ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంపై చర్చ జరుగుతుంది. ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన పలు ఎన్నికలలో ఆ పార్టీ పెద్దగా ప్రభావం చుపకపోవడంతో నాయకత్వ మార్పు జరగాలంటూ ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు సూచిస్తున్నారు. అయితే పార్టీ అధ్యక్ష బాధ్యతల అంశంపై రాహుల్, ప్రియాంకలో మధ్య వారసత్వ పోరు నడుస్తోందని బీజేపీతో పాటు ఇతర పార్టీలు ఆరోపిస్తున్నాయి. తాజాగా ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలంతా మాజీ ప్రధాని ఇందిరా గాంధీని, ప్రియాంకలో చూస్తున్నారని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీలో ఇటీవల వారసత్వ పోరు మరోసారి చర్చనీయాంశం అవుతోంది. ఇటీవల ఆపార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు ప్రియాంక గాంధీకి పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని ఏకంగా సోనియా గాంధీకే లేఖ రాశారు. ఇక కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ అయితే తనను ప్రధాని చేస్తే పాకిస్థాన్ భరతం పడుతుందని ఆమె ఇందిరా గాంధీ మనవరాలని తనపై ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో అధికార బీజేపీ ఈవ్యాఖ్యలపై కౌంటర్ స్టార్ట్ చేసింది. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీపై నమ్మకం కోల్పోయారని వ్యాఖ్యలు చేసింది. అయితే ప్రస్తుతం ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా తన గురించి మాట్లాడారు.
రాబర్ట్ వాద్రా మాట్లాడుతూ "ప్రియాంకా చాలా కష్టపడుతుంది. ఆమె తన నానమ్మ ఇందిరాగాంధీ నుంచి చాలా విషయాలు నేర్చుకుంది. ప్రజల సమస్యలపై ఆమె నిరంతరం పోరాడుతుంది. ఆమెకు చాలా భవిష్యత్తు ఉంది. ప్రజలంతా తనలో ఇందిరా గాంధీని చూస్తున్నారు.కాంగ్రెస్ ఎంపీలు సైతం ఆమెను ప్రధానమంత్రిగా ఆమెదిస్తున్నారు". అని రాబర్ట్ వాద్రా అన్నారు.
అదే సమయంలో "రాహుల్ గాంధీ కూడా చాలా కష్టపడుతున్నారు. వారి రక్తంలోనే రాజకీయాలు ఉన్నాయి. దేశం కోసం వారి ప్రియమైన వ్యక్తులను కోల్పోయారు" అని రాబర్డ్ వాద్రా తెలిపారు. అయితే తనను కూడా ప్రజలు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారని అయితే బీజేపీ నెపోటిజమ్ పేరుతో రాజకీయం చేస్తుందన్నారు.
దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆ సమయంలో తనపై ఈడీ రైడ్ జరుగుతుందన్నారు.అయితే తన పొలిటికల్ ఎంట్రీ అంశం భవిష్యత్తులో ఆలోచిస్తానని తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేక ఇబ్బందుల్లో ఉన్న హస్తం పార్టీకి ఇప్పుడు ఈ నేతల వ్యాఖ్యలు కొత్త తలనొప్పులు తెచ్చేలా ఉన్నాయి.


