ఉగ్రావతారం | Priyanka Upendra: Ugravatara Movie Trailer Launch Event | Sakshi
Sakshi News home page

ఉగ్రావతారం

Oct 16 2024 12:08 AM | Updated on Oct 16 2024 12:08 AM

Priyanka Upendra: Ugravatara Movie Trailer Launch Event

‘‘హైదరాబాద్‌తో నాకు ఎంతో అనుబంధం ఉంది. నా భర్త ఉపేంద్రగారిని తొలిసారి ఇక్కడే కలిశాను. అందుకే హైదరాబాద్‌ నాకు చాలా లక్కీ సిటీ. నా కెరీర్‌లో తొలి యాక్షన్‌ ఫిల్మ్‌ ‘ఉగ్రావతారం’. ఈ పాత్రకు నేను సరిపోతానని డైరెక్టర్‌ గురుమూర్తిగారు నమ్మారు. నా మొదటి పాన్‌ ఇండియన్‌ మూవీని అందరూ చూడాలని కోరుకుంటున్నాను’’ అని నటి ప్రియాంకా ఉపేంద్ర అన్నారు. ప్రియాంకా ఉపేంద్ర లీడ్‌ రోల్‌లో గురుమూర్తి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఉగ్రావతారం’.

ప్రియాంకా ఉపేంద్ర సమర్పణలో ఎస్‌జీ సతీష్‌ నిర్మించిన ఈ సినిమా నవంబరు 1న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో ఈ చిత్రం ట్రైలర్, సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. నిర్మాత రాజ్‌ కందుకూరి ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్‌ చేయగా, నిర్మాత కరాటే రాజు, నటుడు సత్యప్రకాశ్‌ పాటను రిలీజ్‌  చేశారు. డైరెక్టర్‌ గురుమూర్తి మాట్లాడుతూ– ‘‘సమాజంలో జరిగే అన్యాయాలు, అఘాయిత్యాలపై మంచి సందేశాత్మాక చిత్రంగా ‘ఉగ్రావతారం’ ఉంటుంది’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement