breaking news
Priyanka
-
అదృశ్యమై.. 8 రోజుల తరువాత శవమై
బెంగళూరు: హాసన్ జిల్లా చన్నరాయపట్టణ తాలూకా చిక్కనాయకనహళ్లికి చెందిన నవ వివాహిత ప్రియాంక (27) అదృశ్యం కేసు విషాదాంతమైంది. 8 రోజుల తరువాత ఆమె మృతదేహం శ్రావణ బెళగొళ దగ్గర హేమావతి కాలువలో తేలింది. వివరాలు.. ఈ నెల 19న రాత్రి సన్నరాయపట్టణ తాలూకా చిక్కనాయకనహళ్లిలో భార్యాభర్తలు రాజశేఖర్, ప్రియాంక ఊరి శివార్లలోని కాలువ దగ్గరకెళ్లారు. అక్కడ గొడవ జరిగిందని, ఆమే కాలువలోకి దూకేసిందని భర్త చెబుతున్నాడు. అయితే భర్తే ప్రియాంకను నీటిలోకి తోసేసినట్లు ప్రియాంక కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఆమెకు ఈత వస్తుందని చెప్పారు. అప్పటి నుంచి పోలీసులు, ఫైర్ సిబ్బంది గాలింపు చేపట్టారు. కాలువలో వెతుకుతూ వెళ్లగా లోతుగా ఉన్నచోట మృతదేహం లభించింది. శ్రావణ బెళగొళ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రియాంకకు మొదటే పెళ్లయిందని, అది దాచి తనతో రెండవ పెళ్లి చేశారనే కోపంతో రాజశేఖర్ ఆమెను హత్య చేశాడని మృతురాలి కుటుంబీకులు ఆరోపించారు. -
మొదటి భర్తే కావాలంటూ..
బెంగళూరు: హాసన్‌లో ఓ వివాహిత ఇంటి నుంచి వెళ్లిపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అనైతిక సంబంధాల కారణంగా కుటుంబాల్లో వివాదాలు పెరుగుతున్నాయనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రాజశేఖర్, ప్రియాంక దంపతులు హాసన్‌లో నివాసం ఉంటున్నారు. ఇటీవల ప్రియాంక ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆందోళనకు గురైన భర్త రాజశేఖర్ ఆమె కోసం వెతకడం ప్రారంభించాడు. ఈ క్రమంలో ప్రియాంక గతంలోనే మరో వ్యక్తిని వివాహం చేసుకుందని, ఆ విషయాన్ని తనకు చెప్పకుండా తనతో మళ్లీ పెళ్లి చేశారని ఆరోపించాడు.ప్రియాంక తన మొదటి భర్తను వదిలేసి తన వద్దకు వచ్చిందని, ఇప్పుడు మళ్లీ అతని వద్దకే వెళ్లి ఉంటుందనే అనుమానం వ్యక్తం చేశాడు. తనను, తన కుటుంబాన్ని మోసం చేశారని రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న రాజశేఖర్ కుటుంబ సభ్యులు ప్రియాంక తల్లిదండ్రులను ప్రశ్నించారు. తమకు వాస్తవాలు దాచిపెట్టి పెళ్లి చేశారంటూ ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.కుమార్తెను ప్రేమించాడని.. చంపేశారు దొడ్డబళ్లాపురం: కుమార్తెను ప్రేమిస్తున్న యువకున్ని ఆమె తల్లితండ్రులు హత్య చేసిన ఘటన దావణగెరె జిల్లా మొళకాల్మూరు తాలూకా తళవారహళ్లిలో వెలుగుచూసింది. వివరాల మేరకు.. హానగల్ గ్రామానికి చెందిన నాగేశ్ (22), పొరుగూరు రుద్రమ్మనహళ్లికి చెందిన యువతి, రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. తమ కూతురి జోలికి రావద్దని యువతి తల్లిదండ్రులు అనేకసార్లు నాగేశ్‌ను హెచ్చరించినా మార్పు రాలేదు. ఆగ్రహానికి లోనైన యువతి తల్లిదండ్రులు మాట్లాడాలని నాగేశ్‌ని తళవారహళ్లి వద్ద నిర్జన ప్రదేశానికి పిలిపించారు. అక్కడ రాళ్లు, కత్తులతో హత్య చేసి పరారయ్యారు. 2 రోజుల కిందట జరిగిన హత్య మంగళవారం బయటపడింది. మొళకాల్మూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు, ఇంతలోనే నిందితులు ఊరు వదిలి పరారయ్యారు. -
పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేదు
సాక్షి, రాజమహేంద్రవరం: డాక్టర్ ప్రియాంక హత్య కేసులో పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేదని ఆమె తండ్రి వెంకటేశ్ ఆరోపించారు. శుక్రవారం రాజమహేంద్రవరంలో వైఎస్సార్ సీపీ ప్రచార కమిటీ నేతృత్వంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘దర్యాప్తు కోసం స్పెషలాఫీసర్‌ను నియమించామని ప్రభుత్వం హడావుడి చేసింది. ఆయనేమో వారం పది రోజుల నుంచి సెలవులో ఉన్నారు. ఇలా అయితే దర్యాప్తు ఎలా ముందుకు సాగుతుంది’’ అని వెంకటేశ్ మండిపడ్డారు. తాము మూడు రోజులుగా వివరాలు సేకరిస్తుంటే, ఎవరూ సహకరించడం లేదన్నారు. స్వతంత్ర హాస్పిటల్, ప్రసాద్ ఐమ్యాక్స్ యాజమాన్యాలు సీసీ కెమెరాల ఫుటేజీ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయని తెలిపారు. ‘పోలీసుల వద్ద ప్రత్యక్ష సాక్షుల వివరాలు లేవు. ఇలాగైతే నిందితులకు ఎప్పుడు శిక్ష పడుతుంది. నిందితులను మూడు రోజులపాటు రక్షించిన రాజకీయ నాయకులు, పోలీసులను కూడా శిక్షించాలి. రాష్ట్రంలో యువత గంజాయి మత్తులో అకృత్యాలకు పాల్పడుతున్నారు. రేయింబవళ్లూ కష్టపడి చదివి పీజీ సీటు సంపాదించుకున్న నా కుమార్తెను దారుణంగా హతమార్చారు. నా బిడ్డ డాక్టర్‌గా కొద్ది రోజుల్లో ఇంటికి వస్తుందనుకుంటే శవాన్ని పంపించారు’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తన బిడ్డకి జరిగినట్లు ఎవరికీ జరగకూడదని, ఏ తండ్రికీ కడుపుకోత రాకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజానికి ప్రాణం తీసేవాళ్లు కావాలా? ప్రాణం పోసే వాళ్లు కావాలా? తమకు న్యాయం జరగకపోతే ఇలాంటి రాక్షసులు మరింతగా రెచ్చిపోతారని అన్నారు. కేసు దర్యాప్తు విషయంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా నిందితులకు కొమ్ముకాస్తోందని ఆయన ఆరోపించారు. -
ప్రియాంక చనిపోక ముందు రోజు... డాక్టర్ ప్రియాంక తండ్రి ఎమోషనల్ వీడియో
-
జగనన్న ఇచ్చిన హామీతోనే మాకు ఇంత దైర్యం వచ్చింది
-
అక్క కోసం దేనికైనా రెడీ ప్రియాంక సోదరుడు
-
పోలీసులకు దండం పెట్టి అడుగుతున్న దయచేసి.. ప్రియాంక తండ్రి ఆవేదన
-
వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. టాలీవుడ్ సినీతారల ప్రత్యేక పూజలు.. ఫోటోలు
-
జగన్ హామీ ఇచ్చారు.. అమ్మా ప్రియాంక ఎక్కడున్నావ్ అమ్మ.. ఏడ్చేసిన మెడికో ప్రియాంక తల్లిదండ్రులు
-
డాక్టర్ ప్రియాంక హత్యపై న్యాయ పోరాటం
సాక్షి, అమరావతి: డాక్టర్ ప్రియాంక హత్యపై వైఎస్సార్సీపీ తరపున న్యాయ పోరాటం చేస్తామని ఆమె తల్లిదండ్రులకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. రాజమండ్రిలో దారుణ హత్యకు గురైన డాక్టర్ ప్రియాంక తల్లిదండ్రులు చంద్రమ్మ, వెంకటేష్ గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్‌ను కలిశారు. తమ బిడ్డ ఎంతో కష్టపడి మెరిట్లో రాజమండ్రి కళాశాలలో సీటు తెచ్చుకుందని, ఆమెను కిరాతకులు బలి తీసుకున్నారని వారు కన్నీటి పర్యంతమయ్యారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని వారు వైఎస్ జగన్‌ను కోరారు. కుమార్తెను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తల్లిదండ్రులను వైఎస్ జగన్ ఓదార్చి, పార్టీ తరపున న్యాయ పోరాటం చేస్తామని భరోసా ఇచ్చారు.ఆ రాక్షసులకు మరణ శిక్ష పడే వరకు విశ్రమించం: ప్రియాంక తండ్రి వెంకటేష్తమ బిడ్డను చంపిన రాక్షసులకు మరణ శిక్ష పడేవరకు విశ్రమించబోమని డాక్టర్ ప్రియాంక తండ్రి వెంకటేష్ స్పష్టం చేశారు. వైఎస్ జగన్‌ను కలిసిన అనంతరం వైఎస్సార్సీపీ మాజీ ఎంపీలు మార్గాని భరత్, బుట్టా రేణుకతో కలిసి వెంకటేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఆర్థిక స్థోమత లేకపోయినా రెక్కలు ముక్కలు చేసుకుని మా బిడ్డను డాక్టర్‌ను చేశాం. మా బిడ్డ కూడా కష్టపడి చదివింది. మెరిట్లో పీజీ సీటు వచ్చిందని రాజమండ్రికి పంపిస్తే.. రాక్షసుల్లా కారుతో గుద్ది గుద్ది చంపేశారు. ఈ నెల 2న ప్రియాంకకు పెళ్లిచూపులు జరిగాయి. 3న కాలేజీకి వెళ్లిన పాపను అదే రోజు రాత్రి పొట్టనబెట్టుకున్నారు. మేము ప్రాణాలతో ఉన్నా చనిపోయిన శవాలతో సమానం అయిపోయాం. ఆస్పత్రిలో చేర్చినప్పటి నుంచి మాకు సరైన సమాచారం ఇవ్వలేదు. ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వకుండా కేసును తొక్కిపెట్టే ప్రయత్నం చేశారు. నిందితులు మద్యం, గంజాయి మత్తులో ఉన్నారా లేదా అనే పరీక్షల వివరాలు కూడా బయటపెట్టలేదు. స్థానిక పోలీసులు, అధికారులపై మాకు ఏమాత్రం నమ్మకం లేదు. నిందితులను కాపాడేందుకు ప్రభుత్వం, పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మా పాపను పొట్టనబెట్టుకున్న హంతకులకు ఉరిశిక్ష పడేవరకు మా పోరాటం ఆగదు. వాళ్లు తప్పించుకోలేరు. ఈ కేసును తక్షణమే సీబీఐకి అప్పగించి మా కుటుంబానికి న్యాయం చేయాలి. దీనిపై మేం హైకోర్టుకు కూడా వెళ్తాం. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని కలిశాం. చట్ట ప్రకారం వాళ్లకు శిక్షలు పడేలా చేస్తామని, బాధపడవద్దు అని వైఎస్ జగన్ మమ్మల్ని ఓదార్చి, మాకు ధైర్యం చెప్పారు.ప్రియాంక కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతాం: మాజీ ఎంపీ బుట్టా రేణుకపలుకుబడి ఉన్న నిందితులను కాపాడాలని ప్రభుత్వ పెద్దలు చూస్తున్నారు. కిరాతకంగా హత్య చేసిన వారికి కఠిన శిక్షలు పడాలి. బాధిత చేనేత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకు పోరాడతాం.నిందితులను కాపాడుతున్న అధికార పార్టీ పెద్దలు ఎవరు?: మాజీ ఎంపీ మార్గాని భరత్ఉద్దేశపూర్వకంగా కారును మూడుసార్లు డాక్టర్ ప్రియాంక తలపై నుంచి ఎక్కించి చంపేస్తే, దానిని ప్రభుత్వం, పోలీసులు సాధారణ యాక్సిడెంట్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇది ముమ్మాటికీ హత్యే. ఘటన జరిగిన రాత్రి కేవలం మాల్ దగ్గరి సీసీ ఫుటేజ్ మాత్రమే చూపించారు. మిగిలిన సిటీ సీసీ ఫుటేజీలను, నిందితుల కాల్ డేటా ఎందుకు బయటపెట్టడం లేదు? పైగా నిర్లక్ష్యపు డ్రైవింగ్ అంటూ కేసు నమోదు చేయడంలో ఆంతర్యమేంటి? నిందితులు మద్యం, డ్రగ్స్ సేవించిన విషయాన్ని ఎఫ్ఐఆర్లో ఎందుకు చేర్చలేదు? నిందితులను కాపాడుతున్న అధికార పార్టీ పెద్దలు ఎవరో తేల్చాలి. నిందితులతో పాటు వారికి కూడా కఠినమైన శిక్షలు పడాలి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ బాజీలాల్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలి. ఇంత దారుణ ఘటన జరిగిన కాసేపటికే బాధ్యతగల డీఎస్పీ అదే మాల్లో సినిమాకి వెళ్లడం పోలీసుల నిర్లక్ష్యానికి నిదర్శనం. తక్షణమే ఈ కేసును సీబీఐకి అప్పగించకపోతే హైకోర్టును ఆశ్రయిస్తాం. -
ప్రియాంక తల్లిదండ్రుల మాటలు విని జగన్ కళ్లలో కన్నీళ్లు తిరిగాయి..
-
వైఎస్ జగన్‌ని కలిసిన మెడికో ప్రియాంక పేరెంట్స్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మెడికో ప్రియాంక తల్లిదండ్రులు గురువారం కలిశారు. తమ కుమార్తెను కారుతో ఢీకొట్టి చంపిన విషయమై వైఎస్ జగన్‌కు ప్రియాంక పేరెంట్స్ వివరించారు.తమ కుమార్తెను తలచుకుని వెంకటేష్, చంద్రమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. వారిని వైఎస్ జగన్ సముదాయించి ధైర్యం చెప్పారు. నిందితులకు శిక్ష పడేలా చూడాలంటూ వైఎస్ జగన్‌ను ప్రియాంక కుటుంబ సభ్యులు కోరారు. అవసరమైన న్యాయ పోరాటం చేద్దామంటూ వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. -
ప్రియాంకని ఎందుకు చంపారు..? పోలీస్ విచారణలో సంచలన విషయాలు
-
రాజమండ్రి డాక్టర్ ప్రియాంక ఘటనపై వైఎస్ జగన్ రియాక్షన్
-
డాక్టర్ ప్రియాంక హత్య కేసులో కస్టడీలోకి నిందితులు
-
ప్రియాంక కేసులో కీలక మలుపు నిందితులకు పోలీస్ కస్టడీ
-
సాక్షాలతో నేను బయటపెడతా! వాళ్ళ వెనుక బడా రాజకీయ నాయకులు ఉన్నారు...
-
20 లక్షలిస్తే.. నా కూతురు తిరిగివస్తుందా..! మోసం చేసావ్ చంద్రబాబు..
-
పోలీస్ స్టేషన్ కు డబ్బు సూట్ కేసులు..!? సీసీటీవీ ఫుటేజ్ మాయం..
-
ఎందుకు చంపినవారిని కాపాడుతున్నారు? ప్రియాంక ఆత్మకు శాంతి చేకూర్చాలంటే...
-
ఎవరిని కాపాడటం కోసం చూస్తున్నారు! ఏపీ ప్రభుత్వం పై ప్రియాంక తండ్రి సంచలన కామెంట్స్
-
రాజమండ్రి ప్రియాంక ఘటనపై విద్యార్థులు భారీ ర్యాలీ
-
నా కూతురిని చంపిన వాడికి సహాయం చేస్తే.. చంద్రబాబు గుర్తుపెట్టుకో.. ప్రియాంక తండ్రి స్ట్రాంగ్ వార్నింగ్
-
డాక్టర్ ప్రియాంక మృతి కేసులో FIR సెక్షన్ లో మార్పులు.. ఎందుకు అలా..?
-
కేకును కోస్తే అరెస్ట్ చేసి నడి రోడ్డుపై నడిపించారు.. మెడికల్ విద్యార్థిని ప్రియాంకను చంపేస్తే మాత్రం వారిని
-
రాజమండ్రి పోలీసులు అందరూ ఎలాంటివారంటే..! డాక్టర్ ప్రియాంక ఘటనపై అడ్వకేట్ బాల కామెంట్స్
-
కారుతో తొక్కేసి మెడికో ప్రియాంకను చంపి పరార్.. పూర్తి CCTV ఫుటేజ్?
-
ప్రియాంక కేసు.. నిందితుల కాల్ డేటా ఏదీ?: మార్గాని భరత్
సాక్షి, రాజమహేంద్రవరం: మెడికో ప్రియాంక హత్య కేసులో నిందితులను కాపాడే అదృశ్య శక్తులు ఉన్నాయా? అని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్. ఈ కేసులో నిజాలేమైనా దాచారా? అంటూ చంద్రబాబు సర్కార్‌పై ఆయన మండిపడ్డారు. సమాధానం చెప్పాలంటూ కూటమికి పది ప్రశ్నలు సంధించారు. డాక్టర్ ప్రియాంకను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఇంతటి తీవ్రమైన ఘటనను మొదట్లో ఎందుకు తక్కువ చేసి చూపించే ప్రయత్నం జరిగిందని ఆయన కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంగళవారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘మూడు రోజులు నిందితులు ఎక్కడున్నారు?’ఈ ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరుపై అనుమానాలు ఉన్నాయని మాజీ ఎంపీ ఆరోపించారు. మూడో తేదీన ఘటన జరిగితే.. ఆరో తేదీన నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారని, ఆ మధ్య మూడు రోజులు నిందితులు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. వారిని ఎవరైనా దాచారా? దాచితే ఎవరి అండ ఉందో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.‘చిన్న యాక్సిడెంట్‌గా ఎలా చెబుతారు?’డాక్టర్ ప్రియాంక మృతిని మొదట చిన్న ప్రమాదంగా పేర్కొనడంపై భరత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులు తొలుత ర్యాష్ డ్రైవింగ్ కింద కేసు నమోదు చేశారని, హత్య అంశం వెలుగులోకి వచ్చిన తర్వాతే సెక్షన్లు ఎందుకు మార్చారని ప్రశ్నించారు. తాము ఆందోళన చేపట్టే వరకు కేసు తీవ్రతను ఎందుకు గుర్తించలేదని నిలదీశారు.‘నిందితుల ఫోన్ డేటా ఎందుకు సేకరించలేదు?’హత్య జరిగిన రోజు రాత్రి నిందితులు ఎవరెవరితో మాట్లాడారో, ఎవరిని సంప్రదించారో తెలుసుకోవడానికి ఫోన్ డేటాను ఎందుకు పరిశీలించలేదని భరత్ ప్రశ్నించారు. ఘటన వెనుక ఉన్న శక్తులను బయటకు తీసుకురావాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు.‘మద్యం మత్తులో జరిగిన ఘటనగా ఎలా చెబుతారు?’స్థానిక ఎమ్మెల్యే ఘటనను మద్యం మత్తులో జరిగిన హిట్ అండ్ రన్ కేసుగా పేర్కొనడంపై కూడా భరత్ స్పందించారు. ఒక మనిషి ప్రాణం పోయిన ఘటనను కేవలం ప్రమాదంగా ఎలా చూస్తారని భరత్ ప్రశ్నించారు. సోషల్ మీడియా పేజీలు ఎందుకు మూగబోయాయి?రెండు రాష్ట్రాల్లో చర్చకు వచ్చిన ఈ ఘటనపై రాజమహేంద్రవరం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, పేజీలు ఎందుకు స్పందించలేదని భరత్ ప్రశ్నించారు. వారిపై ఎవరి ఒత్తిడి ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు.‘అధికార పార్టీ ఆదేశాలతోనే కప్పిపుచ్చే ప్రయత్నం’ఈ ఘటనలో అధికార పార్టీ ఒత్తిళ్లు ఉన్నాయంటూ మార్గాని భరత్ ఆరోపించారు. నిందితులు ఘటన అనంతరం వెళ్లిన మార్గాల్లో సీసీ కెమెరాలను ఎందుకు పరిశీలించలేదని ప్రశ్నించారు. పోలీసులు వారికి సంబంధించిన వివరాలు ముందుగానే తెలుసుకున్నా.. ఆలస్యంగా అరెస్ట్ చేసినట్లు చూపించారని ఆరోపించారు.సీఐపై చర్యలు ఎందుకు లేవు?ఇంతటి వివాదం నెలకొన్నప్పటికీ ప్రకాష్‌నగర్ సీఐపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని భరత్ ప్రశ్నించారు. కేసులో పూర్తి నిజాలు బయటకు రావాలంటే సమగ్ర దర్యాప్తు అవసరమని అన్నారు. -
మెడికో ప్రియాంక కేసు.. అసలు మాల్లో ఏం జరిగింది?
సాక్షి, తూర్పుగోదావరి: రాజమహేంద్రవరం ప్రసాదిత్య మాల్ వద్ద కారుతో ఢీకొట్టిన సంఘటనలో మృతి చెందిన వైద్య విద్యార్థిని కనికే ప్రియాంక కేసులో అనుమానాలు వీడడం లేదు. ఇప్పటి వరకు మాల్లో ప్రియాంకపై వాహనంతో జరిగిన దాడికి సంబంధించి మాత్రమే సీసీ ఫుటేజ్ బయటికి వచ్చింది. నిందితులు మాల్‌లోకి వచ్చిన ఫుటేజ్ గాని, ప్రియాంక మాల్‌లోకి ఎప్పుడు వచ్చిందన్న ఫుటేజ్ గాని పోలీసులు బయట పెట్టలేదు.మాల్లో ఏం జరిగిందన్న విషయంపై సందేహాలు తొలగలేదు. ప్రసాదిత్యా మాల్లో నిందితులతో మాల్ సిబ్బందికి జరిగిన గొడవ పుటేజ్ బయటకు ఎందుకు రాలేదన్న దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డాక్టర్ ప్రియాంక పోస్ట్‌మార్టం రిపోర్ట్, కెమికల్ ఎనాలసిస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ అల్టర్ చేసే అవకాశం ఉంది.కాగా, ప్రియాంక మృతదేహానికి సోమవారం రాజమహేంద్రవరం డీఎస్పీ సుభాష్ బృందం పోస్టుమార్టం నిర్వహించారు. ప్రియాంక కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఆమెకు పోస్టుమార్టం నిర్వహించేందుకు క్రైం డీఎస్పీ సుభాష్, ప్రకాశ్‌నగర్ సీఐ బాజీలాల్, ఎస్సై సతీష్, ఇద్దరు కానిస్టేబుళ్ల బృందం ఆదివారం రాత్రి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.మర్నాడు పోస్టుమార్టం పక్రియ పూర్తి చేసి ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం ప్రియాంక మృతదేహాన్ని భారీ ఊరేగింపుతో స్వగ్రామమైన గద్వాల్ జిల్లా అయిజ మండలంలోని ఎక్లాస్‌పురానికి తీసుకువచ్చి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. -
డాక్టర్ ప్రియాంక మృతి వెనుక షాకింగ్ నిజాలు
-
Big Question: ఆ నిందితులను 3 రోజులు ఎక్కడ దాచిపెట్టారు
-
ఆలనాపాలన... రోడ్డుపాలు చేయొద్దు!
డాక్టర్ కావాల్సిన ప్రియాంక నూరేళ్ల జీవితం క్షణాల్లో కడతేరిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన అందరి మనసునూ కలచివేసింది. పిల్లలకు కార్లిచ్చి పంపుతున్న తల్లిదండ్రులు ఆ పిల్లల ధోరణి గమనిస్తున్నారా?రేస్ ఉన్మాది – స్పీడ్ కోసం ప్రాణాలు తీసేవాడుఈగో ఉన్మాది – ‘దారి ఇవ్వలేదు’ అని గుద్దేవాడుమత్తు ఉన్మాది – తాగి స్టీరింగ్ పట్టేవాడుడాడీ పవర్ ఉన్మాది – ‘నాన్న చూసుకుంటాడు’ అని నడిపేవాడు. ఇంట్లో ‘బంగారు తండ్రి’ అని పిలుచుకునే కొడుకు రేపు ఈ నలుగురిలో ఒకడు కాకుండా చూసుకుంటున్నామా?ఆగస్టు 3, 2026 రాత్రి 10:00 గంటలు. రాజమండ్రిలోని ఒక మాల్లో సినిమా చూసి బయటకు వచ్చిన ప్రియాంక (28) తన స్కూటీ తీసి ఫ్రెండ్‌తో కలిసి ఇంటికి బయలుదేరింది. బహుశా ఆమె సినిమా కబుర్లలో మునిగి ఉంటుంది. హాస్టల్ నుంచి ఫోన్ వస్తే ‘ఇంకో పావుగంటలో చేరుకుంటున్నాం’ అని కూడా చెప్పి ఉంటుంది. కాని ప్రియాంక జీవితం సడన్‌గా విషాదంలో కూరుకుపోయింది. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు తమ వాహనంతో ప్రియాంక స్కూటీని ఢీకొట్టడమే కాదు, ప్రియాంక తలపై నుంచి కారును పోనిచ్చి పరారయ్యారు.ఆ క్షణమే కోమాలోకి వెళ్లిన ప్రియాంక ఆగస్టు 9న మృతి చెందింది. ఆ అమ్మాయి చేసిన నేరం ఏమిటి? ఏ కొద్ది మందికో దక్కే ఎంబీబీఎస్ కోర్సు చదివి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్లో ఉన్న అమ్మాయి క్షణంలో ఉన్మాద చర్యకు ప్రాణం కోల్పోవడం ఏమిటి? ఆమె మృతికి ఇద్దరు వ్యక్తులే కారణంగా పైకి కనిపించవచ్చు. కాని వారి ‘మైండ్‌సెట్’ను అలా తయారు చేసిన వ్యవస్థ, పెంపకం, వ్యసనం, లెక్కలేనితనం... ఇవన్నీ కారణాలే. ఇవి సరికానంత వరకూ ఇలాంటి ఉత్పాతాలు జరగవని గ్యారంటీ ఇవ్వలేము. రోడ్డు మీద క్షేమంగా తిరగలేము.నాలుగు రకాల ఉన్మాదాలురోడ్ల మీద తిరిగే వాహనాల బ్రాండ్ కంటే వాటిని నడుపుతున్న మనుషుల మనస్తత్వాలు ముఖ్యం. నేటి రోడ్డు ప్రమాదాలను పరిశీలిస్తే వాటికి కారణమైన వారిలో నాలుగు రకాల ఉన్మాదులు కనిపిస్తున్నారు.రేస్ ఉన్మాది: కేవలం స్పీడ్ కోసం, రోడ్డుపై థ్రిల్ కోసం పక్కవారి ప్రాణాలు తీసేవాడు. ‘మావాడు బైక్ స్పీడ్‌గా నడుపుతాడు’ అని తల్లిదండ్రులే గొప్పగా చెప్పి ఇలా తయారు చేస్తున్నారు. ‘ఫాస్ట్‌గా నడిపే వాడే గొప్ప’ అని కుర్రాడి బుర్రలో ఉంటే ఎవరిది దోషం?ఈగో ఉన్మాది: ‘నాకు దారి ఇవ్వలేదు’ అని, అహం దెబ్బతిన్నదని కావాలనే వెనుక నుంచి గుద్దేసేవాడు. ‘వాడికి ఎవరూ ఎదురు చెప్పడానికి వీల్లేదు’ అని తల్లిదండ్రులే చిన్నప్పటి నుంచి అహాన్ని సాకుతారు.మత్తు ఉన్మాది: ఒంట్లో ఎంత మద్యం ఉందో తెలియకుండానే స్టీరింగ్ పట్టి, రోడ్డుపై నడిచే ప్రతి ఒక్కరినీ టార్గెట్‌గా మార్చేవాడు. స్నేహితులు ఎలాంటివారో తల్లిదండ్రులు చూడకపోవడం, రాత్రి ఒంటి గంటకు కూడా రాకపోతే పార్టీకి వెళ్లాడు అని సరిపెట్టుకోవడం... దాని ఫలితం ఇది.డాడీ పవర్ ఉన్మాది: ‘నా వెనుక నాన్న ఉన్నాడు, ఏ తప్పు చేసినా చూసుకుంటాడు’ అనే నమ్మకంతో బరితెగించి వాహనం నడిపేవాడు. కొడుక్కు పద్దెనిమిదేళ్లు రాకముందే తండ్రి కారు కీ చేతికి ఇవ్వడం, పోలీసు ఆపితే నా పేరు చెప్పు అని తండ్రి అనడం... ఇంకేముంది?రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంకను బలితీసుకున్నది ఈ ఉన్మాదాల కలయికే. ఈ విపరీత ధోరణులు రాత్రికి రాత్రి పుట్టవు. చిన్నప్పటి నుంచి తయారై ఉంటాయి. 20 సెకన్లలో జరిగిన ప్రియాంక మృత్యుఘటన వెనుక ‘20 ఏళ్ల బాధ్యతారాహిత్యపు పెంపకం’ కారణమై ఉండొచ్చు. రాత్రి పది తర్వాత కొడుకు బయట ఉంటే కారో, బైకో వేసుకుని తిరుగుతుంటే ‘ఎక్కడ ఉన్నావు?’ అని అడగ్గలిగే స్థితిలో తల్లిదండ్రులు లేకపోయినా, ‘చెప్పాల్సిన పని లేదనే’ ధోరణిలో పుత్రరత్నాలు ఉన్నా అది సమాజానికి అపాయకరం. మరవకూడని పాఠంఈ రోజు డాక్టర్ ప్రియాంక మన మధ్య లేదు. కానీ ఆమె మరణం నేర్పిన పాఠం చాలా పెద్దది. తల్లిదండ్రులారా.. మీ కొడుకులకు ఎదుటివారికి గౌరవం ఇవ్వడం, కోపాన్ని అదుపులో ఉంచుకోవడం నేర్పండి. రోడ్డు మీద కారు స్టీరింగ్ చేతిలో ఉందనో, వెనుక అండ ఉందనో అహంకారంతో ప్రవర్తిస్తే చట్టం ముందు, సమాజం ముందు దోషులుగా నిలబడక తప్పదని హెచ్చరించండి. కొడుకులను బాధ్యతగల పౌరులుగా పెంచినప్పుడే మన ఇళ్లలో, సమాజంలో నిజమైన భద్రత ఉంటుంది. బతుకును మింగే ‘బెల్టు’కంటి రెప్ప కునుకేస్తేనే స్టీరింగ్ ఎటో పోతుంది. మరి మత్తు తలకెక్కితే? అడుగుకొక బెల్టు షాపు రారమ్మని పిలుస్తుంటే దారిన పోయేవాడు ఆగి కాసింత పోసుకొని బయల్దేరుదాం అనుకుంటాడు. ఆ తర్వాత ప్రాణాల మీదకు తెస్తాడు. వ్యవస్థ ఇలా ఉంటే దానిని ఆపాల్సిన బాధ్యత పాలనది, పౌర సమాజానిది. అధిక అందుబాటు, వేళాపాళా లేకుండా సాగే అమ్మకాలు సహించరానివి. దీనికి కారకులెవరు... నిజంగా మత్తులో తేలుతున్నది ఎవరు అనేది కూడా తేలాలి.ఏం చేయాలి?→ లైసెన్స్ తీసుకోకుండా, 21 ఏళ్లు రాకుండా కారు ఇవ్వకండి. ఇచ్చే ముందు ‘నువ్వు తప్పు చేస్తే నేను కేసు నుంచి తప్పించను’ అని గట్టిగా చెప్పండి → ప్రతి రాత్రి 9 గంటలకల్లా కొడుకు ఇంటికి వచ్చాడా? కారు ఎక్కడుంది? పార్టీలో ఉన్నాడా... ఫోన్ చేసి చెక్ చేయండి. ఇది అనుమానం కాదు. బాధ్యత → ‘సారీ’ చెప్పడం నేర్పండి. రోడ్డుపై ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే దిగి క్షమాపణ చెప్పే అలవాటు చేయండి. ఈగో కంటే మనిషితనం గొప్పదని చూపించండి → సినిమా, రీల్స్ గురించి మాట్లాడండి. ‘రేసింగ్ సీన్లు సినిమాకే బాగుంటాయి... నిజ జీవితంలో చాలా ప్రాణాంతకం’ అని కూర్చుని చెప్పండి. హీరోయిజం అంటే స్పీడ్ కాదు.... బాధ్యత అని చెప్పండి.→ శిక్ష నుంచి తప్పించకండి. చిన్న స్క్రాచ్ అయినా, చిన్న ఫైన్ అయినా అబ్బాయినే కట్టనివ్వండి. ‘నాన్న ఉన్నాడు’ అనే నెట్ తీసేయండి. భయం ఉంటేనే బుద్ధి వస్తుంది. -
మెడికల్ విద్యార్థిని ప్రియాంక ఘటనపై అనితకు ఇచ్చిపడేసిన తెలంగాణ ప్రజలు
-
ప్రియాంక ఘటనపై జూపల్లి కృష్ణ రావు సంచలన వ్యాఖ్యలు
-
ఆ రోజు మాల్లో ఏం జరిగిందంటే... డాక్టర్ ప్రియాంక మరణంపై సాక్షి ప్రత్యక్ష సాక్షిచెప్పిన నిజాలు
-
మా ఇంటి ఏకైక డాక్టర్.. చివరి ఫోన్‌కాల్ గుర్తుచేసుకుని కన్నీళ్లు
-
తాగాను.. బండి నడిపాను అంటే సరిపోతుందా?
హైదరాబాద్‌లో ఇవాళ ఒక్కరోజే.. మూడు హిట్ అండ్ రన్ కేసులు నమోదు అయ్యాయి. హైదర్షా కోట్ ఘటనలో ఆర్మీ జవాన్ మృతి చెందగా.. కొండాపూర్ ప్రమాదంలో వనపర్తికి చెందిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. బాలాపూర్ ఘటనలోనూ ఒకరు మృతి చెందారు. ఈ ఘటనల్లో రెండింటిలో.. నిందితులు ఫుల్‌గా మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మెడికో ప్రియాంక కేసు విషాదాంతమైన సంగతి తెలిసిందే. రాజమండ్రిలో జరిగిన ఈ కేసులోనూ నిందితులు మద్యం సేవించిన స్థితిలో ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఇలాంటి ఘటనలు దేశం నలుమూలాల రోజు నమోదు అవుతూనే ఉన్నాయి. ఏరకంగా చూసుకున్నా.. మద్యం మత్తులో నిర్లక్ష్యం.. కుటుంబాలకు జీవితాంతం తీరని విషాదాన్నే మిగులుస్తోంది.ప్రియాంక.. పక్కన యాక్సిడెంట్ దృశ్యంప్రపంచంలోని అనేక దేశాలు మద్యం తాగి వాహనం నడపడాన్ని సాధారణ ట్రాఫిక్ ఉల్లంఘనగా చూడవు. అది ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించే తీవ్రమైన నేరంగా పరిగణిస్తాయి. ముఖ్యంగా ప్రమాదం జరిగి మరణాలు సంభవిస్తే శిక్షలు మరింత కఠినంగా ఉంటాయి.అమెరికాలో మద్యం సేవించి వాహనం నడపడం (DUI/DWI) తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. రాష్ట్రాన్ని బట్టి చట్టాలు మారినా.. జరిమానాలు, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు, జైలు శిక్ష వంటి చర్యలు ఉంటాయి. ప్రమాదంలో మరణం జరిగితే కేసు తీవ్రత మరింత పెరుగుతుంది.బ్రిటన్‌లోనూ డ్రంక్ డ్రైవింగ్‌పై కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. మద్యం మత్తులో డ్రైవ్ చేస్తూ మరణానికి కారణమైతే దీన్ని అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణించి దీర్ఘకాల జైలు శిక్షలు విధించే అవకాశం ఉంటుంది. డ్రైవింగ్ నిషేధం, భారీ జరిమానాలు కూడా ఉంటాయి.ఆస్ట్రేలియా, సింగపూర్, జపాన్ వంటి దేశాల్లోనూ మద్యం సేవించి డ్రైవింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటారు. సింగపూర్‌లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు భారీ జరిమానాలు, జైలు శిక్షలు విధించే విధానం ఉంది. కొన్ని సందర్భాల్లో వాహనం స్వాధీనం చేసుకునే చర్యలు కూడా ఉంటాయి.లెక్కలు చెబుతున్న భయానక నిజంమద్యం మత్తులో స్టీరింగ్ పట్టడం.. కేవలం ట్రాఫిక్ తప్పిదం కాదు ప్రాణాలను బలిగొనే ప్రమాదకర నిర్ణయం. భారత్‌లో 2022లో డ్రంక్ డ్రైవింగ్‌తో 4,201 మరణాలు.. 2023లో 9,143 కేసులు.. 2024లో 8,270 ప్రమాదాలు నమోదయ్యాయి. ఈ సంఖ్య ఈ మధ్యకాలంలో పెరుగుతూ పోతోంది. ఇవే కాకుండా.. ఇతరుల ప్రాణాలు తీయడమే కాకుండా, తాగి తమ ప్రాణాలు తీసుకుంటున్నవాళ్ల లెక్కలు ఇంకా బోలెడు ఉన్నాయి.భారత్‌లో చట్టాలు ఉన్నా.. భారత్‌లోనూ డ్రంక్ డ్రైవింగ్‌పై చట్టాలు ఉన్నాయి. మోటార్ వాహనాల చట్టం ప్రకారం మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానా, జైలు శిక్షకు అవకాశం ఉంటుంది. ప్రమాదం జరిగి మరణం సంభవిస్తే భారత న్యాయ సంహిత (BNS) కింద నిర్లక్ష్యపు చర్యలకు సంబంధించి మరింత తీవ్రమైన కేసులు నమోదు చేయవచ్చు. అయితే సమస్య చట్టాల కొరతలో కాదు.. వాటి అమలులో ఉందనే విమర్శలు ఉన్నాయి. తనిఖీలు జరుగుతున్నప్పటికీ.. కొందరు మద్యం మత్తులో వాహనాలు నడిపి ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారు.శిక్ష భయం ఎందుకు రావడం లేదు?డ్రంక్ డ్రైవింగ్ అనేది కేవలం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనగా చూడలేం. మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల అమాయకుల ప్రాణాలు పోవచ్చు.. ఎన్నో కుటుంబాలు జీవితాంతం తీరని విషాదాన్ని మిగులుస్తాయి. అయినప్పటికీ కొందరిలో ఈ నేరం పట్ల సరైన భయం కనిపించడం లేదు.ఇతర దేశాల్లో డ్రంక్ డ్రైవింగ్‌పై చట్టాల అమలు అత్యంత కఠినంగా ఉంటుంది. తప్పు చేసిన వెంటనే చర్యలు తీసుకోవడం, లైసెన్స్ రద్దు, భారీ జరిమానాలు, జైలు శిక్షలు వంటి పరిణామాలు ఉంటాయనే భయం వాహనదారుల్లో ఉంటుంది. ప్రమాదంలో మరణం సంభవిస్తే కేసును మరింత తీవ్రంగా పరిగణిస్తూ కఠిన శిక్షలు విధిస్తారు.హైదర్షా కోట్ హిట్ అండ్ రన్ దృశ్యం ఇదిభారత్లోనూ చట్టాలు ఉన్నప్పటికీ.. వాటి అమలు, శిక్షలు పడే వేగమే ప్రధాన సవాల్‌గా మారుతోంది. కేసులు దర్యాప్తు, న్యాయ ప్రక్రియలో ఎక్కువ కాలం కొనసాగడం.. శిక్షలు ఆలస్యంగా పడటం వల్ల కొందరిలో నేరం పట్ల భయం తగ్గుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.కఠిన చట్టాలతో పాటు.. వాటిని వేగంగా, సమర్థంగా అమలు చేయడం కూడా అంతే కీలకం. ఎందుకంటే మద్యం మత్తులో స్టీరింగ్ పట్టే ప్రతి వ్యక్తి తన ప్రాణాన్నే కాదు.. రోడ్డుపై ఉన్న ఎంతోమంది జీవితాలను ప్రమాదంలోకి నెడుతున్నాడు. శిక్ష భయం పెరిగినప్పుడే ఇలాంటి నిర్లక్ష్యాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుంది.మారాల్సింది మనస్తత్వం కూడా..ప్రపంచ దేశాలు చెబుతున్న పాఠం ఒక్కటే.. మద్యం తాగి డ్రైవింగ్ చేయడం సరదా కాదు, అది ప్రాణాలతో చెలగాటం. కఠిన చట్టాలతో పాటు.. వాటి అమలు, ప్రజల్లో బాధ్యతాయుతమైన ప్రవర్తన పెరగాల్సిన అవసరం ఉంది. హిట్ అండ్ రన్ ఘటనలు పెరుగుతున్న వేళ.. ‘‘తాగాను.. డ్రైవ్ చేస్తాను’’ అనే నిర్లక్ష్య ఆలోచనకు అడ్డుకట్ట పడాల్సిన సమయం వచ్చింది. -
ఎంతో బాధతో ఈ వీడియో చేస్తున్న.. డాక్టర్ ప్రియాంక మృతిపై మార్గాని భరత్ ఎమోషనల్
-
ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదా?... తీవ్ర ఆవేదనతో ఏపీ సర్కార్‌ను ప్రశ్నించిన పీజీ మెడికో ప్రియాంక తండ్రి వెంకటేష్
-
ఈ కేసులో రాజకీయ హస్తం ఉంది..!? ప్రియాంక తండ్రి సంచలన వ్యాఖ్యలు
-
ఆటమ్ టూ మర్డర్ కేసు..!? డాక్టర్ ప్రియాంక కేసులో ఎస్పీ సంచలన విషయాలు!
-
రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి
-
ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదా?
కంబాలచెరువు (రాజమహేంద్రవరం)/సాక్షి, హైదరాబాద్/సాక్షి, అమరావతి: ‘నా కుమార్తెను కావాలని కారుతో మూడుసార్లు ఢీకొట్టారు. అంతటితో ఆగకుండా తలపై నుంచి కారును పోనిచ్చారు. వాళ్లు మనుషుల రూపంలో ఉన్న మృగాలు. నా బిడ్డ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నా ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు. అయ్యా చంద్రబాబూ.. నీకు జాలిలేదా? అమ్మా అనితమ్మా.. నీకు ఆడ పిల్లల్లేరా? పవన్‌కళ్యాణ్.. నీకు మనసు లేదా?’ అంటూ మెడికో పీజీ డాక్టర్ ప్రియాంక తండ్రి వెంకటేష్ కన్నీటిపర్యంతమయ్యారు. ప్రియాంక కేసును రాజకీయ ఒత్తిళ్లతో తారుమారు చేస్తున్నారనే అనుమానంతో ఆదివారం రాజమహేంద్రవరంలోని ప్రకాశ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.ఘటన అనంతరం ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సహకారం అందలేదని, ఆసుపత్రి ఖర్చుల విషయంలోనూ సాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఒకసారి ‘మీకు మేమున్నాం.. బాధపడకండి’ అంటూ ఫోన్ చేశారని, ఆ తర్వాత ఎలాంటి స్పందన లేదన్నారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, హోంమంత్రి అనిత, మంత్రి లోకేశ్ కనీసం స్పందించక పోవడంపై వెంకటేష్ ప్రశ్నలు సంధించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటనపై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని నిలదీశారు. ప్రియాంకను హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందిస్తున్నామని, ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. ఆసుపత్రి యాజమాన్యంకు ఫోన్ చేసి అందుతున్న చికిత్సపై ఒక్కసారైనా ఫోన్ చేశారా? మెరుగైన సేవలు అందించండని ప్రభుత్వం నుంచి మెస్సేజైనా పెట్టారా? ప్రభుత్వం పని చేస్తుందో లేదో అర్థం కావడం లేదు. మూడు సార్లు కావాలనే కారుతో ఢీకొట్టి, ఆ తర్వాత తలపై నుంచి కారును పోనిచ్చారంటే చంపాలనే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. నిందితులు ఘటన తర్వాత కూడా సాధారణంగానే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లారని ఆరోపించారు. చట్టాలపై ప్రజలకు నమ్మకం కలగాలంటే కఠినంగా అమలు చేయాలని, తమకు న్యాయం చేయాలని వెంకటేష్ వేడుకున్నారు. ‘ఇంత దారుణానికి పాల్పడిన మృగాలను కఠినంగా శిక్షించండి.. ఉరి తీయండి’ అంటూ కన్నీటితో విజ్ఞప్తి చేశారు.మా కడుపు కోతను అర్థం చేసుకోండి‘మా కుటుంబంలో మొదటి డాక్టర్ కాబోతోందని, ఎంతో మంచి పేరు వస్తుందని ఆశించాం. ఒకరు సక్సెస్ అయితే ఎంతో మందికి ఇన్స్ఫిరేషన్గా ఉంటుందని ఆశపడ్డాం. నాకు ముగ్గురూ అమ్మాయిలే. మీకు పెళ్లిళ్లు చేశాక మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారని మాట్లాడినప్పుడు మొత్తం కుటుంబాన్ని నేను చూసుకుంటానని హామీ ఇచ్చింది ప్రియాంక. అలాంటి మెడికల్ పీజీ విద్యార్థిని అందమైన జీవితాన్ని చిదిమేశారు. మా కలల సౌధం కూల్చేశారు. మా కడుపు కోతను అర్థం చేసుకోండి. ఈ ఘటన మా కుటుంబానికి తీరని లోటు. మద్యం మత్తులో ఆడపిల్లను హత్య చేసిన వారు హాయిగా తిరగొచ్చా? చట్టాలపై భరోసా రావాలంటే సమాజంలో భయం కలిగేట్లు చేయండి’ అని వెంకటేశ్ కన్నీటిపర్యంతమయ్యారు. కీలక ఆధారాలు సేకరించాంవైద్య విద్యార్థిని ప్రియాంక కేసులో లోతైన దర్యాప్తు చేస్తున్నామని, ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించి నిందితులిద్దరినీ అరెస్టు చేసినట్లు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్ తెలిపారు. ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 3న రాత్రి స్వతంత్ర ఆసుపత్రి నుంచి సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి వెళ్లగా ప్రియాంక వెంటిలేటర్‌పై ఉన్నట్లు తెలిపారు. ఆమె స్నేహితుడు ఉమేష్ నుంచి వివరాలు సేకరించి కేసు నమోదు చేశామన్నారు. మరుసటి రోజు సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా, ప్రియాంక ప్రయాణిస్తున్న బైక్‌ను కారుతో మూడుసార్లు ఢీకొట్టినట్లు గుర్తించామని చెప్పారు. దీంతో ఇది ప్రమాదం కాకుండా ఉద్దేశ పూర్వకంగా జరిగిన ఘటనగా కేసు నమోదు చేసి, ఈ నెల 6న నిందితులిద్దరినీ రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. నిందితుల నేర చరిత్రపైనా ఆరా తీశామన్నారు. కారు నంబర్ ప్లేట్లు తొలగించి డిక్కీలో పెట్టారని, మొదటి నిందితుడు దస్వంత్ కారులోనే నిద్రిస్తుండగా పట్టుకున్నామని చెప్పారు. దస్వంత్ చెన్నైలో బీటెక్ చేశాడని, విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడని, రెండో నిందితుడు జోసెఫ్ ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తున్నాడని తెలిపారు. ప్రియాంక మృతి చెందితే కేసును హత్య కేసుగా మారుస్తామని ఎస్పీ స్పష్టం చేశారు.ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు : సీఎం చంద్రబాబురాజమండ్రిలో ఈ నెల 3వ తేదీన ఇద్దరు యువకులు కారుతో ఢీకొట్టిన ఘటనలో పీజీ మెడికో ప్రియాంక ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న ఒక వైద్య విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జిల్లా అధికారులతో ఆదివారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం మాట్లాడారు. ప్రియాంక మృతికి కారణమైన నిందితులు ఇప్పటికే అరెస్టై జైల్లో ఉన్నారని ఎస్పీ వివరించారు. నిర్లక్ష్యంతో నిండు ప్రాణం తీసిన వారిపై కఠిన సెక్షన్లతో శిక్షలు పడేలా చూడాలని, బాధిత కుటుంబానికి రూ.20 లక్షల ఆరి్థక సాయం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.వారం రోజులు మృత్యువుతో పోరాడి రాజమహేంద్రవరంలో ఈ నెల 3వ తేదీన కారుతో మూడు సార్లు ఢీకొట్టి.. తలపై నుంచి ఎక్కించడంతో తీవ్ర గాయాలపాలైన మెడికో పీజీ డాక్టర్ ప్రియాంక (28) ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మృతి చెందినట్లు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ప్రియాంక తల్లిదండ్రులు కర్నూలు నుంచి వెళ్లి జోగులాంబ గద్వాల జిల్లాలో ఉంటున్నారు. కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ప్రియాంక రాజానగరంలోని జీఎస్ఎం మెడికల్ కళాశాలలో డెర్మటాలజీ పీజీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఘటన జరిగిన తర్వాత నుంచి ఆమెకు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆమె ఆదివారం తుదిశ్వాస విడిచారు. -
రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి
హైదరాబాద్: రాజమండ్రిలో ఇటీవల ఇద్దరు ఉన్మాదులు కారుతో ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంక మృతి చెందారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందిన ప్రియాంక బ్రెయిన్ డెడ్ అయ్యిందని వైద్యులు ప్రకటించారు. ప్రియాంక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు కొన్ని గంటల క్రితం ప్రకటించిన వైద్యులు.. అంతలోనే ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్దారించారు. ప్రియాంక కేసు ఇదే..ప్రియాంక కర్నూలుకు చెందిన యువతి. ఆమె తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని జీఎస్ఎల్ వైద్య కళాశాలలో డెర్మటాలజీ విభాగంలో పీజీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఆగస్టు 3న రాజమండ్రిలో తోటి విద్యార్థినితో కలిసి సినిమా థియేటర్ నుంచి వస్తుండగా మద్యం మత్తులో ఉన్న దుష్యంత్, ఆండ్రూ విలియం జోసెఫ్ కారును వేగంగా నడుపుతూ వచ్చి వీరి బైక్‌ను ఢీకొట్టారు. మరోసారి బలంగా ఢీకొట్టి ప్రియాంక మీద నుంచి కారు వెళ్లడంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది.ప్రియాంకను సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. ప్రియాంక తండ్రి వెంకటేశ్ ఇటీవల మాట్లాడుతూ... కొన్ని రోజుల్లో వైద్య విద్య పూర్తి చేసుకుని వైద్యురాలిగా సేవలు అందిస్తుందని అనుకున్నామని ఆవేదన చెందారు. తమ కుమార్తెకు ఈ గతి పట్టించిన వాళ్లను వదలిపెట్టకూడదని అన్నారు. -
వేటపోతుకు ఇచ్చిన విలువ కూడా డాక్టర్ ప్రియాంకకు లేదా? అనితపై అడ్వకేట్ రజిని ఫైర్
-
నా కూతురు చావు బ్రతుకుల మధ్య ఉంది..! చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై ప్రియాంక తండ్రి ఫైర్
-
మెడికో ప్రియాంక కేసు.. కీలక విషయాలు వెల్లడించిన ఎస్పీ
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: ప్రియాంక ఘటన దురదృష్టకరమని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ అన్నారు. రాజమండ్రిలో కారు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసు వివరాలను ఎస్పీ మీడియాకు వెల్లడించారు. ‘‘ఈ నెల మూడో తేదీ రాత్రి 10 గంటలకు మెడికల్ సమాచారం వచ్చింది...వెంటనే ప్రకాష్ నగర్ పీఎస్ పోలీసులు ఘటన స్థలానికి వెళ్లారు. ముందస్తు సమాచారంతో కేసు నమోదు చేశాం. ఆ మర్నాడు ఉదయానికి కల్లా నిందితులను గుర్తించాము. నిందితులు బైక్ మీద ఉన్న ప్రియాంకను మూడు సార్లు కారుతో ఢీకొట్టారు. ఇద్దరు నిందితులను విచారించి ఆరో తేదీన అరెస్ట్ చేశాం’’ అని ఎస్పీ తెలిపారు.‘‘గ్యాస్ కనెక్షన్ ఆధారంగా నిందితులను గుర్తించాం. నిందితులు మాల్లో కొందరితో ఘర్షణ పడ్డారు. ప్రియాంకది రోడ్డు ప్రమాదం కాదు.. క్రిమినల్ చర్య. ప్రియాంక ఫ్రెండ్ ఉమేశ్ స్టేట్మెంట్ను రికార్డ్ చేశాం. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేశాం. ప్రియాంక తండ్రికి ఈ కేసు విచారణపై బ్రీఫ్ చేశాం. నిందితులను పోలీసు కస్టడికీ తీసుకుంటున్నాం. ఉద్దేశపూర్వకంగా చేశారా? లేదా అనేదానిపై విచారణ చేస్తాం. ఘటన తరువాత ఒక చోటకు వెళ్లి నిందితులు పడుకున్నారు. నిందితులపై గతంలో కేసులు లేవు. నిందితులపై బీఎన్ఎస్ 110 సెక్షన్ నమోదు చేశామని ఎస్పీ పేర్కొన్నారు. -
మూడు రోజుల మౌనం వెనుక..
సాక్షి, రాజమహేంద్రవరం: మత్తోన్మాదంతో వైద్య విద్యార్థిని కనికే ప్రియాంకను కారుతో ఢీకొన్న కిరాతకులను కాపాడేందుకు ఓ అదృశ్య శక్తి తెర వెనుక ప్రయత్నించిందనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ దారుణానికి సంబంధించి వరుసగా జరిగిన పరిణామాలు, పోలీసులు వ్యవహరించిన తీరు రాజమహేంద్రవరం నగరంలో నివసిస్తున్న కూటమి ప్రజాప్రతినిధులు మౌనవ్రతం పాటించడం.. ఇవన్నీ ప్రజల అనుమానాలకు బలం చేకూర్చుతున్నాయి. ఈ దుర్మార్గం జరిగిన ప్రసాదిత్య మాల్ వద్ద సీసీ కెమెరాల ఫుటేజీల్లో నిందితుల అమానుషం స్పష్టంగా కనిపిస్తున్నా, వారిని అరెస్ట్ చేసేందుకు 72 గంటల సమయం తీసుకోవడం వెనుక ఏం జరిగిందనేది చర్చనీయాంశంగా మారింది. హిట్ అండ్ రన్.. అంటూ తప్పుడు వాదన సహజంగా రహదారిపై వెళ్తున్న వారిని ఓ వాహనం ఢీకొట్టి వెళ్లిపోతే హిట్ అండ్ రన్ అని పోలీసు పరిభాషలో చెబుతారు. అయితే రాజమహేంద్రవరంలో ఉద్దేశ పూర్వకంగానే వైద్య విద్యార్థిని స్కూటీని కిరాతకులు వెంట వెంటనే మూడుసార్లు ఢీకొట్టి.. కింద పడిపోయిన ప్రియాంక తల పైనుంచి కారు పోనిచ్చారు. ఇదంతా సీసీ కెమెరాల ఫుటేజీల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అయినప్పటికీ మద్యం మత్తులో ఢీకొట్టారని, హిట్ అండ్ రన్ అని పోలీసులు, స్థానిక ప్రజాప్రతినిధులు చెబుతుండడం గమనార్హం. ఉద్దేశపూర్వకంగానే కారుతో ఢీకొట్టి హత్యాయత్నం చేశారని... హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ప్రియాంక తల్లిదండ్రులు, మాల్ వద్ద దుర్ఘటనను చూసిన స్థానికులు డిమాండ్ చేస్తున్నా.. ఆ దిశగా పోలీసులు చర్యలు చేపట్టకపోవడంతో మరిన్ని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ప్రియాంక కుటుంబీకులు స్థానికులు కాకపోవడంతో మద్యం మత్తులో జరిగిన ఘటన అని చెప్పేసి కేసును నీరుగార్చేందుకు ప్రయతి్నస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆ మూడు రోజులూ ఎక్కడున్నారో... ఈ నెల 3న రాత్రి 9 గంటల సమయంలో ప్రియాంక స్కూటీని ఢీకొట్టిన సూరారపు ధస్వంత్, ఆండ్రూ జోషెఫ్ కారులో వేగంగా వెళ్లిపోయారు. చిన్న చిన్న విషయాలకే ప్రెస్మీట్లు పెట్టి ఫొటోలు తీసుకుని మీడియాకు పంపించే పోలీసులు.. బహిరంగంగా ఇంత పెద్ద అమానుష ఘటన జరిగినా మూడో రోజు వరకు నోరు విప్పకపోవడం గమనార్హం. సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో పాటు మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ గట్టిగా నిలదీయడంతో పోలీసులు ఈ నెల 6న హడావుడిగా ప్రెస్‌మీట్ పెట్టి మద్యం మత్తులో ప్రమాదం జరిగిందని తేల్చేశారు. అదే రోజు రాత్రి 7 గంటల సమయంలో ఇద్దరిని అరెస్ట్ చూపించి, మరుసటి రోజు రిమాండ్‌కు తరలించారు. మరి అప్పటివరకు నిందితులు ఎక్కడున్నారనే ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పడం లేదు. అదేవిధంగా నిందితులు మత్తులో ప్రసాదిత్య మాల్‌లోకి వెళ్లినప్పుడు, వైద్య విద్యారి్థని ప్రియాంకను ఢీకొట్టినప్పుడు కారుకు వెనుక, ముందు నంబర్ ప్లేట్లు ఉన్నాయి. ప్రమాదం అనంతరం నిందితుల నుంచి కారు స్వా«దీనం చేసుకున్న తర్వాత నంబర్ ప్లేట్లు మాయమయ్యాయి. నిందితులను రక్షించేందుకు ఓ ప్రజాప్రతినిధి పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చారని, అందుకే నంబర్ ప్లేట్లు మాయమయ్యాయనే వాదనలు వినిపిస్తున్నాయి. -
డా. ప్రియాంక ఘటనపై SP సంచలన వ్యాఖ్యలు
-
నా బిడ్డ గురించి సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం
-
డా.ప్రియాంక ఘటనపై అడ్వకేట్ రజిని ఫస్ట్ రియాక్షన్
-
‘చంద్రబాబు, పవన్ కల్యాణ్ కనీసం స్పందించరా?’
సాక్షి, తూర్పుగోదావరి: చంద్రబాబు సర్కార్‌పై మెడికో ప్రియాంక తండ్రి వెంకటేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడపిల్ల అన్యాయమైపోతే మహిళా హోంమంత్రి మనసు కరగలేదా? అంటూ ప్రియాంక తండ్రి మండిపడ్డారు. రెక్కలు ముక్కలు చేసుకుని మా పాపను చదివించుకున్నాం. మా పాపను బతికించుకోవాలనే తపనలో ఉన్నాం. ప్రభుత్వం నుంచి ఇంతవరకు స్పందన లేదు. మా కడుపుకోత లోకేష్‌కు అర్థం కావడం లేదా?’’ అంటూ ప్రియాంక తండ్రి నిలదీశారు.‘‘ఆడపిల్లను చంపేసి హాయిగా తిరగొచ్చా.. మీ చట్టాలు సరిగా పనిచేస్తున్నాయా?. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కనీసం స్పందించలేదు. విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా పట్టించుకోలేదు. ప్రతినెల హైదరాబాద్ వస్తారు కదా.. మా బిడ్డ పరిస్థితి తెలుసుకోరా?. కనీసం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నా బిడ్డ పరిస్థితి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. రాష్ట్ర హోం మంత్రి గాని, జిల్లా అధికారులు గానీ ఇప్పటివరకు ఈ ఘటన గురించి మాట్లాడలేదు. నా బిడ్డ అవయవదానం చేసే ఆలోచన లేదు. బతికించుకునే ప్రయత్నమే చేస్తున్నాం’’ అని ప్రియాంక తండ్రి పేర్కొన్నారు.కాగా, రాజమండ్రిలో కారు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కర్నూలుకు చెందిన ప్రియాంక తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని జీఎస్ఎల్ వైద్య కళాశాలలో డెర్మటాలజీ విభాగంలో పీజీ మొదటి సంవత్సరం చదువుతోంది.ఈ నెల 3న రాజమండ్రిలో తోటి విద్యార్థినితో కలిసి సినిమా థియేటర్ నుంచి వస్తుండగా మద్యం మత్తులో ఉన్న దుష్యంత్, ఆండ్రూ విలియం జోసెఫ్‌లు కారును వేగంగా నడుపుతూ వచ్చి వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు. మరోసారి బలంగా ఢీకొట్టి ప్రియాంక మీద నుంచి కారు వెళ్లడంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. పరిస్థితి విషమించడంతో సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, గ్లాస్గో కోమా స్కేల్ (జీసీఎస్) తక్కువగా ఉండటంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు కిమ్స్ వైద్యులు తెలిపారు. -
రాజమండ్రి మెడికల్ విద్యార్థిని ఘటనపై సంచలన నిజాలు బయటపెట్టిన ప్రత్యక్ష సాక్షి ప్రియాంక ఫ్రెండ్..
-
వెంటిలేటర్‌పై డాక్టర్ ప్రియాంక
హైదరాబాద్: రాజమండ్రిలో కారు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైద్య వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కర్నూలుకు చెందిన ప్రియాంక తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని జీఎస్ఎల్ వైద్య కళాశాలలో డెర్మటాలజీ విభాగంలో పీజీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ నెల 3న రాజమండ్రిలో తోటి విద్యార్థినితో కలిసి సినిమా థియేటర్ నుంచి వస్తుండగా మద్యం మత్తులో ఉన్న దుష్యంత్, ఆండ్రూ విలియం జోసెఫ్‌లు కారును వేగంగా నడుపుతూ వచ్చి వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు. మరోసారి బలంగా ఢీకొట్టి ప్రియాంక మీద నుంచి కారు వెళ్లడంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. పరిస్థితి విషమించడంతో సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, గ్లాస్గో కోమా స్కేల్ (జీసీఎస్) తక్కువగా ఉండటంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు కిమ్స్ వైద్యులు తెలిపారు. వారిని వదిలిపెట్టరాదు కొద్ది రోజుల్లో వైద్య విద్య పూర్తి చేసుకుని వైద్యురాలిగా సేవలు అందిస్తుందని అనుకున్నాం. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండి అన్నీ చూసుకోవాలని అనుకునేది. కానీ ఆమెను ఈ పరిస్థితుల్లో చూడాల్సి వస్తుందనుకోలేదు. మా కుమార్తె బతకాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం, ఆప్నియా టెస్టుకు ఆమె శరీరం సహకరించడం లేదు అందుకే వైద్యులు విరమించుకున్నారు. మా కుమార్తెకు ఈ గతి పట్టించిన వాళ్లను వదలిపెట్టకూడదు. నడిరోడ్డులో ఉరితీయాలి. – తండ్రి వెంకటేష్ -
ఆ కోపంతోనే కారుతో ప్రియాంకను ఢీకొట్టారు
-
కండిషన్ క్రిటికల్ చివరి ప్రయత్నాలు
-
ప్రియాంక పరిస్థితిపై తండ్రి కన్నీటి వేదన
హైదరాబాద్: ఇద్దరు వ్యక్తులు ఉన్మాదానికి తన కూతురు ప్రియాంక జీవచ్ఛవంలా మారడంపై తండ్రి వెంకటేష్ కన్నీటి పర్యంతమవుతున్నారు. తమ కూతురు ఇప్పటికూడా బ్రతికే హోప్స్ లేవని డాక్టర్స్ చెబుతున్నా, చేసే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. బ్రెయిన్ పూర్తిగా డెడ్ అయిపోయిందని, శరీరం వైద్యానికి సహకరించడం లేదన్నారు. సాక్షి టీవీతో మాట్లాడిన ఆయన.. తమ కూతురి పరిస్థితికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని, ఆ నిందితులను కొట్టి చంపాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘మా కూతురు ఇప్పటి కూడా బ్రతికే హోప్స్ లేవని చెప్తున్నారు డాక్టర్స్. బ్రెయిన్ పూర్తిగా డెడ్ అయిపోయింది. అప్నియా పరీక్ష చేస్తామని చెప్పారు వైద్యులు. పాప సోడియం టెస్ట్ లెవెల్స్ డౌన్ ఉన్నాయి. బాడీ వైద్యానికి సహకరించడం లేదు. మేము అప్నియా పరీక్ష చేయమని చెప్పాముఅప్పుడు సోడియం లెవెల్స్ కరెక్ట్‌గా వస్తే వైద్యానికి శరీరం సహకరిస్తుంది. పాప బ్రతికి రావాలని ప్రయత్నం చేస్తున్నాం. పాప అవయదానంపై మేము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అవయవ దాన విషయంలో ఎవరు సంప్రదించలేదు. నా సతీమణి ఆరోగ్య పరిస్థితి బాగాలేదు ఆమెను ఐసీయూలో అడ్మిట్ చేశారు. ఏపీ ప్రభుత్వం స్పందించాలి. నిందితులను అతి కఠినంగా శిక్షించాలి. నడిరోడ్డుపై నిందితులను కొట్టి చంపాలి. సినిమా థియేటర్లో ఇద్దరు నిందితులు తాగి ఉన్నారు. థియేటర్ మేనేజ్మెంట్ వాళ్లతో గొడవ పెట్టుకున్నారు. అదే కోపంతో రాష్‌గా బయటికి వచ్చారు. మా కూతురు ఉమేష్ ఇద్దరు లోనికి వస్తున్న సమయంలో కారుతో ఢీకొట్టారు. కూతురు తలపై కారు ఎక్కించి ఎస్కేప్ అయ్యారు. కొంచెం కూడా సోయలేదా. పాప పరిస్థితి చూసి రాజమండ్రి నుంచి హైదరాబాద్ కిమ్స్‌కు తరలించాం. వైద్యులు అప్పుడే హోప్స్ లేవని చెప్పారు. మా అమ్మాయిని బ్రతికించండి అని ప్రాధేయ పడ్డాను. కిమ్స్ వైద్యులు స్పందించారు’ అని తెలిపారు. -
నా కూతురి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే... షాకింగ్ కామెంట్స్
-
డాక్టర్ ప్రియాంక కేసులో నిందితులకు రిమాండ్
-
పాపం! డాక్టర్ ప్రియాంక.. ఇంత దారుణమా?
ఇద్దరు వ్యక్తుల ఉన్మాదానికి యువ డాక్టర్ జీవచ్ఛవంలా మారింది. ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం ఊరి కాని ఊరికి వచ్చిన ఆ యువతి ఇప్పుడు మృత్యువు ముంగిట నిలిచింది. మద్యం మత్తులో విచక్షణ మరిచిపోయి కండకావరంతో కారుతో తొక్కించి కిరాతకంగా వ్యవహరించిన దుర్మార్గులపై కఠినంగా వ్యవహరించడంలో పోలీసులు విఫలమయ్యారన్న ఆరోపణలు మిన్నంటుతున్నాయి.రాజమహేంద్రవరం (తూర్పుగోదావరి జిల్లా): వైద్య విద్యార్థిని కనికే ప్రియాంక(28) బ్రెయిన్ డెడ్ పాలైన కేసులో నిందితులను కాపాడే ప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఘటన జరిగిన మూడు రోజుల వరకు పోలీసులు కేసును గుంభనంగా ఉంచారన్న దానిపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో పోలీసులు ఎందుకు తాత్సారం ప్రదర్శించారో తెలపాలని ప్రశ్నించారు. పోలీసులపై ఎవరి ఒత్తిడి ఉందని నిలదీస్తున్నారు. ప్రియాంక ప్రమాదానికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.ప్రియాంకకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ మోరంపూడి జంక్షన్ వద్ద శనివారం నిర్వహించిన ధర్నాలో మార్గాని భరత్ పాల్గొన్నారు. 'జస్టిస్ ఫర్ డాక్టర్ ప్రియాంక' ప్లకార్లు ప్రదర్శిస్తూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా మార్గాని భరత్ మాట్లాడుతూ.. ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. ప్రియాంకకు జరిగిన అన్యాయంపై తాము పోరాడుతున్నామని, న్యాయం జరిగే వరకు పోరాడేందుకు జనమంతా కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.''డాక్టర్ ప్రియాంకను కారుతో మూడు సార్లు ఢీకొట్టడం అత్యంత దారుణం. ఆగస్టు 3న ఘటన జరిగితే మూడు రోజుల తర్వాత నిందితులను అరెస్ట్ చేసినట్టు చూపించారు. ఘటన జరిగిన రోజు రాత్రే నిందితులు పోలీసుల కస్టడీలో ఉన్నారు కానీ, అధికారికంగా వారి అరెస్ట్ గురించి వెల్లడించలేదు. ఏదో కుట్ర జరిగిందని మాకు అనుమానంగా ఉంది. మాకున్న సమాచారం ప్రకారం.. యాక్సిడెంట్ కేసుగా చూపించి, నిందితులకు స్టేషన్ బెయిల్ ఇవ్వాలని చూశారు. పోలీసులపై ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిడి ఉందని అర్థమవుతోంది. డాక్టర్ ప్రియాంక కేసు గురించి పోస్టులు పెట్టొద్దని సోషల్ మీడియా ఇన్ప్లుయెన్సర్లు అందరినీ బెదిరించారు. ప్రజాస్వామాన్ని కూటమి ప్రభుత్వం ఖానీ చేస్తోంది. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తామని నారా లోకేశ్ చెప్పారు, ఇప్పుడు రాజమండ్రిలో అదే జరుగుతోంది. ఒక డాక్టర్‌ను కారుతో తొక్కించిన ఘటనలో నిందితులను పోలీసులు, ప్రభుత్వం కాపాడటానికి ప్రయత్నించడం దారుణం. నిందితులపై ముందే ఎందుకు హత్యాయత్నం కేసు పెట్టలేదు? 3 రోజుల పాటు నిందితులను ఎందుకు దాచారు? ప్రియాంకకు జరిగిన అన్యాయంపైనా సీబీఐతో దర్యాప్తు చేయించాలి. యాక్సిడెంట్ చేసిన తర్వాత నిందితులు ఎవరెవరికి ఫోన్ చేశారనే కాల్ డేటా బయటపెట్టాలి. ఈ కేసులో నిజానిజాలు వెల్లడి కావాలంటే ప్రజలు బయటకు వచ్చి పోరాడాలి. నిందితులను ఎవరు కాపాడుతున్నారు, ఎందుకు కాపాడుతున్నారు, ఎన్ని సూటుకేసులు ఎన్ని చేతులు మారాయి.. ఇవన్ని బయటకు రావాలి. డాక్టర్ ప్రియాంకకు న్యాయం జరగాల''ని మార్గాని భరత్ అన్నారు.ఈనెల 21 వరకు నిందితులకు రిమాండ్ డాక్టర్ ప్రియాంక బ్రెయిన్ డెడ్‌కు కారణమైన కేసులో నిందితులు సూరారపు ధస్వంత్, ఆండ్రు జోసఫ్లకు కోర్టు ఈ నెల 21 వరకు రిమాండ్ విధించింది. వీరిద్దరూ మద్యం మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. కాగా, హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో ప్రియాంకకు చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. -
డాక్టర్ ప్రియాంక పరిస్థితి విషమం
-
విద్యార్థిని ఘటనపై జక్కంపూడి రాజా ఏమన్నారంటే?
-
తాగుబోతుల అరాచకం.. మూడు సార్లు
-
వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మద్యం తాగిన ఇద్దరు యువకులు కారుతో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి ఐదురోజులుగా మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని కనికే ప్రియాంక (28) శుక్రవారం మృతిచెందింది. ఈ నెల 3న ప్రియాంక స్నేహితుడితో కలిసి ప్రసాదిత్య మాల్లో సినిమాకి వెళ్లి బైక్‌పై బయటకు వస్తుండగా.. మద్యం తాగిన ఇద్దరు యువకులు తమ కారుతో ఆ బైక్‌ను మూడుసార్లు ఢీకొట్టి వేగంగా వెళ్లిపోయారు. ఈ ఘటనలో ప్రియాంక తలకు తీవ్రగాయాలయ్యాయి. తొలుత స్థానికంగా ఉన్న స్వతంత్ర ఆస్పత్రిలో చేర్చిన ఆమెను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ఆమె బ్రెయిన్‌డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. కుటుంబసభ్యులు ఆమె అవయవాలను దానం చేశారు. ఎంబీబీఎస్‌లో మెరిట్ స్టూడెంట్ కర్నూలు నుంచి తెలంగాణలోని గద్వాల్ జిల్లా ఎక్లాస్‌పురానికి వలస వెళ్లిన రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటేష్‌కు ముగ్గురు కుమార్తెలు. వారిలో రెండో కుమార్తె ప్రియాంక. కర్నూలులోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తిచేసిన ఆమె మెరిట్ స్టూడెంట్‌గా ప్రతిభ కనబర్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 18న రాజమహేంద్రవరంలోని జీఎస్ఎల్ మెడికల్ కళాశాలలో పీజీ డెర్మటాలజీలో చేరింది. ప్రియాంక మృతి వార్తతో ఎక్లాస్పురంలో విషాదం నెలకొంది. ఆమె మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి శుక్రవారం రాత్రి ఎక్లాస్‌పురానికి తీసుకెళ్లి, శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నిందితులకు 14 రోజుల రిమాండ్ వైద్య విద్యార్థిని వెళుతున్న బైక్‌ను కారుతో ఢీకొట్టి ఆమె మృతికి కారకులైన సూరారపు ధస్వంత్, ఆండ్రు జోసెఫ్‌లను పోలీసులు అరెస్టుచేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో వారిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. వీరిలో సూరారపు ధస్వంత్ సున్నపుబట్టీల వ్యాపారికాగా ఆండ్రు జోసెఫ్ ట్రాన్స్‌పోర్టు వ్యాపారం చేస్తున్నారు.వారిద్దరు ఘటన జరిగిన రోజు సాయంత్రం 5 గంటలకు ఏవీ అప్పారావు రోడ్డులోని స్కాచ్ బ్యారెల్ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేసి కారులో కూర్చుని కొంతసేపు తాగారు. తర్వాత మరో ప్రాంతంలో కూర్చుని తాగి, అనంతరం ప్రసాదిత్య మాల్‌కు వెళ్లారు. మద్యం మత్తులో ఉన్న ఇద్దరూ కారుని అతివేగంగా లోపలికి పోనివ్వడం, మాల్ సిబ్బంది వారిని అడ్డుకోవడం, వారు అదే వేగంతో బయటకు వెళుతూ ప్రియాంక కూర్చున్న బైక్‌ను మూడుసార్లు ఢీకొట్టిన విషయం తెలిసిందే. -
మెడికో ప్రియాంక కేసులో నిందితులకు రిమాండ్
-
ప్రియాంక కేసులో సంచలనం.. 3 కారుతో గుద్ది గుద్ది
-
రాజమండ్రి డాక్టర్ ప్రియాంక ఘటనపై ఫ్రెండ్స్ సంచలన నిజాలు..!
-
మెడికో ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం
సాక్షి, హైదరాబాద్: మెడికో ప్రియాంక పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. నాలుగు రోజుల క్రితం రాజమండ్రిలో కారు ప్రమాదంలో ప్రియాంక గాయపడిన సంగతి తెలిసిందే. మద్యం మత్తులో ప్రియాంక బైక్‌ను యువకులు కారుతో ఢీకొట్టారు. ప్రియాంకపై నుంచి కారు దూసుకెళ్లడంతో బ్రెయిన్ డెడ్ అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వైద్య విద్యార్థిని ప్రియాంక ప్రమాద ఘటన సంచలనం రేపింది.ఘటనకు సంబంధించి లభ్యమైన సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తే ఇది ప్రమాదం కాదని.. ఉద్దేశపూర్వకంగా చేసినదేనని స్పష్టమవుతోంది. ప్రమాదానికి కారణమైన యువకులు సూరారపు ధస్వంత్, ఆండ్రు జోసెఫ్ ఈ నెల మూడో తేదీ రాత్రి రాజమహేంద్రవరంలోని ఏవీ అప్పారావు రోడ్డులో ఉన్న ప్రసాద్ ఆదిత్యమాల్కు సినిమా చూసేందుకు కారులో వచ్చారు. వారు మద్యం మత్తులో ఉన్నట్టు అనుమానించిన మాల్ సిబ్బంది బ్రీత్ ఎనలైజర్‌తో పరిశీలించగా, ఆ యువకులు వారిపై దురుసుగా ప్రవర్తించారు.మద్యం తాగినట్టు నిర్ధారణ కావడంతో వారిని థియేటర్ లోపలికి అనుమతించలేదు. దీంతో ఆ యువకులు బయటకు వెళ్లే క్రమంలో నియంత్రణ లేకుండా కారును నడిపినట్టు సీసీ టీవీ ఫుటేజీల్లో నిర్ధారణ అయ్యింది. వారి కారు ఆదిత్య మాల్ గేటు దాటుతున్న సమయంలోనే... వైద్య విద్యార్థిని ప్రియాంక, ఆమె స్నేహితుడు మల్లి వెంకటదుర్గసాయి కూడా బైక్‌పై మాల్ గేటు దాటుతున్నారు. ఈ క్రమంలో యువకుల కారు వారి బైక్‌ని ఢీకొట్టింది. ప్రియాంక వారి వైపు కోపంగా చూడటంతో మరోసారి కారుతో వారి బైక్‌ను ఢీకొట్టారు. అలా మూడుసార్లు వెంటవెంటనే బైక్‌ని ఢీకొట్టారు. దీంతో బైక్ పైనుంచి ప్రియాంక కింద పడిపోయింది.ఇది చూసిన మాల్ సిబ్బంది కేకలు వేయడంతో యువకులు కారును వేగంగా దూసుకువెళ్లారు. ఈ క్రమంలో కిందపడిన ప్రియాంక తల పైనుంచి కారు ఎక్కి వెళ్లడం సీసీ టీవీ ఫుటేజీలో కనిపించింది. ప్రియాంకను ఆమె స్నేహితుడు, థియేటర్ సిబ్బంది హుటాహుటిన కంబాలచెరువులోని స్వతంత్ర ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి అత్యంత విషమించడంతో అక్కడి నుంచి ఆమెను హైదరాబాద్‌కు తరలించారు. అక్కడి కిమ్స్ ఆస్పత్రి వైద్యులు ఆమెకు బ్రెయిన్ డెడ్ అయిందని, మృత్యువుతో పోరాడుతోందని వెల్లడించడం ఆందోళన కలిగిస్తోంది.ప్రమాద ఘటనపై థియేటర్ మేనేజర్ విజయ్ ఫిర్యాదు మేరకు ఒక కేసు, ప్రియాంక తండ్రి కనికే వెంకటేష్ ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదయ్యాయి. సీసీ టీవీ ఫుటేజీల్లో నమోదైన కారు నంబర్ ఆధారంగా యువకులను పోలీసులు గుర్తించారు. వారిద్దరూ చింతల నామవరానికి చెందినవారుగా గుర్తించి అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. అయినా ప్రకాశ్‌నగర్ పోలీసులు మాత్రం ఇది మద్యం మత్తులో జరిగిన ప్రమాదమేనని, ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని హడావిడిగా ప్రకటించ డం పలు అనుమానాలకు తావిస్తోంది. -
ప్రమాదం కాదు.. ఉద్దేశపూర్వకంగానే..!
కంబాలచెరువు (రాజమహేంద్రవరం)/ సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వైద్య విద్యార్థిని ప్రియాంక ప్రమాద ఘటనకు సంబంధించి లభ్యమైన సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తే ఇది ప్రమాదం కాదని, ఉద్దేశపూర్వకంగా చేసినదేనని స్పష్టమవుతోంది. ప్రమాదానికి కారణమైన యువకులు సూరారపు ధస్వంత్, ఆండ్రు జోసెఫ్ ఈ నెల మూడో తేదీ రాత్రి రాజమహేంద్రవరంలోని ఏవీ అప్పారావు రోడ్డులో ఉన్న ప్రసాద్ ఆదిత్యమాల్కు సినిమా చూసేందుకు కారులో వచ్చారు. వారు మద్యం మత్తులో ఉన్నట్టు అనుమానించిన మాల్ సిబ్బంది బ్రీత్ ఎనలైజర్‌తో పరిశీలించగా, ఆ యువకులు వారిపై దురుసుగా ప్రవర్తించారు. మద్యం తాగినట్టు నిర్ధారణ కావడంతో వారిని థియేటర్ లోపలికి అనుమతించలేదు. దీంతో ఆ యువకులు బయటకు వెళ్లే క్రమంలో నియంత్రణ లేకుండా కారును నడిపినట్టు సీసీ టీవీ ఫుటేజీల్లో నిర్ధారణ అయ్యింది. వారి కారు ఆదిత్య మాల్ గేటు దాటుతున్న సమయంలోనే... వైద్య విద్యార్థిని ప్రియాంక, ఆమె స్నేహితుడు మల్లి వెంకటదుర్గసాయి కూడా బైక్‌పై మాల్ గేటు దాటుతున్నారు. ఈ క్రమంలో యువకుల కారు వారి బైక్‌ని ఢీకొట్టింది. ప్రియాంక వారి వైపు కోపంగా చూడటంతో మరోసారి కారుతో వారి బైక్‌ను ఢీకొట్టారు. అలా మూడుసార్లు వెంటవెంటనే బైక్‌ని ఢీకొట్టారు. దీంతో బైక్ పైనుంచి ప్రియాంక కింద పడిపోయింది. ఇది చూసిన మాల్ సిబ్బంది కేకలు వేయడంతో యువకులు కారును వేగంగా దూసుకువెళ్లారు. ఈ క్రమంలో కిందపడిన ప్రియాంక తల పైనుంచి కారు ఎక్కి వెళ్లడం సీసీ టీవీ ఫుటేజీలో కనిపించింది. ప్రియాంకను ఆమె స్నేహితుడు, థియేటర్ సిబ్బంది హుటాహుటిన కంబాలచెరువులోని స్వతంత్ర ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి అత్యంత విషమించడంతో అక్కడి నుంచి ఆమెను హైదరాబాద్‌కు తరలించారు. అక్కడి కిమ్స్ ఆస్పత్రి వైద్యులు ఆమెకు బ్రెయిన్ డెడ్ అయిందని, మృత్యువుతో పోరాడుతోందని వెల్లడించడం ఆందోళన కలిగిస్తోంది.విచారణ చేపట్టాలి: రాజమహేంద్రవరం వైద్య విద్యారి్థని ప్రియాంక ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (ఏపీ జుడా) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఘటనపై సమగ్ర, పారదర్శక, నిష్పాక్షిక విచారణ జరిపించాలని గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది.సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా యువకుల గుర్తింపుప్రమాద ఘటనపై థియేటర్ మేనేజర్ విజయ్ ఫిర్యాదు మేరకు ఒక కేసు, ప్రియాంక తండ్రి కనికే వెంకటేష్ ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదయ్యాయి. సీసీ టీవీ ఫుటేజీల్లో నమోదైన కారు నంబర్ ఆధారంగా యువకులను పోలీసులు గుర్తించారు. వారిద్దరూ చింతల నామవరానికి చెందినవారుగా గుర్తించి అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. అయినా ప్రకాశ్‌నగర్ పోలీసులు మాత్రం ఇది మద్యం మత్తులో జరిగిన ప్రమాదమేనని, ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని హడావిడిగా ప్రకటించడం పలు అనుమానాలకు తావిస్తోంది. -
లావుగా ఉన్నావని భార్యను కడతేర్చిన భర్త
కర్ణాటక: చిన్న కారణంతో ఓ భర్త తన భార్య గొంతు నులిమి హత్య చేసి ఘటన ధార్వాడ జిల్లాలోని నవలగుంద తాలూకా ఉణసి గ్రామంలో చోటు చేసుంది. ప్రియాంక (29) హత్యకు గురైన మహిళ. భర్త బసవరాజ్ వడ్డర్(32) నిందితుడు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు.. 2024లో ప్రియాంక, బసవరాజ్‌లకు పెళ్లయింది. పెళ్లైన నెల రోజుల నుంచి భర్త బసవరాజు సోదరుడు సిద్దరామేష్ తల్లిదండ్రులు సుభాష్, వేణవ్వ పుట్టింటి నుంచి బంగారం తీసుకురావాలని తమ కుమార్తెను వేధించారు. అంతేగాక నువ్వు చాలా లావుగా ఉన్నావు. భర్త వయస్సు కన్నా నీ వయస్సే పెద్దది. ఇలా అయితే గర్భిణివి కాలేవని మానసికంగా, శారీరకంగా హింసించారు. అంతేగాక ప్రియాంకపై అనుమానం పెట్టుకొని భర్త బసవరాజ్ తరచు ఘర్షణ పడుతూ ఆమె గొంతు నులిమి చంపాడని మృతురాలి తల్లి లక్ష్మి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మృతురాలి భర్త బసవరాజ్‌తో పాటు నవలగుంద పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. -
ప్రియుడి ఘరానా మోసం.. అప్పటికే కన్నతల్లి ఘాతుకం!
కట్టుకున్న భర్తను, కన్నబిడ్డలను వదిలి ప్రియుడితో కొత్త జీవితం ప్రారంభించాలని భావించిన ఓ మహిళ.. చివరకు ఊహించని రీతిలో జైలు పాలైంది. తన సహజీవనానికి అడ్డుగా ఉందనే అనుమానంతో ఆరేళ్ల చిన్నారిని హత్య చేయడమే కాదు.. ప్రియుడి మాయమాటలకు నమ్మి జీవితాన్నే నాశనం చేసుకుంది. బెంగళూరులో సంచలనం సృష్టించిన ఈ కేసు వివరాల్లోకి వెళ్తే..దావణగెరెకు చెందిన ప్రవీణ్, ప్రియాంక దంపతులకు 2007లో వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రవీణ్ విద్యాసంస్థ నిర్వహిస్తుండగా, ప్రియాంక న్యాయవాదిగా పనిచేస్తున్నారు. 2025 చివర్లో కుటుంబానికి చెందిన 25 ఎకరాల భూమి వివాదానికి సంబంధించిన కేసు పనిమీద బెంగళూరు వెళ్లిన ప్రియాంక.. కాలేజీ రోజుల స్నేహితుడు, ఒకప్పుడు ప్రేమించిన మోహన్‌ను మళ్లీ కలిసింది.తాను రూ.1,000 కోట్ల ఆస్తులున్న రియల్ ఎస్టేట్ వ్యాపారినని మోహన్ నమ్మబలికాడు. అంత ఆస్తి ఉందని చెప్పడంతో ఆమె అతనికి ఆకర్షితురాలైంది. క్రమంగా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. బెంగళూరు నుంచి తిరిగొచ్చిన తర్వాత భర్త ప్రవీణ్‌పై విడాకుల కోసం ఒత్తిడి తెచ్చిన ప్రియాంక.. చివరకు ఇంటిని విడిచి వెళ్లిపోయింది.విడిపోయిన తర్వాత పెద్ద కుమార్తె తండ్రి వద్ద ఉండగా, చిన్నారి వెన్నెల మాత్రం ప్రియాంకతో కలిసి బెంగళూరులోని సీగేహళ్లిలో అద్దె విల్లాలో నివసిస్తోంది. ఈ క్రమంలో మార్చి 24న వెన్నెల పుట్టినరోజు వేడుకలు జరిపిన ప్రియాంక.. బిర్యానీ, ఐస్‌క్రీం తినిపించిన తర్వాత చిన్నారిని కారులోనే వదిలేసి ప్రియుడు మోహన్‌తో కలిసి కాఫీ షాప్‌కు వెళ్లినట్లు చెప్పింది. మరుసటి రోజు వెన్నెల నిద్రలేవకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.అనారోగ్యంతో చిన్నారి మరణించిందని కుటుంబ సభ్యులకు చెప్పి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే బిడ్డ మృతిపై అనుమానంతో ప్రవీణ్ పోస్ట్‌మార్టం నివేదికను పరిశీలించాడు. ఆ నివేదికను విదేశాల్లో పనిచేస్తున్న తన డాక్టర్ సోదరికి చూపించగా, అందులో అనేక లోపాలు ఉన్నాయని ఆమె గుర్తించింది. దీంతో ప్రవీణ్ పోలీసులను ఆశ్రయించాడు.దర్యాప్తులో వెన్నెలది సహజ మరణం కాదని, గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. తమ భవిష్యత్తుకు చిన్నారి అడ్డుగా మారిందనే కారణంతో ప్రియాంక, మోహన్ కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. చిన్నారి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు మోహన్‌ను అరెస్టు చేశారు. అయితే అప్పటి నుంచి పరారీలో ఉన్న ప్రియాంకను గురువారం హాసన్‌లో అదుపులోకి తీసుకుని బెంగళూరుకు తరలించారు.కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ప్రియాంక, మోహన్‌లు కాశీలో రహస్యంగా వివాహం చేసుకున్నారట. ఆ తర్వాత దుబాయ్‌లో నూతన సంవత్సర వేడుకలు కూడా జరుపుకున్నారని తెలుస్తోంది. వెన్నెల కేసు దర్యాప్తులో మరో షాకింగ్ విషయం బయటపడింది. తాను కోటీశ్వరుడినని చెప్పిన మోహన్ వాస్తవానికి పెద్ద వ్యాపారి కాదని, అద్దె ఇళ్ల బ్రోకర్‌గా పనిచేస్తున్నాడని తేలింది. అతని మాటలు నమ్మి కుటుంబాన్ని వదిలేసిన ప్రియాంక.. చివరకు కన్నకూతురి హత్య కేసులో నిందితురాలిగా కటకటాల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. -
బిర్యానీ గొడవ.. దంపతుల ఆత్మహత్య
విశాఖపట్నం: రామాటాకీస్ వెనుక వైపున గల శ్రీనగర్‌లో నివాసముంటున్న దంపతులు బలరాం (33), ప్రియాంక (27) ఆదివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ద్వారకా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా కళింగపటా్ననికి చెందిన వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకుని, బతుకుతెరువు కోసం విశాఖ వచ్చి స్థిరపడ్డారు. వెల్డింగ్ పనులు చేసే బలరాం మద్యానికి బానిసై తరచూ భార్యను వేధిస్తుండటంతో ప్రియాంక గతంలో పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో బలరాం బిర్యానీ కావాలని పట్టుబట్టడంతో ప్రియాంక తల్లి బయటకు వెళ్లగా, ఆమె తిరిగి వచ్చేసరికి దంపతులిద్దరూ ఇంట్లో విగతజీవులుగా పడి ఉన్నారు. సమాచారం అందుకున్న నైట్ రౌండ్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. అయితే బలరామే భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్నాడా, లేక ప్రియాంక బలవన్మరణానికి పాల్పడటంతో భయపడి బలరాం ఆత్మహత్యకు ఒడిగట్టాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కళ్లెదుటే తల్లిదండ్రులు ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడడంతో వారి నాలుగేళ్ల కుమారుడు అనాథగా మిగిలిపోయాడంటూ ప్రియాంక తల్లి రోదించడం స్థానికులను కలచివేసింది. -
చెల్లి మాటే నెగ్గింది.. కేరళలో చక్రం తిప్పిన ప్రియాంక
-
ఆంటీతో యువకుడి వివాహేతర సంబంధం..!
బనశంకరి(బెంగళూరు): సహజీవన బంధాలు ఎక్కువగా విషాదంతోనే ముగుస్తున్నాయి. అలాంటి ఉదంతమే ఇది. మహిళతో కలిసి జీవిస్తున్న యువకుడు ఉరివేసుకున్న రీతిలో శవమయ్యాడు, బెంగళూరు రాజగోపాలనగర పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. వివరాలు.. చిత్రదుర్గకు చెందిన తిప్పేస్వామి(28), దావణగెరె (35) మహిళ ఒకే గార్మెంట్స్‌లో పనిచేస్తూ ఇన్‌స్టా ద్వారా పరిచయమై ప్రేమలో పడ్డారు. మహిళకు వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. భర్త , పిల్లలను వదిలిపెట్టి తిప్పేస్వామితో వచ్చేసింది. రెండునెలల క్రితం బెంగళూరు శ్రీగంధనగరలో బాడుగ ఇల్లు తీసుకుని భార్యాభర్తలం అని చెప్పి జీవిస్తున్నారు. కొంతకాలంగా మహిళ గొంతెమ్మ కోర్కెలతో తిప్పేస్వామిని ఇబ్బంది పెడుతోంది. దీంతో విరక్తి చెందిన అతడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మహిళ పరారైంది. యువకుని సంబంధీకుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు ఆ మహిళపై కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. -
ఇంధన కొరత సృష్టిస్తే కఠిన చర్యలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో చమురు అక్రమ, కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని హైదరాబాద్ కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల హెచ్చరించారు. పెట్రోల్, డీజిల్ కొరత రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ లభ్యత, నిల్వలు, సరఫరా పరిస్థితులపై ఏజెన్సీ నిర్వాహకులు, డి్రస్టిబ్యూటర్లతో సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ.. నీటి సరఫరా, ప్రభుత్వ వాహనాలు, అంబులెన్సులు, ఫైరింజిన్లకు ఇంధన కొరత లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్యాస్ సిలిండర్ల సరఫరా విషయంలో బుకింగ్, రీఫిల్లింగ్ నిబంధనలను కచి్చతంగా అమలు చేయాలని ఆదేశించారు. ఒకే సిలిండర్ కలిగిన కుటుంబాలకు ప్రాధాన్యమివ్వాలన్నారు. పౌరులు వదంతులను నమ్మవద్దని, అధికారిక సమాచారాన్ని మాత్రమే ఆధారంగా తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ రాజిరెడ్డి, జిల్లా సివిల్ సప్లై అధికారి శ్రీనివాస్, సంక్షేమ అధికారులు జి.ఆశన్న, ప్రవీణ్ కుమార్, ఇలియాస్ అహ్మద్, ఆర్టీఓ పురుషోత్తమ రెడ్డి తదితరులు పాల్గొన్నారు -
ఇటు బాధ్యతలు స్వీకరించి.. అటు సీఎంను కలిసి..
హైదరాబాద్ నూతన కలెక్టర్‌గా ప్రియాంక అల ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు. విద్య, వైద్యానికి ప్రాధాన్యం: కలెక్టర్కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రియాంక అల మాట్లాడుతూ.. నగరంలో విద్య, వైద్య రంగాలకు తొలి ప్రాధాన్యమివ్వనున్నట్లు తెలిపారు. బస్తీ దవాఖానాలను బలోపేతం చేసి పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. పాఠశాల విద్య బలోపేతంతో ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రయతి్నస్తానన్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హుల దరిచేరేలా కృషి చేస్తానన్నారు. కలెక్టరేట్ పరిధిలో పనిచేసే అధికారులు, ఉద్యోగులు సమయపాలన పాటించి తమ విభాగాలో పెండింగ్ పైళ్లు లేకుండా చూసుకునే విధంగా చర్యలు చేపడతానని పేర్కొన్నారు కలెక్టరేట్, సీఎం ప్రజావాణితోపాటు ప్రస్తుతం జిల్లాలో నిర్వహిస్తున్న వాట్సాప్ గ్రీవెన్స్ సెల్ ద్వారా వస్తున్న దరఖాస్తులను పెండింగ్‌లో లేకుండా చూస్తానని ప్రియాంక అల స్పష్టంచేశారు. View this post on Instagram A post shared by Priyanka Ala (@priyankaala__ias) -
ఒంటరితనం తట్టుకోలేక..
తిరుపతి క్రైమ్ : స్థానిక తిమ్మినాయుడుపాళెంలో నివసిస్తున్న ప్రియాంక (30) అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.వివరాల ప్రకారం.. ప్రియాంక ఇరిగేషన్ శాఖలో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తోంది. తల్లిదండ్రులు గతంలో మృతి చెందడంతో కొంతకాలంగా ఆమె ఒంటరిగా నివసిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఇటీవల ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు స్థానికులు వెల్లడిస్తున్నారు. అయితే ఆ ప్రేమ వ్యవహారం విఫలమైన నేపథ్యంలోనే ఈ ఘోర నిర్ణయం తీసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.శనివారం రాత్రి ఆమె తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న అలిపిరి పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఫారిన్ ట్రిప్‌లో 'ఓజీ' బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)
-
పీఎం అభ్యర్థిగా ప్రియాంక..?
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంపై చర్చ జరుగుతుంది. ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన పలు ఎన్నికలలో ఆ పార్టీ పెద్దగా ప్రభావం చుపకపోవడంతో నాయకత్వ మార్పు జరగాలంటూ ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు సూచిస్తున్నారు. అయితే పార్టీ అధ్యక్ష బాధ్యతల అంశంపై రాహుల్, ప్రియాంకలో మధ్య వారసత్వ పోరు నడుస్తోందని బీజేపీతో పాటు ఇతర పార్టీలు ఆరోపిస్తున్నాయి. తాజాగా ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలంతా మాజీ ప్రధాని ఇందిరా గాంధీని, ప్రియాంకలో చూస్తున్నారని తెలిపారు.కాంగ్రెస్ పార్టీలో ఇటీవల వారసత్వ పోరు మరోసారి చర్చనీయాంశం అవుతోంది. ఇటీవల ఆపార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు ప్రియాంక గాంధీకి పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని ఏకంగా సోనియా గాంధీకే లేఖ రాశారు. ఇక కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ అయితే తనను ప్రధాని చేస్తే పాకిస్థాన్ భరతం పడుతుందని ఆమె ఇందిరా గాంధీ మనవరాలని తనపై ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో అధికార బీజేపీ ఈవ్యాఖ్యలపై కౌంటర్ స్టార్ట్ చేసింది. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీపై నమ్మకం కోల్పోయారని వ్యాఖ్యలు చేసింది. అయితే ప్రస్తుతం ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా తన గురించి మాట్లాడారు.రాబర్ట్ వాద్రా మాట్లాడుతూ "ప్రియాంకా చాలా కష్టపడుతుంది. ఆమె తన నానమ్మ ఇందిరాగాంధీ నుంచి చాలా విషయాలు నేర్చుకుంది. ప్రజల సమస్యలపై ఆమె నిరంతరం పోరాడుతుంది. ఆమెకు చాలా భవిష్యత్తు ఉంది. ప్రజలంతా తనలో ఇందిరా గాంధీని చూస్తున్నారు.కాంగ్రెస్ ఎంపీలు సైతం ఆమెను ప్రధానమంత్రిగా ఆమెదిస్తున్నారు". అని రాబర్ట్ వాద్రా అన్నారు.అదే సమయంలో "రాహుల్ గాంధీ కూడా చాలా కష్టపడుతున్నారు. వారి రక్తంలోనే రాజకీయాలు ఉన్నాయి. దేశం కోసం వారి ప్రియమైన వ్యక్తులను కోల్పోయారు" అని రాబర్డ్ వాద్రా తెలిపారు. అయితే తనను కూడా ప్రజలు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారని అయితే బీజేపీ నెపోటిజమ్ పేరుతో రాజకీయం చేస్తుందన్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆ సమయంలో తనపై ఈడీ రైడ్ జరుగుతుందన్నారు.అయితే తన పొలిటికల్ ఎంట్రీ అంశం భవిష్యత్తులో ఆలోచిస్తానని తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేక ఇబ్బందుల్లో ఉన్న హస్తం పార్టీకి ఇప్పుడు ఈ నేతల వ్యాఖ్యలు కొత్త తలనొప్పులు తెచ్చేలా ఉన్నాయి. -
ప్రియాంక గాంధీపై పార్టీ నేత సంచలన లేఖ
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిపై ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పార్టీ నాయకత్వం సరిగ్గా లేదని ఆ పార్టీ అగ్రనేత సోనియాగాంధీకి లేఖ రాశారు. త్వరలోనే నాయకత్వ బాధ్యతలు ప్రియాంక గాంధీకి అప్పగించాలన్నారు. అందుకోసం యావద్దేశం ఎదురుచూస్తుందని తెలిపారు. ఈ లేఖతో అధికార బీజేపీ కౌంటర్ స్టార్ట్ చేసింది. కాంగ్రెస్‌లో మరోసారి గ్రూప్ వార్ నడుస్తోందని శుక్రవారం కామెంట్ చేసింది. కాంగ్రెస్‌కు ప్రస్తుతం దేశవ్యాప్తంగా గడ్డుకాలం నడుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు పరాజయం పాలవడంతో పాటు పలు రాష్ట్రాల్లో ఆపార్టీ ఘోర పరాజయం మూటగట్టుకుంది. దీంతో ఆ పార్టీ నాయకత్వంపై బహిరంగంగానే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. 16 రోజుల పాటు యాత్ర నిర్వహించారు. ఆయన అక్కడ ఇండియా కూటమికి చుక్కెదురైంది. కాంగ్రెస్ పార్టీ 63 స్థానాల్లో పోటీ చేసి కేవలం 6స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. దీంతో పార్టీ భవిష్యత్తుపై మరోసారి చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఒరిస్సాకు చెందిన బరాబతి-కటక్ నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ మెుఖ్యుం సోనియాగాంధీకి లేఖ రాశారు. మాజీ ఎమ్మెల్యే లేఖలో "ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి జాతీయ స్థాయితో పాటు రాష్ట్రాలలో ఆశాజనకంగా లేదు. కేంద్రంలో మనం మూడు సార్లు వరుసగా పరాజయం పాలయ్యాము. ఈ పరిస్థితి పార్టీనే దైవంగా కొలిచే మాలాంటి కార్యకర్తలకు మింగుడు పడడం లేదు. బిహార్, ఢిల్లీ, మహారాష్ట్ర, కశ్మీర్‌లతో పాటు ఇతర ప్రాంతాల్లో ఓడిపోవడానికి పార్టీ అంతర్గత సంక్షోభాలు కారణమన్నారు. భారత్‌లో ప్రస్తుతం 35 సంవత్సరాలలోపు జనాభా గలవారు దాదాపు 65శాతం మంది ఉన్నారు. భవిష్యత్తు మెుత్తం యువత చేతుల్లోనే ఉంటుంది. కనుక ప్రస్తుత జాతీయ అధ్యక్షుడిగా ఉన్న మల్లికార్జున్ ఖర్గే గారి (83) వయస్సు రీత్యా వారి ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోలేరు. కనుక ప్రస్తుత పరిస్థితుల్లో ఎంపీ ప్రియాంక గాంధీ చేతికి పార్టీ బాధ్యతలు అప్పగించాలి. దేశ యుువత వారి నాయకత్వం కోసం వేచిచూస్తుంది". అని లేఖలో ఆయన పేర్కొన్నారు. పార్టీలో సరైన నాయకత్వం లేకే జ్యోతిరాధిత్య సిందియా, హిమంత్ బిశ్వాస శర్మ, జైవీర్ శెర్గిల్ లాంటి కీలక నాయకులు కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారని తెలిపారు. ప్రస్తుతం ఒడిస్సాతో పాటు దేశవ్యాప్తంగా పార్టీ పరిస్థితి ఏమి బాగాలేదని ఇప్పటికైనా మేల్కోని తగిన చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్‌కు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశముందని పేర్కొన్నారు. అయితే ఈ లేఖపై బీజేపీ పార్టీ అటాక్ స్టార్ట్ చేసింది. కాంగ్రెస్‌లో అంతర్గతంగా రాహుల్ గాంధీ గ్రూప్, ప్రియాంక గాంధీ గ్రూప్ వార్ నడుస్తోందని తెలిపింది. అవి ఇప్పుడు బహిర్గతమయ్యాయని బీజేపీ కామెంట్ చేసింది. -
'వారణాసి' ఫేమ్ ప్రియాంక చోప్రా స్టన్నింగ్ లుక్ (ఫొటోలు)
-
హైదరాబాద్ లోని చందానగర్ లో మిరాయ్ హీరోయిన్ రితికా నాయక్, ప్రియాంక
-
నటి ప్రియాంక మోహన్ ఇష్టపడే ఫ్యాషన్ బ్రాండ్స్ ఇవే..! ఎక్కడికెళ్లినా అది తప్పనిసరి..
ట్రెండ్స్ వెంట పరుగెత్తకుండా, సింపుల్ స్టయిలింగ్తోనే క్లాసీ లుక్ చూపించే నటి ప్రియాంక మోహన్. చీరలైనా, మోడర్న్ డ్రెసుల్లోనైనా తన ఫ్యాషన్ స్టేట్మెంట్ మాత్రం సింపుల్ అండ్ ఎలిగెన్స్గానే ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఎలిగెన్స్నూ చూపిస్తోంది ఈ ఫ్యాషన్ బ్రాండ్స్‌తో..ఫ్యాషన్‌లో ఎప్పుడూ స్థానాన్ని కోల్పోని క్లాసిక్ ఆభరణమే ఈ మల్టీ లేయర్ చోకర్. మగువ మెడను అంటిపెట్టుకొని ఉంటూ అందాన్ని వెంట తీసుకొని వస్తుంది. అందుకే, చోకర్స్పై మోజూ ఎప్పటికీ తరగనిది. సాధారణ చోకర్స్ మాదిరి కాకుండా రెండు నుంచి ఐదు వరుసల వరకు ముత్యాలు, వివిధ పూసలతో తయారుచేసే వీటికి మధ్యలో ఒక డాలర్ తగిలిస్తే వాటి అందం మరింత ఆకట్టుకునేలా మారుతుంది. కాటన్, సిల్క్, ఆర్గంజా చీరలు, లెహంగాలకు డీప్ నెక్ బ్లౌజులతో ధరిస్తే ఎవ్వరికైనా బాగా నప్పుతుంది. అనార్కలీలకు కూడా అద్భుతంగా మ్యాచ్ అవుతుంది ఈ చోకర్. అయితే, ఈ చోకర్ ధరించినప్పుడు మినిమల్ జ్యూలరీతో స్టయిల్ చేసుకోవడం ఉత్తమం. చెవులకు చిన్న స్టడ్స్, సింపుల్ ఉంగరం ధరించాలి. అలాగే హెయిర్ స్టయిల్స్ కూడా సింపుల్ బన్ లేదా వేవీ హెయిర్ స్టయిల్స్ ట్రై చేసి, చోకర్ అందాన్ని హైలెట్ చేసేయొచ్చు. వివాహాది శుభకార్యాలకు, స్పెషల్ డేస్‌కు ఈ టిప్స్‌తో స్టయిలింగ్ చేసి, మినిమలిస్టిక్ గ్రేస్‌ఫుల్ లుక్ సొంతం చేసుకోండి అచ్చం నటి ప్రియాంక మోహన్‌లా. "చర్మం ఎంత నేచురల్‌గా ఉంటే అంత అందంగా కనిపిస్తాం. అందుకే, మినిమల్ మేకప్‌నే ప్రిఫర్ చేస్తా. ఇక ఎక్కడికెళ్లినా సరే, సన్ స్క్రీన్ తప్పనిసరి. అంటోంది". ప్రియాంక మోహన్. (చదవండి: liposuction: సౌందర్య చికిత్సలు ఇంత డేంజరా..? పాపం ఆ మహిళ..) -
తెలంగాణే మార్గదర్శి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో త్వరలో చేపట్టనున్న జనగణనలో కులగణనను చేర్చాలన్న కేంద్ర నిర్ణయం వెనుక కాంగ్రెస్ పార్టీ అద్వితీయ పోరాటం ఉందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) పేర్కొంది. ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ తన భారత్ జోడో పాదయాత్ర సందర్భంగా, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేసి చూపించిందని, దేశానికే మార్గదర్శిగా నిలిచిందని కొనియాడింది. తెలంగాణలో అన్ని వర్గాల నుంచి సమాచారం సేకరించి పారదర్శకంగా నిర్వహించిన కులగణన నమూనానే కేంద్రం అనుసరించాలని తీర్మానించింది. దేశంలోని అణగారిన వర్గాలకు విద్య, ఉపాధి, రాజకీయ అంశాల్లో న్యాయం చేసేలా జనగణనను ఎప్పట్లోగా పూర్తి చేస్తుందో కేంద్రం చెప్పాలని డిమాండ్ చేసింది. శుక్రవారం సాయంత్రం న్యూఢిల్లీ అక్బర్ రోడ్డులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సీడబ్ల్యూసీ భేటీ జరిగింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాం«దీ, కేసీ వేణుగోపాల్‌తో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి కమిటీ సభ్యులు దామోదర రాజనరసింహ, రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు హాజరయ్యారు. ప్రధానంగా కులగణన, పహల్గాం ఉగ్రదాడిపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు అప్రమత్తంగా ఉండాలి: ఖర్గే రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర మొదలు, మొన్నటి లోక్‌సభ ఎన్నికల వరకు ఇదే అంశాన్ని ముందుపెట్టి కాంగ్రెస్ పార్టీ పోరాడిందని ఖర్గే చెప్పారు. పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కులగణన పూర్తి చేసి ప్రభుత్వ పథకాల్లో అమలు చేసే ప్రక్రియను సైతం మొదలు పెట్టిందని ప్రశంసించారు. ప్రజల సమస్యలను నిజాయితీగా లేవనెత్తితే, ఎన్డీఏ వంటి మొండి ప్రభుత్వాలు తలవంచాల్సిందేనని రాహుల్‌గాంధీ నిరూపించారని అన్నారు. అయితే కులగణన సమస్యను ఒక మంచి ముగింపు వచ్చేంత వరకు కాంగ్రెస్ నేతలంతా అప్రమత్తతతో వ్యవహరించాలని సూచించారు. అనంతరం ఇదే అంశంపై చేసిన తీర్మానంలోనూ తెలంగాణ అంశాన్ని సీడబ్ల్యూసీ ప్రస్తావించింది. తెలంగాణ నమూనాను కేంద్రం అనుసరించాలి ‘తెలంగాణలో కులగణనకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం పాటించిన విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అనుసరించాల్సిన అవసరం ఉందని సీడబ్ల్యూసీ భావిస్తోంది. తెలంగాణలో కుల సర్వే రూపకల్పన పూర్తిగా పౌర సమాజం, సామాజికవేత్తలు, నాయకుల క్రియాశీల ప్రమేయంతో.. సంప్రదింపులు, పారదర్శక ప్రక్రియ ద్వారా జరిగింది. ఈ సర్వే పూర్తిగా బ్యూరోక్రాటిక్ విధానంలో కాకుండా ప్రజల పరిశీలన నుంచి వచ్చింది.అందువల్ల జాతీయ స్థాయి కులగణన కోసం తెలంగాణ పాటించిన విధానాన్ని అనుసరించాలని సీడబ్ల్యూసీ కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతోంది. కేంద్రం విశ్వసనీయమైన, శాస్త్రీయమైన, భాగస్వామ్య నమూనాను రూపొందించేందుకు వీలుగా మా పూర్తి మద్దతును ప్రకటిస్తున్నాం. సంప్రదింపులు, జవాబుదారీతనం సమ్మిళితత్వంతో విలువలను ప్రతిబింబించే చట్రాన్ని రూపొందించడంలో సహకరించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం..’అని సీడబ్ల్యూసీ తన తీర్మానంలో పేర్కొంది. జాప్యం వద్దు..పారదర్శకంగా జరగాలి ‘కులగణన ప్రక్రియలో జాప్యం చేయకూడదు. అన్ని రాజకీయ పార్టీలను పూర్తి విశ్వాసంలోకి తీసుకోవాలి. ఈ అంశంపై పార్లమెంట్లో వెంటనే చర్చ జరపాలి. ప్రభుత్వం వెంటనే అవసరమైన నిధులను కేటాయించి, జనాభా లెక్కల ప్రతి దశకు నిర్దిష్టమైన సమయాన్ని ప్రకటించాలి. కులగణన వివరాల నమోదు ప్రక్రియ పూర్తి సమగ్రంగా, పారదర్శకంగా ఉండేలా చూడాలి. రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలకు, విద్యా, ఉపాధి అవకాశాలకు ఈ కులగణనే ప్రాతిపదికగా ఉండాలి. కుల గణన సరిగ్గా జరిగి అమలైతే సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుతుంది..’అని తీర్మానంలో స్పష్టం చేసింది. పూర్తి పారదర్శకతతో నిర్వహించాం: సీఎం రేవంత్ తెలంగాణలో కులగణన జరిగిన తీరును సీడబ్ల్యూసీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వివరించారు. కచ్చితత్వంతో, పూర్తి పారదర్శకంగా కులగణన నిర్వహించామని తెలిపారు. ‘బీసీల జనాభా గతం కన్నా 6 శాతం మేర పెరిగింది. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి, దానిని పార్లమెంట్ ఆమోదానికి పంపించాం. విద్య, ఉద్యోగం, ఉపాధి, నిధుల కేటాయింపుల్లో ఓబీసీ, ఆదివాసీ, దళితులు, మైనార్టిలకు ప్రయోజనం చేకూరేలా ఇకపై ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయి.కులగణనతో ఆయా వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందని మేము విశ్వసిస్తున్నాం. మమ్మల్ని చూసే కేంద్రం కూడా కులగణన చేసేందుకు ముందుకొచ్చింది. దీనిపై రాష్ట్రంలోని నిమ్న వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి..’అని సీఎం తెలిపారు. రేవంత్, దామోదరకు అభినందనలు కులగణన ప్రక్రియలో చేసిన శ్రమ, అమలులో చూపిన చొరవపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి దామోదరలను సీడబ్ల్యూసీ కీలక నేతలు అభినందించారు. -
రెండో పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ ఫేమ్ ప్రియాంక (ఫొటోలు)
-
ప్రియుడితో బుల్లితెర నటి బ్రేకప్.. కన్ఫామ్ చేసేసిందిగా!
బాలీవుడ్ భామ ప్రియాంక చాహర్ చౌదరి తనపై వస్తున్న రూమర్స్‌పై స్పందించింది. ప్రియుడు అంకిత్ గుప్తాతో బ్రేకప్ అయినట్లు ఇటీవల కొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన బుల్లితెర బ్యూటీ ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చింది. ఎవరైనా సరే తమ జీవితంలో మార్పు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని తెలిపింది. జీవితంలో ముందుకు సాగాలే తప్ప వెనకడుగు వేయకూడదని అంటోంది. ఆమె మాటలను చూస్తుంటే వీరిద్దరి మధ్య బ్రేకప్ నిజమేనని తెలుస్తోంది.ప్రియాంక చాహర్ మాట్లాడుతూ.. ' మార్పు అనేది ఎల్లప్పుడూ మంచిదని నేను నమ్ముతున్నా. ఎందుకంటే మనం జీవితంలో అభివృద్ధి చెందడానికి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ముందుకు సాగాల్సిందే. అది రిలేషన్లో అయినా.. ఫ్యాషన్‌లో అయినా అదే మంచి నిర్ణయం" అని తెలిపింది. కాగా.. ఇటీవల ప్రియాంక చాహర్ చౌదరి, అంకిత్ గుప్తా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో ఈ జంటపై బ్రేకప్ రూమర్స్ మొదలయ్యాయి. (ఇది చదవండి: ప్రియుడితో బిగ్‌బాస్ బ్యూటీ బ్రేకప్.. త్వరలోనే తెలుగులో ఎంట్రీ!)అంతుకుముందు వీరిద్దరు కలిసి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న 'తేరే హో జాయేన్ హమ్' అనే టీవీ షో నుంచి సైతం అంకిత్ వైదొలగాలని నిర్ణయించుకోవడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలో ప్రియాంక చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజా పరిణామాలతో ఈ జంట తమ రిలేషన్‌షిప్‌కు దాదాపు ఎండ్ కార్డ్ వేసినట్లేనని అర్థమవుతోంది. కాగా.. వీరిద్దరు మొదటసారిగా 'ఉదారియన్' సెట్స్‌లో కలుసుకున్నారు. ఆ తరువాత బిగ్ బాస్- 16లో కనిపించారు. అంతేకాకుడా అంకిత్ గుప్తా, ప్రియాంకతో కలిసి బాలికా వధు, సద్దా హక్ సిరీయల్స్‌లో జంటగా నటించారు. మరోవైపు ప్రియాంక చాహర్ చౌదరి శ్రీ విష్ణు హీరోగా నటించే తెలుగు చిత్రంలో హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రంలో మరో బాలీవుడ్ బ్యూటీ దివ్య ఖోస్లా కుమార్ కూడా నటించనుంది. -
OTT: సడెన్‌గా తెలుగులోకి వచ్చేసిన 'జాబిలమ్మ నీకు అంత కోపమా'
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ దర్శకత్వం వహించిన చిత్రం ‘నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబం’.. తెలుగులో ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’(Jabilamma Neeku Antha Kopama) పేరుతో విడుదలైంది. అయితే, ఎలాంటి ప్రకటన లేకుండా ఇప్పుడు తెలుగులో స్ట్రీమింగ్కు వచ్చేసింది. పవీష్, అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాశ్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేశ్ మీనన్, రబియా ఖతూన్, రమ్యా రంగనాథన్ ప్రధాన పాత్రల్లో ఇందులో నటించారు. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో తమిళ్ వర్షన్ అందుబాటులో ఉంది. అయితే, తాజాగా తెలుగు వర్షన్ కూడా స్ట్రీమింగ్ అవుతుంది.‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ మూవీ ఫిబ్రవరి 21న థియేటర్స్‌లోకి వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద యూత్‌ను మెప్పించిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగు వర్షన్ అమెజాన్ ప్రైమ్‌లో సడెన్‌గా స్ట్రీమింగ్ అవుతుంది. ఎలాంటి ప్రకటన లేకుండా ఈ సినిమాను విడుదల చేయడంతో ఫ్యాన్స్ సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సింప్లీ సౌత్ ఓటీటీలో కూడా ఈ చిత్రం తెలుగులో ఉంది. ఓ భిన్నమైన రొమాంటిక్ కామెడీ కథతో ధనుష్ ఈ సినిమాని తెరకెక్కించారు. యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా ఈ మూవీ ఉంటుంది. ఆర్కేప్రోడక్షన్స్‌తో కలిసి ధనుష్(Dhanush) సొంత నిర్మాణ సంస్థ వండర్‌బార్ ఫిల్మ్స్ పథాకంపై ఈ సినిమాను నిర్మించారు. -
ప్రియాంకా.. స్కూటీలు ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు విద్యార్థినులకు స్కూటీలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మంగళవారం శాసనమండలి ఆవరణలో వినూత్న నిరసన తెలిపారు. స్కూటీల ఆకారంలో ఉన్న ప్లకార్డులతో సభ ఆవరణకు చేరుకున్నారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని వాగ్దానం చేశారని, అధికారంలోకి వచ్చి 15 నెలలైనా హామీ నెరవేర్చలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ధ్వజమెత్తారు.‘ప్రియాంకగాందీ.. స్కూటీలు ఎక్కడ?’అంటూ ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, కల్వకుంట్ల కవిత, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ తదితరులు నినాదాలు చేశారు. అనంతరం మండలి మీడియా పాయింట్ వద్ద కవిత మాట్లాడుతూ కల్యాణమస్తులో భాగంగా తులం బంగారం ఇవ్వలేమన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు ఆడపిల్లలకు స్కూటీలు ఎగ్గొట్టే పనిచేస్తోందన్నారు. సమస్యలకు కేంద్రంగా తెలంగాణ.. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను మళ్లీ సమస్యలకు కేంద్రంగా మార్చుతోందని శాసనమండలి బీఆర్ఎస్ ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఆరోపించారు. స్టేషన్‌ఘన్‌పూర్ సభలో తామిచ్చిన హామీలు అమలు చేయలేమని స్వయంగా వారే ఒప్పుకోవటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. డిగ్రీ, ఆపై చదివే విద్యార్థినులకు స్కూటీలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. -
మిసెస్ ఇండియా పోటీల్లో తెలంగాణ క్వీన్ ప్రియాంక తారే..!
జాతీయ స్థాయిలో ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న జాతీయ మిసెస్ ఇండియా పోటీల్లో ప్రియాంక తారే తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చత్తీస్‌గఢ్‌లోని భిలాయ్ నుంచి వచ్చి నగరంలో స్థిరపడిన ఆమె మిసెస్ ఇండియా తెలంగాణ క్వీన్ 2025 అనే ప్రతిష్టాత్మక బిరుదుతో పాటు మిసెస్ ప్యాషనేట్ అవార్డు గెలుచుకుంది. ఈ నేపథ్యంలో జాతీయ వేదికపై మిసెస్ ఇండియా పోటీలో తెలంగాణ సౌందర్యాభిలాషను ప్రదర్శించడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. ప్రియాంక తారే అద్భుత ప్రతిభావంతురాలు. ఎంఎన్‌సీసీలో హెచ్ఆర్, సీఎస్ఆర్గా పలు ఈవెంట్లు నిర్వహిస్తోంది. ఆమె క్రీడలు, పాటలు, నృత్యం వంటి వాటిలో మంచి ప్రతిభావంతురాలు . ప్రియాంక రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఫిట్నెస్ ఔత్సాహికురాలు కూడా. ఆమె తన డ్రీమ్‌ని నెరవేర్చుకోవడమే గాక ఇతరులను కూడా ఆ మార్గంలో వెళ్లేలా ప్రోత్సహిస్తోంది. అంతేగాదు వివిధ రకాల ఎన్జీవోలతో కలిసి నిరుపేద బాలికలు/పిల్లల సంక్షేమం, మహిళ సాధికారత వంటి సామాజిక కార్యక్రమాల కోసం తన వంతుగా సేవలందిస్తోంది. (చదవండి: 'విందోదయం': బ్రేక్ ఫాస్ట్‌లకు కేరాఫ్ ఈ టిఫిన్ సెంటర్లు..!) -
ప్రియుడితో బిగ్‌బాస్ బ్యూటీ బ్రేకప్.. త్వరలోనే తెలుగులో ఎంట్రీ!
బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకున్న జంట ప్రియాంక చాహర్ చౌదరి, అంకిత్ గుప్తా. బిగ్ బాస్ సీజన్- 16లో వీరిద్దరు కంటెస్టెంట్స్‌గా పాల్గొన్నారు. ఈ సీజన్లో ప్రియాంక సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. ఆ రియాలిటీ షో తర్వాత వీరిద్దరు పలు సీరియల్స్‌లోనూ నటించారు. దీంతో వీరిద్దరు డేటింగ్లో ఉన్నట్లు చాలాసార్లు వార్తలొచ్చాయి. అంతేకాకుండా త్వరలోనే ఓ యూట్యూబ్ ఛానెల్లో ప్రసారం కాబోయే తేర్రే హో జాయేన్ హమ్ షో కోసం జతకట్టనున్నారు. అయితే తాజాగా వీరిద్దరికీ సంబంధించిన ఓ వార్త బాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ బుల్లితెర జంట ఇన్‌స్టాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రియాంక, అంకిత్ తమ రిలేషన్‌కు గుడ్ బై చెప్పనున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. త్వరలోనే ఎంగేజ్మెంట్ కూడా చేసుకోబోతున్నట్లు వార్తలొచ్చాయి. అంతేకాకుండా ఈ జంట పెళ్లికి సిద్ధమయ్యారని టాక్ వినిపించింది. కానీ తాజా పరిణామాలతో ఈ జంట బ్రేకప్ చెప్పేసుకున్నట్లు బీటౌన్‌లో టాక్ నడుస్తోంది.ఈ విషయం తెలుసుకున్న ప్రియాంక అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ నిరాశను వ్యక్తం చేశారు. అయితే ఒకరినొకరు అన్‌ఫాలో చేసినప్పటికీ.. ఇన్స్టాగ్రామ్ ఫోటోలు తొలగించలేదు. అయితే ఇదంతా రాబోయే కొత్త షో కోసం ఇలా చేశారా? అని కొందరు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. కాగా.. అంకిత్ గుప్తా, ప్రియాంకతో బాలికా వధు, సద్దా హక్ సిరీయల్స్‌లో జంటగా నటించారు. ప్రియాంక చాహర్ చౌదరి శ్రీ విష్ణు హీరోగా నటించే తెలుగు చిత్రం హీరో హీరోయిన్లో కనిపించనుంది. ఈ చిత్రంలో మరో బాలీవుడ్ బ్యూటీ దివ్య ఖోస్లా కుమార్ కూడా నటించనుంది. -
'కట్నం క్యాష్‌గానే ఇస్తారంటా'.. నవ్వులు తెప్పిస్తోన్న ట్రైలర్!
కమెడియన్ సప్తగిరి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం పెళ్లి కాని ప్రసాద్. ఈ మూవీని అభిలాష్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కించారు. ఇందులో ప్రియాంక శర్మ హీరోయిన్గా నటించింది. పెళ్లి కాని ఓ యువకుడు పడే ఇబ్బందుల నేపథ్యంలోనే ఈ మూవీ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను హీరో విక్టరీ వెంకటేశ్ చేతుల మీదుగా విడుదల చేశారు. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే ఆడియన్స్‌కు నవ్వులు పూయిస్తోంది. పెళ్లి కావాల్సిన యువకుడు తన తండ్రి పెట్టే కండీషన్లతో సతమతమయ్యే కథ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా ఈ జనరేషన్లో పెళ్లి కావాలంటే ఎన్ని షరతులు ఉన్నాయనేది ఇందులో చూపించనున్నారు. ఈ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ మార్చి 21న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో మురళీధర్ గౌడ్, అన్నపూర్ణమ, వడ్లమాని శ్రీనివాస్, ప్రమోదిని, బాషా, లక్ష్మణ్ మీసాల, రోహిణి, రాంప్రసాద్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతమందించారు.Wishing @MeSapthagiri and the team of #PelliKaniPrasad all the very best for the release!Here's the trailer:https://t.co/XDVHxb4kbn@PriyankaOffl @abhilash_gopidi @ThamaEnts #ShekarChandra @Chaganticinema @SVC_official pic.twitter.com/44Bfe8bCFZ— Venkatesh Daggubati (@VenkyMama) March 13, 2025 -
పాపాహోం నుంచి శాటిలైట్ సెంటర్‌కు..
సీతమ్మధార: తల్లిదండ్రులు విడిపోయారు. దీంతో ఆ బాలిక భవిష్యత్ అంధకారంలో పడిపోతుందనుకున్నారు. అమ్మమ్మ అన్నీ అయి చదివించారు. సీతమ్మధార పాపాహోంలో(Seethammadhara) ఉంటూ చదువుకున్న ఆమె ప్రస్తుతం ఉన్నతోద్యోగం చేయడం విశేషం. దీంతో త్వరలోనే పాపాహోం ఆవరణలో ఆమెకి ఘనంగా సత్కారం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ యువతి విజయగాథ మనమూ తెలుసుకుందాం. గూడూరుకు చెందిన భట్టిపాటి ప్రియాంక (21)(Bhattipati Priyanka) విశాఖ జిల్లా తగరపువలసలో మేనమామ వద్ద ఉంటూ చదువుకునేది. 9వ తరగతి చదివే సమయంలో 2017లో పాపాహోంలో చేరింది. సీతమ్మధారలోని డాల్ఫిన్ స్కూల్లో 9, పది చదివింది. ఈమెకి తల్లి లేరు. తండ్రి రెండో వివాహం చేసుకున్నారు. ప్రియాంక డిప్లమో ఇన్ కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ (డీసీసీ) పూర్తి చేసింది. తర్వాత నెల్లూరు జిల్లాలో డీకేడబ్ల్యూ కళాశాలలో బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ బ్రాంచ్‌లో (సీఏ)లో చేరింది. భీమునిపట్నం పాలిటెక్నిక్ కళాశాలలో పాపాహోం ఆర్థిక సాయంతోనే డిప్లమో చదివింది. ఈ కళాశాల నుంచి విద్యార్థుల వివరాలు పంపడంతో శ్రీహరికోటలోని స్పేస్ సెంటర్లో ఏడాది పాటు అప్రెంటిస్ శిక్షణకు ఎంపికై శిక్షణ తీసుకుంది. గత ఏడాది అక్టోబర్‌లో ఈ శిక్షణ పూర్తి అయింది. ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా బెంగళూరులోని కేంద్ర ప్రభుత్వానికి చెందిన యూఆర్ రావు శాటిలైట్ సెంటర్లో అకౌంట్స్‌లో సీహెచ్ఎస్ఎస్ పోస్టులో కాంట్రాక్ట్ విధానంలో పని చేస్తోంది. ప్రస్తుతం ఆమెకి రూ.22 వేల వేతనం అందుతోంది. రాకెట్ లాంచింగ్ ఉద్యోగమే లక్ష్యం.. నేను 2003లో గూడూరులో పుట్టాను. 2008లో నా తల్లిదండ్రులు విడిపోయారు. గూడూరులోని అమ్మమ్మ వద్దే పెరిగాను. విశాఖలోని పాపాహోంలో ఉంటూ డాల్ఫిన్ స్కూల్లో 9వ తరగతిలో చేరాను. అక్కడే పదో తరగతి పూర్తి చేశాను. భీమిలిలో డిప్లమో చేశాను. 2018లో తల్లి ఇంట్లోంచి వెళ్లిపోయారు. ఎక్కడున్నారో తెలియదు. రాకెట్ లాంచింగ్ సెంటర్లో ఉద్యోగమే ధ్యేయంగా పని చేస్తున్నాను. గూడురులో అమ్మమ్మ బాగోగులు నేనే చూస్తున్నాను. – ప్రియాంక, బెంగళూరు. -
Priyanka Mohan: నేనొక శారీ లవర్ని
బంజారాహిల్స్: ‘నాకు చీరలంటే ఎంతో ఇష్టం.. ఒక్క మాటలో చెప్పాలంటే నేనొక శారీ లవర్ని’ అని చెప్పారు హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్. జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లో గ్జితి వీవ్స్లో ఏర్పాటు చేసిన నూతన కలెక్షన్లను మంగళవారం ఆవిష్కరించారు. మహిళలకు చీర అందాన్ని ఇవ్వడమే కాకుండా మరింత గౌరవాన్ని ఇస్తుందని ప్రియాంక అన్నారు. తాను నిత్యం రకరకాల కలెక్షన్లు అన్వేషిస్తూ ఉంటానని, నచ్చిన చీరను తెప్పించుకోడం.. కట్టుకొని ముచ్చట తీర్చుకోడం జరుగుతుందన్నారు. మార్కెట్లోకి ట్రెండీ డ్రెస్‌లకు ధీటుగా శారీలు కూడా వస్తుండటం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా గ్జితి వీవ్స్ ప్రతినిధులు సౌజన్య, బాబీ మాట్లాడుతూ ప్రతి అవసరానికీ ఓ చీర, ప్రతి సీజన్‌కు ఓ చీర అనే కాన్సెప్‌్టతో దేశంలోని భిన్న రకాల చేతి వృత్తుల చీరలతో పాటు డిజైనరీ చీరలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. – నటి ప్రియాంక -
'సరిపోదా శనివారం' బ్యూటీ ప్రియాంక మోహన్ చీర లుక్స్ తో రచ్చ చేస్తుందిగా..! (ఫోటోలు)
-
తెలుగులో క్వీనే వచ్చేను...
‘మామా మామా కమ్ అండ్ సింగు... క్వీనే వచ్చెను... నువ్వే కింగు...’ అంటూ మొదలవుతుంది ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’(Jabilamma Neeku Antha Kopama) సినిమాలోని ‘గోల్డెన్ స్పారో...’ పాట. పవీష్, అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాశ్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేశ్ మీనన్, రబియా ఖతూన్, రమ్యా రంగనాథన్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబం’. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీకి హీరో ధనుష్ దర్శకత్వం వహించారు.ఆర్కేప్రోడక్షన్స్‌తో కలిసి ధనుష్(Dhanush) సొంత నిర్మాణ సంస్థ వండర్‌బార్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 21న విడుదల కానుంది. ఈ మూవీని ‘జాబిలమ్మ నీకు అంత కోపమా..’ అనే టైటిల్‌తో తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి రిలీజ్ చేస్తోంది. తాజాగా ఈ మూవీలోని ‘గోల్డెన్ స్పారో’ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు.‘గోల్డెన్ స్పారో... నా గుండెలో యారో... నువ్వు లేని లైఫు ఫుల్ శారో..,’ అంటూ సాగే ఈ స్పెషల్ సాంగ్‌లో పవీశ్, అనిఖాలతో పాటు హీరోయిన్ ప్రియాంకా మోహనన్(Priyanka Mohan) డ్యాన్స్ చేశారు. ఈ పాటకు రాంబాబు గోసాల లిరిక్స్ అందించగా, అశ్విన్ సత్య–సుదీష్ శశికుమార్–సుభాషిణి ఆలపించారు. ఈ సిని మాకు సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్. -
నా క్యారెక్టర్‌కు కనెక్ట్ అవుతున్నారు
సదన్, ప్రియాంకా ప్రసాద్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రణయ గోదారి’. పీఎల్ విఘ్నేష్ దర్శకత్వంలోపారమళ్ళ లింగయ్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదలైంది. ఈ చిత్రం సక్సెస్‌మీట్‌లో పీఎల్ విఘ్నేష్ మాట్లాడుతూ– ‘‘మా సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బాగుందని చెప్పడం హ్యాపీగా ఉంది’’ అన్నారు.‘‘ఈ సినిమాలో నాపాత్రకు ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు ప్రియాంకా ప్రసాద్. ‘‘ఈ సినిమాపాటలకు మంచి స్పందన లభిస్తోంది’’ అన్నారు సంగీత దర్శకుడు మార్కండేయ. -
ఇది అన్ని టాక్ షోలలా ఉండదు
ప్రస్తుత జెనరేషన్‌కు మార్పు అన్నది ఆక్సిజన్ లాంటిది. ప్రతిక్షణం నిత్య నూతనంగానే కాదు వినూత్నంగా చూడాలని కోరుకుంటుంది నేటి తరం. మామూలుగా ఇంటర్వ్యూ, టాక్ షోలంటే ఇద్దరు ఎదురెదురుగా పద్ధతిగా కూర్చోవడం నుండి నడుస్తూ మాట్లాడడం వరకు చూశాం. నాటి దూరదర్శన్ టాక్ షోల నుండి నేటి ఓటీటీ టాక్ షోల వరకు ఇంచుమించుగా ఇదే పద్ధతి అవలంబిస్తున్నారు. కానీ వాటన్నిటికీ విభిన్నంగా నేటి తరం నేటివిటీకి దగ్గరగా ‘ది రానా దగ్గుబాటి షో’ ఉంది. దీనికి హోస్ట్‌గా పేరుకు తగ్గట్టే నేటి ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి వ్యవహరించడం విశేషం. ఈ కార్యక్రమం స్ట్రీమ్ అయ్యేకన్నా ముందు ప్రముఖ యాంకర్ సుమతో ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రమోషనల్ప్రోమో ఒకటి రిలీజ్ చేశారు.ఆప్రోమోలోనే ఈ షోకి సంబంధించిన కాన్సెప్ట్ రిలీజ్ చేశారు. ప్రోమోలో సుమ స్టూడియోకి వచ్చి రానాను కలుస్తుంది. ‘టాక్ షో అన్నావు కదా... గెస్టులు ఎవరు? దానికి సంబంధించిన అధికారిక అనౌన్సమెంట్ ఇలా ఉండాలి’ అని రానాకి సూచిస్తుంటే, ‘నేను టాక్ షో అన్నాను కానీ అనౌన్స్మెంట్, ఇంట్రో అని చెప్పలేదు కదా... చాలా షోస్ ఇలానే రొటీన్‌గా చేస్తున్నావు కదా.. మా టాక్ షో వాటన్నిటికీ విభిన్నం’ అని రానా చెబుతారు. రానా అన్నట్టే ఇప్పటిదాకా తెలుగులో వచ్చిన టాక్ షోస్ సంప్రదాయాన్ని ‘ది రానా దగ్గుబాటి షో’ బ్రేక్ చేసిందనే చెప్పాలి.ముఖ్యంగా ఈ షోలో రానా హోస్ట్ అనే కంటే వచ్చిన గెస్ట్‌లతో ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ క్యాజువల్‌గా షో నడపడం చాలా బాగుంది. ఈ షో మొదటి ఎపిసోడ్లో భాగంగా ప్రముఖ తెలుగు హీరో నాని, ‘హను– మాన్’ ఫేమ్ తేజ సజ్జా, నటి ప్రియాంకా మోహన్ అతిథులుగా వచ్చారు. వారిని షోలకి పిలవడం దగ్గర నుండి వాళ్ళతో మాట్లాడడం, ఆటలాడడం అంతా సరికొత్తగా అనిపిస్తుంది. ఎదుటివారి అభిరుచిని కనిపెట్టడం మీడియాలో దర్శకులకు తెలిసినంత మరెవరికీ తెలిసుండదు. అలా వాళ్లు ప్రేక్షకుల నాడిని పడతారు కాబట్టే వారి కాన్సెప్ట్స్ ప్రేక్షకాదరణ పొందుతాయి. దానికి నిలువెత్తు నిదర్శనమే ఈ ‘ది రానా దగ్గుబాటి షో’. ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న ఈ షో వర్తబుల్... వాచిట్. – హరికృష్ణ ఇంటూరు -
అంతర్జాతీయ స్థాయిలో ‘కల్కి 2’: స్వప్న, ప్రియాంక
‘‘కల్కి 2’ సినిమా పనులు ఇప్పటికే మొదలయ్యాయి.. ప్రీప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి’’ అని నిర్మాతలు స్వాప్న దత్, ప్రియాంక దత్ చెప్పారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్ , దీపికా పదుకొనె, దిశా పటానీ ప్రధాన పాత్రల్లో నటించిన మైథలాజికల్ అండ్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌పై సి.అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది జూన్ లో విడుదలై, ఘనవిజయం సాధించింది.‘కల్కి సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’కి సీక్వెల్‌గా ‘కల్కి 2’ రానుందని చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం గోవాలో జరుగుతున్న 55వ ఇఫీ (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) వేడుకల్లో మెయిన్ స్ట్రీమ్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ‘కల్కి 2898 ఏడీ’ సినిమాని ప్రదర్శించారు. అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు స్వాప్నదత్, ప్రియాంక దత్ బదులిస్తూ.. ‘‘ప్రస్తుతం ‘కల్కి 2’ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. తొలి పార్టు చిత్రీకరణ టైమ్‌లోనే 30 నుంచి 35 శాతం ‘కల్కి 2’ షూటింగ్ పూర్తయింది. అయితే ఈ సినిమాలోని ప్రధాన నటీనటుల షూటింగ్ కాల్షీట్స్ ఫైనలైజ్ కావాల్సి ఉంది. తొలి పార్టులో మదర్ రోల్ చేసిన దీపికా పదుకొనే ‘కల్కి 2’లోనూ మదర్ రోల్ చేస్తారు. ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ చేస్తాం’’ అని పేర్కొన్నారు ‘కల్కి 2’ చిత్రీకరణ వచ్చే ఏడాది ్రపారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
Sai Priyanka pagadala: అమ్మలాంటి అన్నదాత కోసం...
తల్లి తన ఆకలి గురించి పట్టించుకోదు. పిల్లల కడుపు నిండిందా లేదా అనేదే ఆమెకు ముఖ్యం. రైతులు కూడా అమ్మలాంటి వారే. అందుకే వారిపై దృష్టి పెట్టింది సాయిప్రియాంక. తాను పండించే పంటల ద్వారా ఎంతోమందికి పోషకాహార శక్తిని అందిస్తున్న రైతు ఆ శక్తికి ఎంత దగ్గరలో ఉన్నాడు? ఎంత దూరంలో ఉన్నాడు... అనే ఆసక్తితో పరిశోధన బాట పట్టింది. తన పరిశోధన అంశాలను కొలంబోలో జరిగే అంతర్జాతీయ సదస్సులో వివరించడానికి సిద్ధం అవుతోంది.సాయిప్రియాంక చదువుకున్నది పట్టణాల్లో అయినా ఆమెకు పల్లెలు అంటేనే ఇష్టం. పల్లెల్లో పచ్చటి పొలాలను చూడడం అంటే ఇష్టం. ఆ ఇష్టమే వ్యవసాయం గురించి తెలుసుకోవాలనే ఆసక్తికి కారణం అయింది. ఆ ఆసక్తే తనను ‘అగ్రికల్చరల్ సైంటిస్ట్’ను చేసింది.ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఎఫ్పీఆర్ఐ) అనేది వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం. పోషకాహార లోపానికి సంబంధించి పరిశోధన ఆధారిత పరిష్కారాలను అందించే సంస్థ ఇది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర సంస్థలతో కలిసి ఈ సంస్థ ‘డెలివరింగ్ ఫర్ న్యూట్రిషన్ ఇన్ సౌత్ ఏషియా: కనెక్టింగ్ ది డాట్స్ ఎక్రాస్ సిస్టమ్స్’ అనే అంశంపై కొలంబోలో డిసెంబర్ 3,4,5 తేదీలలో అంతర్జాతీయ సదస్సు ఏర్పాటు చేస్తోంది. పోషకాహారం దాని ప్రభావిత అంశాల గురించి చర్చించడానికి ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన నిపుణులు, విధానకర్తలు, పరిశోధకులను ఏకతాటిపై తీసుకు వస్తోంది.మన దేశం నుంచి ఆరుగురు ప్రతినిధులు ఈ ప్రతిష్ఠాత్మకమైన సదస్సులో పాల్గొనబోతున్నారు. వారిలో సాయి ప్రియాంక ఒకరు. తన పరిశోధనకు సంబంధించిన అంశాలను ఈ అంతర్జాతీయ సదస్సులో ప్రియాంక వివరించనుంది. ప్రత్యేక గ్రామాలు తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా పస్తాపూర్, అర్జున్ నాయక్ తాండా, బిడకన్నె గ్రామాలకు వ్యవసాయ పరంగా ప్రత్యేకత ఉంది. వీటిని ‘ప్రత్యేక గ్రామాలు’ అనుకోవచ్చు. కొర్రలు, సామలు, ఊదలులాంటి సిరిధాన్యాలతో పాటు సుమారు 20 రకాల ఆకుకూరలు సాగు చేస్తుంటారు అక్కడి రైతులు. రసాయనాలు వినియోగించకుండా సేంద్రియ పంటలను పండిస్తున్నారు. దక్కన్ డవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్)లాంటి సంస్థల ప్రోత్సాహంతో ఈ గ్రామాల్లోని రైతులు పౌష్టికాహారాన్ని ఇచ్చే ప్రత్యేక పంటలు సాగు చేస్తున్నారు.పత్తి, సోయా, చెరుకు లాంటి వాణిజ్య పంటలు సాగు చేసే గ్రామాలతో పోల్చితే ఈ ప్రత్యేక గ్రామాల్లోని ప్రజలకు పౌష్టికాహారం ఏ మేరకు అందుతోందనే అంశంపై ఎంతోమంది రైతులతో మాట్లాడింది సాయిప్రియ.‘అగ్రి న్యూట్రీ స్మార్ట్ విలేజెస్’ పేరుతో క్షేత్రస్థాయిలో పరిశోధనలు చేస్తోంది. రైస్, పప్పులులాంటి ఒకేరకమైన ఆహారంతో పాటు ఆకు కూరలు, సిరిధాన్యాలు తీసుకోవడం ద్వారా ఆ మూడు గ్రామాల ప్రజలు మెరుగైన పౌష్టికాహారం పొందగలుగుతున్నారని ఆమె పరిశోధనల్లో తేలింది. ఈ గ్రామాలతో పాటు హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రామాల్లో కూడా పరిశోధనలు చేస్తోంది.ఐఏఆర్ఐలో పీహెచ్డీఖమ్మం పట్టణానికి చెందిన పగడాల సాయి ప్రియాంక పదో తరగతి వరకు ఖమ్మంలో, ఇంటర్ విజయవాడలో చదువుకుంది. తల్లిదండ్రులు రాజరాజేశ్వరి, నర్సింహరావులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. ‘డాక్టర్ కావాల్సిందే’ ‘ఇంజనీర్ కావాల్సిందే’లాంటి సగటు తల్లిదండ్రుల ఆలోచనకు దూరంగా కూతురుకి వ్యవసాయ రంగంపై ఉన్న ఆసక్తిని ప్రోత్సహించారు.వ్యవసాయ పరిశోధనపై ఎంతో ఆసక్తి ఉన్న సాయి ప్రియాంక అశ్వారావుపేటలో బీఎస్సీ అగ్రికల్చర్, మేఘాలయలోని సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తి చేసింది. ఢిల్లీలోని ఐఏఆర్ఐ (ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్)లో పీహెచ్డీ చేస్తోంది. ప్రస్తుతం జహీరాబాద్ ‘కృషి విజ్ఞాన కేంద్రం’లో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సైంటిస్ట్‌గా పనిచేస్తోంది.‘ఇవి మాత్రమే మనం చేరుకోవాల్సిన గమ్యాలు’ అని యువతరం ఒకే వైపు దృష్టి సారించినప్పుడు ఎన్నో రంగాలు మూగబోతాయి. ఆ రంగాలలో పరిశోధనలు ఉండవు. ప్రగతి ఉండదు. విభిన్న ఆలోచనలు ఉన్న సాయిప్రియాంక లాంటి అమ్మాయిలు తాము కొత్త దారిలో ప్రయాణించడమే కాదు ‘మనం ప్రయాణించడానికి, అన్వేషణ కొనసాగించడానికి ఒకే దారి లేదు. ఎన్నో దారులు ఉన్నాయి’ అనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నారు. ఈ కోణంలో సాయిప్రియాంక ‘కృషి’ యువతరంలో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది.సంతోషంగా ఉంది‘అగ్రి న్యూట్రీ స్మార్ట్ విలేజ్’ అనే ్రపాజెక్ట్పై మూడు ప్రత్యేక గ్రామాల్లో నా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ‘గ్లోబల్ హంగర్ ఇండెక్స్’లాంటి వాటి ఆధారంగా ఈ గ్రామాల్లో ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్‌ను తయారు చేస్తున్నాము. ఇతర గ్రామాలతో పోల్చితే ఈ ప్రత్యేక గ్రామాల్లో కాస్త మెరుగైన పౌష్టికాహారం అందుతోంది. దక్షిణ ఆసియా దేశాలకు చెందిన సుమారు 600 మంది ప్రతినిధులతో కొలంబోలో జరిగే అంతర్జాతీయ సదస్సులో పాల్గొనే అవకాశం లభించినందుకు ఎంతో సంతోషంగా ఉంది.– సాయి ప్రియాంక, వ్యవసాయ శాస్త్రవేత్త పాత బాల ప్రసాద్, సాక్షి, సంగారెడ్డి -
ఉగ్రావతారం
‘‘హైదరాబాద్‌తో నాకు ఎంతో అనుబంధం ఉంది. నా భర్త ఉపేంద్రగారిని తొలిసారి ఇక్కడే కలిశాను. అందుకే హైదరాబాద్ నాకు చాలా లక్కీ సిటీ. నా కెరీర్లో తొలి యాక్షన్ ఫిల్మ్ ‘ఉగ్రావతారం’. ఈ పాత్రకు నేను సరిపోతానని డైరెక్టర్ గురుమూర్తిగారు నమ్మారు. నా మొదటి పాన్ ఇండియన్ మూవీని అందరూ చూడాలని కోరుకుంటున్నాను’’ అని నటి ప్రియాంకా ఉపేంద్ర అన్నారు. ప్రియాంకా ఉపేంద్ర లీడ్ రోల్లో గురుమూర్తి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఉగ్రావతారం’.ప్రియాంకా ఉపేంద్ర సమర్పణలో ఎస్జీ సతీష్ నిర్మించిన ఈ సినిమా నవంబరు 1న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో ఈ చిత్రం ట్రైలర్, సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. నిర్మాత రాజ్ కందుకూరి ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేయగా, నిర్మాత కరాటే రాజు, నటుడు సత్యప్రకాశ్ పాటను రిలీజ్ చేశారు. డైరెక్టర్ గురుమూర్తి మాట్లాడుతూ– ‘‘సమాజంలో జరిగే అన్యాయాలు, అఘాయిత్యాలపై మంచి సందేశాత్మాక చిత్రంగా ‘ఉగ్రావతారం’ ఉంటుంది’’ అన్నారు. -
మూడేళ్ళ గ్యాప్ తర్వాత రీఎంట్రీ.. టాలీవుడ్ దూసుకెళ్తున్న ‘శనివారం’ బ్యూటీ (ఫొటోలు)
-
తెర వెనక 'సరిపోదా శనివారం'.. నాని-ప్రియాంక ఇలా (ఫొటోలు)
-
మీ సోనియా ఇటలీ నుంచి వచ్చారు కదా !
శివాజీనగర: తాను రాజస్థాన్ నుండి వచ్చినవాడైతే మీ పార్టీ అధినాయకురాలు సోనియాగాంధీ ఇటలీ నుండి వచ్చారు, ఆమె కూడా తమ రాష్ట్ర నుండి రాజ్యసభకు ఎంపికయ్యారనేది మరువరాదని మంత్రి ప్రియాంక్ ఖర్గేకు రాజ్యసభ సభ్యుడు లెహర్ సింగ్ ఎదురుదాడికి దిగారు. కేఐఏడీబీ భూముల వ్యవహారాన్ని ప్రశ్నించినందుకు ఖర్గే జూనియర్ వారి స్నేహితులు రాజస్థాన్ వారని తనపై ఆరోపణ చేశారు. తాను అడిగేందుకు ఇష్టపడుతున్నాను. సోనియాగాంధీ రాజస్థాన్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఇటలీలో జని్మంచారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సీ.వేణుగోపాల్ సికార్‌లో, రణదీప్ సింగ్ సుర్జేవాలా చురులో జని్మంచారు. వారు ఏ రాష్ట్రం నుండి రాజ్యసభకు ఎంపికయ్యారని ఆయన ప్రశ్నించారు. రాజస్థానీ కావటం నేరమా? రాజస్థాన్ పాకిస్థాన్‌లో లేదని అన్నారు. నెహ్రూ కుటుంబం ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిందా లేదా కాశీ్మర్ నుండి వచ్చిందా అని ప్రశ్నించారు. తాను 59 సంవత్సరాల నుండి కర్ణాటకలో నివసిస్తున్నాను. తాను కన్నడ మాట్లాడుతున్నాను. చదువుతాను, రాస్తాను. తాను కర్ణాటక బీజేపీలో కోశాధికారి అని, తాను తన పార్టీలో ఎమ్మెల్సీ, ఎంపీగా సేవలందించాను. తాను రాజకీయం వంశం నుండి వచ్చినవాడు కాదు. రాహుల్ గాని, ఖర్గే జూనియర్.. రాళ్లు వేసే ముందు గాజు గదిలో ఉన్నారనేది తెలుసుకోవాలి అని లెహర్ సింగ్ ధ్వజమెత్తారు. -
చిరంజీవి గారితో నన్ను పోల్చడం.. కల్కి 2 లో నాని..?
-
సుదర్శన్ థియేటర్లో ‘సరిపోదా శనివారం’ ట్రైలర్ విడుదల ఈవెంట్ (ఫొటోలు)
-
నడకలో నిరాశ
పారిస్ ఒలింపిక్స్ అథ్లెటిక్స్ పోటీల తొలి రోజు భారత్‌కు నిరాశ తప్పలేదు. 20 కిలోమీటర్ల రేస్ వాక్‌లో మన అథ్లెట్లు ఆకట్టుకోలేకపోయారు. మహిళల విభాగంలో ప్రియాంక గోస్వామి 1 గంటా 39 నిమిషాల 55 సెకన్లలో లక్ష్యాన్ని చేరి 41వ స్థానంతో సరిపెట్టుకుంది. ఆసియా క్రీడల్లో రజత పతకం సాధించి ఆశలు రేపిన ప్రియాంక... ‘పారిస్’ క్రీడల్లో అదే ప్రదర్శన కనబర్చలేకపోయింది. 28 ఏళ్ల ప్రియాంక తన అత్యుత్తమ ప్రదర్శన (1 గంట 28 నిమిషాల 45 సెకన్లు) కంటే 11 నిమిషాలు వెనుకబడింది. పురుషుల విభాగంలో వికాస్ సింగ్ 30వ స్థానంతో, పరమ్‌జీత్ సింగ్ 37వ స్థానంతో రేసును ముగించారు. మరో వాకర్ అ„Š దీప్ అనారోగ్యం కారణంగా రేసు పూర్తి చేయలేకపోయాడు. -
చారులత ఆన్ డ్యూటీ
నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ‘గ్యాంగ్ లీడర్’ మూవీ తర్వాత నాని, ప్రియాంక మోహన్ జోడీగా నటిస్తున్న రెండో చిత్రం ‘సరిపోదా శనివారం’. ఎస్జే సూర్య, సాయికుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్ మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు.ఈ సినిమా నుంచి ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘‘యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘సరిపోదా శనివారం’. ఈ మూవీలో చారులత అనే పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నారు ప్రియాంక మోహన్. ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. భారీ బడ్జెట్, ఉన్నత ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఆగస్టు 29న ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
రైడర్ ప్రియాంక
ఓ వైపు వృత్తి.. మరోవైపు హాబీ.. చాలా మంది ఈ రెంటిలో ఏదో ఒక్కదానికే ప్రాధాన్యం ఇస్తారు. అతికొద్దిమంది మాత్రమే ఈ రెంటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతారు.. అలా రెంటిలోనూ గుర్తింపు తెచ్చుకోడం అంత సులువేం కాదు.. అందునా ఓ మహిళ ఇలా మల్టీ టాస్కింగ్ చేయడం చెప్పుగోదగ్గ విషయం.. పైగా అతి కష్టతరమైన గుర్రపు స్వారీలో రాణించడమంటే ఎంతో గుండె ధైర్యం కూడా ఉండాలి.. అలా గుర్రపు స్వారీలో రాణిస్తూనే.. ఎనీ్టపీసీలో మేనేజర్‌గా బిజీగా ఉంటూ.. మరోవైపు రచయిత్రిగానూ రాణిస్తున్నారు.. నగరానికి చెందిన ప్రియాంక భుయాన్. పలువురికి రోల్‌మోడల్‌గా నిలుస్తున్న ఆమె అనుభవాలు సాక్షితో పంచుకున్నారు... ఆ వివరాలు మీకోసం.. మహిళలంటే వంటింటికే పరిమితం అనే అపోహలను చెరిపేస్తూ.. అన్నింటిలోనూ పోటీకి సిద్ధమని నిరూపిస్తున్నారు నేటి మహిళలు.. కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా ఆటల్లోనూ ముందడుగేస్తున్నారు. ఎంత కష్టమైనా.. ఎదురు నిలిచి.. గెలిచి చూపిస్తున్నారు.. అంతటితో ఆగకుండా మరోవైపు కుటుంబ బాధ్యతలను భారంగా కాకుండా ఎంతో నిబద్ధతతో చక్కదిద్దుతూ ముందుకు సాగుతున్నారు ఎనీ్టపీసీలో మేనేజర్‌గా పనిచేస్తున్న ప్రియాంక భుయాన్. గుర్రపు స్వారీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ.. నలుగురికీ రోల్‌మోడల్‌గా నిలుస్తున్నారు. చిన్నన్నాటి కల.. అస్సాంలోని గువహటిలో జన్మించాను. అక్కడే నా బాల్యం గడిచింది. మూడేళ్లు వయసప్పుడు అమ్మ ఇచ్చిన ఓ గ్రీటింగ్ కార్డులో తొలిసారిగా గుర్రం బొమ్మ చూశాను. అప్పటి నుంచి గుర్రాలంటే పిచ్చి. కాస్త పెరిగాక గుర్రపు స్వారీపై ఆసక్తి పెరిగింది. కానీ ఆర్థిక పరిస్థితులు అందుకు సహకరించలేదు. గుర్రాన్ని దగ్గరి నుంచి చూడటమే విశేషం. కానీ ఇప్పుడు గుర్రం స్వారీ చేస్తూ పోటీల్లో పాల్గొనడం, పతకాలు సాధించడం నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎన్నో ఆటంకాలు... వృత్తిలో భాగంగా 2020లో రాయ్‌పూర్ బదిలీ అయ్యాను. కుటుంబం నుంచి దూరంగా ఉండటంతో ఒంటరిగా ఫీలయ్యేదాన్ని. అప్పుడే హార్స్ రైడింగ్ కలకు చేరువవ్వాలని నిర్ణయించుకున్నా.. అయితే మొదట్లో ఎవరేం అనుకుంటారో అని కాస్త భయపడ్డా. పైగా మహిళలకు ఈ రంగంలో చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అయినా ధైర్యం చేసి∙ట్రైనింగ్సెంటర్లో చేరాను. ట్రైనింగ్సెంటర్కు వెళ్లి గుర్రాలను చూడగానే ఎగిరి గంతేశాను. అయితే ప్రాక్టీస్ సమయంలో కింద పడి గాయాలయ్యాయి. వాటన్నింటినీ దాటుకుని ముందుకెళ్లాను. ఢిల్లీలో జరిగిన పోటీలో కాంస్య పతకం గెలుచుకున్నా.ఆ బాండింగ్ ప్రత్యేకం.. హార్స్ రైడింగ్ నేర్చుకోవడమే కాదు.. గుర్రంతో మంచి అనుబంధం ఉండాలి. ఎంత బాండింగ్ ఉంటే అంత అద్భుతంగా రాణించగలుగు తాం. ఒక్కోసారి గుర్రాలు మనకు సహకరించవు. దీనివల్ల గాయాలు కావొచ్చు. ప్రాణాలు కూడా పోవచ్చు. ముందస్తు జాగ్రత్తలతో పాటు గుర్రంతో స్నేహం చేయాలి. కుదిరితే సొంత గుర్రం కొనుక్కోవడం మంచిది.ధర ఎక్కువే..గుర్రాల్లో చాలారకాలుంటాయి. స్వారీలకు వేడి రక్తం ఉన్న విదేశీ గుర్రాలను వాడుతుంటారు. వాటిని దిగుమతి చేసుకోవడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఒక్కోదాని ఖరీదు రూ.30 నుంచి రూ. 40 లక్షలు ఉంటుంది. దీనికి పన్ను అదనం. దేశవాళీ గుర్రాలు అయితే కాస్త తక్కువ ధరకు దొరుకుతాయి. కానీ అనుకున్నన్ని సాహసాలు, మిరాకిల్స్ కష్టం. నేనూ ఓ గుర్రాన్ని కొనుక్కున్నా. కాకపోతే దురదృష్టవశాత్తు కొన్ని నెలలకే క్యాన్సర్‌తో మరణించింది. గుర్రాన్ని పెంచడమూ ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే.రాయడమూ ఇష్టమే..గుర్రపు స్వారీతో పాటు పుస్తకాలు రాయడమూ హాబీ. ఇప్పటివరకూ మూడు పుస్తకాలు రాశాను. వాటికి పాఠకుల నుంచి స్పందన వచి్చంది. కురుక్షేత్రంలో మహిళల గురించి ప్రపంచానికి పరిచయం చేయాలని నా తపన. అందుకే వీలు చిక్కినప్పుడల్లా పుస్తకాలు రాస్తుంటాను. -
పార్ట్నర్షిప్ నుంచి తప్పుకున్న ప్రియాంక చోప్రా.. మూతపడనున్న రెస్టారెంట్!
సెలబ్రిటీలు కేవలం సినిమాలే కాదు. మరింత ఆదాయం కోసం కొత్త దారుల్లోనూ వెళ్తుంటారు. పలువురు సినీతారలు ఇప్పటికే బిజినెస్‌లు కూడా స్టార్ట్ చేశారు. అలా అందరిలాగే సరికొత్తగా హోటల్ బిజినెస్‌లో అడుగుపెట్టింది బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా. అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించింది. ఈ హోటల్‌ను మరొకరి భాగస్వామ్యంతో ఆమె మొదలు పెట్టింది.అయితే న్యూయార్క్ సిటీలో సోనా పేరుతో ప్రారంభించిన రెస్టారెంట్ పార్ట్నర్షిప్ నుంచి ప్రియాంక చోప్రా పక్కకు తప్పుకుంది. దీంతో ఆమె వైదొలిగిన కొన్ని నెలలకే సోనా హోటల్‌ను పూర్తిగా మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. మూడేళ్ల పాటు చేసుకున్న ఒప్పందం ముగియడంతో షట్ డౌన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈనెల 30 సోనా రెస్టారెంట్‌కు చివరి రోజుగా ఇన్‌స్టా ద్వారా వెల్లడించారు. మూడేళ్లుగా మీకు సేవ చేయడం మాకు గొప్ప గౌరవం అంటూ పోస్ట్‌లో రాసుకొచ్చారు.కాగా.. 2021లో ప్రియాంక చోప్రా, మనీష్ గోయల్ కలిసి సంయుక్తంగా సోనా రెస్టారెంట్‌ను ప్రారంభించారు. 2023 చివర్లో చోప్రా రెస్టారెంట్‌తో తనకున్న భాగస్వామ్యాన్ని ముగింపు పలికింది. దీంతో ఆమె తప్పుకున్న ఆరు నెలలకే రెస్టారెంట్ మూసివేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. కాగా.. ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంది. కార్ల్ అర్బన్‌తో కలిసి 'ది బ్లఫ్' షూటింగ్‌తో బిజీగా ఉంది. View this post on Instagram A post shared by SONA (@sonanewyork) -
రూ.200 కోట్లు కొట్టేశారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకు (టీఎస్‌సీబీ) మేనేజర్ భర్త, కుమారుడు కలిసి ఏర్పాటు చేసిన ప్రియాంక ఫైనాన్స్ సంస్థ రూ.200 కోట్లు మేర స్వాహా చేసి బిచాణా ఎత్తేసింది. అధిక వడ్డీ పేరుతో అనేక మంది నుంచి డిపాజిట్లు సేకరించి ఐపీ పిటిషన్ దాఖలు చేసింది. బాధితుల ఫిర్యాదుతో సోమ వారం కేసు నమోదు చేసుకున్న నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులు దర్యాప్తు బాధ్యతల్ని సిట్‌కు అప్పగించారు. సోమవారం సీసీఎస్ కార్యాలయం వద్ద నిరసన తెలిపిన బాధితులు తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాకు చెందిన నిమ్మగడ్డ వాణి బాల, నేతాజీ భార్యాభర్తలు. సైదాబాద్‌లో వీళ్లు నివసిస్తుండగా... వాణి బాల ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో–ఆపరేటివ్ బ్యాంక్‌లో విధుల్లో చేరారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది టీఎస్సీబీగా మారగా ప్రస్తుతం వాణి బాల మేనేజర్ స్థాయిలో పని చేస్తున్నారు. 15 శాతం వడ్డీ ఇస్తామని చెప్పి.. దాదాపు 20 ఏళ్ల నుంచి వాణి బాల ఓ పథకం ప్రకారం బ్యాంక్‌కు వచ్చే వినియోగదారులను ఆకర్షిస్తూ వచ్చారు. టీఎస్సీబీలో డిపాజిట్ చేస్తే సాలీనా కేవలం 6 నుంచి 7% మాత్రమే వడ్డీ వస్తుందని, అబిడ్స్‌లోని టీఎస్‌సీబీ సమీపంలోనే తన భర్త నేతాజీ నెలకొలి్పన ఫైనాన్స్ సంస్థ ప్రియాంక ఎంటర్‌ప్రైజెస్‌లో డిపాజిట్ చేస్తే 15శాతం వడ్డీ వస్తుందని నమ్మబలికారు. బ్యాంకు కస్టమర్లతో పాటు సహోద్యోగులు, స్నేహితులను ఇందులో డిపాజిట్ చేసేలా ప్రేరేపించారు. చాలాకాలం చెల్లింపులు సక్రమంగా జరగడంతో అనేక మంది దృష్టి ఈ ప్రైవేట్ సంస్థపై పడింది.బ్యాంకులో భారీ మొత్తం డిపాజిట్ చేస్తే ప్రతి ఏడాదీ ఐటీ శాఖ వారికి లెక్కలు చూపాలని, తమ సంస్థలో ఆ ఇబ్బంది ఉండదంటూ మరికొందరిని ఆకర్షించారు. డిపాజిట్లుగా సేకరించిన మొత్తంతో ఏం చేస్తున్నారంటూ ఇటీవల కొందరు ప్రియాంక సంస్థ నిర్వాహకులను ప్రశ్నించారు. దీనికి నిర్వాహకులు తమకు జీడిమెట్ల, బెంగళూర్‌లో వ్యాపారాలు, కర్మాగారాలు ఉన్నాయంటూ చెప్పి నమ్మిస్తూ వచ్చారు. దీంతో వీరి వద్ద డిపాజిట్లు పెరిగాయి. గరిష్టంగా రూ.2 కోట్ల వరకు డిపాజిట్ చేసిన వాళ్లూ ఉన్నారు. కాగా, ఆ ఫైనాన్స్ సంస్థలో ఆమె కుమారుడు శ్రీహర్ష కీలకంగా వ్యవహరించాడు. ఆఫీసు, ఇంటికి తాళాలు: ఈ నెల 14న ఆఖరుసారిగా కార్యాలయం తెరిచిన నేతాజీ ఆయన కుమారుడు శ్రీహర్ష సిబ్బందిని హఠాత్తుగా పంపేసి తాళం వేశారు. ఈ విషయం తెలిసిన బాధితులు సైదాబాద్‌లోని ఇంటికి వెళ్లగా అక్కడా తాళమే కనిపించింది. దీంతో తాము మోసపోయామని భావించి అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారీ మొత్తంతో ముడిపడిన కుంభకోణం కావడంతో సీసీఎస్‌కు వెళ్లాల్సిందిగా అక్కడి అధికారులు సూచించారు. దీంతో వాళ్లు సోమవారం సీసీఎస్ డీసీపీ ఎన్.శ్వేతను కలిసి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. బాధితుల్లో అనేక మంది వృద్ధులు ఉన్నారని, వీళ్లంతా తమ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ప్రియాంక సంస్థలో పెట్టుబడిగా పెట్టారని అధికారులు చెప్తున్నారు. ఆర్నెల్లుగా వడ్డీల చెల్లింపుల్లో జాప్యం గతేడాది నవంబర్, డిసెంబర్ నుంచి వడ్డీల చెల్లింపులు సక్రమంగా జరగట్లేదు. అదేమని కొందరు ప్రశ్నించగా... ఎన్నికల సమయం కావడంతో డబ్బుల లావాదేవీలు తగ్గాయని అందుకే వడ్డీలు ఇవ్వడంలో ఆలస్యం అవుతోందంటూ నిర్వాహకులు చెప్పుకొచ్చారు. ఈ నెలాఖరుకు వాణి బాల సరీ్వసు పూర్తి కావస్తుండటంతో పదవీ విరమణ పొందాల్సి ఉంది. దీంతో ఈ నెల 3న ప్రియాంక సంస్థ నిర్వాహకులు సిటీ సివిల్ కోర్టులో దివాలా పిటిషన్ (ఐపీ) దాఖలు చేశారు. -
‘నిద్ర’కూ ఓ స్టార్టప్.. సూపర్ సక్సెస్!
ఒకరోజు నిద్ర పట్టక రకరకాలుగా ఆలోచిస్తుంటే... ‘నిద్ర’కు సంబంధించిన స్టార్టప్ ఐడియా తట్టింది ప్రియాంక సలోత్కు. ఆ రాత్రి వచ్చిన ఐడియా తనని ‘ఉద్యోగి’ స్థాయి నుంచి ‘ది స్లీప్’ కంపెనీ ద్వారా ‘ఎంటర్ప్రెన్యూర్’గా మార్చింది. దిండు నుంచి పరుపుల వరకు పేటెంటెడ్ స్మార్ట్‌గ్రిడ్ టెక్నాలజీతో ‘ది స్లీప్ కంపెనీ’ రూపొందించిన ఉత్పత్తులు మార్కెట్లో ప్రత్యేకతను చాటుకున్నాయి.రాజస్థాన్‌లోని గంగానగర్ జిల్లాకు చెందిన ప్రియాంక సలోత్ స్కూల్ రోజుల్లో హిందీ మీడియం నుంచి ఇంగ్లిష్ మీడియంలోకి వచ్చింది. అంతా కొత్త కొత్తగా అనిపించింది. అయితే అదేమీ తనని భయపెట్టలేదు. ఉత్సాహాన్ని ఇచ్చింది. హిందీ మీడియంలోలాగే ఇంగ్లిష్ మీడియంలోనూ చదువులో దూసుకుపోయింది. ఐఐఎం కోల్‌కత్తాలో చదువు పూర్తయిన తరువాత కార్పొరేట్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది.యంగ్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్ అయినæప్రియాంక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీ జేపీ మోర్గాన్‌తో కెరీర్ప్రారంభించింది. ఆ తరువాత సింగపూర్‌లో వేరే కంపెనీలో చేరింది. కొన్ని నెలల తరువాత... కన్సల్టింగ్ అండ్ ఇన్వెస్టింగ్ రోల్స్ తనకు సరికాదేమో అనిపించింది. నిజానికి ఈ రియలైజేషన్ అనేది ప్రియాంకకు ఇదే మొదటిసారి కాదు.దిల్లీలో ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు ‘షూడాగ్’ ‘స్టీవ్ జాబ్స్’ పుస్తకాల ప్రభావంతో ‘సాంకేతిక రంగంలో ఉండాలనుకోలేదు. ఇంజినీర్ కావాలనుకోలేదు. మరి నేనెందుకు ఇంజినీరింగ్ చేస్తున్నాను?’ అని తనని తాను ప్రశ్నించుకుంది. చాలామంది టాపర్స్లాగే ‘ఇంజనీరింగ్ లేదా మెడిసిన్’ అని ఆలోచించి ఇంజినీరింగ్ చేస్తుందే తప్ప ప్రత్యేక కారణం అంటూ లేదు. ఈ నేపథ్యంలోనే మేనేజేమెంట్ విషయాలపై తనకు ఉన్న ఆసక్తితో మేనేజ్మెంట్ కోర్సు చేసింది.సింగపూర్ నుంచి తిరిగివచ్చిన తరువాత ముంబైలోని కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీ ‘పీ అండ్ జీ’లో చేరి కన్సూ్యమర్ బ్రాండ్స్‌పై ఆసక్తిని పెంచుకుంది. ఏరియల్ డిటర్జంట్ బ్రాండ్‌లో పనిచేసిన తరువాత బేబీ డైపర్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ ‘΄ాంపర్స్’ హెడ్‌గా నియామకం అయింది. ఆ తరువాత... ప్రెగ్నెన్సీ వల్లప్రొఫెషనల్ లైఫ్ నుంచి విరామం తీసుకోవాల్సి వచ్చింది.ఆ సమయంలో ‘ఉద్యోగం కాదు సొంతంగా ఏదైనా వ్యా΄ారం చేయాలి’ అనే ఆలోచన ఆమెలో పెరిగి పెద్దదైంది. అదే సమయంలో చిన్న భయం కూడా మొదలైంది. ‘పెద్ద జీతాన్ని కాదనుకొని వ్యా΄ారం చేస్తే... ఎన్నో రిస్కులు ఎదురవుతాయి. వృత్తిజీవితంలో ముందుకు దూసుకుపోతున్నప్పుడు రిస్క్ చేయడం ఎందుకు?’ అనిపించింది. అయితే కొద్దిరోజుల్లోనే ఆమె కంఫర్ట్ జోన్ ఆలోచనల నుంచి బయటికి వచ్చింది.ఒక బిడ్డకు జన్మనిచ్చిన ప్రియాంక ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపింది. అలాంటి ఒక రాత్రి వచ్చిన ఆలోచనే... ది స్లీప్ కంపెనీ. తనలాగే ఎంతోమంది నిద్రలేమితో సతమతమవుతున్నారు. దీనికి ఒక పరిష్కారం ఆలోచిస్తే ‘స్లీప్ అండ్ కంఫర్ట్’ బిజినెస్‌కు సంబంధించి మంచి అవకాశం ఉంది అనిపించింది. తన స్టార్టప్ ఐడియా మిత్రులకు నచ్చలేదు. మళ్లీ ‘రిస్క్’ అనే భయం ముందుకు వచ్చింది. అయితే ఆ భయాన్ని వెనక్కి నెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసి తన ఐడియాపై సంవత్సరానికి పైగా పనిచేసింది.డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్‌లో పని చేసిన మాజీ ఉద్యోగి ఏకే త్రి΄ాఠీతో కలిసి హైటెక్–్ర΄ాడక్ట్ రూపకల్పన చేసింది. తరువాత భర్త హర్షిల్ సలోత్తో కలిసి ‘ది స్లీప్ కంపెనీ' ప్రారంభించింది. ప్రియాంక బిజినెస్ ఐడియా సక్సెస్ అవుతుందని నమ్మినవారి సంఖ్య తక్కువ. అయితే పేటెంటెడ్ స్మార్ట్‌గ్రిడ్ టెక్నాలజీతో వచ్చిన ‘ది స్లీప్ కంపెనీ’ మార్కెట్లో తనదైన ప్రత్యేకతను సృష్టించుకుంది. మొదట్లో రకరకాల సవాళ్లు ఎదురైనా కంపెనీకి సంబంధించిన ఫండింగ్ జర్నీ సాఫీగా సాగింది. పెద్ద సంస్థలు కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపించాయి. మ్యాట్రస్ బ్రాండ్ నుంచి స్లీప్ అండ్ కంఫర్ట్ టెక్ సొల్యూషన్ కంపెనీగా ఎదిగింది ది స్లీప్ కంపెనీ.వెయ్యి ఫెయిల్యూర్స్ తరువాత...‘ది స్లీప్ కంపెనీ’ లాంచ్ చేయడానికి ముందుప్రాడక్ట్స్కు సంబంధించి వెయ్యికి పైగా ప్రయోగాలు చేస్తే అన్నీ విఫలం అయ్యాయి. ఈ పరాజయాలు ఒక దశలో నన్ను నిరాశలోకి నెట్టి ‘ఉద్యోగానికి రాజీనామా చేసి తప్పు చేశానా?’ అని సందేహించేలా చేశాయి. ఫండ్ రైజింగ్ క్రమంలో ‘మీప్రాడక్ట్లో కొత్త ఏం ఉంది’ అంటూ రిజెక్షన్స్ మొదలయ్యాయి. ‘ఇక వెనక్కి వెళదాం’ అని ఆ సమయంలో అనుకొని ఉంటే ఎంటర్‌ప్రెన్యూర్‌గా నాకు పెద్ద విజయం దక్కేది కాదు. – ప్రియాంక సలోత్, కో–ఫౌండర్, ది స్లీప్ కంపెనిఇవి చదవండి: Sankari Sudhar: మాతృత్వం వరం! కెరీర్ రీ లాంచ్... అవసరం! -
వయనాడ్, రాయ్‌బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
ఐదో దశ నామినేషన్ల చివరి రోజు వరకు యూపీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారనే ఉత్కంఠను ఆ పార్టీ కొనసాగించింది. అయితే చివరికి ఆయన రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తున్నట్లు పార్టీ వెల్లడించింది. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ మరో సస్పెన్స్‌కు తెరలేపింది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఒకవేళ రాహుల్ అటు కేరళలోని వయనాడ్, ఇటు యూపీలోని రాయ్‌బరేలీలలో గెలిస్తే ఏ సీటును వదులుకుంటారనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ మెదులుతోంది.గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీ నుంచి మే 3న రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. రాహుల్‌కు ముందు ఆయన తల్లి సోనియా గాంధీ ఈ స్థానానికి వరుసగా 20 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు ఆమె రాజ్యసభ సభ్యురాలు. ఇదిలా ఉండగా వయనాడ్, రాయ్‌బరేలీలలో గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు? అనే ప్రశ్నకు లక్నో యూనివర్శిటీ రాజనీతి శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ సంజయ్ గుప్తా విశ్లేషణ చేశారు.తల్లి రాజకీయ వారసత్వం కోసం రాహుల్ గాంధీ అమేథీని వదిలి, రాయ్‌బరేలీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నిర్ణయం ద్వారా రాహుల్ గాంధీ సురక్షితమైన పందెం ఆడారు. మొదటిది బీజేపీ మహిళా నేత, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో పోటీపడితే గతంలో మాదిరిగా పరాభవం ఎదురుకాకుండా చూసుకున్నారు. మరోవైపు తన తల్లి గతంలో పోటీ చేసి, విజయం సాధించిన రాయ్‌బరేలీ స్థానాన్ని కాపాడుకునే ప్రయత్నం కూడా చేశారు.ఇక వయనాడ్ విషయానికొస్తే ముస్లిం, క్రైస్తవ ఓటర్లు అధికంగా ఉన్న ఈ లోక్‌సభ స్థానం సురక్షితమని రాహుల్ గాంధీ భావించారు. అలాగే అమేథీలో కన్నా రాయ్‌బరేలీలో పోటీ చేయడమే సరైనదని రాహుల్ నిర్ణయించుకున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్‌లో రాహుల్‌కు 7 లక్షల 6,000 ఓట్లు వచ్చాయి. ఆయన ప్రత్యర్థికి కేవలం రెండు లక్షల నాలుగు వేల ఓట్లు మాత్రమే దక్కాయి.అయితే ఈసారి వయనాడ్‌లో పరిస్థితులు మారాయి. రాష్ట్రంలోని అధికార వామపక్ష కూటమి ఈసారి అభ్యర్థిని మార్చింది. ఈసారి బీజేపీ ప్రధాన కార్యదర్శి డి.రాజా భార్య అన్నే రాజాపై రాహుల్ ఎన్నికల బరిలోకి దిగారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా రాహుల్‌కు ఇండియన్ ముస్లిం లీగ్ మద్దతు ఉంది. అయితే ఇక్కడ బీజేపీ కూడా తన సత్తాను చాటుకునే ప్రయత్నంలో ఉంది. ఒకవేళ రాహుల్ అటు వయనాడ్, ఇటు రాయ్‌బరేలీ రెండింటిలో గెలిస్తే రాయ్‌బరేలీని వదులుకుని, వయనాడ్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశాలున్నాయని ప్రొఫెసర్ సంజయ్ గుప్తా అన్నారు. అయితే అటువంటి సందర్భం ఏర్పడినప్పుడు రాయ్‌బరేలీకి జరిగే ఉప ఎన్నికలో రాహుల్ సోదరి ప్రియాంక పోటీ చేసి, గాంధీ కుటుంబపు కంచుకోటకు కాపాడే ప్రయత్నిం చేస్తారని ఆయన తన అభిప్రాయం తెలిపారు. -
ప్రియాంక హక్కును రాహుల్ లాక్కున్నారా?
యూపీలోని రాయ్‌బరేలీ నుంచి ప్రియాంకా గాంధీ పోటీచేస్తారని భావిస్తున్న తరుణంలో అక్కడి నుంచి రాహుల్ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు కాంగ్రెస్ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ఇక్కడి నుంచి రాహుల్ గాంధీ నామినేషన్ కూడా దాఖలు చేశారు.ఈ నేపధ్యంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై పలు ఆరోపణలు చేశారు. రాయ్‌బరేలీ నుంచి నామినేషన్ దాఖలు చేయడం ద్వారా రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా, ఆమె భర్తకు గల హక్కులను లాక్కున్నారని ఆరోపించారు. గుణ లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా జరిగిన బహిరంగ సభలో సీఎం మోహన్ యాదవ్ ఈ ఆరోపణలు చేశారు.ఓటమి భయంతో రాహుల్ గాంధీ అమేథీ (ఉత్తరప్రదేశ్) నుంచి వయనాడ్ (కేరళ)కు పారిపోయారని కూడా మోహన్ యాదవ్ ఎద్దేవా చేశారు. ఇటీవల రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారంటూ ఆ పార్టీ మద్దతుదారులు పోస్టర్లు అంటించారని యాదవ్ గుర్తు చేశారు. మొత్తంగా చూస్తే రాహుల్ గాంధీ అటు తన సోదరి ప్రియాంక, ఇటు బావ రాబర్ట్ వాద్రాల హక్కులను లాక్కున్నట్లయ్యిందని మోహన్ యాదవ్ పేర్కొన్నారు. -
ప్రియాంక విజయానికి ‘స్పెషల్ 24’!
యూపీలోని కాంగ్రెస్ కంచుకోట రాయ్ బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ విషయమై పార్టీ అధిష్టానం ఏ క్షణంలోనైనా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాయ్‌బరేలీలో ఎన్నికల నిర్వహణ కోసం రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ 24 మంది సభ్యులతో కూడిన సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. దీనిలో అసెంబ్లీ ప్రతినిధులు, ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, జిల్లా కాంగ్రెస్ కమిటీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.రాయ్‌బరేలీ నుంచి ఎవరు పోటీ చేయనున్నారనేది కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించనున్నారు. తాజాగా జరిగిన కాంగ్రెస్ సెంట్రల్ కోర్ కమిటీ సమావేశంలో మల్లికార్జున్ ఖర్గేకు టికెట్ ఖరారు చేసే అధికారాన్ని పార్టీ అధిష్టానం అప్పగించింది. ప్రస్తుతానికి ప్రియాంకగాంధీ పేరు ఫైనల్ అయినట్లు భావిస్తున్నప్పటికీ, అధిష్టానం అధికారికంగా ప్రకటించలేదు.రాయ్‌బరేలీ లోక్‌సభ ఎన్నికల కోసం సోనియా గాంధీ ప్రత్యేకంగా 24 మంది సభ్యులతో కూడిన సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో సోనియాగాంధీతోపాటు ఆమె ప్రతినిధి కేఎల్ శర్మ, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పంకజ్ తివారీ, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు ధీరజ్ శ్రీవాస్తవ, బచ్రావాన్ ఎమ్మెల్యే సుశీల్ పాసి, హర్చంద్పూర్ మాజీ ఎమ్మెల్యే సురేంద్ర విక్రమ్‌సింగ్, డాక్టర్ మనీష్ సింగ్ చౌహాన్, సరేని ఎమ్మెల్యే సుధా ద్వివేది, అతుల్ సింగ్, ఉంచహార్ ఎమ్మేల్యే సాహబ్ శరణ్ పాశ్వాన్, రాయ్‌బరేలీ మున్సిపాలిటీ అధ్యక్షుడు శత్రోహన్ సోంకర్, లాల్ గంజ్ నగర్ పంచాయతీ అధ్యక్షురాలు సరితా గుప్తా, రాయ్ బరేలీ మాజీ అధ్యక్షుడు ఇలియాస్, ఏఐసీసీ మాజీ సభ్యుడు కళ్యాణ్ సింగ్ గాంధీ, డీడీసీకి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత వీకే శుక్లాలు ఉన్నారు. ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్, ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జ్ అవినాష్ పాండే, రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆరాధన మిశ్రా రాయ్‌బరేలీ ఎన్నికల్లో వ్యూహకర్తలుగా కీలక పాత్ర పోషిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
రాయ్‌బరేలీ నుంచి ప్రియాంకా గాంధీ!
దక్షిణాదిలో కొంతవరకూ తమ ఎన్నికల పోరు ముగిసిన తరువాత కాంగ్రెస్ థింక్ ట్యాంక్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లోని తమ రాయ్‌బరేలీ కోటను కాపాడుకునేందుకు సిద్ధమయ్యింది. తాజాగా ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ సెంట్రల్ కోర్ కమిటీ సమావేశంలో రాయ్‌బరేలీ రాజకీయ సమీకరణాలపై చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాయ్‌బరేలీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే దానిపై నేడు (ఆదివారం)వెల్లడికానుంది.ప్రియాంక గాంధీ రాయ్‌బరేలీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని తెలుస్తున్నప్పటికీ ఆమె పేరును పార్టీ ఇంకా అధికారికంగా వెల్లడించాల్సివుంది. ప్రియాంక గాంధీ పోటీకి సంబంధించి జిల్లా కాంగ్రెస్ కమిటీకి ఇంకా హైకమాండ్ నుండి ఎటువంటి ఆదేశాలు రాలేదు. అయితే కాంగ్రెస్ జిల్లా కార్యాలయానికి రంగులు వేసే పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రియాంక గాంధీ రాయ్‌బరేలీకి రాగానే ఆమె తొలుత జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తారని, ఆ తర్వాత కోర్ కమిటీతో సంప్రదింపులు జరుపుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.జిల్లా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు ఈరోజు (ఆదివారం) చాలా ముఖ్యమైన రోజు. నేడు ప్రియాంక పోటీపై ఢిల్లీ నుంచి సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పంకజ్ తివారీ మాట్లాడుతూ ఇప్పుడు తాము ఢిల్లీ నుంచి వచ్చే సమచారం కోసం ఎదురు చూస్తున్నామన్నారు. ఏదిఏమైనప్పటికీ రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక పోటీ ఖాయమని, ఆమె ఇక్కడకు రాగానే ఎన్నికల సన్నాహాలు మొదలవుతాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
రాయ్‌బరేలీకి ఇద్దరు గాంధీలు? 40 ఏళ్ల కిందటి చరిత్ర పునరావృతం?
ఉత్తరప్రదేశ్‌లోని హై ప్రొఫైల్ సీట్లలో ఒకటైన రాయ్‌బరేలీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే విషయాన్ని అటు కాంగ్రెస్ గానీ, ఇటు బీజేపీగానీ ఇంకా వెల్లడించలేదు. అయితే ప్రియాంక గాంధీ రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపధ్యంలో ప్రియాంకకు పోటీగా నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన వరుణ్‌గాంధీని ఎన్నికల బరిలోకి దించాలని బీజేపీ నిర్ణయించింది. రాయ్‌బరేలీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు వరుణ్‌గాంధీకి బీజేపీ తాజాగా ఆఫర్ ఇచ్చిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే వరుణ్ తన సోదరి ప్రియాంకా గాంధీపై ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం అడిగారని సమాచారం.రాయ్‌బరేలీ అభ్యర్థుల ప్యానెల్లో వరుణ్ గాంధీ పేరును కూడా బీజేపీ కేంద్ర నాయకత్వం చేర్చినట్లు సమాచారం. రాయ్‌బరేలీ సీటు కాంగ్రెస్‌కు కంచుకోటగా పేరొందింది. ఈసారి సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లడంతో ప్రియాంక గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వరుణ్‌గాంధీని రంగంలోకి దించితే కాంగ్రెస్‌కు గట్టిపోటీ ఎదురవుతుందని బీజేపీ అంతర్గత సర్వేలో వెల్లడైంది. ఈ నేపధ్యంలోనే వరుణ్ గాంధీని ఇక్కడి నుంచి పోటీచేయించేందుకు బీజేపీ రంగం సిద్ధం చేసింది. ఒకవేళ వరుణ్ గాంధీ రాయ్ బరేలీ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తే, గాంధీ కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు పోటీ చేయడం 40 ఏళ్ల తర్వాత జరుగుతున్నట్లవుతుంది. 1984 లోక్‌సభ ఎన్నికల్లో వరుణ్ గాంధీ తల్లి మేనకా గాంధీ అమేథీ నుంచి రాజీవ్ గాంధీపై పోటీ చేశారు. అప్పట్లో ఆమె ఓటమిని ఎదుర్కొన్నారు. ఆ తరువాత మేనకా గాంధీ, సోనియా గాంధీ కుటుంబాలు పరస్పరం ఎన్నికల్లో పోటీకి దిగలేదు. ప్రస్తుతం యూపీలోని సుల్తాన్పూర్ స్థానం నుంచి మేనకా గాంధీ మరోసారి ఎన్నికల బరిలోకి దిగారు. -
అఖిలేష్ ర్యాలీ, ప్రియాంక రోడ్ షో..
ఉత్తరప్రదేశ్‌లోని ఎనిమిది లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. నేటి (బుధవారం) సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నేపధ్యంలో నేడు ఘజియాబాద్‌లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించనున్నారు. మరోవైపు సహరాన్‌పూర్‌లో పార్టీ అభ్యర్థి ఇమ్రాన్ మసూద్‌కు మద్దతుగా ప్రియాంక గాంధీ రోడ్‌షో నిర్వహించనున్నారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చౌదరి భూపేంద్ర సింగ్ కూడా సంస్థాగత సమావేశాన్ని నిర్వహించి, బూత్ నిర్వహణకు కార్యకర్తలకు పలు సూచనలు చేయనున్నారు. ఎన్నికల ప్రచారానికి చివరి రోజున పార్టీలన్నీ తమ ప్రచారహోరును పెంచాయి. ఉత్తరప్రదేశ్‌లోని సహారన్పూర్, కైరానా, ముజఫర్‌నగర్, బిజ్నోర్, నగీనా, మొరాదాబాద్, రాంపూర్, పిలిభిత్‌లలో మొదటి దశలో ఓటింగ్ జరగనుంది. ఈ ఎనిమిది స్థానాల్లోని ఏడు స్థానాల్లో బీజేపీ అభ్యర్థి, ఒక స్థానంలో ఆర్ఎల్డీ అభ్యర్థి పోటీలో ఉన్నారు. అలాగే ఎస్పీ నుంచి ఏడుగురు, కాంగ్రెస్ నుంచి ఒకరు ఎన్నికల బరిలోకి దిగారు. మొత్తం ఎనిమిది స్థానాల్లో బీఎస్పీ తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఎస్పీ అధినేత అఖిలేష్ ప్రచార ర్యాలీని కూడా నిర్వహించనున్నారని సమాచారం. -
కాంగ్రెస్‌కు ఓటు వేయలేని స్థితిలో రాహుల్, సోనియా?
ఈ టైటిల్ చూసి ఏవేవో ఊహలకు వెళ్లకండి. ఓటు వేసే విషయంలో వారిపై ఎటువంటి నిర్బంధం లేదు. అయితే ఇక్కడొక ట్విస్ట్ ఉంది. అదేమిటో, వారితో పాటు ప్రియాంకా గాంధీ కూడా కాంగ్రెస్‌కు ఓటు వేయలేని పరిస్థితిలో ఎందుకు ఉన్నారో, దీనికి గల కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఢిల్లీలో ఆసక్తిగా మారనున్న రాజకీయ సమీకరణాలను మనం చూడబోతున్నాం. ‘ఇండియా కూటమి’ ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీతో సీట్లను పంచుకున్నప్పుడు, గాంధీ కుటుంబానికి చెందిన ఈ ముగ్గురు నేతల ఓట్లు కాంగ్రెస్‌కు పడే అవకాశాలు లేవని ఎవరూ ఊహించివుండరు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు న్యూఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన ఓటర్లు. అయినా వారు ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో వారి సొంత పార్టీకి ఓటు వేసుకోలేరు. ‘ఆప్’తో పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న న్యూఢిల్లీ స్థానాన్ని అరవింద్ కేజ్రీవాల్ పార్టీకి అప్పగించింది. న్యూఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, తూర్పు ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ లోక్‌సభ స్థానాల్లో ‘ఆప్’ పోటీ చేయనుండగా, కాంగ్రెస్ చాందినీ చౌక్, ఈశాన్య ఢిల్లీ, నార్త్ వెస్ట్ ఢిల్లీలో పోటీ చేస్తోంది. న్యూఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ రాజకీయాలకు నెలవుగా ఉండేది. అయితే 2014లో మోదీ వేవ్ ఇక్కడి అన్ని సమీకరణలను తుడిచిపెట్టేసింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి గాంధీ కుటుంబ సభ్యులు తమ సొంత పార్టీకి ఓటు వేయలేని పరిస్థితి ఏర్పటడం బహుశా ఇదే తొలిసారి. నిజానికి కాంగ్రెస్ పార్టీ తనకు తగ్గుతున్న మద్దతు కారణంగా, యూపీ, ఢిల్లీతో సహా అనేక రాష్ట్రాల్లో ఇతర పార్టీలతో చేతులు కలపవలసి వచ్చింది. 1952- 2009 మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ న్యూఢిల్లీ స్థానాన్ని ఏడు సార్లు గెలుచుకుంది. బీజేపీకి చెందిన మీనాక్షి లేఖి ఇక్కడి నుంచి వరుసగా రెండుసార్లు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. 2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ న్యూఢిల్లీ స్థానం నుండి గెలిచి పార్లమెంటుకు చేరుకున్నారు. కాంగ్రెస్ నేతలైన సోనియా, రాహుల్, ప్రియాంకల ఇళ్లు న్యూఢిల్లీ ఏరియాలోనే ఉండటంతో వారికి ఇక్కడే ఓటు హక్కు ఉంది. మరోవైపు ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రాజీవ్ శుక్లా కూడా న్యూఢిల్లీ ఓటర్లే. దీంతో వీరు కూడా కాంగ్రెస్‌కు ఓటు వేయలేని స్థితిలో ఉన్నారు. -
భారత్ జోడో న్యాయ యాత్రలో రాహుల్, ప్రియాంక!
కాంగ్రెస్ రెండో దశ భారత్ జోడో న్యాయ యాత్ర ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నుంచి తిరిగి ప్రారంభమైంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, పార్టీ అధినేత్రి ప్రియాంక గాంధీ ఓపెన్ జీపులో యాత్రలో పాల్గొన్నారు. వీరిని చూసేందుకు జనం తరలివచ్చారు. రాహుల్, ప్రియాంకలను స్వాగతిస్తూ జనం వారిపై పూల వర్షం కురిపించారు. ఈ సమయంలో సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు కూడా యాత్రలో పాల్గొన్నారు. అమ్రోహా, సంభాల్, బులంద్‌షహర్, అలీఘర్, హత్రాస్, ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ వరకు జరిగే ఈ యాత్రలో రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కూడా పాల్గొంటున్నారు. ఆదివారం ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా ఈ యాత్రలో పాల్గొననున్నారు. ఆగ్రా అనంతరం ఈ యాత్ర రాజస్థాన్‌లోకి ప్రవేశిస్తుంది. మార్చి 26న ఈ యాత్రకు విరామం కల్పించనున్నారు. రాహుల్ గాంధీ ఫిబ్రవరి 27, 28 తేదీలలో న్యూఢిల్లీలో జరిగే పార్టీ సమావేశాలకు హాజరుకానున్నారు. అనంతరం భారత్ జోడో న్యాయ యాత్ర మార్చి 2న మధ్యాహ్నం 2 గంటలకు ధోల్పూర్ నుంచి తిరిగి ప్రారంభంకానుంది. ఈ యాత్ర మొరెనా, గ్వాలియర్, శివపురి, గుణ, షాజాపూర్, ఉజ్జయిని, మధ్యప్రదేశ్‌లోని పలు జిల్లాల మీదుగా సాగనుంది. -
సోనియా రాజ్యసభ నామినేషన్.. వెంటవచ్చిన రాహుల్, ప్రియాంక!
రాజ్యసభ ఎన్నికల్లో రాజస్థాన్ నుంచి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పోటీ చేస్తున్నారు. ఇందుకోసం ఆమె ఈరోజు(బుధవారం) నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాజధాని జైపూర్ చేరుకున్న ఆమె వెంట రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. సోనియా గాంధీ లోక్‌సభ నుంచి కాకుండా రాజ్యసభ నుంచి పార్లమెంటుకు చేరుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రియాంక గాంధీ యూపీలోని రాయ్‌బరేలీ స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోటసార నివాసంలో సోనియాగాంధీ నామినేషన్ సెట్‌పై ఎమ్మెల్యేలందరూ సంతకాలు చేశారు. #WATCH कांग्रेस संसदीय दल की अध्यक्ष सोनिया गांधी राज्यसभा चुनाव के लिए अपना नामांकन दाखिल करने के लिए जयपुर, राजस्थान पहुंचीं। उनके बेटे और पार्टी सांसद राहुल गांधी और उनकी बेटी और पार्टी महासचिव प्रियंका गांधी वाड्रा उनके साथ हैं। pic.twitter.com/0oGUmMr1to — ANI_HindiNews (@AHindinews) February 14, 2024 సీనియర్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ 1999 లోక్‌సభ సభ్యురాలుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె అమేథీ లోక్‌సభ సభ్యురాలిగానూ ఉన్నారు. ఆమె పార్లమెంటు ఎగువ సభకు వెళ్లడం ఇదే తొలిసారి. ఫిబ్రవరి 8వ తేదీ నుంచి రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ పత్రాల పరిశీలన ఫిబ్రవరి 16న జరగనుంది. అభ్యర్థులు ఫిబ్రవరి 20లోగా తమ పేర్లను ఉపసంహరించుకోవచ్చు. అవసరమైతే ఫిబ్రవరి 27న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ నిర్వహించి, అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. -
ప్రియుడితో ప్రేమ పెళ్లి.. విడాకులతో షాకిచ్చిన బుల్లితెర నటి!
కోలీవుడ్‌లో బుల్లితెరపై మెప్పించిన నటి ప్రియాంక నల్కారి. తమిళంలో సీతారామన్ అనే సీరియల్‌తో కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత రోజా సీరియల్‌తో ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత సమ్‌థింగ్ సమ్‌థింగ్’, ‘కాంచన-3’ సినిమాల్లోనూ మెరిసింది. అంతేకాకుండా టాలీవుడ్లో అందరి బంధువయా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఎస్ఎంఎస్, హైపర్, నేనేరాజు నేనేమంత్రి, వైఫ్ఆఫ్ రామ్, కిక్-2 చిత్రాల్లో నటించింది. అయితే గతేడాది ఆడియన్స్‌కు ఊహించని షాకిచ్చింది ప్రియాంక. తన ప్రియుడిని సీక్రెట్‌గా పెళ్లాడింది. బుల్లితెర నటుడు రాహుల్ వర్మను మలేషియాలో పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేసింది. ఆ వార్త విన్న ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురయ్యారు. కోలీవుడ్‌లో బుల్లితెరతో పాటు వెండితెరపై మెరిసిన ప్రియాంక నల్కారి ఇండస్ట్రీలో బాగానే గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తమిళంలో నలదమయంతి అనే సీరియల్లో లీడ్ రోల్ పోషిస్తున్నారు ప్రియాంక నల్కారి. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటోంది.' ఏడాదిలోపే విడాకులు..! గతేడాది మార్చిలో పెళ్లిబంధంతో ఒక్కటైన ఈ జంట విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆడియన్స్‌తో నిర్వహించిన ఇంటరాక్షన్‌లో సెషన్లో ఈ విషయాన్ని వెల్లడించింది. మీరు భర్తతో విడిపోయారా? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు అవునని సమాధానమిచ్చింది ప్రియాంక. అలా అభిమానులు అడిగిన ప్రశ్నలకు తన ఇన్‌స్టా స్టోరీస్ ద్వారా సమాధానాలిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ షాక్‌కు గురవుతున్నారు. పెళ్లైన ఏడాదిలోపే ప్రియాంక విడాకులు తీసుకోవడంతో కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో వివాహం జరిగిన కొద్ది రోజుల్లోనే ప్రియాంక సీతారామన్ సీరియల్ నుంచి తప్పుకుంది. అప్పట్లోనే దీనికి కారణం తన భర్తే అని కూడా చెప్పుకొచ్చింది. ప్రియాంక ఓ సీరియల్లో నటించేందుకు చెన్నైకి రావడం.. ఆమె భర్త మలేషియాలో ఉండడంతో వారి మధ్య దూరం పెరగడం వల్లే ప్రియాంక నటనకు స్వస్తి చెప్పిందని కూడా కొందరు రాసుకొచ్చారు. కానీ.. ఆ తర్వాత ప్రియాంక నలదమయంతి అనే సీరియల్‌తో మళ్లీ నటించడం ప్రారంభించింది. కొన్ని రోజుల క్రితమే ప్రియాంక తన ఇన్స్టాగ్రామ్ పేజీలో భర్త ఫోటోలన్నింటినీ తొలగించింది. ప్రియాంక భర్త రాహుల్ కూడా ఆమెతో ఉన్న ఫోటోలన్నీ డిలీట్ చేశాడు. అయితే విడిపోవడానికి గల కారణాన్ని మాత్రం ప్రియాంక నల్కారి వెల్లడించలేదు. ఈ టాపిక్ ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇక ప్రియాంక భర్త రాహుల్ వర్మ విషయానికొస్తే.. నటుడు, బిజినెస్ మేన్ రాణిస్తున్నారు. అతడు తెలుగులో పలు సీరియల్స్‌లో నటించాడు. అదే క్రమంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. కొంతకాలంగా ప్రేమలో మునిగితేలిన ఈ జంట 2018లో సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఆ తర్వాత గతేడాది మలేషియాలో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారు. View this post on Instagram A post shared by Priyanka Nalkari Official (@nalkarpriyanka) -
ప్రియాంకకు చెప్పాలనుకున్న బ్యాడ్ న్యూస్ ఇదేనా?
-
త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ప్రియాంక, శోభా శెట్టి !
-
లోక్‌సభ ఎన్నికల్లో యూపీ నుంచి రాహుల్, ప్రియాంక పోటీ?
ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో అధిష్టానంతో సమావేశమయ్యారు. అనంతరం యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో యూపీ నుంచి పోటీ చేయడం గురించి ఆయన మాట్లాడుతూ..‘అది వారి ఇల్లు. అక్కడి నుంచే వారు పోటీ చేస్తారు. అలహాబాద్, ప్రయాగ్‌రాజ్, రాయ్ బరేలీ, అమేథీలలోని వారి పూర్వీకులతో వారికి మంచి సంబంధాలు ఉన్నాయి. 40 ఏళ్లుగా అక్కడి ప్రజలతో వారికి దృఢమైన అనుబంధం ఉంది. ఈ బంధం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది’ అని అన్నారు. పార్టీ అధిష్టానం ఉత్తరప్రదేశ్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని, ఖర్గే , రాహుల్, ప్రియాంక తదితర జాతీయ నాయకులు యూపీ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని తాము కోరామన్నారు. యూపీలో పొత్తుల గురించి అజయ్ రాయ్ మాట్లాడుతూ దీనిపై నిర్ణయాన్ని పూర్తిగా జాతీయ నాయకత్వానికే వదిలేశామని అన్నారు. తాము ఏకగ్రీవ తీర్మానం చేసి, ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కాగా ఢిల్లీలో అధిష్టానంతో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: నేడు అయోధ్యకు శ్రీరామ పాదుకలు कांग्रेस मुख्यालय, दिल्ली में राष्ट्रीय अध्यक्ष श्री @kharge जी, जननायक श्री @RahulGandhi जी, कांग्रेस महासचिव/प्रभारी, UP श्रीमती @priyankagandhi जी व राष्ट्रीय महासचिव संगठन @kcvenugopalmp जी ने प्रदेश अध्यक्ष श्री @kashikirai जी, CLP लीडर श्रीमती @aradhanam7000 जी व प्रदेश के… pic.twitter.com/Yp4vbrcIxZ — UP Congress (@INCUttarPradesh) December 18, 2023 -
రాహుల్, ప్రియాంక పర్యటించిన చోట్ల
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేతల ఎన్నికల ప్రచారం ఆ పార్టీ అభ్యర్థులకు మిశ్రమ ఫలితాన్నిచ్చింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించిన స్థానాల్లో కొన్ని చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలవగా, మరికొన్ని చోట్ల పరాజయం పాలయ్యారు. ఈ ఏడాది అక్టోబర్18న తన సోదరి ప్రియాంకతో కలిసి వరంగల్ జిల్లాకు వచ్చిన రాహుల్ ప్రచారం నిర్వహించిన ములుగు, వరంగల్ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. రాహుల్ వెళ్లిన భూపాలపల్లి, వరంగల్ ఈస్ట్, కొల్లాపూర్, కల్వకుర్తి, జడ్చర్ల, షాద్‌నగర్, బోధన్, వేములవాడ స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక, ఆయనతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెళ్లినప్పటికీ సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఓటమి పాలు కావడం గమనార్హం. ప్రియాంక వెళ్లిన కొడంగల్, ఖానాపూర్, పాలేరు, ఖమ్మం, మధిర స్థానాల్లో గెలవగా, జహీరాబాద్, మల్కాజ్గిరి స్థానాల్లో పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. రాహుల్ వెళ్లిన కామారెడ్డి, ఆదిలాబాద్‌లోనూ పార్టీ అభ్యర్థి ఓడిపోగా, ఆంధోల్‌లో విజయం సాధించారు. జీహెచ్ఎంసీ పరిధిలో రాహుల్ ప్రచారం చేసిన జూబ్లీహిల్స్, నాంపల్లి, మల్కాజ్గిరి స్థానాల్లో అభ్యర్థులు ఓడిపోయారు. ఖర్గే హాజరైన నల్లగొండలో కోమటిరెడ్డి భారీ మెజార్టీతో గెలవగా, ఆలంపూర్లో సంపత్‌కుమార్ పెద్ద తేడాతో ఓటమి పాలయ్యారు. గతంలో సోనియాగాంధీ సభ నిర్వహించిన తుక్కుగూడలో పార్టీ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి (ఇబ్రహీంపట్నం) భారీ మెజార్టీతో విజయం సాధించడం గమనార్హం -
సీన్ మారింది
పెళ్లయిన కథానాయికలు సినిమాల్లో కొనసాగాలంటే ‘కీ’ రోల్స్‌తో సరిపెట్టుకోవాల్సిందే అనే సీన్ మారిపోయింది. పెళ్లయినా, తల్లయినా ‘లీడ్’ రోల్స్ చేయొచ్చనే సీన్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఫార్టీకి దగ్గర్లో, ఫార్టీ ప్లస్ తారలు లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ లీడ్ లేడీస్‌గా, రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల్లో హీరోల సరసన నటిస్తూ దూసుకెళుతున్నారు. హాలీవుడ్లో ఫార్టీ, ఫిఫ్టీ ప్లస్ తారలు కూడా లీడ్ రోల్స్ చేస్తున్నట్లు ఇండియన్ హీరోయిన్లు చేయడం ఓ శుభ పరిణామం. ఇక ఆ కథానాయికలు చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. ►లేడీ సూపర్ స్టార్ అనిపించుకున్న నయనతార చేతిలో ఎప్పుడూ మూడు నాలుగు సినిమాలు ఉంటాయి. వాటిలో లేడీ ఓరి యంటెడ్ మూవీస్ మినిమమ్ మూడు అయినా ఉంటాయి. ప్రస్తుతం ఆమె కథానాయికప్రాధాన్యంగా చేస్తున్న చిత్రాల్లో ‘అన్నపూరణి’ (అన్నపూర్ణ), ‘టెస్ట్’ ఉన్నాయి. ‘అన్నపూరణి’ నయనకి 75వ చిత్రం. డిసెంబరు 1న విడుదల కానున్న ఈ చిత్రంలో బ్రాహ్మణ యువతిగా నటించారు నయన. ఈ చిత్రం టీజర్లో మాంసాహారానికి సంబంధించిన బుక్ చదువుతూ కనిపించారామె. ఇక మరో చిత్రం ‘టెస్ట్’. ఇందులో మాధవన్, సిద్ధార్థ్, నయనతార లీడ్ రోల్స్‌లో కనిపిస్తారు. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ముగ్గురి జీవితాలు క్రికెట్‌తో ఎలా ముడిపడ్డాయనేది ఈ చిత్రం కథాంశం. ► హీరో సూర్యను పెళ్లి (2006) చేసుకుని సుమారు పదేళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన జ్యోతిక 2015 నుంచి ఇప్పటివరకూ దాదాపు డజను కథానాయికప్రాధాన్యంగా సాగే చిత్రాల్లో నటించారు. ఆ తరహా చిత్రాలు మరిన్ని చేయడానికి కథలు వింటున్న జ్యోతిక ఇరవయ్యేళ్ల తర్వాత ఇటీవల హిందీలో ‘శ్రీ’, ‘బ్లాక్ మ్యాజిక్’ చిత్రాల్లో లీడ్ రోల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే మలయాళంలో ‘కాదల్–ది కోర్’ అనే చిత్రంలో ముమ్ముట్టితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. పదేళ్ల తర్వాత జ్యోతిక మలయాళంలో చేస్తున్న చిత్రమిది. ఇరవయ్యేళ్ల తర్వాత హిందీలో, పదేళ్ల తర్వాత మలయాళంలో సినిమాలు ఒప్పుకున్నారంటే నటిగా తన కెరీర్‌ని ఇంకా విస్తరించేలా జ్యోతిక ప్లాన్ చేసుకుంటున్నారని ఊహించవచ్చు. ►హీరో ఉపేంద్ర భార్య, నటి ప్రియాంక ఓ ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సింగిల్ లెన్స్‌తో తీసిన తొలి చిత్రం ‘క్యాప్చర్’లో ఆమె లీడ్ రోల్ చేశారు. ఒక నటి లీడ్ రోల్ చేసిన ఈ చిత్రానికి లీడ్ రోల్స్ చేస్తూ దూసుకెళుతున్న మరో నటి రాధికా కుమారస్వామి సమర్పకురాలిగా వ్యవహరించడం విశేషం. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ఇలా ఏజ్‌తో సంబంధం లేకుండా తగ్గేదే లే అంటూ లీడ్ రోల్స్ చేస్తున్న తారలు ఇంకొందరు ఉన్నారు. ►కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి భార్య, నటి రాధికా కుమారస్వామి ఒకేసారి రెండు ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రాలు ‘అజాగ్రత్త’, ‘భైరా దేవి’లో నటిస్తున్నారు. ‘భైరా దేవి’ సినిమాలో ఆమె అఘోరాగా కనిపించనున్నారు. ఇక ‘అజాగ్రత్త’ ఏడు భాషల్లో విడుదల కానుంది. మామూలుగా స్టార్ హీరోల చిత్రాలు పాన్ ఇండియాగా పలు భాషల్లో విడుదలవు తుంటాయి. కథానాయికప్రాధాన్యంగా సాగే ఓ సినిమా ఏడు భాషల్లో పాన్ ఇండియాగా రిలీజ్ కావడం అంటే చిన్న విషయం కాదు. ►నలభయ్యేళ్ల వయసులో ఉన్న తారల్లో త్రిష ఒకరు. ఈ బ్యూటీ ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాల్లో కన్నా రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల్లో హీరోల సరసన నటిస్తూ బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం అజిత్ సరసన తమిళంలో ‘విడా ముయర్చి’, మోహన్‌లాల్‌తో మలయాళంలో ‘రామ్’ చిత్రాల్లో నటిస్తున్నారు త్రిష. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో ‘పొన్నియిన్ సెల్వన్ 2’లో యువరాణిగా కనిపించిన త్రిష గత నెల విజయ్ సరసన ‘లియో’తో పాటు ‘ది రోడ్’ అనే ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలో కనిపించారు. -
ప్రియాంక ఉపేంద్ర ప్రయోగాత్మక చిత్రం 'క్యాప్చర్' విడుదలకు సిద్దం
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర భార్య ప్రియాంక ప్రయోగాత్మక చిత్రం క్యాప్చర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటి వరకు తెరపైకి రానటువంటి ప్రయోగాత్మక చిత్రమిదని యూనిట్ తెలిపింది. సినిమా మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్ నుంచి షూట్ చేసినట్టుగా అనిపిస్తుంది. సింగిల్ లెన్స్‌తో తీసిన మొట్ట మొదటి సినిమా కూడా ఇదే. దర్శకుడు లోహిత్.హెచ్ ఎప్పుడూ కూడా కొత్త పాయింట్‌తోనే సినిమాలు తీస్తుంటారు. ప్రియాంక ఉపేంద్ర, లోహిత్ కాంబోలో ఇది వరకు మమ్మీ, దేవకి వంటి చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు మూడోసారి మరో ప్రయోగాత్మక చిత్రమైన ‘క్యాప్చర్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని షమికా ఎంటర్ప్రైజెస్, శ్రీ దుర్గా పరమేశ్వరి ప్రొడక్షన్స్ బ్యానర్స్ మీద రవి రాజ్ నిర్మిస్తున్నారు. రాధికా కుమారస్వామి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ అంతా కూడా గోవాలోనే జరిగింది. 30 రోజుల పాటు నిరవధికంగా చిత్రీకరించారు. ప్రస్తుతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాను విడుదల చేయాలని మేకర్లు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ప్రియాంక ఉపేంద్ర పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌ను గమనిస్తే ప్రియాంక మొహం మీద తీవ్ర గాయాలు కనిపిస్తున్నాయి. ఇక ఆమె చుట్టూ సీసీటీవీ కెమెరాలు కనిపిస్తున్నాయి. వాటి మధ్యలో ఓ కాకి కనిపిస్తోంది. వ్యక్తుల చేతులు కూడా కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఏదో ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో సినిమాను మలిచినట్టుగా ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోయింది. శివ రాజ్ కుమార్ తగరు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న మన్విత కామత్ ఈ చిత్రంలో ఓ కీ రోల్ పోషిస్తున్నారు. మాస్టర్ కనిష్‌రాజ్ ఈ చిత్రంతో బాలనటుడిగా పరిచయం కాబోతున్నారు. పాండికుమార్ ఈ చిత్రానికి కెమెరామెన్‌గా, రవిచంద్రన్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. -
16 నుంచి కాంగ్రెస్ ప్రచార హోరు
సాక్షి, హైదరాబాద్: నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియగానే రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్, ప్రియాంకా గాందీలతోపాటు కీలక నేతలను రంగంలోకి దింపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వారు వారం రోజుల పాటు ఇక్కడే మకాం వేసి, జిల్లాల్లో విస్తృతంగా పర్యటించేలా షెడ్యూల్ రూపొందిస్తోంది. ఈ నెల 15న నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార గడువు ముగియనున్న నేపథ్యంలో 16వ తేదీ నుంచి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలనూ ప్రచార బరిలోకి దింపాలని భావిస్తోంది. అయితే భారీ సభలు కాకుండా రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్‌ల ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటించేలా.. ఈ నెల 16 తర్వాత రాహుల్, ప్రియాంకా గాందీలతో రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించేలా షెడ్యూల్ తయారవుతోంది. పెద్ద సభలను ఏర్పాటుచేసి ప్రజలను అక్కడికి తీసుకురావడం కంటే ప్రజల వద్దకే వెళ్లేలా కార్యక్రమాలు నిర్వహించేందుకు టీపీసీసీ సిద్ధమైంది. అన్ని కొత్త జిల్లాల్లో ఇద్దరు అగ్రనేతలతో రోడ్‌షోలు చేయించాలని, అక్కడే కార్నర్ మీటింగ్‌ల ద్వారా కాంగ్రెస్ ఎన్నికల గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు సిద్ధరామయ్య, అశోక్‌గెహ్లోత్, సుఖ్విందర్సింగ్ సుక్కు, భూపేశ్ బఘేల్‌లను కూడా ఎన్నికల ప్రచారానికి తీసుకురానుంది. హిమాచల్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అమలు చేసిన పథకాల గురించి వారు వివరించనున్నట్టు టీపీసీసీ వర్గాలు చెప్తున్నాయి. ఇక కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదంటూ బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేలా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వంటి నేతలను ప్రచార భాగస్వాములను చేయనుంది. ఈ ప్రచారమంతాపూర్తయ్యాక చివరిగా ఏఐసీసీ అగ్రనేత, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోగానీ, ఉత్తర తెలంగాణలోని కీలక ప్రాంతంలోగానీ భారీ బహిరంగ సభ నిర్వహించి, పోలింగ్ మూడ్‌లోకి వెళ్లిపోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. నేడు కామారెడ్డిలో బీసీ గర్జన సభ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం కామారెడ్డిలో బీసీ గర్జన సభ నిర్వహించనుంది. నామినేషన్ల దాఖలుకు చివరిరోజు కావడంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి గా నామినేషన్ వేయనున్నారు. ఆ కార్యక్రమం ముగిశాక బీసీ గర్జన సభ నిర్వహించనున్నారు. దీనిలో బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించనున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ సభలో పాల్గొంటున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ఆయన స్పష్టమైన ప్రకటన చేస్తారని.. బీఆర్ఎస్ ఆరోపణలకు తగిన విధంగా బదులిస్తారని టీపీసీసీ వర్గాలు చెప్తున్నాయి. -
సరిహద్దుల్లో పటిష్ట నిఘా! కలెక్టర్‌తో వ్యయ పరిశీలకుల భేటీ..
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా సరిహద్దులో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పటిష్ట పర్యవేక్షణ చేస్తున్నామని, వాహనాలను నిశిత పరిశీలన చేస్తూ నగదు, మద్యం, ఇతర వస్తువుల రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల వివరించారు. కలెక్టర్‌తో శనివారం ఎన్నికల వ్యయ పరిశీలకులు సంజీబ్‌కుమార్ పాల్, అజయ్‌లాల్ చంద్‌లు కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. జిల్లాలోని పినపాక, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాలకు అజయ్‌లాల్ చంద్, కొత్తగూడెం, ఇల్లెందు, అశ్వారావుపేట నియోజకవర్గాలకు సంజీబ్‌కుమార్ పాల్ వ్యయ పరిశీలకులుగా ఎన్నికల సంఘం నియమించింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్ని కల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కమిటీలను నియమించినట్లు తెలిపారు. సెన్సిటివ్ నియోజకవర్గాలైన ఇల్లెందు, కొత్తగూడెంలలో అదనపు సహా వ్యయ పరిశీలకులను, వీడియో వ్యూయింగ్ టీంలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఫిర్యాదులకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. జిల్లా సరిహద్దుగా ఉన్న ఇతర రాష్ట్రాల నుంచి మద్యం, ఇతర వస్తువులు రాకుండా చర్యలు తీసుకున్నామని, చెక్‌పోస్టులు, సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ జరుగుతోందని అన్నారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు మాట్లాడుతూ సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఖర్చులు పక్కాగా నమోదు చేయాలి.. అభ్యర్థుల ఖర్చులు కచ్చితంగా నమోదు చేయాలని ఎన్నికల వ్యయపరిశీలకులు సంజీబ్‌కుమార్ పాల్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో కొత్తగూడెం, అశ్వారావుపేట, ఇల్లెందు నియోజకవర్గాల వ్యయ, ఎంసీఎంసీ, ఆబ్కారీ, ఆదాయపన్ను శాఖ, ఎన్నికల ప్రవర్తనా నియమావళి నోడల్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియలో పాటించాల్ని విషయాలను సోదాహరణంగా వివరించారు. పెయిడ్ న్యూస్‌ను గుర్తించాలి! నిరంతర పర్యవేక్షణతో పెయిడ్ న్యూస్‌ను గుర్తించాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు సంజీబ్‌కుమార్ పాల్ సూచించారు. శనివారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఎంసీఎంసీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజూ వివిధ దినపత్రికలు, శాటిలైట్ చానల్స్, కేబుల్, సిటీ కేబుల్, సామాజిక మాధ్యమాల్లో అభ్యర్థుల ప్రచారాలను పరిశీలించాలని చెప్పారు. గుర్తించిన పెయిడ్ న్యూస్, ప్రకటనలపై ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల ద్వారా అభ్యర్థులకు నోటీసులు జారీ చేయాలన్నారు. జిల్లాలో చెక్‌పోస్టుల వద్ద కొనసాగుతున్న పర్యవేక్షణను, సీసీ కెమెరాల రికార్డింగ్ పనితీరును పరిశీలించారు. సీ విజిల్ వచ్చిన ఫిర్యాదులు వాటి పరిష్కారాలు, ఎస్ఎస్టీ, ఎఫ్‌ఎస్‌టీి టీముల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో పినపాక రిటర్నింగ్ అధికారి ప్రతీక్‌జైన్, వ్యయ నియంత్రణ నోడల్ అధికారులు వెంకటేశ్వరరెడ్డి, వెంకటేశ్వర్లు, లైజన్ అధికారులు సంజీవరావు, సీతారాంనాయక్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు దారా ప్రసాద్, ఎంసీఎంసీ నోడల్ అధికారి, డీపీఆర్వో ఎస్.శ్రీనివాసరావు, మైనార్టీ సంక్షేమ అధికారి సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. ఇల్లెందులో.. ఎన్నికల వ్యయ పరిశీలకులు సంజీవ్‌కుమార్ పాల్, అజయ్ లాల్‌చంద్ సోనేజీ శనివారం ఇల్లెందులో పర్యటించారు. తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్యాలయంల అకౌంటింగ్ బృందాన్ని కలుసుకున్నారు. ఇవి చదవండి: జంప్ జిలానీలు..! ఉన్న నేతలు ఎప్పుడో ఏ పార్టీలో చేరుతారో? -
అరరే... ఎంత పనైపాయే!
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ ప్రియాంక మిశ్రా ఊరకనే ఉండి ఉంటే వైరల్ అయ్యేది కాదు. సదరు కానిస్టేబుల్ ఇన్స్టాగ్రామ్ రీల్ చేసి వైరల్ అయింది. ఈ రీల్లో ప్రియాంక మిశ్ర ‘కర్తవ్యం’ సినిమాలో విజయశాంతిని గుర్తు తెచ్చేలా ఓ లెవెల్లో నటించింది. సహజత్వం కోసం సర్వీస్ గన్ను ఉపయోగించి మరీ నటించింది. ఈ వీడియో వైరల్ కావడం మాట ఎలా ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం ‘చాల్లేండి సంబడం’ అంటూ ఆమెను సస్పెండ్ చేసింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా మళ్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేయడానికి ప్రియాంక దరఖాస్తు చేసుకుంది. ఆమె దరఖాస్తు ఆమోదం పొందింది. ఆగ్రాలో పోస్టింగ్ కూడా ఇచ్చారు. అయితే 48 గంటల్లోనే ఆమె నియామకాన్ని పోలీస్ కమిషనర్ ప్రీతిందర్సింగ్ రద్దు చేశారు. ప్రియాంక మిశ్రాపై సోషల్ మీడియాలో సానుభూతి చూపుతున్నవారితో పాటు, సానుభూతి చూపుతూనే ‘స్వయంకృతాపరాధం’ అని విమర్శించిన వాళ్లు కూడా ఉన్నారు. -
డిటెక్టివ్ తీక్షణ
‘రణరణమున రథము నిలిపి, రుధిర నదిని ఎదురు మలిపి..’’ అంటూ సాగుతుంది ‘డిటెక్టివ్ తీక్షణ’ చిత్రంలోని ‘రేజ్ ఆఫ్ తీక్షణ’ పాట. చిత్ర సంగీత దర్శకుడు పెద్దపల్లి రోహిత్ రాసిన ఈ పాటను హైమత్ మొహమ్మద్, సాయి చరణ్ భాస్కరుని, అరుణ్ కౌండిన్య పాడారు. ప్రియాంకా ఉపేంద్ర టైటిల్ రోల్లో ఈ చిత్రానికి త్రివిక్రమ్ రఘు దర్శకత్వం వహించారు. గుత్తా ముని ప్రసన్న, ముని వెంకట చరణ్, పురుషోత్తం .బి కోయురు నిర్మించిన ఈ చిత్రం కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, బెంగాలీ, ఒరియా భాషల్లో రిలీజ్ కానుంది. -
తన స్నేహితురాలు.. రూంకు వచ్చి చూసేసరికి..
సాక్షి, కరీంనగర్: నగరంలోని పాతబజారులో నివా సం ఉండే ఓ యువతి అదృశ్యమైంది. వన్‌టౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. మానకొండూర్ మండలం కొండపల్కలకు చెందిన టి.ప్రియాంక(22) ఇంటర్ పూర్తిచేసింది. పాతబజారు ప్రాంతంలో స్నేహితులతో అద్దెకుంటూ స్థానికంగా ఓ షాపింగ్‌మాల్‌లో పనిచేస్తోంది. శుక్రవారం ఉదయం పని నిమిత్తం గదినుంచి బయటకు వెళ్లింది. రాత్రి తన స్నేహితురాలు రూంకు వచ్చిచూసేసరికి తాళం వేసి ఉండడంతో వారి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. పలుచోట్ల వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో శనివారం వన్‌టౌన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంకెప్పటికి మారతాం?!
ఆ కేంద్రపాలిత ప్రాంతం మొత్తంలో ఏకైక మహిళా ఎమ్మెల్యే ఆమె. అక్కడి ప్రభుత్వంలో ఉన్న ఒకే ఒక్క మహిళా మంత్రి కూడా ఆమే! తీరా, అలాంటి వ్యక్తి కూడా తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందంటే ఏమనాలి? మామూలు పరిస్థితుల్లో రాజీనామా చేయడం కాదు... లింగ, కుల దుర్విచక్షణల్ని తట్టుకోలేక రాజీనామా చేశానంటున్నారు. ఆ ఆరోపణలు దిగ్భ్రమ కలిగిస్తున్నాయి. పుదుచ్చేరిలోని ఏకైక దళిత, మహిళా ఎమ్మెల్యే సి. చంద్ర ప్రియాంక ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తిగా మారారు. అయితే, ఆమె అసమర్థత రీత్యానే పదవి నుంచి తప్పించామని అధికార కూటమి అంటోంది. ఏమైనా, ఈ మహిళా మంత్రి రాజీనామా ఉదంతం స్త్రీలు, వెనుకబడిన కులాల పట్ల మన వ్యవస్థలోని చిన్నచూపును మరోసారి చర్చకు పెడుతోంది. దాదాపు 40 ఏళ్ళ విరామం తర్వాత పుదుచ్చేరిలో మంత్రి పదవి దక్కిన మహిళ చంద్రిక అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ముప్ఫై మంది సభ్యుల పుదుచ్చేరి అసెంబ్లీలో కారైక్కాల్ ప్రాంతంలో రిజర్వుడు స్థానమైన నెడుంగాడు నుంచి ఎన్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి సారథ్యంలోని ఎన్డీఎ ప్రభుత్వంలో 2021లో ఆమెకు మంత్రి పదవి దక్కింది. ‘మంచి ఆలోచనలతో, కష్టపడి పనిచేయాలని రాజకీయాల్లోకి వచ్చాన’న్న చంద్రిక పురుషాధిక్య రాజకీయ ప్రపంచంలో వివక్షకు గురయ్యానని ఆరోపించారు. ప్రజాదరణ ఉన్నా కుట్రల్ని తట్టుకొని, ధనశక్తి అనే భూతంపై పోరాడడం తేలిక కాదని గ్రహించినట్టు ఆమె తన రాజీనామా లేఖలో ఆవేదన చెందారు. ప్రతిపక్ష కాంగ్రెస్, డీఎంకె, వామపక్షాలు ప్రభుత్వాన్నీ, సీఎం ‘దళిత వ్యతిరేక వైఖరి’నీ తప్పు బట్టాయి. అయితే, కీలకమైన మంత్రి పదవిని చంద్రిక సమర్థంగా నిర్వహించట్లేదనీ, ఆరునెలలుగా చెబుతున్నా పట్టించుకోవట్లేదనీ, అందుకే ఆమెను పదవి నుంచి తప్పించామనీ, కేంద్రానికి లేఖ పంపగానే అది తెలిసి ఆమె ముందే రాజీనామా చేశారనీ అధికార పక్షం చెబుతోంది. చిత్రమేమిటంటే, అధికారపక్షం చెబుతున్న ఈ కథనాన్నే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నరైన మరో మహిళ తమిళిసై సౌందరరాజన్ పేర్కొనడం! దుర్విచక్షణ ఉన్నట్టు తెలీదనీ, తనకు చెబితే పరిస్థితిని చక్కదిద్దేదాన్ననీ గవర్నర్ అన్నట్టు తమిళ పత్రికల కథనం. అయితే, మన దేశంలో అలాంటివి లేవనుకోవడం వట్టి భ్రమ. ఆ మాటకొస్తే, ఎవరూ బయటపడకపోయినా చంద్రిక కథ లాంటిదే... ఈ దేశంలోని పలు వురు మహిళా నేతల వ్యధ! పురుషాధిక్య ప్రపంచంలో, అందులోనూ రాజకీయాల్లో ఎన్నో సహించి, భరిస్తే కానీ స్త్రీలు తమకంటూ చిన్నచోటు దక్కించుకొని, గొంతు విప్పలేరన్నది నిష్ఠురసత్యం. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ, చట్టం చేయడానికి సైతం దశాబ్దాలు పట్టిన రాజకీయ వ్యవస్థ మనది. అది అమలయ్యేదెన్నడో నిర్దిష్టంగా చెప్పలేని పరిస్థితి. ఈ పరి స్థితుల్లో చంద్రిక లాంటి వారి ఉదంతాలు ఒక మేలుకొలుపు. ఆమె ఆరోపణలు సంపూర్ణ అసత్యాలని కొట్టిపారేయలేం. స్వతంత్ర భారత శతవసంతాల నాటికి మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చేయాలనేది పాలకులు ప్రవచిస్తున్న లక్ష్యం. 2047 కల్లా అది సాధ్యం కావాలంటే, జనాభాలో దాదాపు సగం ఉన్న మహిళల పాత్ర, వారి ప్రాతినిధ్యం కీలకం. కానీ, అధిక శాతం పార్టీలు, ప్రభుత్వాల చేతలు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. గమనిస్తే, 1970ల వరకు లోక్‌సభలో మహిళా ప్రాతినిధ్యం 5 శాతం వద్దే తచ్చాడుతూ వచ్చింది. 2009లో గానీ అది రెండంకెలకు చేరు కోలేదు. రాజ్యసభలో అయితే 1951 నుంచి ఇప్పటి దాకా ఏనాడూ మహిళల సంఖ్య 13 శాతమైనా దాటలేదు. రాష్ట్ర శాసనసభల్లోనైతే సగటు మహిళా ప్రాతినిధ్యం 10 శాతం కన్నా తక్కువే. మహిళా మంత్రుల సంఖ్యలోనూ మన దేశంలో ఇదే పరిస్థితి. గత మూడు దశాబ్దాల పైచిలుకులో కేంద్రంలో మంత్రిపదవులను చేపట్టిన స్త్రీలు నాటి మహిళా ప్రాతినిధ్యంతో పోలిస్తే 11 శాతమే. క్యాబినెట్ హోదా దక్కినవారైతే 7 శాతమే. రాజకీయ పాలనలో కాదు, ప్రభుత్వ అధికార యంత్రాంగంలోనూ ఆడవారి వాటా మరీ తీసికట్టు. మొత్తం 30 లక్షల పైచిలుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో 11 శాతమే స్త్రీలు. కార్యనిర్వాహక, శాసన నిర్మాణ వ్యవస్థలతో పోలిస్తే, భారత న్యాయ వ్యవస్థలో లింగ సమానత మరీ కనాకష్టం. 1950 నుంచి చూస్తే, సుప్రీమ్ కోర్ట్ జడ్జీల్లో కూడా ఆడ వాళ్ళు 3 శాతమే. ప్రతిచోటా ఉన్నత స్థాయికి చేరడానికి అతివలకు అనేక అవరోధాలు. ఈ గణాంకాలన్నీ ఇప్పటికీ మహిళల పట్ల మనకున్న దుర్విచక్షణకూ, మారని మన పితృస్వామ్య భావజాలా నికీ నిలువుటద్దాలు. దానికి తోడు దళితులు, వెనుకబడిన వర్గాల స్త్రీల పరిస్థితి మరీ కష్టం. ఈ నేపథ్యం నుంచి పుదుచ్చేరి ఉదంతాన్ని చూసినప్పుడే సమస్య లోతులు స్పష్టమవుతాయి. దాదాపు 156 దేశాల్లో సగటున 23 శాతం మహిళా మంత్రులుంటే, భారత్ తద్భిన్నం. కేంద్రంలో పేరుకు మహిళా మంత్రుల సంఖ్య పెంచినా, వారికి రక్షణ, పరిశ్రమలు, రైల్వేలు, రవాణా, వ్యవసాయం లాంటి కీలక శాఖలు అప్పగించడం అరుదు. ఈ పరిస్థితిని మార్చాలంటే, మహిళా రిజర్వేషన్ చట్టాలు తెస్తే సరిపోదు. కులం, మతం, ప్రాంతం, జెండర్ అంశాల్లో పార్టీల, ప్రజల ఆలోచన మారాలి. వెనుకబడిన వర్గాల, స్త్రీల సమర్థతను శంకించడం క్షమార్హం కాదు. అవకాశమిచ్చి, ప్రోత్సహిస్తే, పలువురు నేతల కన్నా వారే సమర్థులు. పాలిచ్చి పెంచిన అమ్మలు మనల్ని పాలించ లేరా? కుటుంబానికి ఇరుసుగా మారి, మొత్తం సమాజాన్ని నిలబెడుతున్న స్త్రీలు సమర్థులు కారా? వారికా సమర్థత లేదనుకోవడం మూర్ఖత్వం. మకిలిపట్టిన మనసుల్లోని మనుస్మృతి భావజాలం! -
అమ్మాయిల స్కెచ్.. యవర్ అడ్డంగా బలైపోయాడు!
'బిగ్‌బాస్'లో ఎప్పుడేం జరుగుతుందో అస్సలు ఊహించలేకపోతున్నాం. ఇప్పుడు కూడా అలానే జరిగింది. అంతా బాగానే ఉందనుకునే టైంలో ప్రిన్స్ యవర్‌కి ఇద్దరమ్మాయిలు షాకిచ్చారు. వాళ్లు వేసిన స్కెచ్ దెబ్బకు మనోడు అడ్డంగా బలైపోయాడు. ఏడుపు తప్ప ఇంకేం మిగల్లేదు. ఇంతకీ హౌసులో 19వ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందనేది ఇప్పుడు హైలైట్స్‌లో చూద్దాం. (ఇదీ చదవండి: 'సప్త సాగరాలు దాటి' సినిమా రివ్యూ) ఫిట్టింగ్ పెట్టేశాడు! తొలి రెండు వారాల్లో పవరస్త్రని సందీప్, శివాజీ గెలుచుకున్నారు. మూడో వారం పవరస్త్ర కోసం జరిగిన పోటీలో ఫైనల్‌గా ముగ్గురు మిగిలారు. కదలకుండా నిల్చుకుని ప్రిన్స్ యవర్, అత్యంత కారంగా ఉండే చికెన్ ముక్కలు తిని శోభా, జుత్తుని కత్తిరించుకుని ప్రియాంక.. ఫైనల్-3లో నిలబడ్డారు. ఇక శుక్రవారం ఎపిసోడ్ మొదలవడమే బిగ్‌బాస్ ఫిట్టింగ్ పెట్టేశాడు. పోటీలో ఉన్న ముగ్గురిలో ఏ ఒక్కరు అనర్హులో.. వాళ్లే డిసైడ్ చేసుకోవాలని బిగ్‌బాస్ చెప్పుకొచ్చాడు. యవర్ బలైపోయాడు అయితే సైడ్ అయ్యే వ్యక్తి ఎవరా అని ముగ్గురు చాలాసేపు డిస్కషన్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే శోభా, యవర్ పేరుని.. యవర్, శోభా పేరుని చెప్పారు. అలా చెప్పిన టైంలో ఒకరిపై ఒకరు అరుస్తూ గొడవపడ్డారు. ఇక డిసైడింగ్ ఓటు వేయాల్సిన ప్రియాంక.. శోభా పేరు చెప్పింది. అలానే టేబుల్ పై ఉన్న యవర్ బొమ్మని ఇద్దరూ కలిసి సుత్తితో ఇరగ్గొట్టారు. తనని పక్కకు జరపడాన్ని తట్టుకోలేకపోయిన యవర్.. అదే సుత్తితో తన బొమ్మ ఉన్న బెంచ్‌ని బలంగా కొట్టాడు. దెబ్బకు అది విరిగిపోయింది. (ఇదీ చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి రాబోతున్న 'ఏజెంట్') కోపానికి కారణాలు చెప్పాడు గతవారం రణధీర టీమ్‌లో ఉండి కష్టపడినప్పుడు కావొచ్చు.. ఇప్పుడు కావొచ్చు యవర్‌కి అవకాశం రాలేదు. దీంతో తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. తొలుత హౌస్ అంతా అరుస్తూ తిరిగాడు. కాసేపటికి ఏడుపు మొదలుపెట్టాడు. శివాజీ దగ్గర కూర్చుని తన బాధలు చెప్పాడు. జాబ్ లేదు, ఒకానొక టైంలో రూ.100 కూడా లేని రోజులు ఉన్నాయని.. అందుకే తనకు కోపం, ఆకలి అని కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పాడు. తనకు సరైన జడ్జిమెంట్ దక్కట్లేదని బాధపడిపోయాడు. ఆమె గెలిచిందా? చివరగా మిగిలిన ప్రియాంక-శోభాశెట్టి మధ్య బుల్ ఫైట్ పోటీ పెట్టాడు. ఇందులో భాగంగా ఎలక్ట్రికల్ బుల్ ఉంటుంది. దానిపై మూడు రౌండ్లు కలిపి ఎవరైతే ఎక్కువసేపు ఉంటారో వాళ్లు విజయం సాధించినట్లు అని బిగ్‌బాస్ చెప్పాడు. ఈ ఆటలో భాగంగా చాలా తెలివిగా వ్యవహరించిన ప్రియాంక.. బుల్‌పై తాడుని పట్టుకుని పడుకున్న పొజిషన్లో ఉండిపోయింది. మూడుసార్లు అలానే చేసింది. శోభాశెట్టి మాత్రం ప్రతిసారి కూర్చున్న పొజిషన్లో బుల్‌పై తక్కువసేపే ఉన్నట్లు అనిపించింది. ఇద్దరు ప్రియాంకనే విజేత అనిపిస్తుంది. కానీ అధికారిక ప్రకటన మాత్రం వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున చేస్తారని బిగ్‌బాస్ చెప్పడంతో శుక్రవారం ఎపిసోడ్ ఎండ్ అయింది. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'లో 3వ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమెనా?) -
నేడు సోనియా సమక్షంలో కాంగ్రెస్ గూటికి తుమ్మల
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అసంతృప్తనేత, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు శనివారం(నేడు) కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. సీడ బ్ల్యూసీ సమావేశాల విరామ సమయంలో శనివారం ఆ పార్టీ అగ్ర నేతలు సోనియా, రాహుల్‌గాంధీల సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. పార్టీలోకి రావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఇప్ప టికే తుమ్మలను ఆహ్వానించిన విషయం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని తుమ్మల నివాసా నికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రేతోపాటు రేవంత్, భట్టి విక్ర మార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెళ్లారు. పార్టీలోకి రావాలని మరోమారు ఆహ్వానించగా సానుకూలంగా స్పందించిన తుమ్మల శనివారం కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని గాంధీభవన్ వర్గాలు తెలిపా యి. కాగా, సీడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగా రాష్ట్రంలోని పలువురు మాజీమంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమా చారం. వీరిని ఈ నెల 17న తుక్కుగూడ సభా వేదికగా పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించినప్ప టికీ అనివార్య కారణాల వల్ల దానిని మార్చారని తెలిసింది. శని, ఆదివారాల్లో జరిగే సీడబ్ల్యూసీ సమావేశాల విరామ సమయంలోనే వీరిని సోని యా, రాహుల్, ఖర్గే సమక్షంలో పార్టీలో చేర్చుకోవా లని నిర్ణయించినట్టు సమాచారం. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి తుమ్మల పోటీ చేసే అవకాశముందని సమాచారం. -
పల్లెటూరి వాడివంటూ భార్య వేధింపులు
కర్ణాటక: కుటుంబ కలహాలతో ఓ మెట్రో ఇంజినీర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. గురువారం తుమకూరు జిల్లా తిపటూరు తాలూకా కిబ్బనహళ్లి పరిధిలో చోటు చేసుకుంది. మంజునాథ్ (38) జిల్లాలోని కుందూరుపాళ్య గ్రామానికి చెందిన వాడు. బెంగూళూరు నగరంలో మెట్రోలో ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్న ఇతడు పదేళ్ల క్రితం తురువెకెరెకు చెందిన ప్రియాంకను పెళ్లి చేసుకున్నాడు. ఇదిలా ఉంటే దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. పల్లెటూరి వాడివంటూ మంజునాథ్‌ను ప్రియాంక వేధించేదని సమాచారం. ఆమె వేధింపులు తట్టుకోలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మంజునాథ్ తన సోదరుడికి ఆడియో మెసేజ్ పంపాడు. కిబ్బనహళ్లి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
టాలీవుడ్ సీరియల్ నటి నూతన గృహప్రవేశం.. ఎలా ఉందో చూశారా!
మౌనరాగం ఫేమ్ ప్రియాంక జైన్ గురించి పరిచయం అక్కర్లేదు. మాటలు రాని మూగ అమ్మాయిగా నటించి అద్భుతహ అనిపించింది. ముంబయికి చెందిన ముద్దుగుమ్మ తెలుగులో సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ నటించింది. జానకి కలగనలేదు సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. చల్తే చల్తే, ఎవడు తక్కువ కాదు, వినరా సోదర వీర కుమార లాంటి చిత్రాల్లో కనిపించింది. అంతే కాకుండా మౌనరాగంతో పాటు ఇంటికి దీపం ఇల్లాలు సీరియల్లో నటించింది. అయితే మౌనరాగం ఫేమ్, సహనటుడు శివకుమార్ మరిహల్తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైంది. గతంలో వీరిద్దరు చాలా సార్లు హోమ్ టూర్స్ చేస్తూ జంటగా కనిపించారు. వారి మధ్య రిలేషన్ గురించి ఇప్పటికే చాలా వీడియోలు చేశారు. (ఇది చదవండి: ఎమ్మెల్యేగా పోటీ అంటూ ఊహాగానాలు.. రాహుల్ సిప్లిగంజ్ క్లారిటీ) అయితే వీరి పెళ్లి సంగతి పక్కనపెడితే ఆమె నటిస్తోన్న జానకి కలగనలేదు సీరియల్‌ను అర్ధాంతరంగా ఆపేశారు. కొంతకాలంగా ప్రేక్షకులకు తలభారంగా మారడంతో ఎలాగోలా 662 ఎపిసోడ్ వరకు అతి కష్టం మీద లాక్కొచ్చారు. కానీ చివరికీ ఇక నిర్మాతలు కూడా చేతులెత్తేయడంతో సీరియల్‌కు ఎండ్ కార్డ్ వేయక తప్పలేదు. తాజాగా జానకి కలగనలేదు ఫేమ్ ప్రియాంక జైన్ తన యూట్యాబ్ ఛానెల్లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. తాము కొత్త ఇంటిలో చేరబోతున్నట్లు వీడియోలో వెల్లడించింది. నూతన గృహ ప్రవేశానికి సంబంధించిన కార్యక్రమాన్ని ఆ వీడియోలో చూపించింది. గృహ ప్రవేశానికి వచ్చిన వారందరికీ ప్రియాంక జైన్, శివ కుమార్ కానుకలు కూడా అందజేశారు. ఈ సందర్భంగా తమ సొంతింటి కల సాకారమైందని ప్రియాంక ఆనందం వ్యక్తం చేశారు. కాగా.. ఇక ప్రియాంక జైన్, శివ కుమార్.. ‘మౌనరాగం’ సీరియల్ అప్పటి నుంచి రిలేషన్లో ఉన్నారు. (ఇది చదవండి: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇల్లు చూశారా? ఎంత బాగుందో!) -
రాష్ట్ర సచివాలయంలో ఉచిత వైద్య శిబిరం
సాక్షి, అమరావతి: రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణకు గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మణిపాల్ ఆస్పత్రి వైద్యులు ఉద్యోగులకు వైద్య పరీక్షలు చేశారు. కార్డియాలజీ, ఆర్థోపెడిక్స్, జనరల్ ఫిజిషియన్ స్పెషలిస్ట్, క్యాన్సర్ వైద్య పరీక్షలతో పాటు, ఈసీజీ, 2డీ ఎకో ఇతర వైద్య పరీక్షలు చేశారు. మొత్తం 750 మంది వైద్య సేవలు పొందారు. శిబిరంలో డాక్టర్ వేణు గోపాల్‌రెడ్డి, డాక్టర్ ప్రియాంక, డాక్టర్ శివ, ఏపీ సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
శరీరమంతా స్క్రూలు, రాడ్లు.. బతకడం కష్టమేనన్నారు: నటి
సాధారణంగా సెలబ్రిటీలు అంటే అందరూ వాళ్ల పూలపాన్పులాంటిదేనని భావిస్తుంటారు. కానీ అలాంటి వారి జీవితాల్లోనూ తెరవెనుక కన్నీళ్ల కథలు కూడా ఉంటాయి. అలా తెరపై అందరినీ నవ్వించే ప్రియాంక కామత్ నిజ జీవితంలోనూ నరకం అనుభవించింది. తన హాస్యంతో రియాల్టీ షోలలో నవ్వులు పూయిస్తూ.. తన జీవితంలో తెరవెనుక కన్నీటి బాధను అనుభవించింది. (ఇది చదవండి: ఆగస్ట్‌లో ‘మెగా’ సందడి.. వారానికో సినిమా, బరిలో చిన్న చిత్రాలు కూడా!) మజ్జా భరత, గిచ్చి గిలి గిలీ ఫేమ్ ప్రియాంక కామత్ శాండల్‌వుడ్‌లో పరిచయం అక్కర్లేని పేరు. ఆమె కలర్స్ కన్నడలోని గిచ్చి గిలి గిలి షోలో తన పంచ్ కామెడీతో ప్రేక్షకులను అలరించింది. సోషల్ మీడియాలోనూ రీల్స్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. అంత సవ్యంగా సాగిపోతున్న నటి జీవితంలో అనారోగ్యంతో బారిన పడి చావు అంచులదాకా వెళ్లి వచ్చింది. గతేడాది డిసెంబర్లో ప్రియుడు అమిత్ పెళ్లి చేసుకున్న ప్రియాంకకు వెన్నెముక సంబంధించిన అనారోగ్యం సమస్యలు తలెత్తాయి. దాదాపు నడవలేని స్థితికి చేరుకుంది ఆమె. దాదాపు ఎనిమిది నెలలపాటు బెడ్‌కే పరిమితమైన ప్రియాంక ఆ తర్వాత అనారోగ్యం నుంచి కోలుకుంది. ఈ ఆపద సమయంలో తన భర్త అండగా నిలిచి తనకు పునర్జన్మనిచ్చాడని ఎమోషనలైంది ప్రియాంక. ఆమె మాట్లాడుతూ.." గతేడాది అమిత్‌తో నిశ్చితార్థం జరిగింది. కొన్ని నెలలకే నాకు వెన్నెముక సమస్యలు వచ్చాయి. వెన్నెముక శస్త్రచికిత్స తర్వాత.. మరో రెండు శస్త్రచికిత్సలు కూడా జరిగాయి. నా శరీరానికి 70 శాతం ఇన్ఫెక్షన్ వచ్చింది. నేను బతికే అవకాశాలు 50 శాతం మాత్రమేనని డాక్టర్స్ చెప్పారు. ఎందుకంటే నా శరీరంలో స్క్రూలు, రాడ్లు అమర్చారు. దాదాపు 8 నెలలు మంచానికే పరిమితమయ్యా. దీంతో అమిత్‌కు నన్ను విడిచిపెట్టి మరొకరిని పెళ్లి చేసుకోమని చెప్పా. కానీ అతను కష్టకాలంలో నాకు అండగా నిలిచాడు. అంతే కాదు తను నా డ్రెస్సింగ్, డైపర్ ప్యాడ్లు మార్చడంలో నాకు సహాయం చేసేవాడు.' అంటూ చెప్పుకొచ్చింది. కాగా.. ఈ జంట డిసెంబర్ 2022 లో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఈ జంట ఆనందంగా ఉన్నారు. (ఇది చదవండి: భర్తకి ప్రముఖ నటి విడాకులు.. ప్రాణం పోయిన ఫీలింగ్!) View this post on Instagram A post shared by People of India (@officialpeopleofindia) View this post on Instagram A post shared by Priyanka Kamath (@kamath.priyanka) -
నేటి నుంచి తల్లిపాల వారోత్సవాలు..
భద్రాద్రి: ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహించే తల్లిపాల వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల పిలుపునిచ్చారు. ఐడీఓసీలో సోమవారం నిర్వహించిన సమావేశంలో వారోత్సవాల వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తల్లిపాల ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు కె.వెంకటేశ్వర్లు, మధుసూదన్‌రాజు, డీఎంహెచ్ఓ డాక్టర్ శిరీష, ఆస్పత్రుల సమన్వయ అధికారి రవిబాబు, మహిళా, శిశు సంక్షేమాధికారి సబిత, ఉపాధి కల్పన అధికారి విజేత పాల్గొన్నారు. వరద నష్టాల నివేదిక అందించాలి జిల్లాలో వరద నష్టాల నివేదికలను అందజేయాలని కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. ఐడీఓసీలో పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరద సహాయక చర్యల్లో అధికారుల పనితీరును అభినందించారు. వర్షాలు, వరదలతో దెబ్బతిన్న పంటలు, పశువులు, ఇళ్లు, పిడుగుపాటు తదితర అంశాలపై సమగ్ర నివేదికలు రూపొందించాలని సూచించారు. ఆర్అండ్బీ శాఖ పరిధిలో నాలుగు వంతెనలు దెబ్బతిన్నాయని, పంచాయతీరాజ్ పరిధిలో 97 రహదారులు మరమ్మతులకు గురి కాగా 60 పనులు పూర్తి చేశామని తెలిపారు. 11 చోట్ల దెబ్బతిన్న పైపులైన్లకు మరమ్మతులు చేపట్టాలన్నారు. ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి, సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. వచ్చిన దరఖాస్తులలో కొన్ని.. ► ఇల్లెందు సీఎస్పీ బస్తీకి చెందిన ఆదివాసీ వ్యవసాయదారులు.. తాము 1987 నుంచి పట్టా భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నామని సింగరేణి అధికారులు జేకే 5 ఓసీ ఏర్పాటుకు సర్వే నిర్వహించి ఏర్పాటు చేసిన హద్దుల ప్రకారం తమ భూములను కోల్పోతున్నామని, జీవనోపాధి కల్పించాలని దరఖాస్తు చేయగా రెవెన్యూ అధికారులకు ఎండార్స్ చేశారు. ►పాల్వంచ నవభారత్ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలో సౌకర్యాలు లేక విద్యార్థినులు ఇబ్బంది పడుతున్నారని, ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది నిర్లక్ష్యంతో తప్పుదోవ పడుతున్నారని విద్యార్థి, యువజన సంఘాలు దరఖాస్తు చేయగా త్వరలో పరిశీలించి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ►కొత్తగూడెం మున్సిపాలిటీ నాలుగో వార్డులో కాలువల నిర్మాణం మంజూరైనా ప్రారంభించ లేదని బీజేపీ పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్ అగర్వాల్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు జోగు ప్రదీప్ తదితరులు ఫిర్యాదు చేయగా కమిషనర్‌ను పిలిచి సమస్యపై ఆరా తీశారు. సంబంధిత వార్డు కౌన్సిలర్, చైర్‌పర్సన్‌ను ఆహ్వానించి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. -
ఆ లేఖ నాదే, నేనే రాశా
కర్ణాటక: ఎమ్మెల్యేలకు మంత్రులు అస్సలు విలువ ఇవ్వడం లేదు, తక్షణం సీఎల్పీ భేటీ ఏర్పాటు చేయాలని ఆయన పార్టీ పెద్దలకు లేఖ రాస్తారు. దానిపై వివాదం ఏర్పడితే.. అబ్బే ఆ లేఖ నేను రాయలేదు, ఎవరో నకిలీ లేఖను సృష్టించారు, బీజేపీ వారికి ఇదే పని అని ఎస్పీకి ఫిర్యాదు చేస్తారు. మరుసటి రోజుకు మాట మార్చి.. ఆ లేఖ నాదే..అగౌరవాన్ని సహించేది లేదు అని హుంకరిస్తారు. కలబుర్గి కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ వైఖరి ఇప్పుడు చర్చనీయాంశమైంది. తాజాగా ఏమన్నారంటే లేఖ రాయడంపై క్షమాపణ కోరేది లేదని బీ.ఆర్.పాటిల్ తాజాగా ప్రకటించారు. ఆదివారం కల్బుర్గిలో మాట్లాడిన పాటిల్, ఎవరు క్షమాపణ కోరారో నాకు తెలియదు. సీఎల్పీ సమావేశం నిర్వహించాలని కోరడం మా హక్కు. కొందరు మంత్రుల ప్రవర్తన అనేకమందికి అసంతృప్తికి కారణమైంది. ఆత్మగౌరవానికి భంగం కలిగితే రాజీనామా చేస్తాను అని పాటిల్ చెప్పారు. సీఎల్పీ సమావేశంలో తాను ఎలాంటి క్షమాపణ కోరలేదని తెలిపారు. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని అందరి ముందు చెప్పలేనన్నారు. లేఖ రాయడం నా హక్కు, నేనే రాశాను.అయితే క్షమాపణ కోరలేదు. ప్రియాంక్ ఖర్గేతో అన్ని విషయాలనూ చర్చించాను అని చెప్పారు. -
వెన్నెల నవ్వితే... ఆ అందం నువ్వే!
రజనీకాంత్ ‘జైలర్’ సినిమాలోని ‘నువ్వు కావాలయ్యా’ పాట సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అనిరుథ్ రవిచందర్ ఈ పాటకు స్వరాలు సమకూర్చి శిల్పారావుతో కలిసి పాడాడు. ఈ పాటకు తమన్నా భాటియా వేసిన స్టెప్లను నెటిజనులు షేర్ చేస్తున్నారు. ఈ క్యాచీ బీట్స్ పాట యూ ట్యూబ్‌లో 74 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఈ పాటలో తమన్నా హుక్ స్టెప్స్‌ను అనుసరిస్తూ మిస్ కేరళ (2017) ప్రియాంక మేనన్ అందమైన వీడియో చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో 47.2 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. కామెంట్ సెక్షన్ హార్ట్ ఇమోజీలతో నిండిపోయింది. -
ఇంకా ఉత్కంఠే.. నీటి మట్టం 60 అడుగుల వరకూ..
ఖమ్మం: గోదావరి నదికి వరద ప్రవాహం పెరుగుతుండడంతో తీర ప్రాంత వాసుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. స్థానికంగా వర్షాలు తగ్గినా ఎగువ నుంచి వరద వస్తుండడంతో గోదావరి శాంతించడం లేదు. అయితే అంతే స్థాయిలో వరద దిగువకు వెళుతుండడంతో భద్రాచలం వద్ద నీటిమట్టం నెమ్మదిగా పెరుగుతోంది. వరద తీవ్రత, తీసుకోవాల్సిన చర్యల గురించి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, కలెక్టర్ ప్రియాంక ఆల ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఐఏఎస్ అధికారి దురిశెట్టి అనుదీప్, ఎస్పీ డాక్టర్ జి.వినీత్, ఏఎస్పీ పరితోశ్ పంకజ్, ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ తదితరులు సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. నేడూ వరద పోటు.. శనివారం రాత్రి 12 గంటల సమయంలో భద్రాచలం వద్ద గోదావరి 15,96,899 క్యూసెక్యుల నీటి ప్రవాహం దిగువకు వెళుతుండగా నీటి మట్టం 56.10 అడుగులుగా ఉంది. గోదావరికి ఎగువ ప్రాంతాన ఉన్న సమ్మక్క బ్యారేజీ వద్ద నీటిమట్టం శనివారం రాత్రి 9 గంటలకు 13 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది. సమ్మక్క బ్యారేజీ భద్రాచలనికి ఎగువన 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ శనివారం మధ్యాహ్నం వదిలిన గరిష్ట వరద భద్రాచలం చేరేందుకు 24 గంటల సమయం పడుతుంది. దీంతో ఆదివారం మధ్యాహ్నం వరకు వరద పోటు కొనసాగే అవకాశం ఉంది. గరిష్ట వరద భద్రాచలం చేరుకునే సమయానికి నీటి మట్టం 60 అడుగుల వరకు చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి భద్రాచలం దగ్గర నీటి మట్టం 53 అడుగుల దిగువకు తగ్గి, ఎగువ నుంచి వరద రాకుంటే పునరావాస శిబిరాల నుంచి ఇళ్లకు వెళ్లేందుకు ముంపు బాధితులకు అనుమతి ఇస్తామని అధికారులు చెబుతున్నారు. -
విషాదం: ప్రియాంక ఆత్మహత్య
సాక్షి, మైదుకూరు: కడుపు నొప్పి భరించలేక సచివాలయ ఉద్యోగి ధనపాల ప్రియాంక (27) ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన వైఎస్సార్‌జిల్లా మైదుకూరులో చోటుచేసుకుంది. మృతురాలి తండ్రి యుగంధర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మైదుకూరు మండలం నంద్యాలంపేట –2లో మైదుకూరుకు చెందిన ధనపాల ప్రియాంక (27) అగ్రికల్చర్ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. ఆమె కొన్నాళ్లుగా కడుపు నొప్పితో బాధపడుతోంది. ఈ క్రమంలో కడుపు నొప్పి ఎక్కువ కావడంతో మూడు రోజుల కిందట విషం తాగింది. అది గమనించిన వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రియాంక మృతి చెందింది. ఇక, జిల్లా వ్యవసాయాధికారి నాగేశ్వరరావు, మండల వ్యవసాయ అధికారి లక్ష్మీప్రసన్న ప్రియాంక మృతదేహాన్ని పరిశీలించి, ఆమె తండ్రి యుగంధర్‌ను పరామర్శించారు. ఇది కూడా చదవండి: ఆర్కే బీచ్: దీపక్‌కు తృటిలో తప్పిన ప్రమాదం -
‘భద్రాద్రి’ సుపరిచితమే !
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి జిల్లా తనకు సుపరిచితమేనని, గతంలో ఈ జిల్లాకు చాలా సార్లు వచ్చానని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల తెలి పారు. జిల్లా అధికారుల సమీకృత కార్యాలయం (ఐడీఓసీ)లో శనివారం సాయంత్రం ఆమె బాధ్యతలు స్వీరించారు. అనంతరం ఐడీఓసీ ప్రాంగణమంతా కలియదిరిగారు. ఇదే క్యాంపస్‌లో ఉన్న కలెక్టర్ క్యాంపు కార్యాలయాన్ని సైతం కుటుంబసభ్యులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. బంధుత్వం ఉంది తనది తెలంగాణేనని, పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్‌లోని ఉప్పల్ అని కలెక్టర్ తెలిపారు. స్థానికురాలినే కావడంతో ఈ రాష్ట్రం, ఇక్కడి జిల్లాలపై అవగాహన ఉందన్నారు. పైగా భద్రాద్రి జిల్లాలో బంధువులు కూడా ఉన్నారని, చిన్నప్పుడు చాలా సార్లు ఈ జిల్లాకు వచ్చానని గతాన్ని గుర్తు చేసుకున్నారు. 2016లో ఐఏఎస్‌గా ఎంపికై న తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్‌గా, హైదరాబాద్ నగర పరిధిలో అడిషనల్ కమిషనర్, జోనల్ కమిషనర్‌గా పని చేసినట్టు తెలిపారు. తన సర్వీసులో పని చేసిన రెండూ అర్బన్ ప్రాంతాలని, తొలిసారిగా గ్రామీణ ప్రాంత జిల్లా అధికారిగా రావడం సంతోషంగా ఉందని చెప్పారు. పైగా ఈ జిల్లాలో గిరిజన జనాభా ఎక్కువగా ఉందని, ప్రభుత్వం తరఫున వారికి చేయాల్సింది ఎంతో ఉందని అన్నారు. చాలా చేయొచ్చు.. ఇక్కడికి బదిలీ అయిందని తెలియగానే జిల్లాకు సంబంధించిన విషయాలు తెలుసుకునే పనిలో పడ్డానని చెప్పారు. ఇంతకాలం ఇక్కడ కలెక్టర్‌గా పని చేసిన అనుదీప్ దురిశెట్టి తనకు ఫోన్ చేసి.. రాష్ట్రంలోనే ఆదివాసీలు అధికంగా నివసించే జిల్లాకు కలెక్టర్‌గా వస్తున్నందుకు శుభాకాంక్షలు తెలిపారని చెప్పారు. కలెక్టర్‌గా ఈ జిల్లాకు చాలా పనులు చేయొచ్చని, బదిలీపై వెళ్తున్న తనకు ఈ జిల్లా ఎంతో సంతృప్తిని ఇచ్చిందని అన్నారని తెలిపారు. 4:23 గంటలకు హైదరాబాద్ నుంచి నేరుగా కొత్తగూడెం ఐడీఓసీకి శనివారం సాయంత్రం కలెక్టర్ చేరుకున్నారు. ఐడీఓసీ మొదటి అంతస్తులోని కలెక్టర్ చాంబర్‌కు చేరుకుని ఆసీనులయ్యారు. సాయంత్రం 4:23 గంటలకు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ.. వైద్య విద్యను అభ్యసించిన తాను ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో సివిల్ సర్వీస్‌లోకి వచ్చినట్లు తెలిపా రు. కలెక్టర్‌కు వివిధ శాఖల అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. తమను తాము పరిచయం చేసుకున్నారు. కలెక్టర్ ప్రియాంక అలా వెంట అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, అన్ని ప్రభుత్వ శాఖ జిల్లా అధికారులు ఉన్నారు. ఎంబీబీఎస్ టు సివిల్స్.. కలెక్టర్ ప్రియాంక హైదరాబాద్ నగరంలోని ఉప్పల్‌లో పుట్టి పెరిగారు. హబ్సిగూడలోని జాన్సన్ గ్రామర్ స్కూల్లో చదువుకున్నారు. ఇంటర్ తర్వాత మహారాష్ట్రలోని ఎంజీఎంఎస్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఆ తర్వాత సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యారు. 2016 బ్యాచ్‌లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. ఆమె భర్త మణిపాల్కుమార్ గాంధీ ఆస్పత్రిలో సర్జన్‌గా పని చేస్తున్నారు. పిల్లలు మైరా (పాప), కియాన్ (బాబు) ఉన్నారు. -
సిద్దిపేట అదనపు కలెక్టర్‌గా గరిమా అగర్వాల్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సార్వత్రిక ఎన్నికల క్రమంలో బదిలీల వేగం పుంజుకుంది. ఇటీవల డీఎస్పీలను బదిలీ చేసిన ప్రభుత్వం శుక్రవారం అదనపు కలెక్టర్లను బదిలీ చేయగా కన్ఫర్డ్ ఐఏఎస్‌లకు పదోన్నతి కల్పిస్తూ అదనపు కలెక్టర్లుగా నియమించింది. అలాగే ఆర్డీవోలకు సైతం స్థానచలనం కల్పించింది. ఉమ్మడి జిల్లాలో పలువురు అదనపు కలెక్టర్లను బదిలీ చేయగా నేడు, రేపు కూడా మరిన్ని బదిలీలు జరిగే అవకాశముందని సమాచారం. ► సిద్దిపేట అదనపు కలెక్టర్(లోకల్ బాడీస్) ముజమ్మిల్‌ఖాన్‌ను పెద్దపల్లి కలెక్టర్‌గా నియమించగా పెద్దపల్లి కలెక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణను టీఎస్ ఫుడ్స్ ఎండీగా నియమించారు. ► జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు కలెక్టర్(లోకల్ బాడీస్) దివాకర్‌ను జగిత్యాల అదనపు కలెక్టర్(లోకల్ బాడీస్)గా నియమించగా అదనపు కలెక్టర్ మంద మకరంద్‌ను నిజామాబాద్ మునిసిపల్ కమిషనర్‌గా బదిలీ చేశారు. ► పెద్దపల్లి అదనపు కలెక్టర్(లోకల్ బాడీస్) కుమార్ దీపక్‌ను నాగర్‌కర్నూల్ అదనపు కలెక్టర్‌గా బదిలీ చేయగా అతనిస్థానంలో కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సతీమణి కరీంనగర్ జెడ్పీ సీఈవో ప్రియాంకను నియమించారు. ► వెయిటింగ్లో ఉన్న జల్ద అరుణశ్రీని కరీంనగర్ అదనపు కలెక్టర్(లోకల్ బాడీస్)గా నియమించారు. ఈమె గతంలో కరీంనగర్ డీఆర్డీవోగా విధులు నిర్వహించారు. ► కరీంనగర్ జాయింట్ కలెక్టర్(ట్రైనీ) నవీన్ నికోలస్‌ను తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ సెక్రటరీగా నియమించారు. ► కరీంనగర్ అదనపు కలెక్టర్(లోకల్ బాడీస్) గరిమా అగర్వాల్‌ను సిద్దిపేట అదనపు కలెక్టర్(లోకల్ బాడీస్)గా నియమించారు. ► కరీంనగర్ అదనపు కలెక్టర్(రెవెన్యూ)గా ఉన్న శ్యాం ప్రసాద్‌లాల్‌ను పెద్దపల్లి అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా బదిలీఅయ్యారు. ► శ్యాంప్రసాద్ లాల్ స్థానంలో సిద్దిపేట స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న కె.లక్ష్మికిరణ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆర్డీవోలు సైతం ప్రస్తుతం ఉట్నూరు ఆర్డీవోగా ఉన్న కె.మహేశ్వర్‌ను కరీంనగర్ ఆర్డీవోగా నియమించారు. కరీంనగర్ ఆర్డీవోగా ఉన్న ఎన్.ఆనంద్‌కుమార్‌ను సిరిసిల్లకు బదిలీచేశారు. సిరిసిల్ల ఆర్డీవోగాఉన్న టి. శ్రీనివాసరావు డిప్యూటీ కలెక్టర్ అండ్ తహసీల్దార్ శేరీలింగంపల్లికి బదిలీపై వెళ్లనున్నారు. ప్రస్తుతం జగిత్యాల ఆర్డీవోగా ఉన్న మాధురిని సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్‌గా పంపారు. సివిల్స్–2016లో తెలంగాణ టాపర్ ముజమ్మిల్‌ఖాన్ 2014లో తొలిసారిగా సివిల్స్ రాస్తే ఐఆర్టీఎస్ వచ్చింది. శిక్షణ పూర్తయ్యాక ఏసీఎంగా కొలువు దక్కింది. 2015లో మళ్లీ సివిల్స్ రాయగా ఐఆర్ఎస్కు ఎంపికయ్యారు. అందులో చేరకుండా పాత ఉద్యోగంలోనే కొనసాగుతూ మూడోసారి 2016లో సివిల్స్ రాయగా జాతీయస్థాయిలో 22వ, రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్‌ను సాధించారు. ఐఏఎస్ శిక్షణ పూర్తి చేశాక 2018లో వికారాబాద్ అసిస్టెంట్ కలెక్టర్, హుస్నాబాద్ డిప్యూటీ కలెక్టర్ పని చేశారు. ఫిబ్రవరి 2020లో సిద్దిపేట జిల్లాకు అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం పెద్దపల్లి కలెక్టర్‌గా పదోన్నతిపై బదిలీ అయ్యారు. ఈయన మాజీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏకే ఖాన్ కుమారుడు కావడం గమనార్హం. -
కలెక్టర్‌గా ప్రియాంక
భద్రాచలం/సూపర్‌బజార్ (కొత్తగూడెం): ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. దీంతో జిల్లా నూతన కలెక్టర్‌గా 2016 బ్యాచ్‌కు చెందిన ప్రియాంక ఆల నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆమె గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో అడిషనల్ కమిషనర్‌గా పని చేస్తున్నారు. 2021లో జరిగిన గ్రేటర్ ఎన్నికలను సమర్థంగా నిర్వహించిన అధికారిగా ఆమె పేరు తెచ్చుకున్నారు. అంతకుముందు ఆమె యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రత్యే క అధికారిగా పనిచేశారు. కలెక్టర్‌తోపాటు భద్రాచలం –ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా ఉన్న గౌతమ్ పొట్రు సైతం బదిలీ అయ్యారు. సెర్ప్ సీఈఓగా గౌతమ్‌ను బదిలీ చేసిన ప్రభుత్వం ఆయన స్థానంలో రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్‌గా ఉన్న ప్రతీక్ జైన్‌ను నియమించింది. ఈ బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది. ట్రైనీగా మొదలుపెట్టి.. సివిల్స్ పరీక్షల్లో జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు సాఽధించిన దురిశెట్టి అనుదీప్ జిల్లాలో ట్రైనీ కలెక్టర్‌గా తొలిసారి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత ఇక్కడే స్థానిక సంస్థలకు అడిషనల్ కలెక్టర్‌గా పదోన్నతి పొందారు. ఈ రెండు పోస్టుల్లో జిల్లా అంతటా ఆయన విస్త్రృతంగా పర్యటించారు. అశ్వారావుపేట దగ్గర కొండరెడ్లపై ప్రత్యేకంగా పరిశోధన చేశారు. వారి జీవిత స్థితిగతులను దగ్గరుండి పరిశీలించారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. గతేడాది రికార్డు స్థాయిలో వరదలు వచ్చినప్పుడు కలెక్టర్ హోదాలో అనుదీప్ చేసిన కృషికి సర్వత్రా ప్రశంసలు దక్కాయి. డైబ్బె అడుగులకు పైగా గోదావరి వరద వచ్చినా ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ సహాయక కార్యక్రమాలు చేపట్టారు. వీటితోపాటు గతేడాది డిసెంబరులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనను విజయవంతం చేశారు. రాష్ట్ర గవర్నర్, సీఎంలు ఒకేసారి జిల్లాలో పర్యటించినా ప్రోటోకాల్ సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పోడు పట్టాలు.. గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న భద్రాద్రి జిల్లాలో పోడు రైతులకు పట్టాలను అతి తక్కువ సమయంలో అందివ్వడంలో కలెక్టర్‌గా అనుదీప్ ఎంతో శ్రమించారు. సుమారు లక్షన్నర వరకు వచ్చిన దరఖాస్తులను వడబోసి కేవలం రెండున్నర నెలల సమయంలో లక్షన్నర ఎకరాలకు సంబంధించి యాభై ఐదు వేల పట్టాలను తయారు చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేశారు. అదనపు గంటలు పని చేశారు. ఎంతో జఠిలంగా మారిన పోడు పట్టాల పంపిణీని ప్రజల నుంచి పెద్దగా వ్యతిరేకత రాకుండానే విజయవంతంగా పూర్తి చేయగలిగారనే భావన ప్రజల్లో నెలకొంది. మారుమూల గిరిజన ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలను మెరుగుపరచడంలోనూ తనదైన ముద్ర వేశారు. అశ్వారావుపేట, ఇల్లెందు, చర్ల, మణుగూరు వైద్యశాలలను ఆధునీకరించటంతోపాటు వైద్యులను నియమించి వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా చర్ల, అశ్వారావుపేట ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు మెరుగు పరచడానికి వ్యక్తిగతంగా కూడా చొరవ చూపించారు. ఆయన కలెక్టర్‌గా ఉన్న సమయంలో జిల్లాకు స్వచ్ఛ సర్వేక్షణ్, ఆరోగ్య పంచాయతీ, జలసంరక్షణ విభాగంలో జాతీయ అవార్డులు వరించాయి. సెర్ప్ సీఈఓగా గౌతమ్ పొట్రు భద్రాచలం ఐటీడీఏ పీఓగా పనిచేస్తున్న గౌతమ్ పొట్రు సెర్ప్ సీఈఓగా బదిలీ అయ్యారు. 2020, ఆగస్టు 7న పీఓగా గౌతమ్ బాధ్యతలు స్వీకరించారు. గిరిజనాభివృద్ధికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించటంలో కృషి చేశారు. కాగా గిరిజన దర్బారులో అందుబాటులో లేకపోవడం, గిరిజన గ్రామాల్లో క్షేత్ర స్థాయి పర్యటనలు లోపించటం వంటి అపవాదులను ఆయన మూటగట్టుకున్నారు. కల్లూరు ఆర్డీఓగా శివాజీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (భూసేకరణ)గా ఉన్న శివాజీని కల్లూరు ఆర్డీఓగా బదిలీ చేశారు. గతంలో ఆయన భద్రాచలం ఆలయ ఈఓగా పని చేశారు. -
ముగ్గురు పల్లెటూరి పిల్లగాళ్ల కథే తురుమ్ ఖాన్ సినిమా
నిమ్మల శ్రీరామ్, దేవరాజ్ పాలమూర్, అవినాష్ చౌదరి హీరోలుగా, పులి సీత, విజయ, శ్రీయాంక హీరోయిన్లుగా నటించిన పల్లెటూరి రివెంజ్ కామెడీ డ్రామా ఫిల్మ్ ‘తురుమ్ ఖాన్లు’. శివకల్యాణ్ దర్శకత్వంలో ఆసిఫ్ జానీ నిర్మించిన చిత్రం ఇది. త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు శివకల్యాణ్ మాట్లాడుతూ– ‘‘ఈ ఆధునిక యుగంలో బ్రహ్మ, విష్ణు, ఈశ్వర్ అనే ముగ్గురు యువకులు ఒకే ఊరిలో పుట్టి, పెరిగి సరదాగా ఒకరినొకరు ఎలా ఆటపట్టించుకుంటారు? ఒకర్ని ఒకరు ఎలా ఏడిపించుకుంటారు? అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించాం’’ అన్నారు. ‘‘తురుమ్ ఖాన్లు’ చిత్రం చిన్న సినిమాగా విడుదలైనా రిలీజ్ తర్వాత పెద్ద సినిమా అవుతుంది’’ అన్నారు నిర్మాత ఆసిఫ్. ఈ చిత్రానికి సంగీతం: వినోద్ యాజమాన్య, అఖిలేష్ గోగు, సహనిర్మాత: కె. కల్యాణ్ రావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దేవరాజ్ పాలమూర్. -
బిగ్ బాస్ నటిపై తీవ్ర ఆరోపణలు.. పోలీసులకు ఫిర్యాదు!
ప్రముఖ బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ ఇషితా గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ -16 కంటెస్టెంట్ ప్రియాంక చాహర్ చౌదరి తన డిజైన్లను కాపీ కొట్టారని ఆరోపిస్తూ ముంబయి పోలీసులను ఆశ్రయించారు. ఇటీవలే నిర్వహించిన ఓ ప్రదర్శనలో తనకు తెలియకుండానే వాటిని ప్రదర్శించారని ఆమె ఆరోపించారు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా ఆమె వెల్లడించారు. ప్రియాంక చౌదరి ధరించిన డిజైన్స్ ఓ ఫ్యాషన్ లైన్ కోసం ప్రత్యేకంగా రూపొందించామని పేర్కొంది. ప్రియాంక ధరించిన డిజైన్స్ న్యూయార్క్ మ్యాగజైన్ కవర్ పేజీని కోసం తయారు చేశామని తెలిపింది. అయితే ఇషిత ఆరోపణలపై ప్రియాంకచౌదరి ఇంకా స్పందించలేదు. సోషల్ మీడియాలో లైక్స్ కోసమే ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోందని ఆరోపించింది. అయితే ఇషిత ఆరోపణలపై కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు డిజైన్లు ఒకేలా లేవని చెబుతున్నారు. కాగా.. ప్రియాంక చాహర్ చౌదరి బిగ్ బాస్- 16 సీజన్లో సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. ప్రైమ్ టైమ్ టీవీ షో 'ఉదరియాన్' ద్వారా పేరు సంపాదించింది. ఇటీవలే కుచ్ ఇత్నే హసీన్లోనూ కనిపించింది. .@ishitarehagupta Please share the details of your complaint here: https://t.co/kMC70YRHG9 https://t.co/xCqnBikWsj — मुंबई पोलीस - Mumbai Police (@MumbaiPolice) April 23, 2023 Bade aye chors! Show chal raha tha that time muh band tha cz reputation kharab ho jata. Bahar aake meri hi nakal ki continuity. Wannabe and envy ke definition. Zero integrity or dignity. Only knows how to use people. Cheap personality. — ISHITA (@ishitarehagupta) April 23, 2023 -
పోలీసులపై బాలల హక్కుల సంఘం చీఫ్ సంచలన ఆరోపణలు
బాలల హక్కుల సంఘం చీఫ్ ప్రియాంక కనూంగో పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు. తనపై దాడి చేసి దుర్భాషలాడరని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను తోసిపుచ్చారు అధికారులు. తాము ఆయనకు సహకరించామని, అతనే తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించారు. ఈ వారంలో కోల్‌కతాలోని తిల్జాలా ప్రాంతంలో ఒక మైనర్ తన పొరుగింటి వారి చేతిలోనే హత్యకు గురయ్యింది. ఈ విషయమైన తాను అక్కడకు వచ్చానని నేషనల్ కమిషన్ ప్రోటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్(ఎన్సీపీసీఆర్) చైర్ పర్సన్ ప్రియాంక కనూంగో చెప్పారు. అప్పుడే కోల్‌కతా పోలీసులు తనపై దాడి చేసి అసభ్యంగా ప్రవర్తించారని చెప్పారు. పోలీసులు మాపై జరుపుతున్న దర్యాప్తు ప్రక్రియలను రహస్యంగా రికార్డు చేస్తున్నారని, దీన్ని వ్యతిరేకించినందుకే తనపై దాడి చేరని కనూంగో సోషల్ మీడియా వేదికగా హిందీలో ట్వీట్ చేశారు. దీనిపై పశ్చిమ బెంగాల్ కమీషనర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్(డబ్ల్యూసీపీసీఆర్) చీఫ్ సుదేష్నా రాయ్ స్పందిస్తూ..తనను, తమ సహోద్యోగులను కనూంగో అవమానించాడని అన్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆలోచిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. అసలు ఎన్సీపీసీఆర్ బృందం మాకు సమాచారం ఇవ్వకుండా ఆ బాలిక కుటుంబం వద్దకు వెళ్లిందన్నారు. నిజానికి ఆ ప్రతిపాదిత పర్యటన అవసరం లేదని చెప్పారు. ఈ విషయాన్నే పేర్కొంటూ రాయ్ ఎన్‌సీపీసీఆర్‌కి లేఖ కూడా రాశారు. (చదవండి: విమానంలో మరో అనుచిత ఘటన: తాగిన మత్తులో 62 ఏళ్ల ప్రయాణికుడి వీరంగం)


