
ప్రియాంక (ఫైల్)
సాక్షి, కరీంనగర్: నగరంలోని పాతబజారులో నివా సం ఉండే ఓ యువతి అదృశ్యమైంది. వన్‌టౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. మానకొండూర్ మండలం కొండపల్కలకు చెందిన టి.ప్రియాంక(22) ఇంటర్ పూర్తిచేసింది. పాతబజారు ప్రాంతంలో స్నేహితులతో అద్దెకుంటూ స్థానికంగా ఓ షాపింగ్‌మాల్‌లో పనిచేస్తోంది. శుక్రవారం ఉదయం పని నిమిత్తం గదినుంచి బయటకు వెళ్లింది. రాత్రి తన స్నేహితురాలు రూంకు వచ్చిచూసేసరికి తాళం వేసి ఉండడంతో వారి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. పలుచోట్ల వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో శనివారం వన్‌టౌన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.