‘ఓట్‌ చోరీ’ కామెంట్స్‌లో ట్విస్ట్‌.. తప్పని తేలితే రాహుల్‌ గాంధీకి శిక్ష | Karnataka Election Body Letter To Rahul Gandhi Over Vote Theft Comments | Sakshi
Sakshi News home page

Rahul Gandhi : రాహుల్‌ గాంధీ ‘ఓట్‌ చోరీ’ కామెంట్స్‌లో ట్విస్ట్‌.. తప్పని తేలితే శిక్షే

Aug 7 2025 4:57 PM | Updated on Aug 7 2025 5:50 PM

Karnataka Election Body Letter To Rahul Gandhi Over Vote Theft Comments

సాక్షి,బెంగళూరు: బీజేపీ కోసమే కేంద్ర ఎన్నికల సంఘం ఓట్లను చోరీ చేస్తోందంటూ కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌ గాంధీ చేసిన ఆరోపణల్లో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఓట్‌ చోరీ పేరుతో రాహుల్‌ గాంధీ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఆ ప్రజెంటేషన్‌లో చూపించిన ఆధారాలు తప్పని తేలితే శిక్ష పడే అవకాశం ఉందని తెలుపుతూ కర్ణాటక రాష్ట్ర ఎన్నికల సంఘం రాహుల్‌ గాంధీకి లేఖ రాసింది.

మహరాష్ట్ర,కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయంటూ రాహుల్‌ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఓట్‌ చోర్‌ పేరుతో గురువారం ఢిల్లీ ఇందిరా భవన్‌లో రాహుల్‌ గాంధీ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఆ ప్రజెంటేషన్‌లో అక్రమాలు జరిగిన ఓటర్ల జాబితాను బహిర్ఘతం చేశారు. అయితే రాహుల్ గాంధీ ‘ఓట్ చోరీ’ ఆరోపణల్ని కర్ణాటక రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ మీనా ఖండించారు. రాహుల్ వ్యాఖ్యలు నిరాధారమైనవి తెలిపింది. ఎన్నికల సంబంధించిన అంశాలను న్యాయం స్థానాన్ని ఆశ్రయించాలని సూచించింది.

అదే సమయంలో రాహుల్‌ ఆరోపణలకు సంబంధించి అధికారిక డిక్లరేషన్, నకిలీ ఓటర్ల వివరాలను సమర్పించాలని కోరింది. తప్పుడు ఆధారాలు సమర్పిస్తే, 1950 ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం శిక్ష పడే అవకాశం ఉందని లేఖలో హెచ్చరించింది. 

 

ఆ నియోజకవర్గంలో లక్ష నకిలీ ఓట్లు.. ఆధారాలివే 
‘సార్వత్రిక ఎన్నికల్లో బలమైన ప్రదర్శన ఇచ్చిన కొన్ని నెలలకే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి ఫలితాలు తారుమారువడంపై మాకు అనుమానం వచ్చింది. గతేడాది 48 మహారాష్ట్ర లోక్‌సభ స్థానాల్లో  సీట్లలో 30 సీట్లు గెలుచుకున్న ఇండియా కూటమి.. కేవలం ఐదు నెలల తర్వాత జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో 50 మార్కును ఎందుకు దాటలేకపోయింది.

మహరాష్ట్ర,కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ కోసమే ఈసీ పనిచేసింది. అందుకు మా వద్ద అణుబాంబులాంటి ఆధారాలున్నాయి. మేం అంతర్గతం చేపట్టిన సర్వేలో కర్ణాటకలో ఇండియా కూటమి 16 ఎంపీ స్థానాలు గెలుస్తుందని తేలింది. కానీ తొమ్మిది స్థానాల్లో మాత్రమే గెలిచింది. 

ఆ తర్వాత ఊహించని విధంగా ఓడిపోయిన ఏడు స్థానాలపై దృష్టి సారించాం. అలా బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ సెగ్మెంట్‌లోని అసెంబ్లీ స్థానమైన మహదేవపురలో ఓటమికి గల కారణాల్ని అన్వేషించాం. బెంగళూరు సెంట్రల్ లోక్‌సభలో పోలైన మొత్తం ఓట్లు 6.26 లక్షలు. బీజేపీకి 6,58,915 ఓట్లు పోలవ్వగా.. 32,707 ఓట్ల తేడాతో గెలిచింది. 

ఇదే బెంగళూరు సెంట్రల్ లోక్‌సభలో మహదేవపుర అసెంబ్లీ స్థానాన్ని పరిశీలిస్తే.. ఓట్ల చోరీ జరిగినట్లు గుర్తించాం. మహదేవపురలో కాంగ్రెస్‌కు 1,15,586 ఓట్లు పోలవ్వగా.. బీజేపీ 2,29,632 ఓట్లు పోలయ్యాయి. బెంగళూరు సెంట్రల్‌లో సర్వజ్ఞనగర్,సీవీ రామ్‌ నగర్‌,శివాజీ నగర్‌,శాంతీ నగర్‌,గాంధీ నగర్‌,రాజాజి నగర్‌,చామ్‌రాజ్‌పేట అన్నీ అసెంబ్లీ స్థానాల్లో గెలిచి ఒక్క మహదేవపురలో ఓడిపోయాం.

ఈ మహదేవపుర అసెంబ్లీ నియోజక వర్గంలో ఐదు రకాలుగా 1,00,250 నకిలీ ఓట్లు గుర్తించాం. నకిలీ ఓటర్లు, నకిలీ, చెల్లని చిరునామాలు, ఒకే ఇంటి అడ్రస్‌తో పదుల సంఖ్యలో ఓటర్లు ఉన్నట్లు తేలింది. ఇది నిజమా? కాదా? అని నిర్దారించేందుకు ఆ ఇంటి చిరునామాలకు వెళ్లాం. ఆ ఇంటి అడ్రస్‌లో ఉన్న ఓట్లను పరిశీలిస్తే.. అన్నీ నకిలీవేనని తేలింది’ అని ఆరోపించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement