
బెంగళూరు: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎన్నడూ అధికారం కోసం పరుగు తీయలేదన్నారు. 1990ల్లో తాను కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఎంతగానో శ్రమించినట్టు చెప్పుకొచ్చారు. తీరా, పార్టీ అధికారంలోకి వచ్చాక.. పార్టీ అధిష్ఠానం ముఖ్యమంత్రి బాధ్యతలను ఇవ్వలేదని ఖర్గే గుర్తు చేసుకున్నారు.
కర్ణాటకలోని బేలిమఠంలో ఆదివారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుని స్థాయి నుంచి ఏఐసీసీ అధ్యక్ష పదవి వరకు దేనికీ తాను ప్రయత్నించలేదని, పార్టీయే అవకాశం ఇచ్చిందన్నారు. నేను ఎప్పుడు పదవుల కోసం పరుగులు తీయలేదు. 1999లో కర్ణాటకలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు తాను శ్రమించినా, పార్టీ అధిష్ఠానం ముఖ్యమంత్రి బాధ్యతలను ఎస్.ఎం.కృష్ణకు అప్పగించిందని గుర్తుచేసుకున్నారు. ఆ సందర్భంలో తనకు ముఖ్యమంత్రి స్థానం దక్కకపోగా, తన సేవలన్నీ వృథా అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటికీ నిరాశకు గురికాకుండా పార్టీ శ్రేయస్సు కోసం శ్రమించడంతోనే తనకు ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించారని పేర్కొన్నారు. పదవులను తాను ఎప్పుడూ కోరుకోలేదని చెప్పుకొచ్చారు.
ఇదే సమయంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాపై ఖర్గే స్పందిస్తూ.. ఆయన ఎందుకు రాజీనామా చేశారో నాకు తెలియదు. జగదీప్ మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారు. నేను రాజ్యసభలో మాట్లాడేందుకు ఆయన అవకాశమివ్వలేదు. రైతులు, పేదలు, అంతర్జాతీయ సమస్యలు, విదేశాంగ విధానంపై విపక్షాలు మాట్లాడితే, వారి స్వరం వినిపించకుండా చేసేవారు అని వ్యాఖ్యలు చేశారు.
Mallikarjun Kharge, Congress chief and Gandhi family loyalist, voiced regrets on how he missed being the Chief Minister of Karnataka despite winning an election for the Congress... pic.twitter.com/KsdgSf2Nqx
— MALLU PARUTI (@mallu_paruti) July 27, 2025