
మెగా కోడలు లావణ్య త్రిపాఠి త్వరలో బిడ్డకు జన్మనివ్వబోతుంది. ఈ క్రమంలోనే అందుకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. రీసెంట్‌గానే భర్త వరుణ్ తేజ్‌తో కలిసి దుబాయి వెళ్లిన లావణ్య.. బేబీ కోసం షాపింగ్ కూడా పూర్తి చేసేసింది. ఇప్పుడు తిరిగి హైదరాబాద్ వచ్చేసింది. ఈ క్రమంలోనే తొలిసారిగా ఈమె బేబీ బంప్‌తో కెమెరా కంటికి కనిపించింది. ప్రస్తుతం ఆ ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)
ఇకపోతే మెగా ఫ్యామిలీకి చెందిన వరుణ్ తేజ్‌తో మిస్టర్, అంతరిక్షం సినిమాలు చేసిన లావణ్య త్రిపాఠి.. అతడితోనే ప్రేమలో పడింది. దాదాపు ఆరేడేళ్ల పాటు వీళ్లిద్దరూ లవ్ చేసుకున్నారు. కానీ ఎక్కడా ఆ విషయం బయటపడకుండా జాగ్రత్త పడ్డారు. అలా పెద్దల్ని ఒప్పించి 2023 నవంబరులో పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది మే లో తాము తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు పుట్టబోయే బేబీ కోసం షాపింగ్ కూడా పూర్తి చేసి తిరిగి హైదరాబాద్ వచ్చేశారు.
లావణ్య త్రిపాఠి విషయానికొస్తే.. ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఈమె 'అందాల రాక్షసి' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. తర్వాత తెలుగుతో పాటు తమిళంలోనూ పలు చిత్రాలు చేసింది. భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయన, దూసుకెళ్తా తదితర సినిమాలు లావణ్యకు మంచి పేరు తీసుకొచ్చాయి. కానీ గత కొన్నేళ్లలో చేసిన మూవీస్ మాత్రం బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడలేదు. ప్రస్తుతం ఈమె చేతిలో 'సతీ లీలావతి', తనళ్ అనే సినిమాలు ఉన్నాయి. వీటి షూటింగ్ అయితే లావణ్య పూర్తి చేసినట్లు ఉంది. త్వరలో ఇవి రిలీజ్ కావొచ్చు.
(ఇదీ చదవండి: ఎన్టీఆర్ 'కొత్త' ఇల్లు.. ఫ్రెండ్స్‌తో పార్టీ!)