
వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నమయ్య జిల్లాలో పర్యటించారు. రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి సోదరుడు అనిల్‌కుమార్ రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యారు.

ఆకేపాడులోని ఆకేపాటి ఎస్టేట్స్‌లో మంగళవారం జరిగిన ఈ వివాహ రిసెప్షన్‌కి హాజరైన వైఎస్ జగన్ నూతన వధూవరులు వర దీక్షితా రెడ్డి, సాయి అనురాగ్ రెడ్డిలకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు.

జగన్‌రాక సందర్భగా ఆకేపాడు జనసంద్రాన్ని తలపించింది. జై జగన్ నినాదాలతో దద్దరిల్లింది. హెలిప్యాడ్ నుంచి వివాహ వేదిక దాకా అభిమానులు, పార్టీ కార్యకర్తలు క్యూ కట్టారు. వాళ్లకు ఆప్యాయంగా అభివాదం చేస్తూ ఆయన ముందుకు కదిలారు.



















