
బెంగళూరు: కర్ణాటకలో రాజకీయ దుమారం రేపిన ధార్వాడ జిల్లా ఏఎస్పీ నారాయణ భరమణి (ASP Narayan Venkappa Baramani) ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిండు బహిరంగ సభలో సహనం కోల్పోయిన సీఎం సిద్ధరామయ్య (cm siddaramaiah).. తనని కొడుతానంటూ చెయ్యెత్తడం తనని మానసికంగా కలచివేసిందంటూ ఏఎస్పీ నారాయణ భరమణిని సంచలన నిర్ణయం తీసుకున్నారు. సుదీర్ఘ కాలంగా పోలీస్ శాఖలో పనిచేసిన తనకు జరిగిన ఈ అవమానాన్ని తట్టుకోలేకపోతున్నానంటూ వాలంటరీ రిటైర్మెంట్ (VRS) ప్రకటించారు.
ఈ మేరకు కర్ణాటక పోలీస్ శాఖకు ఏఎస్పీ నారాయణ భరమణి లేఖ రాశారు. వీఆర్‌ఎస్ లేఖలో..‘ అందరూ చూస్తుండగానే నిండు బహిరంగం సభలో సీఎం సిద్ధరామయ్య చేతిలో నాకు అవమానం జరిగింది. ఆ సంఘటన నన్ను మానసికంగా దెబ్బతీసింది. నా కుటుంబం బాధపడింది. నా భార్య, పిల్లలు కన్నీళ్లతో నిశ్శబ్దంగా గడిపారు. ఘటనకు సంబంధించిన వీడియోలో వైరల్ అయ్యాయి. పలువురు నన్ను అవమానిస్తూ కామెంట్లు పెట్టారు. 31 ఏళ్లుగా పోలీస్ శాఖలో అంకిత భావంతో పనిచేసిన నాకు ఇలాంటి అవమానం జరగడాన్ని తట్టుకోలేకపోయాను’ అని పేర్కొన్నారు.
ఏఎస్పీ నారాయణ భరమణి వీఆర్‌ఎస్ ప్రకటించడంపై కర్ణాటక సిద్ధరామయ్య ప్రభుత్వం స్పందించింది. కర్ణాటక (Karnataka) హోంమంత్రి జి పరమేశ్వర .. ఏఎస్పీ నారాయణ భరమణిని సంప్రదించి బెళగావి డీసీపీ (Belagavi)గా కొత్త పోస్టింగ్ ఆఫర్ చేసినట్టు సమాచారం. కానీ ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్‌ను భరమణి సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది.
The Police, who was insulted on stage by Congress leader & CM Siddaramaiah has resigned.
The cop served for 31 years, joined force as his dream wish, worked hard.
In his resignation, ASP Narayan Baramani has said he felt humiliated & traumatizedpic.twitter.com/ZxBCvSSF9h— Karthik Reddy (@bykarthikreddy) July 3, 2025
పహల్గాం ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో
పహల్గాం ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో (2025 Pahalgam attack) ‘పాకిస్తాన్‌తో యుద్ధం తప్పనిసరి కాదు’అంటూ సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై వివాదం నెలకొంది. పలువురు సిద్ధరామయ్య పాకిస్తాన్ వెళ్లిపో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కామెంట్స్ తర్వాత ఏప్రిల్ 28న బెలగావిలో కాంగ్రెస్ సంవిధాన్ బచావో & ధరల వ్యతిరేకల నిరసన ప్రదర్శన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించింది.
సహనం కోల్పోయిన సిద్ధరామయ్య
అయితే, ఆసభలో సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతుండగా.. పలువురు ఆయన ప్రసంగానికి మాటిమాటికి అడ్డుతగిలారు. గో టూ పాకిస్తాన్ అంటూ నినదించారు. దీంతో సిద్ధరామయ్య సహనం కోల్పోయారు. ఆగ్రహంతో ఊగిపోతూ వేదిక ముందున్న ఏఎస్పీ నారాయణ్ భరమణిని స్టేజీపైకి పిలిచారు. వాళ్లను ఎందుకు కంట్రోల్ చేయడంలేదని ప్రశ్నించారు. ఏఎస్పీ వివరణ ఇస్తున్నా వినిపించుకోకుండా కొడుతానంటూ చెయ్యెత్తారు. ఆ తర్వాత తమాయించుకుని చెయ్యి దించారు.
ఆ ఘటనపై రాజకీయ వివాదం జరిగింది. ప్రతిపక్షాలు ఆయన తీరును తప్పుబట్టాయి. కర్ణాటక కాంగ్రెస్ పాలనను హిట్లర్ పరిపాలనతో పోల్చాయి. ఆ ఘటనపై ఏఎస్పీ నారాయణ్ భరమణి కీలక నిర్ణయం తీసుకున్నాయి. వీఆర్‌ఎస్ తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వానికి లేఖ రాయడం చర్చాంశనీయంగా మారింది.