ఢిల్లీ: వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పరువు నష్టం దావా కేసులో ఈనాడు, న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సహా పలు మీడియా సంస్థలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించిన కథనాలు తొలగించాలని, రూ.10 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమిత్ బన్సల్ విచారణ జరిపారు.
ఇక నుంచి లడ్డు వివాదంలో రాసే కథనాలకు తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఢిల్లీ హైకోర్టు హెచ్చరించింది. తిరుమల లడ్డూ వివాదంలో ఓ వైపు సిట్ దర్యాప్తు కొనసాగుతుండగా, మరో వైపు కల్పిత కథనాలు రాస్తూ వై.వీ సుబ్బారెడ్డి పరువు, ప్రతిష్టలకు ఎల్లో మీడియా భంగం కలిగించింది. ఇక నుంచి లడ్డూ వివాదంలో రాసే కథనాలకు తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఢిల్లీ హైకోర్టు హెచ్చరించింది.


