సీఎస్‌కే జెర్సీలో సురేశ్ రైనా (ఫైల్ ఫొటో.. PC: BCCI/IPL)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంఛైజీ చెన్నై సూపర్ కింగ్స్‌తో టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనాకు విడదీయరాని అనుబంధం ఉంది. సీఎస్‌కేను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని ‘తలా’ అని పిలుచుకునే అభిమానులు.. రైనాను చిన్న ‘తలా’ అని పిలుచుకుంటారు.
అత్యధిక పరుగుల వీరుడిగా
చెన్నై తరఫున ఐపీఎల్‌లో ఇప్పటికీ అత్యధిక పరుగుల వీరుడిగా సురేశ్ రైనానే కొనసాగుతున్నాడు. 2008- 2021 మధ్య చెన్నైకి ఆడిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. 200 మ్యాచ్‌లలో కలిపి 5529 పరుగులు సాధించాడు. నాలుగుసార్లు ఐపీఎల్ టైటిల్, రెండుసార్లు చాంపియన్స్ లీగ్ గెలిచిన చెన్నై జట్లలో అతడు సభ్యుడు.
ఈ నేపథ్యంలో సురేశ్ రైనా సీఎస్‌కేతో తనకున్న అనుబంధం గురించి.. భారత స్పిన్ దిగ్గజం, సీఎస్‌కేలో తన సహచర ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్‌తో పంచుకున్నాడు. ఈ సందర్భంగా చెన్నై జట్టుకు కోచ్‌గా వెళ్లాలనే తన కోరికను రైనా బయటపెట్టాడు.
కోచ్‌గా వస్తానని చెప్పాను
అశూ అడిగిని ప్రశ్నలకు బదులిస్తూ.. ‘‘ఐపీఎల్‌లో నేను 16- 17 ఏళ్ల పాటు ఆడాను. సీఎస్‌కే తరఫున లెక్కకు మిక్కిలి పరుగులు చేశాను. తీవ్రమైన ఒత్తిడి, ఉత్కంఠ నెలకొన్న మ్యాచ్‌లలో రాణించాను. కోచ్‌గా వస్తానని ఇప్పటికే సీఎస్‌కే యాజమాన్యానికి చెప్పాను.
అయితే, వాళ్ల నుంచి ఇంతవరకు సమాధానం రాలేదు. ఏదేమైనా వారిదే తుది నిర్ణయం. నువ్వు (అశూ)- నేనూ రిటైర్ పోయాము కదా. కాబట్టి యాజమాన్యం నిర్ణయాన్ని బట్టే అంతా ఉంటుంది.
సీఎస్‌కేనే నా సర్వస్వం
ఆటగాళ్లుగా సీఎస్‌కేకు మనం చేయాల్సింది చేశాము. ట్రోఫీలు గెలిచాము. కోచ్‌గా నాకు సామర్థ్యం ఉందని భావిస్తే తప్పక నన్ను పిలుస్తారు. ఏ స్థాయిలోనైనా సీఎస్‌కేతో పనిచేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఆటగాడిగా సీఎస్‌కేనే నా సర్వస్వం.
అంతర్జాతీయ క్రికెట్ ఆడాను. ఐపీఎల్‌లో ఆడాను. వరల్డ్‌కప్ మ్యాచ్‌లు ఆడాను. ఒత్తిడిని ఎలా జయించాలో.. మానసికంగా ఎంత దృఢంగా ఉండాలో నాకు తెలుసు. ఎన్నో ప్లే ఆఫ్స్, ఫైనల్స్‌లో నేను రాణించాను. మనం కలిసి ఎన్నో మ్యాచ్‌లు గెలిచాము.
క్రికెట్‌కు మనం కూడా ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి కదా!’’ అని రైనా తన మనసులోని భావాలు పంచుకున్నాడు. కాగా ఐపీఎల్-2027 టోర్నీకి ముందు సీఎస్‌కే టీమిండియా దిగ్గజ పేసర్ జహీర్ ఖాన్‌ను తమ హెడ్‌కోచ్‌గా నియమించిన సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి: రోహిత్ భాయ్ వల్లే ఇలా!.. అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు: గిల్
కోహ్లి మెరుపులు.. తొలి వన్డేలో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా


