OTT: సడెన్‌గా తెలుగులోకి వచ్చేసిన 'జాబిలమ్మ నీకు అంత కోపమా' | Jabilamma Neeku Antha Kopama Movie Released In OTT, Check Streaming Platform Details Inside | Sakshi
Sakshi News home page

OTT: సడెన్‌గా తెలుగులోకి వచ్చేసిన 'జాబిలమ్మ నీకు అంత కోపమా'

Apr 1 2025 8:31 AM | Updated on Apr 1 2025 9:58 AM

Jabilamma Neeku Antha Kopama Movie OTT Streaming Now

కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘నిలవుక్కు ఎన్‌ మేల్‌ ఎన్నడి కోబం’..  తెలుగులో ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’(Jabilamma Neeku Antha Kopama) పేరుతో విడుదలైంది. అయితే, ఎలాంటి ప్రకటన లేకుండా ఇప్పుడు తెలుగులో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. పవీష్, అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాశ్‌ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేశ్‌ మీనన్, రబియా ఖతూన్, రమ్యా రంగనాథన్‌ ప్రధాన పాత్రల్లో ఇందులో నటించారు. ఇప్పటికే అమెజాన్‌ ప్రైమ్‌లో తమిళ్‌ వర్షన్‌ అందుబాటులో ఉంది. అయితే, తాజాగా తెలుగు వర్షన్‌ కూడా స్ట్రీమింగ్ అవుతుంది.

‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ మూవీ ఫిబ్రవరి 21న థియేటర్స్‌లోకి వచ్చేసింది. బాక్సాఫీస్‌ వద్ద యూత్‌ను మెప్పించిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగు వర్షన్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో సడెన్‌గా స్ట్రీమింగ్‌ అవుతుంది. ఎలాంటి ప్రకటన లేకుండా ఈ సినిమాను విడుదల చేయడంతో ఫ్యాన్స్‌ సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు.  సింప్లీ సౌత్‌ ఓటీటీలో కూడా ఈ చిత్రం తెలుగులో ఉంది. ఓ భిన్నమైన రొమాంటిక్‌ కామెడీ కథతో ధనుష్‌ ఈ   సినిమాని తెరకెక్కించారు. యువతరంతో పాటు కుటుంబ   ప్రేక్షకులకు నచ్చేలా ఈ మూవీ ఉంటుంది.  ఆర్కేప్రోడక్షన్స్‌తో కలిసి ధనుష్‌(Dhanush) సొంత నిర్మాణ సంస్థ వండర్‌బార్‌ ఫిల్మ్స్‌ పథాకంపై ఈ సినిమాను నిర్మించారు.

Advertisement
 
Advertisement
Advertisement