రియో రైనాను స్వాగతిస్తున్నాం : రైనా | Suresh Raina And Priyanka Blessed With Baby Boy | Sakshi
Sakshi News home page

రియో రైనాను స్వాగతిస్తున్నాం : రైనా

Mar 23 2020 6:05 PM | Updated on Mar 23 2020 7:35 PM

Suresh Raina And Priyanka Blessed With Baby Boy - Sakshi

టీమిండియా క్రికెటర్‌ సురేష్ రైనా రెండోసారి తండ్రి అయ్యారు. రైనా భార్య ప్రియాంక సోమవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఇప్పటికే రైనా దంపతులకు గ్రేసియా అనే పాప ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని రైనా ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. మా కుమారుడు, గ్రేసియా సోదరుడు రియో రైనాను స్వాగతిస్తున్నందుకు గర్వంగా ఉందని పేర్కొన్నారు. తన భార్య, కుమారుడితో ఉన్న ఫొటోను షేర్‌ చేశారు.

‘ఆశ్చర్యం, ఆశ, అవకాశాలు, ఓ మంచి ప్రపంచం.. అన్ని విషయాలకు ఇది ప్రారంభం. మా కుమారుడు, గ్రేసియా చిన్నారి సోదరుడిని స్వాగతిస్తున్నందకు మేము గర్వపడుతున్నాం. అతడు ప్రతి ఒక్కరి జీవితంలో శాంతిని తీసుకురావడానికి అంచనాలకు మించి కృషి చేస్తాడు’అని రైనా ట్విటర్‌లో ఓ సందేశాన్ని పోస్ట్‌ చేశారు.  ఈ సందర్భంగా ఐపీఎల్‌లో రైనా ప్రాతినిథ్యం వహిస్తున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌.. రైనా దంపతులకు శుభాకాంక్షలు తెలిపింది. అలాగే పలువురు క్రికెటర్లు, సెలబ్రిటీలు కూడా సోషల్‌ మీడియా ద్వారా రైనాకు విషెస్‌ చెబుతున్నారు. కాగా, 2015లో రైనా ప్రియాంకను వివాహం చేసుకున్న సంగతి తెలిసింది. 

Advertisement
 
Advertisement
Advertisement