నేడు సోనియా సమక్షంలో కాంగ్రెస్‌ గూటికి తుమ్మల | Sakshi
Sakshi News home page

నేడు సోనియా సమక్షంలో కాంగ్రెస్‌ గూటికి తుమ్మల

Published Sat, Sep 16 2023 4:13 AM

Sonia Gandhi and Rahul Gandhi and Priyanka To Attend CWC Meeting at Taj Krishna Hotel - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ అసంతృప్తనేత, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు శనివారం(నేడు) కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. సీడ బ్ల్యూసీ సమావేశాల విరామ సమయంలో శనివారం ఆ పార్టీ అగ్ర నేతలు సోనియా, రాహుల్‌గాంధీల సమక్షంలో ఆయన కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నారు. పార్టీలోకి రావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన్‌ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఇప్ప టికే తుమ్మలను ఆహ్వానించిన విషయం తెలిసిందే.

శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని తుమ్మల నివాసా నికి కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రేతోపాటు రేవంత్, భట్టి విక్ర మార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెళ్లారు. పార్టీలోకి రావాలని మరోమారు ఆహ్వానించగా సానుకూలంగా స్పందించిన తుమ్మల శనివారం కాంగ్రెస్‌ కండువా కప్పుకుంటారని గాంధీభవన్‌ వర్గాలు తెలిపా యి. కాగా, సీడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగా రాష్ట్రంలోని పలువురు మాజీమంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమా చారం.

వీరిని ఈ నెల 17న తుక్కుగూడ సభా వేదికగా పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించినప్ప టికీ అనివార్య కారణాల వల్ల దానిని మార్చారని తెలిసింది. శని, ఆదివారాల్లో జరిగే సీడబ్ల్యూసీ సమావేశాల విరామ సమయంలోనే వీరిని సోని యా, రాహుల్, ఖర్గే సమక్షంలో పార్టీలో చేర్చుకోవా లని నిర్ణయించినట్టు సమాచారం. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి తుమ్మల పోటీ చేసే అవకాశముందని సమాచారం.

Advertisement
 
Advertisement