
కమెడియన్ సప్తగిరి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం పెళ్లి కాని ప్రసాద్. ఈ మూవీని అభిలాష్ రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కించారు. ఇందులో ప్రియాంక శర్మ హీరోయిన్‌గా నటించింది. పెళ్లి కాని ఓ యువకుడు పడే ఇబ్బందుల నేపథ్యంలోనే ఈ మూవీ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను హీరో విక్టరీ వెంకటేశ్ చేతుల మీదుగా విడుదల చేశారు.
తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే ఆడియన్స్‌కు నవ్వులు పూయిస్తోంది. పెళ్లి కావాల్సిన యువకుడు తన తండ్రి పెట్టే కండీషన్లతో సతమతమయ్యే కథ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా ఈ జనరేషన్‌లో పెళ్లి కావాలంటే ఎన్ని షరతులు ఉన్నాయనేది ఇందులో చూపించనున్నారు. ఈ ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ మార్చి 21న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో మురళీధర్ గౌడ్, అన్నపూర్ణమ, వడ్లమాని శ్రీనివాస్, ప్రమోదిని, బాషా, లక్ష్మణ్ మీసాల, రోహిణి, రాంప్రసాద్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతమందించారు.
Wishing @MeSapthagiri and the team of #PelliKaniPrasad all the very best for the release!
Here's the trailer:https://t.co/XDVHxb4kbn@PriyankaOffl @abhilash_gopidi @ThamaEnts #ShekarChandra @Chaganticinema @SVC_official pic.twitter.com/44Bfe8bCFZ— Venkatesh Daggubati (@VenkyMama) March 13, 2025
Comments
Please login to add a commentAdd a comment