● ఐదుగురిపై దాడి
తంగళ్లపల్లి(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్‌లో శనివారం ఓ పిచ్చికుక్క వీరంగం సృష్టించింది. అరగంట వ్యవధిలోనే ఐదుగురిపై దాడి చేసింది. ఒక్కసారిగా రెచ్చిపోయిన పిచ్చికుక్క వీధుల్లో వెళ్తున్న వారిపై విచక్షణారహితంగా దాడికి తెగబడింది. ఈ దాడిలో చిట్యాల రాణాప్రతాప్, నందకిశోర్, లింగంపల్లి భూదవ్వ, క్యారం శ్రీధర్, మల్లవేని రమేశ్ తీవ్రంగా గాయపడ్డారు. కుక్కకాటుకు గురైన వారి అరుపులు విన్న స్థానికులు కర్రలతో దానిని తరిమికొట్టే ప్రయత్నం చేశారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
కాలు విరిగినా పరీక్షకు..
మంథని: ప్రమాదంలో కాలు విరిగినా శనివారం నుంచి ప్రారంభమైన పదో తరగతి పరీక్షకు హాజరయ్యాడు ఓ విద్యార్థి. మంథని మండలం గుంజపడుగుకు చెందిన సాదుల చిన్నికృష్ణ మండలంలోని సూరయ్యపల్లి పైవేటు స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. మంథనిలోని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల సెంటర్‌కు వీల్ చైర్‌పై వచ్చి పరీక్ష రాశాడు. సదరు విద్యార్థి సెంటర్‌లో పరీక్ష రాసేందుకు వీలుగా సౌకర్యం కల్పించారు.
భుజంపై కుక్క కాట్లు చూపుతున్న బాలుడు బోయిని నందకిశోర్
మొహంపై గాయాలతో చిన్నారి చిట్యాల రాణాప్రతాప్
వీల్‌చైర్‌లో పరీక్షకు హాజరైన విద్యార్థి


