‘దిశ’ అస్థికల నిమజ్జనం

Asphalt Immersion Of Priyanka At Jogulamba - Sakshi

ఎర్రవల్లిచౌరస్తా (అలంపూర్‌): జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లిలోని కృష్ణానదిలో సోమవారం ‘దిశ’అస్థికలను తండ్రి శ్రీధర్‌రెడ్డి నిమజ్జనం చేశారు. మత్స్యకారుల సాయంతో పుట్టి ద్వారా కృష్ణలోకి వెళ్లి తండ్రి శ్రీధర్‌రెడ్డి అస్థికలను నదిలో కలిపారు. ఆయన వెంట కుటుంబ సభ్యులు, వెటర్నరీ శాఖ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఎన్‌కౌంటర్‌ చేయాలి.. 
అనంతరం శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదన్నారు. ఈ సందర్భంగా కంటతడి పెట్టుకున్నారు. ఏ తండ్రికీ ఇలాంటి పరిస్థితి రావద్దని అన్నారు. అతి కిరాతకంగా హత్య చేసిన మానవ మృగాలను బహిరంగంగా ఎన్‌కౌంటర్‌ చేయాలన్నారు. దిశ తమ మధ్య లేకపోవడం కలచివేస్తోందని సహచర ఉద్యోగులు పేర్కొన్నారు. అతి దారుణంగా నిండు ప్రాణాన్ని బలిగొన్న ఆ నరరూప రాక్షసులను బహిరంగ ప్రదేశంలో ఉరితీయాలని డిమాండ్‌ చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top