి, నూనె పదార్థాలు, ఫ్రై చేసిన ఫుడ్ ను తీసుకోవడం ఆమె తగ్గించింది.
నీళ్లు, నిద్ర: బరువు తగ్గే క్రమంలో రోజుకు 2-3 లీటర్ల నీరు, 7-8 గంటల నాణ్యమైన నిద్ర చాలా అవసరమని తద్వారా శరీరంలో ఎనర్జీ లెవెల్స్ పెరిగి, జీర్ణ క్రియ సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపింది.
హార్మోన్స్ : బరువు తగ్గడంలో మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమైనదని ఆర్య తెలిపింది. ఇందుకోసం క్రమం తప్పకుండా చదవడం, ధ్యానం కృతజ్ఞతా భావంతో ఉండటం ఇవి మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని పేర్కొంది.