
ట్రెండ్స్ వెంట పరుగెత్తకుండా, సింపుల్ స్టయిలింగ్‌తోనే క్లాసీ లుక్ చూపించే నటి ప్రియాంక మోహన్. చీరలైనా, మోడర్న్ డ్రెసుల్లోనైనా తన ఫ్యాషన్ స్టేట్‌మెంట్ మాత్రం సింపుల్ అండ్ ఎలిగెన్స్‌గానే ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఎలిగెన్స్‌నూ చూపిస్తోంది ఈ ఫ్యాషన్ బ్రాండ్స్‌తో..
ఫ్యాషన్‌లో ఎప్పుడూ స్థానాన్ని కోల్పోని క్లాసిక్ ఆభరణమే ఈ మల్టీ లేయర్ చోకర్. మగువ మెడను అంటిపెట్టుకొని ఉంటూ అందాన్ని వెంట తీసుకొని వస్తుంది. అందుకే, చోకర్స్‌పై మోజూ ఎప్పటికీ తరగనిది. సాధారణ చోకర్స్ మాదిరి కాకుండా రెండు నుంచి ఐదు వరుసల వరకు ముత్యాలు, వివిధ పూసలతో తయారుచేసే వీటికి మధ్యలో ఒక డాలర్ తగిలిస్తే వాటి అందం మరింత ఆకట్టుకునేలా మారుతుంది.
కాటన్, సిల్క్, ఆర్గంజా చీరలు, లెహంగాలకు డీప్ నెక్ బ్లౌజులతో ధరిస్తే ఎవ్వరికైనా బాగా నప్పుతుంది. అనార్కలీలకు కూడా అద్భుతంగా మ్యాచ్ అవుతుంది ఈ చోకర్. అయితే, ఈ చోకర్ ధరించినప్పుడు మినిమల్ జ్యూలరీతో స్టయిల్ చేసుకోవడం ఉత్తమం. చెవులకు చిన్న స్టడ్స్, సింపుల్ ఉంగరం ధరించాలి. అలాగే హెయిర్ స్టయిల్స్ కూడా సింపుల్ బన్ లేదా వేవీ హెయిర్ స్టయిల్స్ ట్రై చేసి, చోకర్ అందాన్ని హైలెట్ చేసేయొచ్చు.
వివాహాది శుభకార్యాలకు, స్పెషల్ డేస్‌కు ఈ టిప్స్‌తో స్టయిలింగ్ చేసి, మినిమలిస్టిక్ గ్రేస్‌ఫుల్ లుక్ సొంతం చేసుకోండి అచ్చం నటి ప్రియాంక మోహన్‌లా. "చర్మం ఎంత నేచురల్‌గా ఉంటే అంత అందంగా కనిపిస్తాం. అందుకే, మినిమల్ మేకప్‌నే ప్రిఫర్ చేస్తా. ఇక ఎక్కడికెళ్లినా సరే, సన్ స్క్రీన్ తప్పనిసరి. అంటోంది". ప్రియాంక మోహన్.
(చదవండి: liposuction: సౌందర్య చికిత్సలు ఇంత డేంజరా..? పాపం ఆ మహిళ..)