20వేల కోట్లు.. ముంబై ఇండియ‌న్స్ స‌రికొత్త రికార్డు | Mumbai Indians Becomes Most Valuable Franchise IPL History, Leave RCB And CSK Behind In 2026 Sportico Report | Sakshi
Sakshi News home page

20వేల కోట్లు.. ముంబై ఇండియ‌న్స్ స‌రికొత్త రికార్డు

Oct 30 2026 10:34 AM | Updated on Oct 30 2026 11:13 AM

Mumbai Indians Becomes Most-Valuable Franchise IPL History-Cross CSK-RCB

Photo Credit: Twitter

ఐపీఎల్ ఫ్రాంచైజీ, ఐదుసార్లు చాంపియ‌న్ ముంబై ఇండియ‌న్స్ స‌రికొత్త రికార్డు నెల‌కొల్పింది. స్పోర్టికో (Sportico) 2026 నివేదిక ప్రకారం, రూ. 2.1 బిలియన్ల ( భార‌త క‌రెన్సీలో సుమారు రూ. 20 వేల కోట్లు) ఎంటర్‌ప్రైజ్ విలువతో ఐపీఎల్‌లో అత్యంత విలువైన ఫ్రాంచైజీగా ముంబై ఇండియన్స్ మొదటి స్థానంలో నిలిచింది. 

ఈ నేప‌థ్యంలో సీఎస్‌కే, ఆర్సీబీల‌ను వెన‌క్కినెట్టింది. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన ముంబయి ఇండియన్స్ విలువ 2.1 బిలియన్ డాలర్లు, అంటే సుమారు రూ.20 వేల కోట్లుగా నమోదైంది. దీంతో ఐపీఎల్ చరిత్రలో 2 బిలియన్ డాలర్ల విలువను దాటిన తొలి ఫ్రాంచైజీగా ముంబయి నిలిచింది. ముంబై ఇండియ‌న్స్ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) రెండో స్థానంలో, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) మూడో స్థానంలో ఉన్నాయి.

టాప్-10 ఐపీఎల్ ఫ్రాంచైజీల విలువ..
ముంబయి ఇండియన్స్ – $2.1 బిలియన్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – $1.85 బిలియన్
చెన్నై సూపర్ కింగ్స్ – $1.75 బిలియన్
కోల్‌కతా నైట్‌రైడర్స్ – $1.73 బిలియన్
దిల్లీ క్యాపిటల్స్ – $1.70 బిలియన్

రాజస్థాన్ రాయల్స్ – $1.65 బిలియన్
సన్‌రైజర్స్ హైదరాబాద్ – $1.62 బిలియన్
గుజరాత్ టైటాన్స్ – $1.58 బిలియన్
పంజాబ్ కింగ్స్ – $1.53 బిలియన్
లక్నో సూపర్ జెయింట్స్ – $1.50 బిలియన్

ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ప్రధాన ఆదాయ వనరుల్లో బీసీసీఐ సెంట్రల్ రెవెన్యూ పూల్ కీలకమైనది. ప్రసార హక్కులు, డిజిటల్ మీడియా హక్కుల ద్వారా వచ్చే ఆదాయంలో ఫ్రాంచైజీలకు వాటా లభిస్తుంది. స్పోర్టికో నివేదిక ప్రకారం ఒక్కో ఫ్రాంచైజీకి బీసీసీఐ నుంచి ఏడాదికి సుమారు రూ.475 కోట్ల నుంచి రూ.520 కోట్ల వరకు నిధులు అందుతున్నాయి.

2026 సీజన్‌లో ఒక్కో ఫ్రాంచైజీ సగటున సుమారు రూ.708 కోట్ల రెవెన్యూ సాధించినట్లు నివేదిక పేర్కొంది. 2008లో ఐపీఎల్ ప్రారంభమైన సమయంలో ఉన్న విలువలతో పోలిస్తే.. ఫ్రాంచైజీల విలువ దాదాపు 1800 రెట్లు పెరిగినట్లు స్పోర్టికో నివేదికలో వెల్లడైంది.ఐపీఎల్‌కు పెరుగుతున్న ప్రేక్షకాదరణ, భారీ మీడియా హక్కుల విలువ, స్పాన్సర్‌షిప్ మార్కెట్, డిజిటల్ వ్యూయర్‌షిప్ కారణంగా ఫ్రాంచైజీల బ్రాండ్ విలువ కూడా వేగంగా పెరుగుతోంది.

ఇదీ చదవండి: IPL 2027: ముంబై ఇండియన్స్‌ సంచలన నిర్ణయం

‘సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు.. తప్పించాలనుకోవడం నేరమే’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement